రాజమండ్రి

చిగురించని మగ్గం (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూలిపోతున్న
గుడిసెలో మగ్గం వౌనంగా
చిగురిస్తోంది చీరై
మగ్గం పాట వేసవిలో
దాహ ప్రవాహం
నేత కార్మికుని గొంతులో
ఆకలై విస్తరించింది
మగ్గం కదలికలో
అనుభవం, ఉద్వేగం
హృదయం నిండా నిండిపోయి
చీరలా అద్భుత ప్రపంచాల్ని
ఆవిష్కరిస్తోంది
శ్రామికుని శ్రమ దీపంలా వెలుగుతోంది
అందాల చీర వెలుగుల్లో
గిట్టుబాటు ధరలేని బట్టలకు
జీవితం చీకటైంది అప్పుల్లో
వాని ఖాళీ కడుపులోని మంచినీళ్లు
వౌనంగా కళ్లల్లో కన్నీరై పూస్తుంది
పువ్వులా
వాడు ఉదయం మగ్గం ఆకాశంలో
ఉదయించే సూర్యుడు
మనుష్యులకు బట్టలు అందించి
తాను నగ్నంగా నిలబడ్డాడు
వేసవి నిప్పుల కుంపటిపై నిలబడి
కాలం ఆకలి నిచ్చెనపై
నడుస్తున్న శ్రమ నగ్న శరీరం
వేసవి కాలం ముగిసేలోగా
ఎండలో
వాడి జీవితం ముగిస్తుందేమో..
- నల్లా నరసింహమూర్తి
అమలాపురం, చరవాణి: 9247577501

ఏడు పదుల స్వతంత్రం
ఆ గుడిసె ముందు ఒంటరిగా ఆ పోరడు
అమ్మ కూలిపనికెళ్లింది
అయ్య సారా తాగి
మత్తులో తూలుతున్నాడు
పక్కింటి రాంబాబు
తల్లి దగ్గర పైసలు తీసుకొని
మధ్యాహ్నం మ్యాటినీకెళ్లాడు
ఆ గుడిసె ముందు ఒంటరిగా ఆ పోరడు
గాజుకళ్లతో శూన్యంలోకి చూస్తూ
ఊహలకే పరిమితమైన
అందమైన భవిష్యత్తులోకి తొంగిచూస్తూ
ఆ గుడిసె ముందు ఒంటరిగా ఆ పోరడు
అంచలంచెలుగా ఎదిగి
కష్టాల కడగండ్లను దాటి
ఉన్నతోద్యోగిగా స్థిరపడి
అమ్మకు పాదాభివందనం చేసిన
అద్భుతాన్ని ఆవిష్కరించిన దృశ్యం
పంచరంగుల చలనచిత్రంలా
కన్నుల ముందు సాక్షాత్కరించింది
కడుపులో ఆకలి కేకలు పెట్టింది
పగటి కల చెదిరిపోయింది
ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చాడు
పరమార్థం గుర్తుకొచ్చింది
ఆదివారం కూడా బడిలో
మధ్యాహ్న భోజనం పెడితే
పగటి కలలు కనడం మానేసి
ఒంటరితనానికి తిలోదకాలిచ్చి
హాయిగా బతికేయొచ్చు!
పాపం.. పసివాడి అంతరంగంలో
అల్పమైన ఆలోచన తొంగిచూసింది
ఏడు దశాబ్దాల స్వాతంత్య్రం
సిగ్గుతో తలదించుకున్నది!
అడుగో.. ఇంకా..
ఆ గుడిసె ముందు
ఒంటరిగా.. ఆ పోరడు!
- విడదల సాంబశివరావు,
చరవాణి : 9866400059

ప్రేమంటే ‘ఒన్‌వే’ కాదు

వెంటపడి వేధిస్తే
నీ వెంటపడి వచ్చేయాలా
అది నీ అక్క కూతురా?
అత్త కూతురా?
ప్రేమంటే ‘ఒన్‌వే’ కాదురా
నీకు నీవే గ్రీకు వీరుడిలా ఊహించుకుని
కాదంటే యాసిడ్ పోయటం
వేటకొడవలితో వేటాడటం పైశాచికత్వం
మానవతకో మాయని మచ్చ
పెరట్లోని గులాబిని
పశువు పాడుచేస్తేనే సహించం
అనురాగం, ఆప్యాయాతలను
ముద్దలుగా చేసి
మురిపెంగా పెంచుకున్న
అపరంజి బొమ్మను
నిర్ధాక్షిణ్యంగా నీవు కాలరాస్తే
కన్నవారి కడుపు కోతను తీర్చటం ఎవరి తరం
ఆప్యాయతకు అర్థం తెలియని
నీలాంటి మానవ మృగాలకు
చట్టానికి అతీతంగా
జీవితకాలం గుర్తుండే శిక్ష పడాలి
అది ఎలాంటిదైనా సరే...
- హైమవతీ సత్య
వేల్పూరు
తణుకు మండలం, ప.గో.జిల్లా
సెల్: 9100735905

లక్షావధాని..
లక్ష్యావధాని!
నన్ను అవని చేర్చుటకై
యమునితో పోరాడిన వీరనారి
నా ఉదయంతో విచ్చుకున్న
లెక్కలేని రేకులు గల కమలం
నేను మురళి రూపు దాల్చుటకై
కత్తిపోట్లు తిన్న వెదురుబద్ద
వివేకం చుక్కానిగ
ఆవేశము తెరచాపగ
నా జీవన నౌక రూపశిల్పి
జీవన సూత్రాల లెక్కల
చిక్కుల బాటల్లో దిక్సూచి
వణికించే కష్టాల్లో
నా చలి కుంపటి
అనుభవాల అవసరాల్లో
నిండు విస్తరి
అమ్మ..
ఆ లక్షావధానికి
లక్ష్యావధానికి
నా కవితా హారతి!
- గుడిపూడి రాధికారాణి