విజయనగరం

మారనున్న రూపురేఖలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం: ఒకప్పుడు రాజధానిగా బాసిల్లిన విజయనగరం రూపురేఖలు మారబోతున్నాయి. ఎంతోకాలంగా రోడ్ల విస్తరణ కోసం ఎదురుచూస్తున్నప్పటికీ అడుగడుగునా ఆటంకాలు ఎదురుకావడంతో రోడ్ల విస్తరణ మందకొడిగా సాగుతున్నప్పటికీ వాటికి డెడ్‌లైన్ విధించడం, బాధితులకు టిడిఆర్‌లు అందజేయడం, సారిపల్లిలో గృహనిర్మాణం చేపట్టడం వంటి చర్యల వల్ల బాధితులు కొంత మంది కోర్టుకెళ్లినప్పటికీ అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించడంతో వారంతా తమ స్థలాలను రోడ్ల విస్తరణకు అప్పగించేందుకు ముందుకు వచ్చారు. దీంతో రోడ్ల విస్తరణ కార్యక్రమం వేగవంతం చేయాలని ఇటీవల కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు అధికారులను ఆదేశించారు.
పట్టణంలో ప్రధానంగా 14 రోడ్లను విస్తరించాలని నిర్ణయించారు. వాటిలో మున్సిపాలిటీ,ఆర్ అండ్ బి, ఉడా రోడ్లను విస్తరించేందుకు ముందుకు వచ్చాయి. మున్సిపాలిటీ ఐదు రోడ్లను, ఉడా ఐదు రోడ్లను, ఆర్ అండ్ బి 4 రోడ్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అయితే వాటికి అవసరమైన స్థలాల క్లియరెన్స్ చేసి ఆయా శాఖలకు అప్పగించే బాధ్యత మున్సిపాలిటీ తీసుకుంది. ఈ విధంగా పట్టణంలో మున్సిపాలిటీ ముందుగా రోడ్ల విస్తరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వాటిలో గంటస్తంభం- పాత బస్టాండ్‌కు ప్రస్తుతం 36 అడుగుల రోడ్డు ఉండగా దానిని 80 అడుగులకు విస్తరించాలని నిర్ణయించారు. సుమారు 1.8 కిలోమీటర్ల రహదారి విస్తరణకు రూ.12 కోట్లు ఖర్చు కాగలదని అంచనా వేశారు. దీనికి రోడ్డు విస్తరణ జరిగినప్పటికీ శివారు ప్రాంతంలో ఎలక్ట్రికల్ స్తంభాలను మార్చాల్సి ఉన్నందున అక్కడ పనులు నిలిచిపోయాయి. పాతబస్టాండ్ వద్ద ఉన్న పెట్రోల్ బంకు స్థలాన్ని రోడ్డు విస్తరణకు వినియోగిస్తే అంత మేరకు రాజీవ్ స్టేడియం వద్ద ఖాళీగా ఉన్న స్థలాన్ని ఆ యజమానికి అప్పగించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. దీంతో ఈ సమస్య పరిష్కారమైంది. అదే విధంగా దాసన్నపేట రైతుబజారు నుంచి కొత్తపేట నీళ్లట్యాంక్ వరకు గల రహదారి ప్రస్తుతం 55 అడుగులు ఉండగా దానిని 100 అడుగుల మేరకు విస్తరించాలని నిర్ణయించారు. దీనికి ఎపిఇపిడిసిఎల్ సిబ్బంది స్తంబాలను మార్పు చేయాల్సి ఉంది. ఈ రెండు రోడ్లను వుడా చేపట్టాల్సి ఉంది. అలాగే అంబటిసత్రం నుంచి కొత్తపేట నీళ్ల ట్యాంకు వరకు ప్రస్తుతం ఉన్న 22 అడుగుల రోడ్డును 80 అడుగులకు విస్తరించాల్సి ఉంది. దీనిని ఆర్ అండ్ బి విస్తరించాల్సి ఉంది. ఈ రోడ్డుకు దాదాపు 199 మంది బాధితులకు నష్టం వాటిల్ల నుంది.దీనిపై 90 మంది బాధితులు రోడ్ల విస్తరణకు అంగీకరించినప్పటికీ, దాదాపు 46 మంది బాధితులు కోర్టును ఆశ్రయించడంతో ఈ రోడ్డు పెండింగ్‌లో పడింది. దీనిలో మరికొంత మంది కోర్టు కేసును ఉపసంహరించుకున్నట్టు బోగాట్టా. అలాగే గుంచి నుంచి దాసన్నపేట రైతు బజారు వరకు 28 అడుగుల రోడ్డును 66 అడుగులకు విస్తరించనున్నారు. ఈ రోడ్డుకు సంబందించి 4గురు కోర్టును ఆశ్రయించడంతో ఈ రోడ్డు విస్తరణ ఇంకను చేపట్టలేదు. అలాగే కోట జంక్షన్ నుంచి రింగ్ రోడ్డు వరకు 26 అడుగుల రహదారిని 66 అడుగుల నుంచి 80 అడుగులకు విస్తరించాలని నిర్ణయించారు. ఈ రహదారిని మున్సిపాలిటీ విస్తరించడానికి ముందుకు వచ్చింది. అలాగే మయూరి జంక్షన్ నుంచి బాలాజీ జంక్షన్ వరకు ప్రస్తుతం ఉన్న 80 అడుగుల రహదారిని 100 అడుగులకు విస్తరించనున్నారు. ఇందుకు ఆర్ అండ్ బి ముందుకు వచ్చింది. దీనిపై ఒకరు కోర్టును ఆశ్రయించినట్టు సమాచారం.అలాగే మయూరి జంక్షన్ నుంచి నాయుడు ఫంక్షన్ హాల్ వరకు ప్రస్తుతం ఉన్న 58 అడుగుల నుంచి 100 అడుగులకు విస్తరించనున్నారు. ఈ రోడ్డును మున్సిపాలిటీ విస్తరించనుంది. ఇదిలా ఉండగా నాయుడు ఫంక్షన్ హాలు నుంచి గణేష్ కోవెల వరకు 28 అడుగుల రహదారిని 66 అడుగులకు విస్తరించనున్నారు. దీనిని ఆర్ అండ్ బి చేపట్టనుంది. అదే విధంగా బాలాజీ జంక్షన్ నుంచి సింహాచలం మేడ వరకు 31 అడుగుల రోడ్డును 66 అడుగులకు విస్తరించారు. దీనిని మున్సిపాలిటీ చేపట్టింది. అదే విదంగా రైతుబజారు నుంచి అయ్యన్నపేట, దుప్పాడ వైజంక్షన్ వరకు ప్రస్తుతం ఉన్న 32 అడుగుల రోడ్డును 66 అడుగులకు విస్తరించనున్నారు. ఈ రోడ్డును వుడా చేపట్టనుంది. అదే విధంగా పోలీసు బ్యారెక్స్ నుంచి గోకపేట వరకు 40 అడుగుల రోడ్డును 80 అడుగులకు వుడా విస్తరించనుంది. ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్ నుంచి ధర్మపురి వరకు 40 అడుగుల రోడ్డును 80 అడుగులకు విస్తరణ పనులు జరుగుతున్నాయి. గంటస్తంభం నుంచి కన్యకాపరమేశ్వరీ ఆలయం వరకు 30 అడుగుల రోడ్డును 66 అడుగులకు మున్సిపాలిటీ విస్తరించనుంది. అలాగే విజయనగరం నుంచి నాతవలస వరకు రింగ్‌రోడ్డు మీదుగా రహదారిని 50 అడుగుల నుంచి 66 అడుగులకు మున్సిపాలిటీ విస్తరించనుంది. అయితే ప్రస్తుతం కేవలం 8 రోడ్డు పనులు మాత్రమే జరుగుతున్నాయి. మిగిలిన రోడ్లను ఇంకను మొదలుపెట్టాల్సి ఉంది. రకరకాల ఇబ్బందులను సాకుగా చూపి అధికారులు వెనుకడుగు వేయడంతో రోడ్ల విస్తరణకు డెడ్‌లైన్ విధించారు. ఏది ఏమైనప్పటికీ మరో రెండు నెలల్లో పట్టణ రూపు రేఖలు మారబోతున్నాయి.

త్రిశంకు స్వర్గం!
కొలిక్కిరాని ఆటోనగర్ సమస్య
కొరవడిన సదుపాయాలు లారీ పరిశ్రమ తరలింపులో జాప్యం
అయోమయంలో దుకాణదారులు
సాలూరు: సాలూరు లారీ పరిశ్రమ తరలింపు ప్రక్రియ ఇప్పటికీ కోలిక్క రాలేదు. పరిశ్రమపై ఆధారపడి వేలాదిమంది కార్మికులు జీవిస్తున్నారు. వర్క్‌షాపులు, మెకానిక్ షెడ్లు, ఇతర దుకాణాలను ఏర్పాటు చేసుకుని కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. ఈ దుకాణాల న్నీ పట్టణానికి ఆనుకుని జాతీయ రహదారి పక్కనే ఉన్నాయి. దీంతో తరుచూ ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దీనికి పరిష్కారంగా ఆటోనగర్‌ను ఏర్పాటు చేసి లారీలు, షాపులన్నింటినీ అక్కడకు తరలించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు నాలుగేళ్లక్రితం స్థలం కేటాయించారు. ఇప్పటివరకు లారీ పరిశ్రమను అక్కడకు తరలించలేదు. ఆటోనగర్ ఏర్పాటుకు 2011లో ఏఎస్పీగా పనిచేసిన రవికృష్ణ శ్రీకారం చుట్టగా తరువాత వచ్చిన డిఎస్పీ, సాలూరు సిఐలు కార్యరూపం దాల్చేలా చేశారు. పోలీస్ అధికారుల సూచనల మేరకు పట్టణ శివారులో కొట్టక్కి వంతెన సమీపంలో ప్రభుత్వ భూమిని అప్పటి కలెక్టర్ ఆటోనగర్‌కు కేటాయించారు. డిఐజిగా ఉన్న సౌమ్యమిత్రతో పనులను ప్రారంభింపచేశారు. పట్టణంలో లారీ పరిశ్రమకు అనుబంధంగా 200 దుకాణాలు ఉన్నట్లు గుర్తించారు. వీరంతా శ్యామలాంబ లారీవర్కర్స్ అసోసియేషన్ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకుని స్థలం కోసం దరఖాస్తు చేసుకున్నారు. పురపాలక సంఘం ద్వారా లీజుపై స్థలాన్ని కేటాయించారు. అధికారులు మార్కెటింగ్ చేసి అప్పగించారు.
చోరీకి గురైన విద్యుత్ సామగ్రి
ఆటోనగర్‌కు కేటాయించిన స్థలంలో సాలూరు పురపాలక సంఘం ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనులను చేశారు. ఏసిడిపి నిధులు, ఎంపి ల్యాండ్స్ సుమారు 6లక్షల రూపాయలతో రహదారిని నిర్మించారు. పురపాలక నిధులతో ట్రాన్స్‌ఫార్మర్, విద్యుత్ స్తంభాలు, లైన్లు వేశారు. ఇతర వౌలికసదుపాయాల కల్పనలో జాప్యం జరగడంతో స్థలం పొందిన వారు వర్క్‌షాపులు, మెకానిక్ షెడ్లు పనులను ప్రారంభించి మధ్యలోనే వదిలివేశారు. ఇంతలో ట్రాన్స్‌ఫార్మర్ విడి భాగాలు, ఇతర సామగ్రి చోరీకి గురికావడంతో విద్యుత్ సదుపాయం కల్పించే అవకాశం లేకుండాపోయింది. ప్రస్తుతం వైర్లు కిందకు వేలాడుతున్నాయి.
సదుపాయాలను కల్పిస్తే...
నాలుగేళ్ల అయిన ఆటోనగర్‌లో తాగునీరు, విద్యుత్, ఇతర సౌకర్యాలను కల్పించలేదు. విద్యుత్ సౌకర్యం కల్పిస్తే పలువురు దుకాణాలను తరలించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం జాతీయ రహదారి ప్రక్కన దుకాణాలను అద్దె భవనంలోనే నిర్వహిస్తున్నారు. పరిశ్రమ ఆటోనగర్‌కు తరలిస్తే అక్కడ సొంత భవనాలుంటాయి. పోలీస్, రెవెన్యూ, పురపాలక సంఘం అధికారులు సమన్వయంతో ఆటోనగర్‌లో సౌకర్యాలు మెరుగుపర్చడంతోపాటు వర్క్‌షాపులను తరలించేలా చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. ఇప్పటికైన అధికారులు స్పందించి ఆటోనగర్‌లో సదుపాయాల కల్పనకు కృషి చేయాలని పలువురు కోరుతున్నారు.

గోసంరక్షణకు కృషి
* పట్టణ అధ్యక్షుడు తంగేటి
విజయనగరం(టౌన్): పట్టణంలో గో సంరక్షణకు పాటు పడతానని పట్టణ కమిటీకి నూతనంగా అధ్యక్షునిగా ఎన్నికైన తంగేటి భాస్కరరావు తెలిపారు. ఆదివారం సంస్ధ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ మేరకు పట్టణ కమిటీని ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమంగా పశువులను తరలించి అమ్మడం చేసే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. పశు వధ నిషేధంను కఠినంగా అమలు చేయాలని సూచించారు. సభ్యుల సహకారంతో పశుసంరక్షణకు తనవంతు కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడు లోగిశ రామకృష్ణ నూతన కమిటీని ప్రత్యేకంగా అభినందించారు. పట్టణ కమిటీ ప్రధానకార్యదర్శిగా రెడ్డిపల్లి రవిశంకర్, ఉపాధ్యక్షులుగా జమాషకీల్, రావళ్లశ్రీను, సంయుక్త కార్యదర్శిగా బాలకృష్ణ, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా పాపారావు, పట్టణ మహిళా కన్వీనర్‌గా పైడితల్లిలను నియమించారు. గోసంరక్షణ కమిటీ బలోపేతం చేయడానికి పట్టణంలో కృషి చేయాలని ఈ సందర్భంగా లోగిశ వారికి సూచించారు. నిఘా ఏర్పాటుచేసి గో సంరక్షణకు చర్యలు తీసుకోవాల కోరారు.ఈ కార్యక్రమంలోజిల్లాఅధ్యక్షుడు ఎల్‌కె జైన్, నీలాపుదేవి, పాకా ప్రమీలారాణి,రాజాన లక్ష్మి, ఆనందరావుపాల్గొన్నారు.

సాకివలసలో విషాదం!
* విద్యుత్ షాక్‌తో ఇద్దరు మృతి
* మరో మహిళకు తీవ్రగాయాలు
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం: జిల్లాలోని భోగాపురం మండలం సాకివలసలో విషాదం అలుముకుంది. శనివారం అర్ధరాత్రి సమయంలో విద్యుదాఘాతానికి గురైన పైడమ్మ హాహాకారాలు చేయడంతో ఆమెను రక్షించేందుకు వెళ్లిన మరోవ్యక్తి నారాయణరావు కూడా దుర్మరణం పాలయ్యారు. దీంతో విద్యుదాఘాతం నుంచి రక్షించేందుకు కర్ర చేత్తొ పట్టుకెళ్లిన మరో మహిళ కూడా విద్యుత్ షాక్ గురై ఆసుపత్రిలో చేరింది. ఈ విధంగా ఊహించని సంఘటనతో అక్కడ వరసగా విద్యుత్ ప్రమాదానికి గురయ్యారు. దీంతో ఆ గ్రామంలో రోదనలతో విషాదం అలుముకుంది. ఆ గ్రామానికి చెందిన కనిసెట్టి పైడమ్మ (48) అనే మహిళ శనివారం రాత్రి 11.15 గంటల సమయంలో బహిర్భూమికి వెళ్లగా తెగిపడి ఉన్న విద్యుత్ తీగలు కాలికి తగలడంతో పెద్దగా కేకలు వేసింది. ఈ కేకలు విని రక్షించేందుకు పరుగులు తీసిన లంకె నారాయణరావు (22) కూడా విద్యుదాఘాతానికి గురయ్యాడు. దీంతో అక్కడికి సమీపంలో ఉన్న మరో వ్యక్తి తోటాలు కర్ర పట్టుకొని రక్షించాలన్న తాపత్రయంతో వెళ్లగా ఆమెకు విద్యుత్ షాక్ గురై గాయాలపాలైంది. దీంతో పరిస్థితి విషమించడంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రాణాపాయమేమి లేదని బోగాపురం సిఐ నరసింహరావు తెలిపారు. కాగా, జిల్లాలో తరచు ఇటువంటి సంఘటనలు పునరావృతం కావడంతో విద్యుత్‌శాఖ నిర్లక్ష్యం వల్లనే ఇద్దరు దుర్మరణం పాలయ్యారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వీచిన గాలులకు తీగ తెగి కిందపడటంతో ఆమె విద్యుత్‌ఘాతానికి గురైంది. ఇదిలా ఉండగా గతంలో గజపతినగరం పురిటిపెంటలో కూడా ఇంటిపై దుస్తులు ఆరబెట్టడానికి వెళ్లిన మరో మహిళ కూడా విద్యుత్ ఘాతానికి గురైన విషయం విధితమే. పట్టణాలలో కూడా డాబా ఇళ్లకు ఆనుకొని విద్యుత్ తీగలు ఉండటం వల్ల ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు. ఏది ఏమైనా ఇటువంటి సంఘటనలు పునరావృతం గాకుండా విద్యుత్ శాఖ సరైన చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

అవయవదానంపై అవగాహన అవసరం
* ర్యాలీని ప్రారంభిస్తున్న ఎమ్మెల్సీ, చైర్‌పర్సన్
సాలూరు: అవయవదానంపై ప్రతీ ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని ఎమ్మెల్సీ జి సంధ్యారాణి, మున్సిపల్ చైర్‌పర్సన్ విజయకుమారి కోరారు. ప్రపంచ అవయవదాన అవగాహన దినోత్సవం సందర్భంగా ఆదివారం మండల తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో ర్యాలీని ఎమ్మెల్సీ జి సంధ్యారాణి, మున్సిపల్ ఛైర్‌పర్సన్ విజయకుమారి, మాజీ ఎమ్మెల్యే భంజుదేవ్‌లు ప్రారంభించారు. ఈ ర్యాలీ తహశీల్దార్ నుంచి నుంచి శ్రీ వెంకటేశ్వర డీలాక్స్ సెంటర్ మీదుగా శివాలయం రోడ్డులో ఉన్న సీతారామ ధర్మశాల వరకు కొనసాగింది. అనంతరం ధర్మశాలలో విద్యార్థులు, పట్టణ ప్రజలకు అవయవదానంపై అవగాహన కల్పించారు. అనంతరం పాఠశాల విద్యార్థులు, ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి వి గణేశ్వరరావు మాట్లాడుతూ అవయవదానాన్ని అం దరూ సామాజిక బాధ్యతగా గుర్తించాలన్నారు.మనిషి మరణానంతరం కూడా శరీరంలోని 8 రకాల అవయవాలు ఉపయోగపడతాయని తెలిపారు. మరొకరి జీవితానికి మేలు చేసేవిధంగా అవయవదానం ఉపయోగపడుతుందన్నారు. ఇంతవరకు రక్తదాన శిబిరాలు, నేత్ర దాన శిబిరాలను మాత్రమే నిర్వహించామని, నేటి నుంచి అవయవదానంపై అవగాహన శిబిరాలను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన 120మంది అవయవదానంపై అంగీకరిస్తు పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా రోటరీక్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు కళ్యాణ చక్రవర్తి, రవి వర్మ, వికాసతరంగిణి ప్రతినిధులు పి విశ్వనాథం, ఇండియన్ మెడికల్ అసిసోయేషన్ ప్రతినిధి డాక్టర్ సంజీవినాయుడు, శివకుమార్ పాల్గొన్నారు.

రూ. 15కే కిలో సేంద్రియ ఎరువులు
గజపతినగరం: సాలిడ్ వేస్టు మేనేజ్‌మెంట్ కింద గజపతినగరం పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన సేంద్రియ ఎరువుల తయారీ కేంద్రం మొత్తం తయారైన సేంద్రియ ఎరువును కిలో 15 రూపాయలకే విక్రయించనున్నామని పంచాయతీ ఇఒ సుగుణాకరరావు తెలిపారు. ఇంతవరకు పంచాయతీ పరిధిలో సేకరించిన తడి పొడి చెత్తలను వేర్వేరు చేసి సేంద్రియ ఎరువుగా మార్చి 1350 కిలోల ఎరువును తమారు చేసామని చెప్పారు. జిల్లాలో ప్రథమంగా ప్రయోగాత్మకంగా గజపతినగరం పంచాయతీలో ఇంటింటి నుండి చెత్తను సేకరించి సేంద్రియ ఎరువు తయారు చేయడానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. అలాగే 350 కిలోల సేంద్రియ ఎరువులు విక్రయించామని తెలిపారు.
పసికందును కాలువలో పడేసిన కన్నతల్లి
ఆంద్రభూమి బ్యూరో
విజయనగరం: పట్టణంలోని సాంఘీక సంక్షేమశాఖ వసతిగృహం-2లో ఉంటున్న ఇంటర్మీడియట్ విద్యార్థిని ఏడు నెలలకే బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం బయటకు రాకుం డా ఉండాలన్న ఉద్దేశంతో ఆమె పసికందును వసతిగృహం బయట ఉన్న కాలువలో పడేసింది. దీంతో ఆదివారం ఉదయం అటువైపుగా వెళ్లిన స్థానికులు ఆ దృశ్యాన్ని చూసి 100 నంబరుకు ఫిర్యాదు చేశారు. శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం గ్రామానికి చెందిన ఆ విద్యార్థి ఇక్కడ ఎంఆర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతోంది. దీనిపై విచారించిన జాయింట్ కలెక్టర్ నాగేశ్వరరావు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన వసతిగృహ సంక్షేమాధికారి విజయనిర్మలను సస్పెండ్ చేశారు. ఎఎస్‌డబ్ల్యుఒ శశిభూషణ్‌ను సస్పెన్షన్‌కు కమిషనర్‌కు సిఫార్సు చేశారు. ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న హాస్టల్ వాచ్‌మెన్ టివి గౌరీని విధుల నుంచి తొలగించారు. దీనిపై సాంఘీక సంక్షేమశాఖ డిడి రాజ్‌కుమార్ మాట్లాడుతూ విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు.

జీవన ప్రమాణాన్ని పెంచే అవయవదానం
విజయనగరం(పూల్‌బాగ్): జీవనప్రమాణాన్ని పెంచే అవయవదానం ఆవశ్యకతను విద్యార్ధిదశనుంచే ప్రతి ఒక్కరికీ తెలిసేలా ఉపాధ్యాయులు కృషి చేసే విధంగా చర్యలు చేపడతానని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు అన్నారు. ఆదివారం రోటరీక్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ అవయవదాన దినోత్సవం సందర్భంగా ర్యాలీని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవయవ దానం పట్ల ప్రజల్లో అవగాహన పెరగాలని అన్నారు.మరణానంతరం కూడా తమ అవయవాలు వేరొకరికి జీవితాన్ని ప్రసాదిస్తుందన్న తృప్తి వెలకట్టలేనిదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోరోటరీ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ డివి శ్రీకాంత్, డాక్టర్ పివి శివరాం, డాక్టర్ వెంకటేశ్వరరావు రోటరీ ప్రతినిధులు పాల్గొన్నారు.

యథేచ్ఛగా పశువుల అక్రమ రవాణా!
కొమరాడ: మండలంలోని కొమరాడ జాతీయ రహదారి మీదుగా ఒడిశా రాష్ట్రం నుంచి అక్రమంగా పశువులను రవాణా చేస్తుండటంతో రహదారిపై వచ్చే వాహనచోదకులు పలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ పశువుల అక్రమ రవాణా ప్రతీ ఆదివారం ఒడిశాలోని వివిధ సంతల నుంచి యథేచ్ఛగా పశువుల వర్తకులు తరలిస్తుంటారు. జాతీయ రహదారి మధ్యలో ఉన్న పోలీస్‌స్టేషన్లు, చెక్ పోస్టులునప్పటికీ వాటిని తప్పించి అడ్డుతోవలో జాతీయ రహదారిపై తరలిస్తున్నారు. వందల సంఖ్యలో ఉన్న ఈ పశువులు పార్వతీపురం, మానాపురం సంతలకు, కభేళాలకు అక్రమంగా తరలిస్తుంటారు. అధికారులు పశువుల అక్రమ రవాణాను నిషేధించినప్పటికీ యథావిధిగా పశువుల అక్రమ రవాణా జరుగుతుండటంపై పలు విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికైన అధికారులు స్పందించి జాతీయ రహదారుల మీదుగా పశువుల అక్రమ రవాణాను నిరోధించాలని కోరుతున్నారు.