డైలీ సీరియల్

ట్విన్ టవర్స్- 79

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘సారీ, నాకే పవరుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి ‘సారీ’ అనే పదాన్ని శాశ్వతంగా తీసిపారేసేదాన్ని అనుకున్నాను చిరాగ్గా’’.
ప్రతివాళ్ళు చెయ్యదల్చుకున్నవి చేసేస్తారు. చేసేవి అన్నీ చేశాక, ఎవరికైనా ఇబ్బంది కలుగుతే సారీ! అంటారు. కనీసం ఆ సారీ వెనక సిన్సియారిటీ అయినా వుండదు. కాలు తొక్కి సారీ అంటే ఆ నొప్పి ఎక్కడికి పోతుంది?
‘‘అన్నయ్యా, నువ్వొస్తున్నావా మ్యాచ్‌కి’’ అని అరిచాను వీధిలోంచే?
అన్నయ్యకి కూడా తెలియదు. అందుకని తను కూడా ముందుగా ఏమీ అనుకోలేదు. కానీ నేను పిలిచేటప్పటికీ వస్తున్నా, వస్తున్నా అంటూ బయటకొచ్చాడు.
‘‘వదినా నువ్వూ రా!’’ అన్నాను. ఆవిడ రాదనీ తెలిసి కూడా!
ఆవిడకు ఆటలు, గేమ్స్ అంటే మహా చిరాకు.
‘‘నీ కొడుకు ఇండియా తరఫున ఆడినపుడు వస్తాలే’’ అంతవరకు నువ్వు చూచిరా!’’ అంది.
‘‘ఆరోజు వస్తే ఆ టిక్కెట్లు నీలాంటివాళ్లమీద వేస్ట్ చెయ్యం’’ అంటూ అన్నయ్య వచ్చాడు.
‘‘ఇద్దరం బెంచీలమీద కూర్చుని చూస్తున్నాం. అది లోకల్ పిల్లల గేమ్! కానీ ఆ ఆటగాళ్ళకు, వాళ్ళ తల్లిదండ్రులకు ఒక నేషనల్ ఛాంపియన్‌షిప్ గేమ్‌లాగానే ఉంది.
‘‘అన్నయ్య నాతో ఏదో అనబోయాడు. ఇప్పుడేం వద్దు అన్నయ్యా! తరువాత మాట్లాడదాం’’ అని ఆపేశాను.
చీర మార్చుకుంటుంటే అమ్మ చూపిన కవరు మనసులో మెదులుతూనే ఉంది. శ్రద్ధగా చదవకపోయినా అదేమిటో నాకు తెలుసు.
పోయిన కొద్ది సంవత్సరాలుగా ఇలాటిదేమయినా జరుగుతుందా అని మనసులో అనుమానం పీడిస్తున్నదాన్ని పక్కకు నెడుతూనే ఉన్నాను. కానీ ఇవాళ ఆ అనుమానం ఎదుటికి వచ్చేటప్పటకి స్వీకరించే పరిపక్వత మనసుకు రాలేదు.
కళ్ళు గేమ్‌ని చూస్తూనే ఉన్నాయి. అందరితోపాటు యాంత్రికంగా చప్పట్లు కొడుతూనే ఉన్నాను. అన్నయ్య మధ్య మధ్య నా ముఖం వంక చూస్తున్నాడని కూడా తెలుసు. అయినా నా కళ్ళు గేమ్ నుంచి మరల్చలేదు. వాటిని తడి అవనీయలేదు.
నా వౌళి గేమ్‌లో చాలా ముఖ్యమైన పొజిషన్‌లో ఆడుతున్నాడు. ఇవాళ వాడి గెలుపు వాడికి చాలా ముఖ్యం. నాకు కూడా అదే ముఖ్యం. మరేమీ కాదు.
నాకు నేను చెప్పుకుంటూనే గేమ్ పూర్తిచేశాం. వౌళి టీమ్ గెలిచింది. వాడి సంతోషానికి అవధులు లేవు.
మొహం అంతా సంతోషాన్ని పులుముకుని ఎగురుకుంటూ మా దగ్గరకు వచ్చాడు.
‘‘ఎలా వుంది మావయ్యా గేమ్’’
‘‘్ఫర్వాలేదురా! నువ్వు నా అంత బాగా ఆడటంలేదు’’ అన్నాడు అనయ్య నవ్వుతూ.
‘‘పో మామయ్యా అన్నీ అబద్ధాలే’’ అన్నాడు. వాడికి తెలుసు మామయ్య చాలా సంతోషంగా వున్నప్పుడే తనతో పోల్చి తక్కువ చేస్తాడు.
ఇంతలో గేమ్ కోచ్ మా దగ్గరకు వచ్చాడు. పిల్లలంతా పార్టీ చేసుకుంటారుట. తరువాత వౌళిని తనే ఇంటి దగ్గర దింపుతానని.
నేను అన్నయ్య ఇంటికొచ్చాము. మొట్టమొదటిసారిగా నాకు ఇంటికి వెళ్లాలనిపించలేదు. ఎవరి ముఖం చూడాలనిపించలేదు.
కాని ఇంటికి వెళ్లాం. నాన్న వరండాలో పడక కుర్చీలో కూర్చుని వున్నారు. మొహం చాలా గంభీరంగా ఉంది. మామ్మ మొహం వాడిపోయింది. అమ్మ కళ్ళు, ముక్కు వాచిపోయి ఉన్నాయి. వీటన్నిటికి కారణం ఏమిటో నాకు తెలుసు. ‘‘నేను నా భవిష్యత్తు’’ అదే వాళ్లను కృంగదీస్తోంది. నేను ఎన్నో విధాలుగా అభివృద్ధి చెందినా సరే, వాళ్ళ బాధ మాత్రం తగ్గదు.
మాట్లాడకుండా భోజనం చేసి, ఆ రోజు కోర్టునుండి వచ్చిన కవరు తీసుకుని నా గదిలోకి వెళ్లాను కాని ఆ కవరుని విప్పి చదవాలనిపించలేదు. బల్లమీద పెట్టాను. ఏనాడో ఆ బల్లమీద పెట్టిన రఘు ఫొటో అక్కడే వుంది. ఆ ఫొటో ముందే పెట్టాను. కిటికీలోంచి బయటకు చూస్తూ ఉండిపోయాను.
తలుపు చప్పుడయింది. వదిన అయి వుంటుందని వెనక్కి తిరగలేదు. వదినే! ఆవిడా ఏమీ మాట్లాడలేదు. వూరికే నాకు కంపెనీ కోసం వచ్చింది.
ఒక్కొక్కసారి నిశ్శబ్దం ఏ పదము ఇవ్వలేనన్ని అర్థాలను ఇస్తుంది. శబ్దం కలిగించలేనంత ధైర్యాన్ని ఇస్తుంది.
మా వదిన ఉద్దేశం నాకు తెలుసు. ఎటువంటి సహాయం కావలసినా, వెనక తాము వున్నామన్న సందేశం ఇవ్వడం మాత్రమే.
మేమిద్దం మాట్లాడకుండానే బయట గేటు చప్పుడయింది. వౌళి అయి వుంటాడు. వదిన బయటకు వెళ్లింది తలుపు తెరవడానికి. ‘ఏం చేశావు మీ మామయ్యని కూర్చోలేకుండా, నుంచోలేకుండా ఎగిరిపోతున్నాడు’’ అంది. వాతావరణంలో ఎటువంటి మబ్బు కమ్మనట్లు.
వౌళి చాలా ఉత్సాహంగా ఉన్నాడు. పూస గుచ్చినట్లు ఆట గురించి వదినకు చెప్పాడు. ఆటలో చీమంత ఇంట్రెస్ట్ లేని వదిన చాలా కుతూహలంగా వింది.
అందరూ నిద్రపోయారు. అంతకంటే నిజం అందరూ పడుకున్నారు కానీ ఎవ్వరూ నిద్రపోలేదు.
తెల్లవారింది. దైనందిన కార్యక్రమాలలో మార్పులేదు. అన్నయ్య మాత్రం నా దగ్గరకు వచ్చి ఇవాళ సెలవు పెట్టు అన్నాడు. ఎందుకో నాకు తెలుసు. నేనేమీ మాట్లాడలేదు. అన్నయ్య చెప్పినట్లే చేశాను. మామూలుగా తయారయ్యాను. వౌళి స్కూలుకి వెళ్లిపోయాడు.
అంతకుముందే బయటకు వెళ్లిపోయాడు అన్నయ్య. వ్యవహారం చూస్తే తను బ్యాంక్‌కి సెలవు పెట్టినట్లే ఉన్నాడు.
వౌళి వెళ్లిపోయాక, రాత్రి తీసుకున్న కవరు తెరిచి అంతా చదివాను.
బోలెడు లీగల్ లాంగ్వేజ్. అది అర్థం చేసుకోవాలంటే ప్రతి వాక్యం సగానికి సగం తగ్గించేయాలి. షల్, ఉడ్ అన్న పదాలు తీసిపారేయాలి. అప్పుడు కొంచెం అర్థవౌతుంది.
అన్నయ్య, దాదాపు తన వయసే వున్న మరో వ్యక్తితో లోపలికు వచ్చాడు. తెల్లటి పేంట్, నల్లటి కోటు ఆయన ఎవరో ప్రత్యేకంగా తెలపాల్సిన పనిలేదు.
అన్నయ్య బ్యాంక్‌లో పెద్ద ఆఫీసర్. ఆ వూళ్ళో పెద్ద పెద్ద డాక్టర్లు, లాయర్లు అంతా అన్నయ్యకి పరిచయమే.
నన్ను పిలిచి పరిచయం చేశాడు. వదిన అందరికీ కాఫీలు ఇచ్చింది. నాన్న కూడా వచ్చి కూర్చున్నాడు.
-ఇంకాఉంది

- రమాదేవి చెరుకూరి