దక్షిన తెలంగాణ

నిజం! (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నడూ లేంది సినిమా కెళ్దామని బుంగి

పిలుపునిచ్చిండు. నిజానికి సినిమా

చూడటమంటే నాకు అయిష్టం. ఫక్తు

వ్యాపారాత్మక ధోరణి. మనిషి బలహీనతలను

రెచ్చగొట్టి డబ్బు చేసుకోవడం ఆనవాయితీగా

మారింది. బుంగి మాట కాదనలేక

బయల్దేరాను. ఊర్లో ఉన్న థియేటర్స్ అన్నిట్లో

ఒకే సినిమా రిలీజ్ అయింది. చూడాల్సింది

అదొక్కటే అనే పరిస్థితి కల్పించారు. ఏమిటీ

మొనోపలీ అనిపించింది. మంచి టాక్

వ్యాపింపచేశారు. టికెట్స్ దొరుకుతయో లేదోనని

ముందుగనే వెళ్లినం. చాలా ఏండ్ల తరువాత

థియేటర్‌కు వెళ్లడం వల్ల అంతా కొత్తగా ఉంది.

టికెట్స్ తీసుకున్నం. జనం పలుచగనే

ఉన్నారు. సినిమా టికెట్ అరచేయి పొడవుతో

క్లాత్ స్టోర్ అడ్వర్టయిజ్‌మెంటుతో

చూడముచ్చటగా ఉంది. పెద్దగా కనిపించాల్సిన

సీట్ నెంబర్, వరుస వివరం ఒక మూలకు

అడ్డదిడ్డమైన చేతిరాతతో వెలవెలబోతూ

కనిపించింది. అందలమెక్కిన వ్యాపార దృష్టికి

ఉక్కిరిబిక్కిరయ్యాను.
సినిమా మొదలైంది. జనం ఒక్కసారిగా

వచ్చేసరికి హాల్ అంతా నిండింది. నా సీటు

వరకు మొత్తం నిరక్షరాస్యులైన పల్లె జనంతో

నిండింది. వేషభాషల వల్ల వారి పరిస్థితి నామ

మాత్రమే అనిపించింది. చిన్ననాటి రోజులు

జ్ఞాపకం వచ్చినయి. ధనవంతులు బాల్కనీ

లోకి, పేదలు నేలక్లాసులోకి వెళ్లేవారు.

ఇప్పుడారేఖ చెదిరింది. సినిమా మొదలయింది.

నేలక్లాసులో ఈలలు, గోలలు మిన్నంటాయి.

నా పక్కనున్న వారు నిశ్శబ్దంగా ఉన్నారు.

ఈలలకు అనుగుణంగా వారి కదలికలు

సాగుతున్నాయి. వారిలో ఎగసిపడుతున్న

ఉత్సాహానికి ఈ క్లాసు వాతావరణం నిజంగా

కళ్లెం వేసింది. వారి ప్రవర్తన బలవంతంగా

మారింది. పరాయిగా బతకడం అంటే ఇదేనేమో

అనిపించింది.
రూపుయందుగాని చూపులందైనను
ఒక్క తీరుగానె చక్కనైన
కాకి, కోకిలెపుడు కాలేదు నిజముగా
తెలిసినడచు కొనుము తెలుగు బిడ్డ

- డాక్టర్ బి.వి.ఎన్.స్వామి, కరీంనగర్, సెల్.నం.9247817732