ఆటాపోటీ

సైనా గెలిచేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో రజత పతకం సాధించిన సైనా ఈసారి అంతకంటే మెరుగైన స్థానాన్ని అందుకుంటుందా? కనీసం రజత పతకాన్ని కాపాడుకుంటుందా? అన్న ప్రశ్నలు అభిమానులను వేధిస్తున్నాయి. అతిక్ జౌహరీ వద్ద బాడ్మింటన్‌లో ఒనమాలు దిద్దుకున్న సైనా ఆతర్వాత పుల్లెల గోపీచంద్ శిక్షణలో రాటుదేలింది. తర్వాతి కాలంలో గోపీచంద్‌తో అభిప్రాయభేదాలు రావడంతో తన ప్రాక్టీస్ వేదికను బెంగళూరుకు మార్చుకుంది. అక్కడ ఆమె జాతీయ మాజీ చాంపియన్ విమల్ కుమార్ వద్ద శిక్షణ పొందుతున్నది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యాన్ని సాధించడం సైనా ప్రతిభకు నిదర్శనం. ఒలింపిక్స్ బాడ్మింటన్ విభాగంలో ఒక పతకాన్ని అందుకున్న తొలి భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్స్‌లో ఒక స్వర్ణం, ఒక రజతం, కామనె్వల్త్ యూత్ గేమ్స్‌లో ఒక స్వర్ణం, ఒక రజతం, కామనె్వల్త్ గేమ్స్‌లో ఒక స్వర్ణం, ఒక రజతం, మరో కాంస్యం, ఆసియా క్రీడల్లో కాంస్యం, ఉబేర్ కప్ టీమ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం, ఆసియా చాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. వీటికి తోడు 4 సూపర్ సిరీస్, 5 సూపర్ సిరీస్ ప్రీమియర్, 7 గ్రాండ్ ప్రీ టైటిళ్లను ఆమె సంపాదించుకుంది. ఇవన్నీ ఒక ఎత్తయితే, 2015లో ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్‌షిప్స్‌లో, అదే ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో రజత పతకాలను సాధించడం మరో ఎత్తు. ఆ కోణంలో ఆలోచిస్తే, ఈసారి ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో సైనా ఫేవరిట్స్ జాబితాలోనే ఉంటుంది. కానీ భుజం గాయం, కాలి నొప్పి వేధిస్తున్న నేపథ్యంలో, ఫిట్నెస్ సమస్య అడ్డంకిగా మారింది. ఈ సమస్యల నుంచి బయటపడితే, ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో సైనా సంచలనాలు సృష్టించే అవకాశం లేకపోలేదు. తాయ్ జూ ఇంగ్, అనాకే యమగుచి, సంగ్ జీ హ్యున్, రచనోక్ ఇంతానన్ వంటి మేటి క్రీడాకారిణుల నుంచి ఆమెకు గట్టిపోటీ తప్పకపోవచ్చు. అయితే, టైటిల్ సాధించడమే తన లక్ష్యమని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ప్రకటించిన సైనా ఫిట్నెస్‌పై దృష్టి కేంద్రీకరించినట్టు తెలిపింది. అంతేగాక, ప్రత్యేక స్కిల్స్‌ను పెంచుకోవడానికి కృషి చేస్తున్నట్టు చెప్పింది. పూర్తి ఫిట్నెస్‌తో ఉంటే సైనాను నిలువరించడం సులభం కాదన్నది వాస్తవం.
పురుషుల విభాగానికి వస్తే, ఎవరి అంచనాలకూ అందని రీతిలో అంతర్జాతీయ బాడ్మింటన్‌పై తనదైన ముద్రవేసిన ఆటగాడు కిడాంబి శ్రీకాంత్. ఒక్కో టోర్నీతో రాటుదేలుతూ, విజయాలతో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటూ దూసుకెళుతున్నాడు. పరాజయాల నుంచి పాఠాలు నేర్చుకుంటూ ఎదుగుతున్నాడు. కొంత కాలంగా అనుకున్న స్థాయిలో రాణించలేకపోతున్నప్పటికీ, అతనిని తక్కువగా అంచనా వేయడానికి ఏమాత్రం వీల్లేదు. సాయి ప్రణీత్‌ను కూడా గట్టిపోటీదారుడిగానే పేర్కోవాలి.