ఆటాపోటీ

కాళ్లే ర్యాకెట్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చైనాలో బాడ్మింటన్‌ను ‘తీ జియాన్ జీ’ పేరుతో ఆడేవారు. ఇందులో షటిల్‌కాక్‌ను ర్యాకెట్‌తో కాకుండా కాళ్లతో కొట్టేవారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రచారంలో ఉన్న ఆ క్రీడ స్థానంలోనే ఆధునిక బాడ్మింటన్ విస్తరించింది.
* బాడ్మింటన్‌కు మొదట్లో ఆ పేరు లేదు. ‘షటిల్ కాక్ అండ్ బాటిల్‌డోర్’ అని పిలిచేవారు. ఇంగ్లాండ్‌లోని గూసెస్టర్‌షైర్‌లో బాడ్మింటన్ హౌస్‌ను నిర్మించిన తర్వాత, ఆ క్రీడకు బాడ్మింటన్ అనే పేరు స్థిరపడింది.
* బాడ్మింటన్ హౌస్‌లో బ్యూఫోర్ట్ డ్యూక్ తన సంస్థానంలో విందు ఇచ్చేవాడు. 1873లో అతను ఆహ్వానితులకు షటిల్‌కాక్స్‌ను, ర్యాకెట్లను అందచేసి, సరదాగా మ్యాచ్‌లు ఆడించేవారు. ఒక రకంగా నేటి బాడ్మింటన్ టోర్నీలకు అప్పుడే పునాది పడింది.