కరీంనగర్

20కోట్ల మొక్కలు నాటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్: మూడవ విడత హరితహారం కార్యక్రమంలో రాష్ట్రంలో ఇప్పటివరకు 20కోట్ల మొక్కలు నాటామని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. ఆదివారం ఎల్‌ఎండి వద్ద సిఎం కెసిఆర్ హరితహారం ప్రారంభ కార్యక్రమంలో నాటిన మొక్కలను జిల్లా మంత్రి ఈటల రాజేందర్‌తో కలిసి జోగు రామన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ప్రయోగం మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేపట్టారని, తెలంగాణకు హరితహారం కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు. మొక్కలు నాటడం ముఖ్యం కాదని, వాటిని రక్షించడం ముఖ్యమన్నారు. లెక్కల కోసం మొక్కలు నాటకూడదని, నాటిన ప్రతీ మొక్కను బతికించే బాధ్యతలను తీసుకోవాలన్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల మొక్కలు నాటడం నిలిపివేయమని చెప్పామని, నాటిన మొక్కలను రక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జూలై, ఆగస్టు మాసాలలో నెలకు నాలుగుసార్లు ట్యాంకర్ల ద్వారా నీరు అందించే చర్యలకు అనుమతులిచ్చామని, ఒక ట్రాక్టర్‌కు రూ.480 చొప్పున చెల్లిస్తున్నామని తెలిపారు. కరీంనగర్‌లో మూడవ విడత హరితహారాన్ని సిఎం ప్రారంభించారని, సిఎం నాటిన మొక్కలు ఎలా ఉన్నాయో చూడడానికి ఇక్కడికి వచ్చామని చెప్పారు. జిల్లాలో 80 నుంచి 90 శాతం మొక్కలు రక్షించబడ్డాయని తెలిపారు. గత రెండేళ్లలో నాటిన మొక్కలలో 67శాతం దక్కాయని అన్నారు. వర్షాలు పడిన జిల్లాలలో మొక్కలు నాటాలని, వర్షాలు లేనిచోట్ల నాటిన మొక్కలను రక్షించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని మంత్రి తెలిపారు. ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గాల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు రూపొందిస్తుందన్నారు. సంచార జాతులు, పూసవేర్ల కులస్థులు, పెద్దమ్మల కులస్థులు, వంశధార కులస్థుల అభివృద్ధికి ఎంబిసి చైర్మన్ అధ్యక్షతన గల కమిటితో చర్చించి వారికి సంక్షేమ పథకాలను రూపొందించి సిఎం ఆమోదంతో త్వరలో అమలు చేస్తామన్నారు. వాటి ఫలితాలు వేగంగా వచ్చేలా స్కీములు రూపొందిస్తామని చెప్పారు. గొర్ల కాపర్లు, మత్స్యకారులు, రజకులు, నాయిబ్రాహ్మణులకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, విశ్వకర్మలకు కూడా స్కీములు డిజైన్ చేస్తున్నామని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బిసిల ఆర్థికాభివృద్ధికి కూడా ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, ఎమ్మెల్సీ భానుప్రసాద రావు, ఐడిసి చైర్మన్ ఈద శంకర్ రెడ్డి, మున్సిపల్ కమీషనర్ శశాంకతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

పంద్రాగస్టు వేడుకలకు విస్తృత ఏర్పాట్లు

* జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్

ఆంధ్రభూమి బ్యూరో
కరీంనగర్: ఈ నెల 15న పోలీస్ పరేడ్ మైదానంలో జరిగే పంద్రాగస్టు వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. ఆదివారం సాయంత్రం కలెక్టరేట్ క్యాంపు కార్యాలయంలో పంద్రాగస్టు వేడుకల ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వర్షాకాలం అయినందున వాటర్ ఫ్రూఫ్ టెంట్లు వేయించాలని, సీటింగ్ ఏర్పాట్లు సరిగా చూడాలని, మైదానాన్ని సిద్ధం చేయాలని, తాగునీటి వసతి కల్పించాలని, మైకు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అలాగే వివిధ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించిన శకటాలను వేడుకలలో ప్రదర్శించాలని సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. వేడుకల సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా మంజూరైన సంక్షేమ యూనిట్లను మంత్రి చేతుల మీదుగా ఇచ్చేందుకు సిద్దంగా ఉంచాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ బద్రి శ్రీనివాస్, మున్సిపల్ కమీషనర్ శశాంక, డిఆర్‌డిఓ వెంకటేశ్వర్ రావు, డిఎం అండ్ హెచ్‌ఓ డాక్టర్ రాజేశం, డిఇఓ రాజీవ్, ఆర్‌డిఓ రాజాగౌడ్, మెప్మా పిడి పవన్ కుమార్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.

క్రీడల వల్ల దేహదారుఢ్యం

కోహెడ: క్రీడల వల్ల దేహధారుఢ్యం కలుగడంతో పాటు మానసికోల్లాసం కలుగుతుందని బిజెపి మండల శాఖ అధ్యక్షులు ఖమ్మం వెంకటేశం అన్నారు. కోహెడలో ఆదివారం పార్టీ సిద్ధాంతకర్త పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఖేలో భారత్‌లో భాగంగా మండల స్థాయి క్రీడాపోటీల సమావేశంలో ఆయన మాట్లాడారు. క్రీడల వల్ల స్నేహపూరిత పోటీతత్వం పెరుగుతుందని, విద్యార్థుల్లో క్రీడా ప్రతిభ వెలికి తీసి మంచి క్రీడాకారులుగా తయారు కావడానికి దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు గుగ్గిళ్ల శ్రీనివాస్, యువమోర్చ అధ్యక్షులు కరుణాకర్, నాయకులు సతీష్, శ్రీకాంత్, అఖిల్, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

తాగునీటి కోసం రుద్రంగిలో మహిళల ఆందోళన

చందుర్తి: రుద్రంగి మండల కేంద్రంలోని 5వ వార్డులో తాగునీటి కొరత తీవ్రంగా ఉందని స్థానిక మహిళలు ఆదివారం గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించారు. తమ కాలనీకి గత కొద్ది రోజుల నుండి తాగునీరు రావడం లేదని, పలుమార్లు గ్రామపంచాయతీ సిబ్బంది దృష్టికి తీసుకువచ్చినా సమస్యలు పరిష్కరించడం లేదని మహిళలు ఆందోళన చేపట్టారు. వారం రోజుల్లో సమస్యను పరిష్కరించకుంటే ఆందోళనను మరింత ఉదృతం చేస్తామని మహిళలు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున మహిళలు పాల్గొన్నారు.

సత్ఫలిస్తున్న చార్వాక హెల్ప్‌లైన్

చందుర్తి: వృద్ధుల సమస్యల పరిష్కారం కోసం చార్వాక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ సత్ఫలితాలను ఇస్తుందని చార్వాక ట్రస్ట్ చైర్మన్ డప్పుల అశోక్ అన్నారు. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన గుజ్జేటి లలితమ్మ, చందుర్తి మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన నక్క లక్ష్మినర్సవ్వ తమ కుటుంబ సమస్యలను హెల్ప్‌లైన్ దృష్టికి తీసుకురాగా వెంటనే పరిష్కరించడం జరిగిందని, ఇబ్బందులు ఎదుర్కొంటున్న వృద్ధులు తమ సమస్యలను చార్వాక హెల్ఫ్‌లైన్ దృష్టికి తీసుకువస్చే వెంటనే పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ నాయకులు చెప్యాల గణేష్, మర్రి గౌరవయ్య, రాజిరెడ్డితో పాటు పెద్దఎత్తున వృద్ధులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో బండపెల్లివాసి మృతి

చందుర్తి: చందుర్తి మండలం బండపెల్లి గ్రామానికి చెందిన మంజుల లస్మయ్య (40) రుద్రంగి మండల కేంద్రంలో జరిగిన రోడ్ ప్రమాదంలో శనివారం సాయంత్రం తీవ్రంగా గాయపడగా హైదరాబాద్ గాంధి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. లస్మయ్య అత్తగారింటికి వెళ్లి తిరిగి వస్తుండగా మేకల మందను ఢీకొట్టగా ద్విచక్ర వాహనం నుండి కిందపడడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయనను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య దేవమ్మ, కూతురు మంజుల, కుమారుడు రాజు ఉన్నారు. ఈ సంఘటనపై ఎఎస్‌ఐ ఇస్మాయిల్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

నగరంలో శాంతి ర్యాలీ

కరీంనగర్ టౌన్: కరీంనగర్ నగరంలో ఆదివారం శాంతి ర్యాలీ నిర్వహించారు. నగరంలోని పలు వీధులగుండా ఈ శాంతి ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కమీషనర్ కమలాసన్ రెడ్డి, రాష్ట్ర మైనారిటీ కార్పోరేషన్ చైర్మన్ అక్భర్ హుస్సేన్, మాజీ డిప్యూటి మేయర్ అబ్బాస్ షమీ, కార్పోరేటర్ ఆరీఫ్, మాజీ కార్పోరేటర్ మొండి చంద్రశేఖర్, పీస్ కమిటి నాయకులు మహమూద్ అలీతోపాటు వివిధ మతాలకు చెందిన ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.

ఠాణాల్లో పోలీస్ కుటుంబాల ఆత్మీయ సమ్మేళనాలు

కరీంనగర్ టౌన్: కరీంనగర్ కమీషనరేట్ పరిధిలో పలు పోలీస్ స్టేషన్లలో ఆదివారం పోలీస్ కుటుంబాల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా పోలీస్ కుటుంబాలకు పోలీస్ విధుల్లో చేపట్టే చర్యలు, ఎదుర్కొనే సమస్యలు, ఇబ్బందులను వివరిస్తూ, ఒత్తిడికి లోనయ్యే పోలీసులకు ఉపశమనం లభించేలా వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందాన్ని పంచుకునేందుకు ఫ్యామిలీ డే పేరిట ఈ కార్యక్రమాలను పోలీసు అధికారులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులందరు కలిసి సహఫంక్తి భోజనాలు చేశారు. పలు ఠాణాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో పోలీస్ కమీషనర్ కమలాసన్‌రెడ్డి పాల్గొని పోలీస్ కుటుంబాలనుద్ధేశించి ప్రసంగించారు. నగరంలో వన్ టౌన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లలో జరిగిన కార్యక్రమంలో సిపి కమలాసన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్లు తుల శ్రీనివాస రావు, సదానందం, సీతారెడ్డి, ఎస్‌ఐ సురేందర్‌తోపాటు పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పోలీస్ కుటుంబాల మధ్య సత్సంబంధాలకే ఫ్యామిలిడే

* సిపి కమలాసన్ రెడ్డి

గంగాధర: విధి నిర్వహణలో ఉంటున్న పోలీస్ కుటుంబాలకు ఫ్యామిలీ డేతో సత్సంబంధాలు ఏర్పడుతాయని కరీంనగర్ సిపి వి.బి.కమలాసన్ రెడ్డి అన్నారు. ఆదివారం గంగాధర పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన ఫ్యామిలీ డే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని పోలీస్ కుటుంబాలతో కలిసి సహఫంక్తి భోజనాలు చేశారు. పని ఒత్తిడి వలన పోలీసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దిష్టిలో ఉంచుకొని కరీంనగర్ కమీషనరేట్ పరిధిలో ఫ్యామిలీ డే కార్యక్రమాన్ని నిర్వహించి పోలీసులు తమ కుటుంబ సభ్యులతో ఒక రోజు ఉల్లాసంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో గడిపేందుకు ఉపయోగపడుతుందన్నారు. పోలీసులు విధి నిర్వహణతో పాటు తమ కుటుంబ సమస్యలను కూడా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గంగాధర పోలీస్ స్టేషన్ సిబ్బంది తమ కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి సిఐ రమేష్ బాబు, స్థానిక ఎస్‌ఐ స్వరూప్ రాజ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

శిరీషకు టిటిఆర్ ఫౌండేషన్ చేయూత

సుల్తానాబాద్: సుల్తానాబాద్ మండలం చిన్నకల్వల గ్రామ పంచాయతీ పరిధిలోని ఉప్పరపల్లికి చెందిన శిరీష (18) అనే అభాగ్యురాలికి టిటిఆర్ ఫౌండేషన్ ఆదివారం చేయూతనందించింది. శిరీష శరీరం విషతుల్యం కావడంతో ఇంటికే పరిమితమై మందులు కొనుగోలుకు ఆర్థిక స్థోమత లేకపోవడంతో టిటిఆర్ ఫౌండేషన్‌ను ఆశ్రయించగా, స్పందించిన ఫౌండేషన్ అధ్యక్షుడు తానిపర్తి తిరుపతి రావు ప్రతి నెల ఫౌండేషన్ తరపున వైద్య ఖర్చుల నిమిత్తం రెండు వేల రూపాయలు అందించేందుకు అంగీకరించారు. ఈ మేరకు రెండు వేల రూపాయల చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ బాధ్యులు కాసర్ల మదుసూధన్ రెడ్డి, ఆకారి రాజేశం, పిట్ట భాస్కర్, సల్వాజి తిరుమల్ రావు, బొంకూరు మధు, అభినవ్ గౌడ్, సాయి లక్ష్మణ్, సాగర్, వెంకటేష్, సతీష్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.

గంజాయిని తరలించే ముఠా అరెస్ట్

సుల్తానాబాద్: గంజాయిని తరలిస్తున్న రాజస్థాన్‌కు చెందిన ముగ్గురిని ఆదివారం అరెస్ట్ చేసినట్లు ఎస్‌ఐ రాజు తెలిపారు. గంజాయిని తరలిస్తున్న సర్వన్ రాము, రాజారాం చౌదరి, పంచిలాల్ మోడీలను శనివారం సుగ్లాంపల్లి వద్ద అదుపులోకి తీసుకోవడం జరిగిందని, ఈ ముగ్గురి ముఠా నుండి రెండు కిలోల 700 గ్రాముల గంజాయిని స్వాధీనపర్చుకొని అరెస్ట్ చేయడం జరిగిందని ఎస్‌ఐ వివరించారు.