మహబూబ్‌నగర్

బెట్టింగ్ రాయుళ్ల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల: బెట్టింగ్ రాయుళ్లలో కీలక బుకీ ఐనా అయిజ ప్రాంతానికి చెందిన రాఘవచారి కీలక సమాచారం అందించడంతో మరో నలుగురిని అరెస్టు చేసినట్లు, ఇంకా పరారీలో ఉన్న వారిని కూడా త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని గద్వాల ఇన్‌చార్జి సిఐ సురేష్ తెలిపారు. ఆదివారం గద్వాల పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ మాట్లాడుతూ ఈ నెల 11న గద్వాల పట్టణంలోని వేణు అపార్ట్‌మెంట్‌లో ఓ ఇంట్లో బెట్టింగ్ నిర్వహిస్తున్నారని సమాచారం అందడంతో గ ద్వాల డిఎస్పీ బాలకోటి ఆధ్వర్యంలో ఆ ఇంటిపై పోలీసులు ముకూమడిగా దాడులు నిర్వహించి కీలక బుకీలను అదుపులోకి తీసుకున్నారు. కీలక వ్యక్తి రాఘవచారిని విచారించగా అంతర్‌రాష్ట్రంగా ఆయా ప్రాంతాలలో ఈ బెట్టింగ్ నిర్వహిస్తున్నామని, కీలక సమాచారం అందించారన్నారు. గద్వాల ఎస్సై శ్రీనివాసు ఆధ్వర్యంలో ఆదివారం గద్వాలకు చెందిన చిన్నా, రాము, గంగూలి, మాధవ్‌ను అరెస్టు చేశామన్నారు. గతంలో వీరిపై కేసులు ఉన్నాయని, గతంలో అయిజకు చెందిన గంగూలి మట్కా కేసులు, గద్వాలకు చెందిన మాదవ్, చిన్నాలపై బెట్టింగ్ నిర్వహిస్తున్నపుడు వారిపై పలు స్టేషన్‌లో కేసులు ఉన్నాయన్నా సిఐ పేర్కోన్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 38 మంది బుకీలు ఏజెంట్లుగా మారి వారు సెల్‌పోన్ ద్వారా బెట్టింగ్‌లు నిర్వహించి ఆన్‌లైన్ ద్వారా నగదు లావాదేవిలు నిర్వహించేవారన్నీ సిఐ తెలిపారు. క్రికెట్, పుట్‌బాల్, కబడ్డి, లీగ్ మ్యాచ్ లాంటి అంతర్జాతీయ మ్యాచ్‌లపై బుకీలు బెట్టింగ్ నిర్వహించేవారన్నారు. త్వరలోనే బెట్టింగ్‌తో పత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న వాళ్లను తప్పకుండా పట్టుకుని, భవిష్యత్‌లో ఏ ఒక్క క్రీడలకు జూదం పాల్పడకుండా చేస్తామని సిఐ తెలిపారు. గద్వాల ఎస్సై శ్రీనివాస్, ఏఎస్సై, కానిస్టేబుల్ ఉన్నారు.

కృష్ణాష్టమికి సర్వం సిద్ధం
* నేడు శ్రీకృష్ణుడి డోలారోహణం
* ముస్తాబైన శ్రీవేణుగోపాల స్వామి దేవాయలం
మక్తల్: మండల కేంద్రంలోని యాదవనగర్ వీధిలో వెలసిన శ్రీవేణుగోపాలస్వామి మందిరం కృష్ణాష్టమికి ముస్తాబైంది. 14వ తేదీ రాత్రి 11-51 నిమిషాలకు శ్రీకృష్ణుడు జననం, డోలారోహణం ఉంటుందని ఆలయ కమిటి అధ్యక్షులు కోళ్ల వెంకటేష్ తెలిపారు. 15వ తేదీ మంగళవారం సాయంత్రం 6 గంటలకు పాల ఉట్లు కార్యక్రమం నిర్వహిస్తారని చెప్పారు. పాల ఉట్లు కార్యక్రమం అనంతరం స్వామివారి పల్లకిసేవను పట్టణ పురవీధుల గుండా భక్తితో, భజనలతో ఊరేగించడం జరుగుతుందని తెలిపారు.
పాల ఉట్లు కొట్టిన వారికి వెండి కడియాలు
పాల ఉట్లు కొట్టిన కురుమయాదవుల గ్రూపుకు కీర్తిశేషులు కొత్త సూగయ్యగుప్త జ్ఞాపకార్థం వారి కుమారుడైన కొత్త శ్రీనివాస్‌గుప్త మొదటి, రెండవ బహుమతులుగా వెండి కడియాలు ఇవ్వనున్నట్లు అధ్యక్షులు తెలిపారు. మక్తల్ పట్టణంలోనే గోపాలస్వామి దేవాలయం అతి పురాతన మందిరంగా పేరెన్నిక కలదని చెప్పవచ్చు. ఈ దేవాలయంలో జరిగే కృష్ణాష్టమి వేడుకలకు మక్తల్ పట్టణంతోపాటు చుట్టుపక్కల గ్రామాల నుండి వేలాదిగా ప్రజలు తిలకించేందుకు భారులు తీరుతారు. ఆలయ కమిటి సభ్యులు పవిత్ర కృష్ణానది నుండి జెల్దిబిందె నీటిని తెచ్చి స్వామివారిని శుద్ధిచేసి ప్రత్యేకంగా అలంకరించడం జరుగుతుందని కమిటి అధ్యక్షుడు కోళ్ల వెంకటేష్ తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో అందరు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకై తరలిరావాలని తెలిపారు. ఇట్టి పాలు ఉట్ల కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొంటారని ఆలయకమిటి అధ్యక్షులు కోళ్ల వెంకటేష్ తెలిపారు.

రాజ్యంగాన్ని కాలరాస్తున్న ప్రభుత్వం
* జెఎసి నేతలు
వనపర్తి: ప్రజలకు తమ భావాలను చెప్పుకునే స్వేచ్ఛ రాజ్యంగం కల్పించిందని అలాంటి రాజ్యంగాన్ని ఉల్లంఘిస్తూ ప్రజల హక్కులను రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తున్నదని వనపర్తి జెఎసి కన్వీనర్ వేణుగోపాల్, రాజారాం ప్రకాష్ అన్నారు. ఆదివారం వనపర్తి యాదవ సంఘ భవనంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రధానంగా నీళ్లు, నిధులు, నియామకాలు సాధించడం కోసం తెచ్చుకున్నామని అందుకు ప్రొఫేసర్ కోదండరామ్ అధ్యక్షతన ఉద్యోగ సంఘాలు, ప్రజాసంఘాలు, కులసంఘాలు పోరాటం చేశాయని అన్నారు. రాష్ట్రం సాధించాక గద్దెనెక్కిన కెసిఆర్ ప్రభుత్వం అందుకు విరూద్దంగా పాలన చేస్తుంటే దాన్ని ఎత్తి చూపేందుకు ప్రొఫేసర్ కోదండరామ్ తమ భావ జలాన్ని ప్రజలకు చెప్పేందుకు ప్రజల్లోకి వెళ్తుంటే అడ్డంకులు సృష్టిస్తూ ప్రజాస్వామాన్ని ప్రభుత్వం అపహస్యం చేస్తుందని వారు ఆరోపించారు. ఉద్యమాలతో గద్దెనెక్కిన టిఆర్‌ఎస్ ప్రభుత్వం అదే ఉద్యమాలను అణిచేందుకు ప్రయత్నం చేస్తున్నదని ఇలాంటి పాలన ఎంతో కాలం సాగదని అన్నారు. అడుగడుగునా జెఎసికి అటంకాలు కలిగిస్తూ సమావేశాలను అడ్డుకోవడం దారుణమని ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని వారు అన్నారు. ఎన్ని నిర్భందాలు సృష్టించిన ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వం వైఫల్యాలను చెబుతామన్నారు. ఉద్యోగాలు లేక యువత ఎంతో ఆవేదనలో ఉన్నారని వారికి సమాదానం చెప్పాల్సిన బాద్యత ప్రభుత్వానికి ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వాస్తవాలను గ్రహించి ప్రజాభిప్రాయం మేరకు పాలన కొనసాగించాలని లేనట్లు అయితే ప్రజలు తిరుగబడే రోజులు దగ్గర పడుతున్నాయని వారు అన్నారు. అనంతరం కోదండరామ్ అరెస్టులను నిరశిస్తూ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో జెఎసి నేతలు బుచ్చన్న యాదవ్, లక్ష్మినారాయణ, మునికుమార్, పవన్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే నిర్వహించాలి
* బిజెపి రాష్ట్ర నేత మండ్రెకారి బాలాజీ
నాగర్‌కర్నూల్: 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటికి హైదరాబాద్ సంస్థానంకు మాత్రం సెప్టెంబర్ 17, 1948న నిజాం నిరంకుశ పాలననుంచి విమోచనమైనందున ఆరోజున ప్రభుత్వమే అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని బిజెపి రాష్ట్ర నాయకులు మండ్రెకారి బాలాజీ నేడొక ప్రకటనలో డిమాండ్ చేశారు. కోట్లాది మంది భారతీయుల నిరంతర పోరటం, అసమాన త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని, ఈ ఉద్యమంలో తెలుగువారు కూడా అగ్రభాగాన నిలిచారని అన్నారు. హైదరాబాద్ నియంత నిజాం ప్రజల మనోభావాలకు భిన్నంగా వ్యవహరిస్తూ వారిని అణగదొక్కే నిరంకుశ విధానాలను అమలుచేశారని అన్నారు. మతోన్మాది ఖాసీం రజ్వీ నేతృత్వంలో రజాకార్లను సృష్టించి ప్రజలపై లెక్కలేనన్ని, చెప్పరాని అత్యాచారాలను జరిపించారని అన్నారు. హైదరాబాద్ సంస్థానానికి తానే రాజేనని, స్వతంత్ర రాజ్యంగా ఉంటానని నిజాం ప్రకటించుకున్నారని, ప్రజలపై అకృత్యాలు, అత్యాచారాలు పెరిగిపోవడంతో అప్పటి కేంద్ర హోమంత్రి సర్దార్ పటేల్ చొరవ తీసుకొని భారతదళాలను పంపి హైదరాబాద్ సంస్థానాన్ని నిరంకుశ నిజాం ప్రభువునుంచి విముక్తి కల్పించారని అన్నారు. ఆగస్టు 15,1947 దేశానికి స్వాతంత్య్రం వస్తే హైదరాబాద్ సంస్థానం 1948 సెప్టెంబర్ 17న విముక్తి చెందిందని తెలిపారు. హైదరాబాద్ సంస్థానం నుంచి విముక్తి పొంది కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలలో ఉన్న జిల్లాలలో అక్కడి ప్రభుత్వాలు అధికారికంగా విమోచన దినోత్సవాలను నిర్వహిస్తుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ ఉత్సవాలను నిర్వహించకపోవడం విచారకరమన్నారు.
గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో టిఆర్‌ఎస్ అధినేతగా ఉన్న కేసిఆర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల జీవితాలతో ముడిపడిన సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే నిర్వహించాలని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి సంబందించిన విషయమని అనేక మార్లు చెప్పారని, ఆ పార్టీ సీనియర్ నాయకులు సైతం వివిధ సందర్భాలలో అప్పటి ప్రభుత్వాలను డిమాండ్ చేశారని గుర్తు చేశారు. కాని తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వానికి అధిపతిగా ఉన్న కేసిఆర్ ఈ విషయాన్ని పట్టించుకోకపోవడం అవకాశవాద రాజకీయానికి నిదర్శనమని ఆరోపించారు. ఓ వర్గం ఓట్లకోసమే ఈ విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసిఆర్ స్పందించాలని కోరారు.
ఎస్సై ఖలీల్‌కు కన్నీటి వీడ్కోలు
* గుండుమాల్‌లో అంత్యక్రియలు
* నివాళులర్పించిన వికారాబాద్ ఎస్పీ అన్నపూర్ణదేవి
కోస్గి: హైదరాబాద్‌లోని అప్పా జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పోలీస్ స్పెషల్ బ్రాంచ్ ఎస్సై ఖలీల్‌కు ఆదివారం పోలీసు లాంఛనాలతో కన్నీటి విడ్కోలు పలికారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఎస్సై ఖలీల్ స్వగ్రామమైన మహబూబ్‌నగర్ జిల్లా కోస్గి మండలం గుండుమాల్ గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా వికారాబాద్ ఎస్పీ అన్నపూర్ణదేవి అంత్యక్రియలకు హాజరై ఎస్సై ఖలీల్ మృతదేహాంపై పూలమాలలు ఉంచి నివాళ్ళు అర్పించారు. అదేవిధంగా వికారాబాద్, బొంరాస్‌పేట, కోస్గిలకు చెందిన పోలీస్ సిబ్బంది పలువురు ఎస్సైకి ఘన నివాళ్లి అర్పించారు. ఎస్సై మృతితో గుండుమాల్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రోడ్డు ప్రమాదంలో ఎస్సై ఖలీల్ మృతి చెందాడని తెలియడంతో పాటు ఆయన మృతదేహాన్ని ఆయన స్వంత గ్రామం గుండుమాల్‌కు తీసుకురావడంతో చివరిసారిగా ఆయన మృతదేహాన్ని చూడడానికి చుట్టు పక్కల గ్రామాల ప్రజలు రావడంతో గుండుమాల్ గ్రామం విషాదం అలుముకున్నాయి. ఖలీల్ ముస్లీం కావడంతో ముందుగా ఆయన మతం ఆచారం ప్రకారంగా అంత్యక్రియలు నిర్వహించారు. కాగా పోలీసుల లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఎస్సై ఖలీల్ మృతదేహాం గుండుమాల్ గ్రామంలొని తన సొంత ఇంటికి చేరుకోగానే ఆయన కుటుంబ సభ్యులు బోరున విలపించారు. గ్రామస్తులు సైతం ఖలీల్ జ్ఞాపకాలను ఆయన గ్రామస్తులతో చిన్నప్పటి నుండి ఉండే బందాన్ని గుర్తుచేసుకంటూ కన్నీరు కార్చారు. ఖలీల్ భార్య పిల్లల రోదనలు మిన్నంటాయి. వారిని ఎంత ఓదార్చిన కన్నీరు మాత్రం ఆగలేదు. తండ్రిని తలుచుకూంటూ కూతురు, కుమారుడు రోదిస్తున్న తీరు అక్కడికి వచ్చిన వారినంత కలచివేసింది.
బీడీ పరిశ్రమను..జిఎస్టీ నుంచి మినహాయించాలి
* రాష్ట్ర బీడీ కార్మిక సంఘం కార్యదర్శి వేణుగోపాల్
దేవరకద్ర: కేంద్ర ప్రభు త్వం బీడి పరిశ్రమను జిఎస్టీ నుండి నుంచి మినహయించాలని రా ష్ట్ర బీడీ కార్మిక సంఘం కార్యదర్శి వేణుగోపాల్ అన్నా రు. అదివారం దేవరకద్ర పట్టణంలోని ఆర్‌అండ్‌బి అథితి గృహంలో ఎర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అయన మాట్లాడుతూ విలేఖరుల సమావేశంలో అయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బీడి కార్మికులను నాశనం చేసే విధంగా బీడి పరిశ్రమను జిఎస్టీలోకి తీసుక రావడంతో లక్షాలాది మంది బీడి కార్మికులు వీదిన పడే పరిస్థితి ఎర్పడిందని అన్నారు. జిల్లాలో 20వేలు రాష్ట్రంలో 7 లక్షల మంది బీడి తయారిలో ఉపాధి పొందుతున్నారని అని తెలిపారు. ఇట్టి పరిశ్రమను పొగాకుపై 5శాతం తునికాకుపై 18శాతం బీడి విక్రయాంపై 28శాతంపన్ను విధించడం వల్ల బీడి పరిశ్రమ మూతపడే పరిస్థితి ఎర్పడిందన్నారు. కార్మికులకు ప్రభుత్వం ప్రత్యామ్మాయ ఉపాధి చూపకుండా పన్ను విదించడం అవివేకమైన చర్య అన్నారు. ఇప్పటికైనా చాలి చాలని వేతనాలు, పని దినాలు తగ్గడంతో కుటుంబాలు గడిచే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. కనుక బీడి పరిశ్రమను జిఎస్టీ నుండి మినహాయించాలని బీడి కార్మిక సంఘల ఐక్య కార్యాచరణ ఆధ్వర్యంలో ఈ నెల 14న చిన్నచింతకుంటలో జిల్లా సదస్సు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ సదస్సుకు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా అధ్యక్షులు దేవదాసు, నాయకులు వేంకటేష్, నర్సింహులు , తదితరులు పాల్గొన్నారు.
ఇది గొప్పల ప్రభుత్వం
మక్తల్: మూడు సంవత్సరాలు గడచినా మక్తల్ నియోజకవర్గం లో ఎకరాకైనా నీటిని అందించని టిఆర్‌ఎస్ ప్రభుత్వం... ఒకరు 30 వేల ఎకరాలకు సాగునీటి అందిస్తామని, మరొకరు లక్ష ఎకరాలకు అందిస్తామని గొప్పలు చెబుతూ నియోజకర్గ ప్రజల చెవిలో గులాబీ పువ్వులు పెడుతున్నారని బిజెపి రాష్ట్ర సంపర్క్ అభియాన్ చైర్మన్ బి.కొండయ్య ఆరోపించారు. ఆదివారం మండల కేంద్రంలోని స్థాని క ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఏర్పా టు చేసిన విలేఖరుల సమావేశంలో కొండయ్య మాట్లాడారు. గత సంవత్సరం మక్తల్ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీటి అందిస్తామని చెప్పి ప్రాజెక్టులకు నీటిని విడుదల చేసిన భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు మాటల్లో ఎక్కడ కూడా నిజం లేకోపోయిందని కొండయ్య అన్నారు. లక్ష ఎకరాలకు నీరందిస్తామన్న ముఖ్యమంత్రి, నీటిపారుదల మంత్రి, ఎమ్మెల్యేల మాటల్లో ఎక్కడ నిజం కనిపించలేదని ఆరోపించారు. పిల్లకాలువల మాట దేవుడెరుగు కానీ ప్రధాన కుడికాలువ పనులు ఇంకా పెండింగ్‌లోనే ఉండటం విడ్డూరమని అన్నారు. 30 చెరువులను నీటితో నింపామని చెబుతున్న ఎమ్మెల్యే ఇంతకు నియోజకవర్గంలో ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎంత ఆయకట్టు ఉంది అన్న అవగాహన ఎమ్మెల్యేకు ఉందా అని ఆయన ప్రశ్నించారు. ప్రధాన చెరువులైనా కర్ని, మక్తల్, మంథన్‌గోడ్ చెరువుల్లో చుక్కనీరు చేరలేదని అన్నారు. అబద్ధాలతో పుట్టిన టిఆర్‌ఎస్ పార్టీ అంతే అబద్ధాలతో అధికారంలోకి వచ్చిందని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నుండి మొదలుకొని గల్లీ లీడర్ల వరకు అంతా అబద్దాలు మాట్లాడుతున్న వారేనని విమర్శించారు. బంగారు తెలంగాణ కాదు అబద్దాల తెలంగాణ అంటూ ఆయన మండి పడ్డారు. ఇంత వరకు నిరుద్యోగులకు డిఎస్సీ వేయలేదని అనేక ఉద్యోగాలు ప్రకటిస్తున్నప్పటికి అవి కోర్టు కేసులతోటి ప్రకటనలకే పరిమితం అవుతున్నాయని అన్నారు. మక్తల్‌కు ప్రాతినిత్య వహిస్తున్న ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి అభివృద్ధి పనులు చేపట్టుటలో వెనుకబాటు తనాన్ని చూస్తున్నారన్నారు. గతంలో అన్నమో రామచంద్ర అంటున్న ప్రజ లు ఇప్పుడు ఇసుకో చంద్రశేఖర్‌రావు అంటున్నారని ఎద్దేవా చేశారు. సామా న్య ప్రజలు ఇళ్లు కట్టుకోడానికి ఒక్క ట్రాక్టర్ ఇసుకను తీసుకెళ్లనివ్వని తహశీల్దార్, ఎస్సైలు వందల ట్రాక్టర్ల ఇసుకను పంచదేవ్‌పాడ్ వద్ద ఉన్న కాలువకు ఎలా ఇచ్చారని కొండయ్య అధికారులను ప్రశ్నించారు. ప్రభుత్వ ధనాన్ని కాంట్రాక్టర్‌కు దారాదత్తం చేశారని, రెవెన్యూ, పోలీసు అధికారులు కుమ్మక్కై అక్రమంగా రాత్రి రాత్రికే వందలాది ట్రాక్టర్ల ఇసుకను దండుకోవడమేనా బంగారు తెలంగాణ అని ఆయన ప్రశ్నించారు.
70 కిలో మీటర్లు సైకిల్ మోటారుపై తిరిగి ఎంతో అభివృద్ధి జరిగిందని గొప్పలు చెప్పుకోవడం కాదని 30 కిలోమీటర్ల మేరా బిజెపివారితో కలసిరా నీవు చేసిన అభివృద్ధి ఎంతుందో నిరూపణ అవుతుందని కొండయ్య ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు. ప్రాజెక్టుల కింద ఉన్న ఆయకట్టు భూములకు 3వేల ఎకరాలకు ఎక్కడ సాగునీటిని ఇచ్చారో ఎమ్మెల్యే పత్రిక ముఖం గా నిరూపించాలని కొండయ్య డి మాండ్ చేశారు. మాగనూర్ మండలంలో పారే ప్రధాన కుడికాలువ పను లు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని, వాటి పనులు త్వరితగతిన పూర్తిచేసి రైతులకు సాగునీటిని విడుదల చేయాలని కొండయ్య అన్నారు. సమావేశంలో బిజెపి నాయకులు సోమశేఖర్‌గౌడ్, కర్నిస్వామి, సి.చంద్రశేఖర్, చీరాల సత్యనారాయణ, మోహన్‌గౌడ్, బంగారు లక్ష్మణ్, రుద్రసముద్రం రాంలింగం, వాకిటి నర్సింహ , తదితరులు పాల్గొన్నారు.
అప్పుల రాష్ట్రంగా మారుస్తున్న కెసిఆర్
* బిజెపి రాష్ట్ర కమిటీ సభ్యుడు రతంగ్‌పాండురెడ్డి
ధన్వాడ: తెలంగాణ రాష్ట్రంను బంగారు తెలంగాణ రాష్ట్రం గా మారుస్తానని చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్, నేడు అప్పుల రాష్ట్రం గా మారుస్తున్నారని బిజెపి రాష్ట్ర కమిటి సభ్యుడు రతంగ్‌పాండురెడ్డి మండిపడ్డారు. ఆదివారం మరికల్ మండల పరిధిలోని అప్పంపల్లిలో బిజెపి మండల స్థాయి కార్యకర్తల సమావేశం మండల అధ్యక్షులు భాస్కర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తను ఉద్దేశించి బిజెపి రాష్టక్రమిటి సభ్యులు రతంగ్‌పాండురెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ పాలన రజకార్ల పాలనగా తలపిస్తుందన్నారు. కేవలం రాష్ట్రంలో ఆనలుగురు పాలననే కోనసాగుతుందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడ పనులు చేయాలన్న ఆ నలుగురి ద్వారానే పనులు చేయ డం ఎంతవరకు సమంజసమని ఆయ న ప్రశ్నించారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు కేవలం నామ మా త్రంగా పారిపాలన కొనసాగిస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న మిషన్ భగీరథ పనులలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య పెరుగుతున్న నేటికి రాష్టవ్య్రాప్తంగా ఉద్యోగాలు వేసిన పాపానపోలేదన్నారు. ఉన్న నిరుపేదలైన దళితులకు మూడు ఎకరాల భూములను ఇస్తామని చేసిన నేటికి ఒక్కగజం కూడా ఇవ్వని దుస్థితి టిఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం నిరుపేదలకు పలు సంక్షేమ పథకాలకై ప్రత్యేకంగా గ్రామాల వారిగా నిధులు కేటాయిస్తు న్న వాటిని సక్రమంగా రాష్ట్ర ప్రభుత్వం పంపిణి చేయలేక పోతుందనని అన్నారు. ప్రతి మండల కేంద్రంలో 30 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని చెప్పిన నేటికి అమలు చేయలేకపోవడం సిగ్గుచేట్టాన్నారు. రాష్ట్రంలో టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు అభివృద్ధిని మరిచి కేవలం ఇసుక దందాలోనే పనిచేయాడం సిగ్గుచేటన్నారు. అనంతరం పాలమూరు జిల్లా బిజెపి పార్లమెంట్ ఇంచార్జి కె.నర్సన్‌గౌడ్ మాట్లాడుతూ సెప్టెంబర్ 17ను రాష్ట్ర ప్రభుత్వామే అధికారికంగా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం అభివృధ్ధికి ఎవరు అడ్డుపడటం లేదని అన్నారు. కోదండరాం తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, నిరుద్యోగుల విషయంపై మాట్లాడితే మతిబ్రమించిందని కెసిఆర్ అనడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఇట్టి విషయంపై రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని ఆయన తెలిపారు. నారాయణపేట నియోజకవర్గం అభివృద్ధి పనులకై నారాయణపేట ఎమ్మెల్యేను కలువడానికి టిఆర్‌ఎస్ నాయకులు రాయిచూర్‌కు వేళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మరికల్ మండలంలోని అప్పంపల్లి రోడ్డు విషయంపై పలుసార్లు గ్రామస్థులు, నాయకులు పేట ఎమ్మెల్యేకు విన్నవించిన ఇకరోడ్డు అయిపోయిందనుకొండి అంటూ ఎమ్మెల్యే చెప్పిన నేటికి రోడ్డు గుంతలమమమైపోయిందన్నారు. నారాయణపేటను జిల్లాగా ఏర్పాటు విషయంలో ఎమ్మె ల్యే నిర్లక్ష్యం చేయడం జరిగిందని ఆయన విమర్శిచారు. ప్రస్తుతం 2019 ఏన్నికల్లో బిజెపి పార్టీ అభ్యర్థిగా రతంగ్‌పాండురెడ్డి ఎమ్మెల్యేగా చేయడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నేతలు రఘువీర్‌యాదవ్, ప్ర భాకర్‌వర్దన్, సిద్దిరామప్ప, మరికల్ బి జెపి మండల అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, రాజు, గడ్డంగోపాల్, వెంకటేష్, మల్లారెడ్డి, రాజేష్, తదితరులు పాల్గొన్నారు.
పాలమూరు ప్రాజెక్టును విభజించాలి
* సిఎం ఇచ్చిన హామీ ఇంటికో ఉద్యోగం సంగతేంటీ?
* భూ నిర్వాసితులను మోసం చేస్తున్న ప్రభుత్వం
* డిండికి నీటిని తరలించడం ద్రోహమే
*మంత్రులు, ఎమ్మెల్యేలు ద్రోహులుగా మిగులొద్దు
* టిజెఎసి జిల్లా చైర్మన్ రాజేందర్‌రెడ్డి
ఆంధ్రభూమి బ్యూరో
మహబూబ్‌నగర్: పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టును రెండు గా విభజించాలని అప్పుడే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు మేలు జరుగుతుందని టిజెఎసి జిల్లా చైర్మన్ రాజేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం మహబూబ్‌నగర్‌లోని టిఎన్జీఓ భవనంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జూరాల ప్రాజెక్టు నుండి మార్పు చేసి ప్రభుత్వం పెద్ద తప్పు చేసిందని ఆరోపించారు. మార్పు చేసినప్పటికిని ప్రాజెక్టును రెండుగా విభజించాలని డిమాండ్ చేశారు. జూరాల ప్రాజెక్టు నుండి కూడా పాలమూరు ప్రాజెక్టుకు నీరు తీసుకుంటే ప్రభుత్వానికి ఖర్చు తక్కువ అవుతుందని మక్తల్, నారాయణపేట, దేవరకద్ర, మహబూబ్‌నగర్, కొడంగల్, నియోజకవర్గాలతో పాటు వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలోని పలు నియోజకవర్గాలకు సాగునీరు ఇవ్వడానికి ఎంతో మేలు జరగనుందన్నారు. కానీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఒంటెద్దు పోకడంతో చాలా అన్యాయం జరిగిందన్నారు. దినిని దృష్టిలో పెట్టుకుని జిల్లాలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలతో కలిసి ఈ నెల 14న వృస్తృత రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతుందని మహబూబ్‌నగర్ పట్టణంలోని అన్నపూర్ణ పంక్షన్‌హాల్ గార్డెన్‌లో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పరిధిలోని కర్వెనా రిజర్వాయర్ పనులకు శంకుస్థాపన చేసిన సందర్భంలో భూ నిర్వాసితులకు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని మాట ఇచ్చారని ఆ మాటకు కట్టుబడి నిర్వాసితుల కుటుంబాల సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లా మంత్రులు, టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు భూ నిర్వాసితులకు అండగా నిలవాలని వారికి అన్యాయం జరుగుతుంటే వారి పక్షాన నిలుస్తున్న వారిపై పోలీసు కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. నిర్వాసితులకు భూమికి భూమి, ఇంటికో ఉద్యోగం కల్పించేలా ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో నిర్మాణంలో ఉన్న అన్ని ప్రాజెక్టులను పూర్తి చేయాలన్నారు. తెలంగాణకు కేటాయింపు ఉన్న కృష్ణానది నీటిలో మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలకు న్యాయమైన వాటాను ఇవ్వాలన్నారు. పాలమూరు ప్రాజెక్టు పరిధిలోని నార్లాపూర్ నుండి డిండికి కృష్ణా జలాలను తరలించి అక్కడి నుండి నల్లగొండ జిల్లాకు నీటిని తరలించడం అంటే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు ప్రభుత్వం ద్రోహం చేసినట్లేనని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ వ్యతిరేకులను ద్రోహులుగా ప్రజలు గుర్తించారని ప్రస్తుతం జిల్లాకు అన్యాయం జరుగుతుంటే ముఖ్యమంత్రితో చర్చించకుండా ప్రజల పక్షాన గొంతెత కుండా ఉంటే తెరాస మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ద్రోహులుగానే మిగిలిపోతారని అన్నారు. రౌండ్ టెబుల్ సమావేశానికి ప్రొపెసర్ హరగోపాల్‌తో పాటు పలువురు ప్రబుఖులు హాజరవుతున్నారని తెలిపారు. పాలమూరు అధ్యాయన వేధిక జిల్లా కన్వీనర్ రాఘవాచారి మాట్లాడుతూ పాలమూరు జిల్లాకు ద్రోహం జరుగుతుంటే టిఆర్‌ఎస్ అధినాయకత్వం చెప్పుడుమాటలు వింటే జిల్లా ఎమ్మెల్యేలను, మంత్రులను ప్రజలు క్షమించరని అన్నారు. ఎన్నికల్లో ఓట్లు వేసేంది జిల్లా ప్రజలు అన్న విషయాన్ని నాయకులు గుర్తించుకోవాలని హితవుపలికారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి కొదండరాం చేస్తున్న ప్రయత్నాని కూడా ప్రభుత్వం అడ్డుకోవడం విచారకరమి అన్నారు. విలేఖరుల సమావేశంలో టిజెఎసి నాయకులు బాలకిషన్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.