ప్రకాశం

విద్యుత్ షాక్‌కు గురై రైతు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మర్రిపూడి: మండల కేంద్రమైన మర్రిపూడి దళితకాలనీకి చెందిన గురిజాల నరసయ్య (67)విద్యుత్‌షాక్‌కు గురై ఆదివారం అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన వెలుగుచూసింది. మృతుడి భార్య మరియమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నామని ఎస్‌ఐ శ్రీహరి తెలిపారు. పోలీసుల కథనం మేరకు మర్రిపూడికి చెందిన నరసయ్య ఆదివారం ఉదయం తన పొలంలో ఉన్న వరినారుమడికి నీరు పెట్టేందుకు కరెంటు మోటారుదగ్గరకు వెళ్లాడు. ఆ సమయంలో స్టాటర్ పెట్టే దగ్గర కరెంటువైర్లు తగిలి నరసయ్య అక్కడికక్కడే మృతిచెందాడని భార్య ఫిర్యాదులో పేర్కొందని తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకుని మృతుడికి సంబంధించిన వివరాలను సేకరించటం జరిగిందని నరసయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు తెలిపారు. భార్య ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తుచేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

త్వరలో రిమ్స్‌కు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతులు
రాష్ట్ర పరిధిలోకి చేరనున్న మూడు రిమ్స్ హాస్పిటళ్లు
రాష్టవ్రైద్య ఆరోగ్యశాఖమంత్రి కామినేని వెల్లడి
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు:ఒంగోలు రిమ్స్‌కు త్వరలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుండి అనుమతులు వస్తాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖమంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభాపతి కోడెల శివప్రసాదు, వైద్య ఆరోగ్యశాఖమంత్రి కామినేని శ్రీనివాస్ ఆదివారం ఉదయం రాష్టప్రర్యావరణ అటవీశాఖమంత్రి శిద్దా రాఘవరావును మర్యాదపూర్వకంగా ఆయన నివాసంలో కలిశారు. ఈసందర్భంగా శిద్దా రాఘవరావు షష్ఠ్యబ్ధిపూర్తి మహోత్సవం పురస్కరించుకుని శిద్దా దంపతులకు పుష్పగుచ్ఛాలు అందచేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కామినేని విలేఖర్లతో మాట్లాడుతూ ఇటీవల మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బృందం ఒంగోలు రిమ్స్ సందర్శించినప్పుడు విద్యార్థులు, స్ట్ఫా సరిపడ ఉన్నారని తెలియచేశారని తెలిపారు. మార్కాపురం ఏరియా హాస్పిటల్‌ను జిల్లా ఆసుపత్రిగా అభివృద్ది చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఒంగోలు రిమ్స్‌లో కొత్తగా సిటిస్కాన్ ఏర్పాటుకు టెండర్లు పిలవటం జరిగిందని త్వరలో ఏర్పాటుచేస్తామన్నారు. రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులకోసం రెండువందల కోట్ల రూపాయలు కేటాయించగా ఆరోగ్యశాఖకు 105 కోట్లు కేటాయించటం జరిగిందని 50శాతం వేతనాలు పెంచినట్లు చెప్పారు. రాష్ట్రంలో మూడు రిమ్స్‌లుస్వయం ప్రతిపత్తిగా పనిచేస్తున్నాయని, వాటినన్నంటిని ప్రభుత్వపరిధిలోకి తీసుకురావటం జరుగుతుందని మంత్రి తెలిపారు. ఈనెల 11వతేదీన ఉపరాష్టప్రతిగా ఎం వెంకయ్యనాయుడు ప్రమాణస్వీకారం కార్యక్రమంలో పాల్గొన్నందున అలాగే ఈనెల బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఆంధ్రప్రదేశ్ పర్యటన కార్యక్రమం ఏర్పాట్లపై సమీక్ష సందర్భంగా రాలేకపోయానని అందుకోసం శిద్దా రాఘవరావు దంపతులకు ప్రత్యేకంగా స్పీకర్‌తో వచ్చి శుభాకాంక్షలు తెలిపామన్నారు. శిద్దా రాఘవరావు స్నేహభావం కలిగిన వ్యక్తి, సౌమ్యులు అని కొనియాడారు. ముందుగా శాసనసభాపతి కోడెల శివప్రసాదు విలేఖర్లతో మాట్లాడుతూ శిద్దా రాఘవరావు షష్ఠిపూర్తి సందర్భంగా ఆరోజు రాలేకపోయానని తెలిపారు. మంచి వ్యాపారవేత్త, నీతివంతమైన రాజకీయ వేత్త అని ఆయన కొనియాడారు.

జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ సంఘం నూతన భవనాన్ని ప్రారంభించిన స్పీకర్ కోడెల
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు: ఒంగోలు నగరంలోని రంగారాయుడు చెరువు వద్ద పశుగణాభివృద్ధి సంస్థ కార్యాలయ ఆవరణలో జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ సంఘం నూతనంగా నిర్మించిన భవనాన్ని ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభాపతి కోడెల శివప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 60లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ భవనం పశుగణాభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. నూతన భవనం ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖమంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒంగోలు జాతిపశుసంపదని పెంపొందించేందుకు ఈ నూతన భవనం ఏర్పాటుచేయటం అభినందనీయమన్నారు.నూతన భవన ఆవరణలోపశుపూజ, మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర అటవీశాఖమంత్రి శిద్దా రాఘవరావు, జిల్లాపరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు, శాసనమండలి సభ్యులు కరణం బలరాం, పోతుల సునీత, పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరక్టర్ వి రవీంధ్రనాధ్‌ఠాగూర్, డిస్ట్రిక్ లైవ్ స్టాక్ డెవలప్‌మెంటు అసోసియేషన్ చైర్మన్ నాగినేని అవనీంద్రప్రసాదు, ఒంగోలు ఆర్‌డిఒ కె శ్రీనివాసరావు, జిల్లావైద్య ఆరోగ్యశాఖాధికారి యాస్మిన్ తదితరులు పాల్గొన్నారు.

గిద్దలూరు కేంద్రంగా గంజాయి వ్యాపారం
స్మగ్లర్ల సరఫరా.. సాధువుల అమ్మకం
మార్కాపురం: గిద్దలూరు కేంద్రంగా గంజాయి వ్యాపారం జోరుగా సాగుతున్నట్లు శనివారం జరిగిన సంఘటనతో బయటపడింది. కొందరు స్మగ్లర్లు విశాఖపట్టణం, అరకు లాంటి ప్రాంతాల నుంచి గంజాయిని తీసుకువచ్చి ఇక్కడ దళారుల ద్వారా అమ్మకాలు సాగిస్తున్నట్లు వెల్లడైంది. గత రెండునెలల క్రితం అరకు నుంచి రైలులో గంజాయిని గిద్దలూరుకు తీసుకువస్తుండగా రైల్వేపోలీసుల సమాచారంతో స్థానిక పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. అయితే అప్పటి నుంచి గంజాయి స్మగ్లింగ్‌పై పోలీసులు పెద్దగా దృష్టి సారించిన దాఖలాలు లేవు. శనివారం భారీ స్థాయిలో గంజాయి పట్టుబడటంతో పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మార్కాపురం డివిజన్‌లో గంజాయి అమ్మకాలు ప్రస్తుతం గిద్దలూరు ప్రాంతంలోనే భారీగా జరుగుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం భారీ స్థాయిలో ఒకేసారి 18 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో ఆప్రాంత ప్రజల్లో భయాందోళన వ్యక్తం అవుతోంది. ఈప్రాంతంలోని యువత గంజాయికి అలవాటుపడితే కుటుంబాలు నాశనమవుతాయని, పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి గంజాయి అమ్మకాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.
సమాజసేవలో లయన్స్‌క్లబ్
విద్యా, వైద్యరంగాలపై ప్రజల్లో చైతన్యం రావాలి * స్పీకర్ కోడెల పిలుపు
ఒంగోలు అర్బన్:సమాజసేవలో లయన్స్‌క్లబ్ సేవలు మరవలేనివని శాసనసభాపతి కోడెల శివప్రసాదు అన్నారు. ది ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ లయన్స్‌క్లబ్స్ 36వ జిల్లాగవర్నర్ నామినేని మోహన్‌రావు, సభ్యుల ప్రమాణాస్వీకారం ఆదివారం విష్ణుప్రియ కన్వనె్షన్‌హాలులో అట్టహాసంగా జరిగింది. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కోడెల శివప్రసాదురావు,అటవీశాఖమంత్రి శిద్దా రాఘవరావు, వైద్య ఆరోగ్యశాఖమంత్రి కామినేని శ్రీనివాస్, శాసనమండలిసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి, పోతుల సునీత జ్యోతి ప్రజ్వలన చేసి సభా కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో స్పీకర్ కోడెల మాట్లాడుతూ లయన్స్‌క్లబ్ ప్రపంచంలో వందసంవత్సరాలు పూర్తిచేసుకుందన్నారు. రెండువందల దేశాల్లో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. క్లబ్‌లో సభ్యత్వం తేలికగా రావచ్చు కాని ఆ తరువాత అతని నడవడికపై సభ్యత్వం ఉంటుందన్నారు. గౌరవానికి నిదర్శనంగా సభ్యులు భావిస్తారన్నారు. ప్రతిసభ్యుడిని బయట చేసేపనిని గమనిస్తూ ఉంటారని స్ధాయి ఉన్నవారికే సభ్యత్వాలు ఇస్తారన్నారు. గ్రామీణ పట్టణాభివృద్ధి ప్రాంతాల్లో పేదరిక నిర్మూలనకోసం పాటుపడాలన్నారు. విజన్‌తో ముందుకు వెళ్లాలనిసూచించారు.లయన్స్ క్లబ్‌లో స్థాయిని నిరూపించుకోగలిగితే సొంత నిధులతోపాటు దాతల సహకారం ఉంటుందన్నారు. సమాజానికి సేవచేయాలనే తపన రావాలన్నారు. దేశప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వచ్ఛ్భారత్‌కు పిలుపునిస్తే రాష్టమ్రుఖ్యమంత్రి స్వచ్ఛాంధ్రప్రదేశ్‌కు పిలుపునిచ్చారన్నారు. ప్రతి వందమందిలో 55మందికి ఇంటింటికి మరుగుదొడ్లులేవన్నారు.
కొంతమందికి మరుగుదొడ్లు ఉన్నప్పటికి వాటిని వినియోగించటం లేదన్నారు.మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ప్రభుత్వం విస్తత్రంగా మరుగుదొడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందన్నారు. తన నియోజకవర్గంలో ఆరునెలల్లో 20వేల మరుగుదొడ్లు నిర్మాణం చేసి గిన్నిస్‌బుక్‌లో రికార్డు సాధించిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రధానంగా గ్రామాలు,పట్టణాల్లో పారిశుద్ధ్యం, పరిశుభ్రత, రక్షితమంచినీటిపై దృష్టిసారించాలన్నారు.దీనివలన 70శాతం రోగాలు దరిచేరవన్నారు. అంటువ్యాధులను పారదోలవచ్చునని తెలిపారు.నీటిసంరక్షణతోపాటు భూగర్బజలాలను పెంపొందించేందుకు కృషిచేయాలన్నారు.చెరువుల పూడిక తీత, చెట్లపెంపకాలు, రక్తదాన శిబిరాలపై దృష్టిసారించాలన్నారు.
సంవత్సరానికి ప్రతిఒక్కరు రెండుసార్లు రక్తదానం చేసేవిధంగా అవగాహన కల్పించాలన్నారు. అవయదానం చేసేవిధంగా ప్రజల్లో చైతన్యం కల్పించాలన్నారు. అప్పుడే చనిపోయిన ప్రతివ్యక్తి మనకళ్ళముందే తిరుగుతూ ఉంటారన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం భారతదేశం అభివృద్ధి చెందలేదని ప్రపంచంలో ఎక్కడాలేని మనవవనరులు మనదేశంలో ఉన్నాయని అమెరికాలో వందకు 40శాతం యువతఉంటే భారతదేశంలో 60శాతం యువత ఉందన్నారు. అక్షరాస్యత పెరిగినప్పుడే సమాజం చైతన్యవంతం అవుతుందన్నారు. మనంచేసేపనిలోనే ప్రభుత్వకార్యక్రమాలు విజయవంతం అవుతాయన్నారు.
రాష్ట్రఅటవీశాఖమంత్రి శిద్దారాఘవరావు మాట్లాడుతూ తాను కూడా లయన్స్‌క్లబ్‌లో సభ్యుడిగా చేరి సమాజసేవలో విస్తత్రంగా సేవా కార్యక్రమాలను చేపట్టినట్లు చెప్పారు. 2008లో క్లబ్‌లో గవర్నర్‌గా తన సేవలు అందించామన్నారు. వందసంవత్సరాలు పూర్తిచేసుకుందన్నారు. కొన్నిదేశాల్లో ప్రభుత్వాలు చేయని పనులు కూడా లయన్స్‌క్లబ్ చేస్తుందని రాష్ట్రంలో మాత్రం లయన్స్‌క్లబ్ ప్రభుత్వానికి చేయూతనిస్తుందన్నారు. భవిష్యత్‌లో సభ్యులు సేవాకార్యక్రమాలు భాగాచేసి సమాజానికి మంచిపేరు తీసుకురావాలన్నారు.రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖమంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ తానుకూడా లయన్స్‌క్లబ్‌లో సభ్యుడునని పేర్కొన్నారు. వైద్యరంగంలో అనేకమార్పులు వచ్చాయని రక్తదానంపై ప్రజల్లో అవగాహన కల్పించినప్పుడే ప్రాణదానం జరుగుతుందన్నారు. సేవాభావంతో ప్రతిఒక్కరు ముందుకువెళ్ళాలన్నారు. వ్యక్తులపై నమ్మకం ఉంటేనేదాతలు సహకారం అందిస్తారన్నారు. చేసేకార్యక్రమాలు సేవాభావంతో చేయాలన్నారు. ప్రస్తుతం ప్రభుత్వంతో లయన్స్‌క్లబ్ టీకాల విషయంలో కలిసిపనిచేస్తుందని తొమ్మిదిసంవత్సరాలనుండి 15సంవత్సరాల లోపు పిల్లలు కోటి 20లక్షలమంది ఉన్నారని వారందరికి టీకాలు వేస్తున్నామన్నారు. ఆరోగ్యపరంగా బాగుంటేనే మనిషి పదికాలలపాటు పచ్చగా ఉంటారన్నారు. 2016-17లో ప్రభుత్వ వైద్యశాలల పరిస్థితి దుర్గంధంగా ఉండేదన్నారు. రాష్టవ్య్రాప్తంగా అన్నిప్రభుత్వ వైద్యశాలలతోపాటు రిమ్స్ ఆసుపత్రిని తాను స్వయంగా పరిశీలించటం జరిగిందన్నారు. పూర్తిస్థాయిలో అనేక మార్పులు తీసుకురావటంతో ప్రతిరోజు రాష్ట్రంలో 48లక్షలమంది ఓపిలు వస్తున్నాయన్నారు. మూడుసంవత్సరాల్లో అనేక మార్పులు తీసుకురావటం జరిగిందని, కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలు అభివృద్దికార్యక్రమాల్లో ముందుకువెళ్తున్నాయన్నారు. ప్రపంచంలోనే భారతదేశంలోఅగ్రగామిగా ఉండేందుకు ప్రధానమంత్రి మోదీ చర్యలు చేపట్టారన్నారు. స్వచ్ఛందసంస్థల పాత్రలో లయన్స్‌క్లబ్ ఎల్లప్పుడు ముందంజలో ఉంటుందన్నారు. సేవ చేసేందుకు భగవంతుడు మంచి అవకాశాలు ఇచ్చారని ప్రతి సభ్యుడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సమాజానికి మరింత చేరువకావాలని పిలుపునిచ్చారు. అనంతరం రాష్టమ్రంత్రి శిద్దారాఘవరావు లయన్స్‌క్లబ్ బుక్‌ను ఆవిష్కరించగా మరోమంత్రి కామినేని శ్రీనివాస్ లయన్స్‌క్లబ్ లోగోను ఆవిష్కరించారు. తరువాత స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావును మంత్రులు శిద్దా, కామినేనిని ఘనంగా సత్కరించి మెమోంటోలు అందచేశారు. ఈకార్యక్రమంలో ప్రకాశం, గుంటూరు, నెల్లూరు, విశాఖపట్నం, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిని లయన్స్‌క్లబ్ ప్రతినిధులతోపాటు జిల్లాకాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు ఈదా సుధాకర్‌రెడ్డి, బిజెపి రాష్ట్రప్రధానకార్యదర్శి సురేష్‌రెడ్డి, జిల్లాపార్టీ అధ్యక్షుడు పివి కృష్ణారెడ్డి, లయన్స్‌క్లబ్ ఆఫ్ ఒంగోలు ఉమెన్స్ అధ్యక్షురాలు మేడికొండ రచన తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా ప్రమాణస్వీకారం
లయన్స్‌క్లబ్ జిల్లా గవర్నర్‌గా నామినేని మోహన్‌రావు, వైస్ గవర్నర్‌గా ఎవిఆర్ ప్రసాదు, క్యాబినెట్ సెక్రటరిగా నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, క్యాబినేట్ కోశాధికారిగా సిహెచ్ హరిప్రసాదురావు, ఆర్గనైజింగ్ కమిటి కో చైర్మన్లుగా శిద్దావెంకటేశ్వరరావు, నిడమనూరి నాగేశ్వరరావు, జిల్లా పిఆర్‌ఒగా పి ప్రకాష్‌బాబులచేత ఇంటర్నేషనల్ పాస్ట్‌డైరక్టర్, మాజీ ఎంఎల్‌సి చిగురపాటి వరప్రసాదురావు ప్రమాణాస్వీకారం చేయించారు.