Others

తనని మిస్సవుతున్నా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సౌత్‌లో క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న మిల్కీ భామ తమన్నా ప్రస్తుతం తన సోదరుడు వివాహ పనుల్లో బిజీగా ఉంది. దాంతోపాటు తమిళంలో రెండు చిత్రాల్లో నటిస్తోంది. అందులో ఒకటి విక్రమ్ సరసన నటిస్తున్న స్కెచ్ సినిమా ఒకటి. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయ. అయితే ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్న తమన్నా, విక్రమ్‌ను మిస్సవుతున్నానంటూ చెప్పడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన సందర్భంగా ఈమె స్కెచ్ సినిమాలో పని చేయడం ఆనందంగా ఉందని, యూనిట్‌తోపాటు విక్రమ్‌ను మిస్సవుతున్నానంటూ పేర్కొంది. స్కెచ్ సినిమాతో మళ్లీ తన కెరీర్ ఊపందుకుంటుందని నమ్మకంతో ఉందీ భామ. ఈమధ్య వరుస పరాజయాలు పలకరించడంతో తమన్నాకు కాస్త అవకాశాలు తగ్గాయి. దాంతో కోలీవుడ్‌లో వచ్చిన రెండు అవకాశాలను అందిపుచ్చుకుంది.