రివ్యూ

అయనా.. లాభం లేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

** ఫర్వాలేదు **నేనే రాజు నేనే మంత్రి
తారాగణం: రానా, కాజల్, కేథరిన్, అశుతష్ రాణా, తనికెళ్ల భరణి, శివాజీ రాజా, జయప్రకాష్‌రెడ్డి, పోసాని నవదీప్, ప్రభాస్ శీను తదితరులు
సంగీతం:అనూప్ రూబెన్స్
నిర్మాతలు:సురేష్‌బాబు,
కిరణ్‌రెడ్డి, భరత్ చౌదరి
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:తేజ
‘ఒక తప్పును సరిదిద్దడానికి ఇంకో తప్పు చేయడం తప్పే?’ అన్న సాధారణ సూత్రాన్ని విస్మరించి చూస్తే ‘నేనే రాజు నేనే మంత్రి’ ఓకె!
ఓ గ్రామంలో వడ్డీ వ్యాపారం చేసే జోగీంద్ర (రానా)కు భార్య రాధ (కాజల్) అంటే వల్లమాలిన ప్రేమ. ఓ సందర్భంలో తన భార్య గర్భవిచ్చిత్తికి సర్పంచ్ కారణమవుతాడు. కోపంతో సర్పంచ్ కావాలనుకుని చివరకు ఎంఎల్‌ఏ, మంత్రి అయిపోతాడు. సిఎం అయ్యే క్రమంలో పడ్డ మెలికలు, చివరకు ఏమైందన్న దానిలోనే నేనే.. ప్రస్థానం ముగుస్తుంది. ఇందులో లాజిక్‌కి పాధాన్యం లేదు. పాత్రలకు వాళ్లిచ్చిన భావాలకు వ్యతిరేకంగా కథాసరళి నడవడం దారుణం. ఉదాహరణకి భర్త జోగీంద్ర తాకట్టు పెట్టుకున్న కడియాలు సైతం వెనుకదారి నుంచి స్వంతదారులకు ఇచ్చివేసే దయార్ద్ర గుణం కలిగిన వనితగా భార్య రాధని ఇందులో చూపారు. మరి అదే రాధ భర్త తనకోసం సర్పంచ్‌నీ, ఎంఎల్‌ఏనీ చంపేసాడని తెలిసినా ఏకోశానా వారించదు. ఇక్కడే పాత్ర పట్ల దర్శకుడు చూపిన పరస్పర విరుద్ధ అంశాలు ప్రస్ఫుటమయ్యాయి. దాన్ని కప్పిపుచ్చడం కోసం ఆయన ఏంచేసినా నాకు తప్పనిపించదు అని రాధతో అనిపించటం, పాత్ర వ్యక్తిత్వానికే మచ్చ తెచ్చినట్టు. ఇక హోంమంత్రి, ఎంఎల్‌ఏ పాత్రల్ని గల్లీ లీడర్స్‌లా చూపించటం బాగలేదు. రాజకీయ సన్నివేశాలన్నీ తేలిపోయాయ. అశుతోష్ రాణా పాత్రతో ‘ఎప్పట్నించో ఉన్న పార్టీలోనూ మేమే ఉన్నాం. సినిమా దేవుడు పెట్టిన పార్టీలోనూ, ఉద్యమకారుడు పెట్టిన పార్టీలోనూ, మాస్ హీరో పెట్టిన పార్టీలోనూ.. మేమే ఉన్నాం’ అని సమకాలీన అంశాన్ని టచ్ చేశారు. ‘మనకెందుకీ గోలంతా.. మునుపటిలాగే ఉందాం’ అని భర్తకి నచ్చజెప్పిన రాధే, ఆసుపత్రిలో తనంత తానే ప్రాణవాయువు పైపుని తొలగించుకుని ‘నువ్వు సిఎం అయితీరాలి’ అని చెప్పడం ఫక్తు సినిమాటిక్ అనిపించింది.
కథా పోకడల అవకతవకల్ని వదిలేసి మిగతా విషయాలకొస్తే- ఎంత రానా ఇది నా ఒన్ మ్యాన్ షో కాదని సంస్కారవంతంగా చెప్పినా సినిమాకు దాదాపు కర్తా, కర్మా, క్రియా జోగీంద్ర పాత్రధారి రానాయే. ఒక సందర్భంలో ఆ పాత్రనుద్దేశించి మునెప్ప (పోసాని కృష్ణమురళి) ‘నువ్వు అమాయకుడివా, అలా నటించి మమ్మల్ని మాయచేసేస్తున్నావా’ అని అంటాడు. సరిగ్గా రానా నటనకు ఈ కితాబు వర్తిస్తుంది. ఆ చూపులో ఓ రకం అమాయకత్వం కనబడుతోంది. దానివెనుక భార్య పట్ల తనకున్న విపరీత ప్రేమ అలాగే నిలవడానికి ఎలాగైనా సరే ఏదో ఒకటి చెయ్యాలన్న పట్టుదలా కన్పడింది. అదే రీతిలో తాను నమ్మిన బంటు శివ (నవదీప్)ని అపార్థం చేసుకుని చంపేశానన్న బాధని కారులో వెళుతూ కేవలం కళ్ళలో చూపిన తీరు ప్రేక్షకుణ్ణి పట్టేసింది. రాధ పాత్రలో కాజల్ కూడా ఎన్నదగిన రీతిలో నటించింది. ఫోకస్ టీవీ చానల్ అధినేత్రి దేవికారాణి (కేథరిన్) పాత్ర కేవలం ఈ స్థాయి చిత్రాలలో రెండవ నాయిక లేకపోతే ఎలా అన్న ఫార్ములాతో పెట్టిందే తప్ప అర్థవంతంగా లేదు. అయితే ఆ పాత్రకిచ్చిన తీరులో ఆమె ఒదిగిపోయింది. ‘కత్తులతో కొలిమి, నెత్తుటితో చెలిమి..’ పాట సినిమా తీరుకి సందర్భోచితంగా సరిపోయింది. వెనుకటికో సామెతుంది.. అంటూ జోగీంద్ర చెప్పిన సామెతల్లో ‘షిర్డీకెళ్లాలంటే షిరిడీ బస్సే ఎక్కాలి తప్ప సిటీ బస్సెక్కితే వెళ్లం’’ అన్నది ఆడియోరియంలో ట్రెమండస్‌గా పేలింది. అదే భాషను అనుసరించి దర్శకుడు తేజ కూడా ‘‘హిట్ కొట్టాలంటే, తర్కాలూ తాటికాయలూ అనుకుంటూ పోతే ఎలా’’ అని భావించే ‘‘నేనే..’’ని రూపొందించి ఉంటారు. అయితే ఎంతగా ఈమధ్యకాలంలో తేజా మార్కు తేజం తగ్గిందని చాలామంది భావిస్తున్నా, ఆ బాపతు తళుకులు తగ్గలేదని చిత్ర ప్రారంభ సమయంలో వచ్చిన ‘నువ్వే నువ్వే..’ పాట చిత్రీకరణలోనూ, ఆఖర్లో ఆరడుగుల రానా ముఖానికి ఉరి విధించేటప్పుడు తలకు కప్పే ముసుగు వేయడానికి ఎత్తు సరిపోక ఇబ్బంది పడుతున్న పోలీసుకు, వీలుగా తన తలని వంచి సహకరించిన సన్నివేశంలోనూ చటుక్కున మెరిసాయి.

-అనే్వషి