Others

డాక్టర్ చక్రవర్తి (నాకు నచ్చిన చిత్రం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రయోగాలు తెలుగు సినిమాకు కొత్త కాదు. వైవిధ్యమైన కథను ఎన్నుకుని ప్రేక్షకుల హృదయాలకు హత్తుకునేలా చెప్పే విధానం ఆనాటి దర్శకులకు తెలిసినంతగా ఇప్పటి దర్శకులకు తెలీదనడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. 1964 సంవత్సరంలో విడుదలై అఖండ విజయాన్ని సాధించిన ‘డా చక్రవర్తి’ చిత్రాన్ని ఈ సందర్భంలో కచ్చితంగా ప్రస్తావించుకోవచ్చు. ఏఎన్నాఆర్ హీరోగా నటించిన డాక్టర్ చక్రవర్తి సినిమా అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఇప్పటికీ ఎప్పటికీ మరపురాని చిత్రమది. ఈ చిత్ర విజయానికి తోడ్పడ్డ గొప్ప విషయాలన్నీ అప్పట్లో ప్రయోగాల కిందే లెక్కలు వేసుకోవచ్చు. అప్పట్లో వేలాదిమంది పాఠకుల్ని సామాజికాంశాలతో ఆర్ద్రపరిచి గాఢంగా ఆకట్టుకున్న నవల చక్రభ్రమణం ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అప్పట్లోనే నవలను ఆకళింపు చేసుకున్న చదువరులు -అన్నపూర్ణ సంస్థ ఫలానా నటీనటులతో చిత్రం నిర్మిస్తే ఓ మంచి చిత్రాన్ని అందించినట్టేనంటూ లేఖలు రాశారు. ఇది చిత్ర నిర్మాణానికి నాంది పలికింది. వెంటనే మధుసూదనరావు రచయిత్రినుంచి హక్కులు కొన్నారు. ఆదుర్తి దర్శకత్వంలో చిత్ర నిర్మాణం మొదలైంది. నిర్మాణంలో కొన్ని కొత్త సంగతులు చోటుచేసుకున్నాయి. పాఠకుల సూచన ప్రకారం నటవర్గం ఎంపిక జరిపి ప్రేక్షాభిరుచికి పట్టంకట్టారు. ఈ చిత్రంతోనే గొల్లపూడి మారుతిరావు స్క్రీన్ ప్లే రైటర్‌గా పరిచయమయ్యారు. ఆచార్య ఆత్రేయ తిరిగి అన్నపూర్ణవారి తొలి నవలా చిత్రానికి మాటలు రాశారు. షావుకారు జానకి అన్నపూర్ణలో నటించిన తొలి చిత్రమైతే, మహానటి సావిత్రికిది చివరి సినిమా. ఈ చిత్రాన్ని మాస్ ప్రేక్షకులు కన్నా క్లాస్ ప్రేక్షకులు విపరీతంగా వీక్షించారు. సాలూరి స్వరాలు మృదుమధురంగా రంజింప చేసాయి. శ్రీశ్రీ రచించిన ‘మనసున మనసై బతుకున బతుకై’ గీతాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులు ప్రశంసించారు. ఆదుర్తి అద్భుత దర్శక ప్రతిభ, అక్కినేని, సావిత్రి తదితర హేమాహేమీల నటనా వైదుష్యంతో ‘డా చక్రవర్తి’ సినిమా తెలుగు చిత్రసీమకి మణిహారం అయ్యింది.

-మాధవరపు కృష్ణ, కాకినాడ