AADIVAVRAM - Others

వింత జీవి శిలాజం ఏం చెబుతోంది? (విజ్ఞానం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూమిపై పరిణామ దశ మొదలైన కాలంలో నీటిలో ఈదుతూ జీవించిన సరికొత్త జీవి శిలాజాన్ని ఇటీవల శాస్తవ్రేత్తలు కనుగొన్నారు. డైనోసార్ల వంటి అతి భారీ జంతుజాలం జీవించినప్పుడు ఇవి కూడా ఉన్నాయన్నమాట. అప్పట్లో జీవజాలం అతి భారీగా ఉండేవి. కానీ ఆ కాలంలో మనుగడ సాగించిన సరికొత్త జీవి శిలాజం మాత్రం చిన్న పరిమాణంలో ఉంది. దాదాపూ 541 మిలియన్ సంవత్సరాల క్రితం మొదలైన జీవ పరిణామ దశలో ఇది మనుగడ సాగించినట్లు కరెంట్ బయాలజీ జర్నల్ తాజా సంచికలో పేర్కొన్నారు. ‘కేపినటేటర్ ప్రయేటర్ మిస్సస్’ అన్న పేరుతో దీనిని పిలుస్తున్నారు. కేవలం ఇది ఒక జీవిగానే కాకుండా ఒక జినస్ (ప్రజాతి) ఉన్న అతిపెద్ద కుటుంబానికి చెందిన జీవజాలమని వారు అంచనాకొచ్చారు. ముఖం లేని సన్నని ఈ జీవికి ముఖం ఉండాల్సిన ప్రాంతంలో రెండు దవడల్లా, ఇరువైపులా కలపి 50 సన్నని కొక్కాల వంటి ఎముకల అమరిక ఉన్న శిలాజాన్ని కనిపెట్టారు. ఆహారాన్ని పొదివిపట్టుకుని తినేందుకు ఈ భాగం ఉపయోగపడేదని భావిస్తున్నారు. నాలుగు అంగుళాల పొడవున్న ఈ జీవికి అంగుళంలో మూడోవంతు పొడవైన వెన్నుముక ఉంది. కొన్ని జలచరాలకు ఉన్న రీతిలో ఇది ఉండటాన్ని వారు గుర్తించారు. సముద్ర జలాల్లో జీవించే ఒక రకమైన యారో వార్మ్స్ (్ఛటోగ్నథ)కు ఇవి ముందుతరాలని చెప్పొచ్చు. నోరు లేకపోయినా అది ఉండాల్సిన భాగంలో దంతాలకు బదులు మరో ఏర్పాటు ఉండటాన్ని బట్టి ఆ జీవి ప్రీహిస్టారిక్ కాలానికి చెందినదిగా భావిస్తున్నట్లు యేల్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్తవ్రేత్తల బృంద నాయకుడు డెరెక్ బ్రిగ్స్ చెప్పారు. బ్రిటిష్ కొలంబియా, కెనడాలోని రెండు జాతీయ పార్కుల్లో ఈ శిలాజాలను ఆ బృందం క్షుణ్ణంగా పరిశీలించింది. ‘అతి సూక్ష్మమైన, కొక్కేల వంటి ఎముకల సమూహంతో కూడిన నోటివంటి భాగం అతి బిగుతుగా ఉందని’ ఆయన పేర్కొన్నారు. మిగతా శరీరంలో వెన్నుముక కొనసాగిందా లేదా అన్నది ఇంకా నిర్ధారించలేదు. దీనికి పెట్టిన ‘కేపినటేటర్’ అన్న పేరుకు అర్ధం చురుకుగా ఈతకొట్టగల జీవి అని అర్థం. భూమిపై జీవరాశి వైవిధ్యమైన పరిణామ దశలో ఉన్నప్పుడు ఇవి జీవించి ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ శిలాజాలు ఇప్పటికే శిథిలమైపోవడం వల్ల ఇతర అంశాలను కనుగొనడం కష్టంగానే ఉంది. అయితే ఈ శిలాజాల్లో మృదువైన కణజాలాన్ని భద్రపరచగలిగామని బ్రిగ్స్ చెప్పారు. అందువల్లే కేపినటేటర్ ఏ జీవులను పోలి ఉందన్న విషయాన్ని కనిపెట్టగలిగారు. ‘కేంబ్రియన్’ కాలంలో జీవించిన అందమైన సరికొత్త జీవజాతి గురించి తెలుసుకునేందుకు ఈ శిలాజాలు ఉపయోగపడ్డాయని మరో శాస్తవ్రేత్త డగ్ ఇర్విన్ అభిప్రాయపడ్డారు.