ఆటాపోటీ

సాకర్‌కు దీటుగా.. బాడ్మింటన్ దూకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకున్న సాకర్‌కు సుమారు దశాబ్దకాలంగా బాడ్మింటన్ సవాళ్లు విసురుతున్నది. ప్రజాభిమానాన్ని రోజురోజుకూ పెంచుకుంటూ, సాకర్ తర్వాత ఎక్కువ మంది ప్రేక్షకులు వీక్షించే క్రీడగా ఎదిగింది. వివిధ దేశాలకు విస్తరిస్తున్నది. త్వరలోనే ఫుట్‌బాల్‌ను అధిగమించి, ఎక్కువ మంది అభిమానులున్న క్రీడగా అవతరించే అవకాశం లేకపోలేదు. ఇంతగా ఆదరణ పొందుతున్న బాడ్మింటన్ ఆడడం అనుకున్నంత సులభం కాదు. అది ఎంత కష్టమో చూస్తే తెలియదు.. స్వయంగా ర్యాకెట్ పట్టుకొని, కోర్టులోకి అడుగుపెడితేనే తెలుస్తుంది. మెరుపు వేగంతో దూసుకొచ్చే షటిల్ దిశను గుర్తించి, క్షణాల్లో పొజిషన్ తీసుకొని, ప్రత్యర్థికి సరైన సమాధానం చెప్పడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఒక సమర్థుడైన ఆటగాడు బలంగా స్మాష్ చేస్తే, షటిల్ గంటకు సుమారు 322 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది. ఆ విధంగా స్మాష్ చేయడానికి, ప్రత్యర్థి కొట్టిన షటిల్‌ను అంతే సమర్థంగా లిఫ్ట్ చేయడానికి ఎంతో బలం ఉండాలి. మజిల్ పవర్ ఎంత ఎక్కువగా ఉంటే, బాడ్మింటన్‌లో అంత బాగా రాణించగలుగుతారు. బాడ్మింటన్ కోర్టులోకి దిగడమే ఒక సవాలు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి మ్యాచ్‌ల్లో ఉత్కంఠకు కొదువ ఉండదు. ప్రపంచ చాంపియన్‌షిప్స్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ స్థాయి టోర్నీల్లో పోటీపడేవారంతా అంతర్జాతీయ స్టార్లు కావడంతో, ప్రతి ఒక్క మ్యాచ్, అనుక్షణం అభిమానులను మునివేళ్లమీద నిల్చోబెడుతుంది. ఉత్కంఠ రేకెత్తిస్తూ, శారీరక ద్రుఢత్వానికి, మానసిక పరిపక్వానికీ పరీక్ష పెడుతూ, అద్భుతమైన వ్యాయామంగా, ఆసక్తికరమైన క్రీడగా మారింది కాబట్టే బాడ్మింటన్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉంది. సాకర్ తర్వాత ఎక్కువ మంది అభిమానులు ఈ ఆటకే ఉన్నారు. బాడ్మింటన్ ఎప్పుడు, ఎక్కడ మొదలైంది అనే ప్రశ్నకు సరైన సమాధానం లేదు. చారిత్రక ఆధారాలు కూడా తక్కువే. బాడ్మింటన్‌ను పోలిన క్రీడలు కొన్ని తైలవర్ణ చిత్రాల్లో, శిల్పాల్లో కనిపిస్తుండడంతో, దీనికి శతాబ్దాల చరిత్ర ఉందని అంటారు. ఆధునిక కాలానికి వస్తే, అమెరికాలో 19వ శతాబ్దంలోనే ఈ క్రీడ ప్రాచుర్యాన్ని పొందింది. 1930 దశకానికి బాడ్మింటన్ ఇంటింటి ఆటగా మారింది. 1992లో మొదటిసారి ఒలింపిక్స్‌లో అడుగుపెట్టింది. ఆసియా దేశాల ఆధిపత్యం ఈ క్రీడలో కొనసాగుతున్నదని చెప్పడానికి ఒలింపిక్స్‌లో పతకాలే సాక్ష్యం. 46 ఒలింపిక్ పతకాల్లో 42 ఆసియాకు చెందిన వారే గెల్చుకున్నారంటే ఆశ్చర్యం కలగక మానదు. చైనా, జపాన్, కొరియా, ఇండోనేషియా, మలేసియా దేశాల సరసన భారత్ కూడా బాడ్మింటన్ పవర్ హౌస్‌లో చోటు సంపాదించింది. ఆసియాలో వేళ్లూనుకున్నప్పటికీ, చాలా దేశాల్లో బాడ్మింటన్‌కు ఆదరణ బాగానే ఉంది. 1934లో ఏర్పడిన అంతర్జాతీయ బాడ్మింటన్ సమాఖ్య (బిఎఫ్‌ఐ)లో ఇప్పుడు 148 సభ్య దేశాలు ఉన్నాయంటే, ఈ క్రీడ ఎంతగా విస్తరించిందో ఊహించుకోవచ్చు. ఈ స్థాయిలో దూసుకెళుతున్నది కాబట్టే, సాకర్‌కు గట్టిపోటీనిస్తున్నది. ఫిఫా ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌కు సవాళ్లు విసురుతూ, అభిమానుల సంఖ్యను పెంచుకుంటున్నది. ప్రతి ఇంటి ఆటగా మారుతున్న బాడ్మింటన్ మరో గొప్ప విందును అందించడానికి సిద్ధమవుతున్నది. గ్లాస్గోలో ఈనెల 21 నుంచి 27 వరకు జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్స్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ టోర్నీని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎంత మంది చూశారో లెక్కలు తేలితే, సాకర్‌తో బాడ్మింటన్ ఏ స్థాయిలో పోటీపడుతున్నదో స్పష్టమవుతుంది.

- శ్రీహరి