మంచి మాట

గోకులాష్టమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృష్ణాష్టమినే జన్మాష్టమి, గోకులాష్టమి కూడా. దేవకీ వసుదేవుల పంట పండిన శ్రావణ బహుళ అష్టమినాడు ఈ కృష్ణాష్టమిపండుగను కుల మత భేద రహితంగా చేసుకుంటారు. కొంతమంది కృష్ణుడు పుట్టినప్పుడు ఉన్న రోహిణి నక్షత్రం ఉన్న రోజున కూడా జరుపుకుంటారు. శ్రావణ బహుళ అష్టమి, రోహిణి నక్షత్రం, అర్థరాత్రి కారాగారంలో దేదీప్యమానంగా వెలుగొందే చిన్నారి బాలుడు దేవకీ ఒడి నిండాడు. వసుదేవాదులకు నీలమేఘశ్యాముడు, మకరకుండల కేయూరధారుడు అయిన శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించాడు. ఆ చతుర్భుజాకారుడిని చూడగానే అపరిమితానందంతో దేవకీ వసుదేవులు చేతులు జోడించి కనుల నీరు కారుతుండగా మొక్కారు. దేవాదిదేవుడు అనాది మధ్య లుడు, ఆపద్భాంధవుడు, అనంతుడు, ఆపదమొక్కులవాడు అంటూ ఎనె్నన్నో నామాలతో కీర్తించారు.
మానసికంగానే స్నానపానాదులు ఆచరించి వారిద్దరూ భగవంతు నికి ఆసన ఆర్ఘ్యపాద్యాదులిచ్చి ఎన్నో రకాల నివేదనలు చేసి కర్పూర హారతులిచ్చి ఎన్నోకీర్తనలు ఆలపించారు. స్తుతించారు. ఆనంద తన్మయత్వంలో మునిగిపోతున్న వారిని చూచి భగవంతుడే ఓ దేవకీ వసుదేవుల్లారా అని పిలిచి తన్ను యశోదమ్మ దగ్గర పడుకోబెట్టి అక్కడ ఉన్న యోగమాయ అనే పురిటి కందును తీసుకొని వచ్చి కంసునికి చూపించమన్నాడు.
వసుదేవుడు అట్లానే చేశాడు. రేపల్లెలో నందుని ఇంట యశోదమ్మ మగపిల్లవాడిని కనిందంటూ ఆమెకు బాలింతోపచారాలు చేశారు. పుట్టిన బిడ్డకు స్నానపానాదులు చేయంచారు. దిష్టులు తీశారు. నందుడు పుత్రుడు పుట్టాడని గోవులను, భూములను దానం చేశాడు. యశోదమ్మ చేత పసిడి దానం ఇప్పించారు. పండింటి మగ పిల్లవాడు అంటూ చూడడానికి వచ్చిన ముత్తెదువులందరికీ పండు తాంబూ లాదులు ఇచ్చిపంపుతున్నారు.
అలా ఆనాడు పుట్టిన కృష్ణుడిని తలుచుకుని ఏమేమి చేసి ఉంటారో అవి అన్నీ ఈనాడు అన్ని దేవాలయాల్లో కృష్ణునికి చేస్తుంటారు. అందరిండ్లల్లో కృష్ణజననాన్ని పురస్కరించుకుని కృష్ణునికి ఇష్టమైన పాలు పెరుగు వెన్న మీగడ ఇలాంటివాటిని కృష్ణయ్యకు నివేదనలు చేస్తారు. చిన్న పిల్లలకు కృష్ణుని వేషం కట్టి కళ్లారా కృష్ణయ్యను చూసుకొంటారు. తమతమ పిల్లలు కృష్ణయ్యలే అనుకొని తల్లులంతా తమను యశోదమ్మగా భావించుకుని మురిసిపోతుంటారు.
కృష్ణలీలలను గుర్తు చేసుకొని మధురమైన కృష్ణ కథలు వింటుంటారు. మరికొంతమంది శ్రీకృష్ణ ప్రతిమను లేదా పటాన్ని ఉంచి షోడశోపచారములతో భక్తిగా అర్చిస్తారు. నేలను అలికి, స్వస్తిక్ ఆకారపు ముగ్గువేసి, ఆ స్థలాన్ని బాగా అలంకరిస్తారు. పండ్లు, పిండి పదార్థాలు లడ్డూలు, మోదకములు, పాలతో వండిన పదార్థాలతో నెయ్యి, పాలు, తేనె, బెల్లంతో కూడిన నైవేద్యమును ‘ఓ శ్రీకృష్ణా! నీవు స్వీకరింతువుగాక’ అని నివేదిస్తారు. తరువాత పచ్చకర్పూరం, యాలకులు, లవంగాలు, జాజి, జాపత్రి మొదలైన సుగంధ ద్రవ్యాలతో కూడిన తాంబూలమును స్వామికి సమర్పిస్తారు. అనంతరం స్వామికి కర్పూర నీరాజనాన్ని, నమస్కారాన్ని సమర్పిస్తారు. ఇట్లా చేయడం కృష్ణాష్టమి వ్రతంగా భావిస్తారు. సాయంత్రం పూట వీధి కూడలిలోను, దేవాలయాలల్లోను ఉట్టు కొట్టే పండుగను చేస్తారు. మరికొంతమంది పదహారు వేలమంది గోపికలతో, రాధతో యమున ఒడ్డున బాలకృష్ణుడు ‘రాసలీల’ జరిపి గోపికలను ఆనందపరవశులను చేయడం, ఆత్మ - పరమాత్మల సమ్మేళనలోని అంతరార్థాన్ని తెలియచేసేందుకై ఆయన ఈ బృందావనాన్ని రంగస్థలంగా చేసుకోవడం స్మరించుకుంటూ ఈనాడు పోతనామాత్యుని భాగవతపఠనం చేస్తారు. శ్రీకృష్ణుని లీలలను మనసార స్మరించుతూ కృష్ణాష్టమి నాడు కృష్ణనామాన్ని జపించినవారు శ్రీ కృష్ణ సాయుజ్యాన్ని పొందుతారు.
కృష్ణునికి ఇష్టమైన నామం గోవింద జలములనుండి భూమిని పైకి తీసుకొని వచ్చి సృష్టికి కారణమైనవాడు కనుక గోవింద నామం పిలువబడినది. గోవులంటే ప్రీతి, ప్రేమ. వాటి కాపరిగా ఉండటం చేత గోవిందా గోవిందా అని పిలువబడ్డాడని అనంతనామధేయుణ్ణి సహస్రనామాలతో అర్చిస్తుంటారు.

- చోడిశెట్టి శ్రీనివాసులు