Others

బహుముఖ ప్రజ్ఞ (శరత్కాలం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్టీ రామారావు, జానకి జంటగా నటించిన చిత్రానికి మంచి పేరును సూచించాలంటూ అప్పట్లో యూనిట్ సభ్యులకు నగదు బహుమానం ప్రకటించారట హెచ్‌ఎం రెడ్డి. ఆ చిత్రంలో నటించిన పేకేటి శివరాం ‘వద్దంటే డబ్బు’ అనే పేరును సూచించి నగదు బహుమతి పొందాడు (విడుదల 19-2-1954). ఆ రోజుల్లో తెలుగు సినిమా రంగంలోని పలు విషయాలపై ఘాటైన పదజాలంతో విమర్శనాత్మక వ్యాసాలు గేనిడ పేరిట వెలువడుతుండేవి. ఎవరీ వ్యక్తి అని పరిశ్రమ పెద్దలు ఆశ్చర్యపోతూ వుండేవారు. తరువాత తెలిసింది, ఆయనెవరో కాదు తన పేరునే ఆంగ్లంలో త్రిప్పి వ్రాస్తూ ప్రచురించే శివరామ్ అని. పేకేటి శివరామ్ బహుముఖ ప్రజ్ఞాశాలి. జర్నలిస్టుగా, రచయితగా తెలుగు సినిమా రంగంలోని అనేక విభాగాల్లో అనుభవంగల వ్యక్తిగా పేరుపొంది నటుడిగా, దర్శకుడిగా పలు విజయవంతమైన చిత్రాల నిర్మాణానికి కారకుడయ్యాడు. అక్కినేనితో నటించిన దేవదాసు చిత్రం చాలు నటుడిగా పేకేటి అనుభవం ఎంతటిదో చెప్పడానికి.
దర్శకుడిగా కన్నడంలో చక్రతీర్థ, పునర్జన్మతోపాటు తెలుగులో భలే అబ్బాయిలు, ఎన్టీఆర్ స్వంత చిత్రం ‘కులగౌరవం’ లాంటి చిత్రాలను తీశాడు శివరాం. ఇక రాజకీయాల విషయానికి వస్తే స్వర్గీయ ఇందిరాగాంధీకి సన్నిహితుడిగా కాంగ్రెస్ పార్టీ ప్రచార విభాగంలోనూ సేవలు అందించాడు. శివరాం వారసులుగా పరిశ్రమలో త్యాగరాజన్ (అల్లుడు), మనవడు ప్రశాంత్ నటులుగా తమిళ రంగంలో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. కుమారుడు పేకేటి రంగా పలు తెలుగు చిత్రాలకు కళా దర్శకుడిగా వ్యవహరించాడు. 1918 అక్టోబర్ 8న జన్మించిన శివరాం 2006 డిసెంబర్ 30న మన నుంచి దూరమయ్యాడు. పేకేటి శివరాం ఒక సినీరంగ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తున్నప్పటి చిత్రమిది.

-పర్చా శరత్‌కుమార్ 9849601717