రివ్యూ

అబద్ధం.. అతకలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

** ఫర్వాలేదు **లై
తారాగణం: నితిన్, మేఘా ఆకాష్, అర్జున్, నాజర్, మధునందన్, రవికిషన్ సమర్పణ:వెంకట్ బోయినపల్లి
సంగీతం:మణిశర్మ
సినిమాటోగ్రఫి: జె.యువరాజ్
నిర్మాతలు:రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర
దర్శకత్వం:హను రాఘవపూడి

త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అ..ఆ’ సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు హీరో నితిన్. ఆ సినిమా తరువాత కథల ఎంపిక విషయంలో కేర్ తీసుకుంటున్న నితిన్ చాలా కథలు విని.. లై కథ నచ్చడంతో ఓకె చెప్పాడు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘లై’పై మొదటినుంచి మంచి అంచనాలున్నాయి. ఫస్ట్‌లుక్, పాటలు, ట్రైలర్ బాగా ఆకట్టుకుని సినిమాపై భారీ అంచనాలని పెంచింది. లై అంటే అబద్ధం ఎవరు చెప్పారు.. ఎందుకు చెప్పారు? దానివలన ఎలాంటి పరిణామాలు జరిగాయో తెలియాలంటే మాత్రం కథలోకి వెళ్లాల్సిందే..
ఇండియాలో వున్న పోలీస్ ఫోర్స్ మొత్తం భయంకరమైన క్రిమినల్ పద్మనాభన్ (అర్జున్) కోసం వెతుకుతుంటారు. పద్మనాభన్ ఒక మెజీషియన్. అతను అమెరికాలో సెటిలై ఉంటాడు. ఇక ఈజీగా డబ్బు సంపాదించాలని ప్రయత్నాలు చేసే పాతబస్తీ కుర్రాడు సత్యం (నితిన్) పేరు మాత్రమే సత్యం కానీ ఎప్పుడూ నిజం చెప్పడు. ఎలాంటి బాధ్యతలు లేని కుర్రాడు. పెద్దింటి అమ్మాయిని పెళ్లాడాలనే ఆలోచనతో ఉంటాడు సత్యం. తన కలలను నెరవేర్చుకోవడానికి ఏదైనా చేసే అమ్మాయి చైత్ర (మేఘా ఆకాష్). హనీమూన్‌ని అమెరికాలో జరుపుకోవాలని ఆశతో పెళ్లికి సిద్ధపడుతుంది. అనుకోకుండా పెళ్లి ఆగిపోవడం.. అతడి ప్లేస్‌లో హీరోయిన్‌తో కలిసి సత్యం వెళ్లడం జరుగుతుంది. తరువాత సత్యం అనుకోకుండా పద్మనాభన్‌తో గొడవ పడతాడు. ఆ గొడవతో సత్యం జీవితం తలకిందులైపోతుంది. అలాంటి సమయంలో అతనేం చేశాడు? అసలు పద్మనాభన్ ఎవరు? అతనితో నితిన్ ఎందుకు గొడవ పడాల్సి వచ్చింది? అనేది తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే...
సినిమాలో విలన్ పాత్రలో యాక్షన్ కింగ్ అర్జున్ నటన అద్భుతం. ఈ క్యారెక్టర్‌ను హను రాఘవపూడి ఎంత బలంగా రాసుకున్నాడో అంతే బలంగా తెరపై ఆవిష్కరించాడు. అర్జున్ కూడా పాత్రలోని వేరియేషన్స్‌ను పర్‌ఫెక్ట్‌గా ఆద్యంతం ఆకట్టుకున్నాడు. ఆ పాత్రకు అర్జున్ చెప్పిన డబ్బింగ్ బావుంది. ఇక హీరో నితిన్ అ.. ఆ తరువాత స్టైల్ పూర్తిగా మార్చేసి, ఈ సినిమాలో చాలా స్టైలిష్‌గా కనిపిస్తాడు. కొంచెం ఓవర్‌గా అనిపించే పాత్రను కూడా మంచి ఈజ్‌తో చేసేశాడు. అతని డాన్సులు, ఫైట్స్, నటన అన్నీ కూడా చాలా బాగున్నాయి. సినిమాకు మరో ప్లస్ పాయింట్ ఇంటర్వెల్‌లో వచ్చే ట్విస్ట్. హీరోయిన్‌గా మొదటి సినిమా చేసిన మేఘా ఆకాష్ ఆకట్టుకుంది. ఈమెకు మంచి భవిష్యత్ ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక మిగతా పాత్రల్లో చేసిన వాళ్ళు వారి వారి పాత్రల మేరకు బాగానే ఆకట్టుకున్నారు. నిర్మాణ పరంగా చాలా భారీగా ఖర్చుపెట్టి తీశారన్న విషయం ప్రతి ఫ్రేములో కనిపిస్తుంది. ఈ సినిమాకు మణిశర్మ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని పెంచింది. దాంతోపాటు పాటలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా బొంబాత్ సాంగ్ అదిరింది. కానీ దాన్ని ఇంకాస్త మాస్‌గా తెరకెక్కిస్తే అదిరిపోయేది. ఇక డైలాగ్స్, ఆర్ట్స్ వర్క్ బాగుంది. ఎడిటింగ్ విషయంలో కాస్త కేర్ తీసుకుంటే బెటర్‌గా ఉండేది. దర్శకుడు హను రాఘవపూడి పాయింటు బాగా రాసుకున్నప్పటికీ తెరకెక్కించిన విధానమే సరిగాలేదు. అనుభవలేమి సన్నివేశాలలో కనబడింది. అనవసరమైన అంశాలను చాలావాటిని సినిమాలో ఇరికించినా, ప్రతినాయకుడి ట్రాక్‌ను బాగా హేండిల్ చేశాడు. పైగా ఓ అంశం చుట్టూ ఈ కథ తిరుగుతుండడంతో ప్రేక్షకుల క్యూరియాసిటీ పెరిగింది కానీ దాన్ని ప్రెజెంట్ చేయడంలో దర్శకుడు ఇంకాస్త కేర్ తీసుకుని ఉండాల్సింది. ఇక సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్ లేకపోవడం. చాలాచోట్ల కామెడీని పెట్టే స్కోప్ ఉన్నా కూడా దర్శకుడు ఆ స్పీడ్‌ను వాడుకోలేదు. అలాగే ఇందులో కొన్ని అనవసరమైన ట్రాక్స్ కూడా ఉన్నాయి. సినిమా అసలైన కథలోకి ప్రవేశించడానికి చాలా టైమ్ పట్టింది. దీంతో సినమాను సాగదీసిన ఫీలింగ్ కలిగింది. అర్జున్- నితిన్‌లు ఉన్నంతసేపు సినిమా బాగుంది అనిపించేలోపు హీరోయిన్ ట్రాక్, లేదా ఇతర బలవంతపు సన్నివేశాలు అడ్డం వచ్చి ఆ మూడ్‌ను చెడగొడతాయి.
చెప్పాలనుకున్న పాయింట్‌ను బలంగా చెప్పకపోవడంతో ప్రేక్షకులు ఎదురుచూసిన ఆసక్తి మిస్ అవ్వడం, సినిమాను చాలా గ్రాండియర్‌గా, లావిష్‌గా తీసిన కొన్ని రొటీన్ సన్నివేశాలు బోర్ కొట్టిస్తాయి. అయితే నితిన్ నటన, హీరోయిన్ గ్లామర్, హను రాఘవపూడి మేకింగ్ బాగున్నా కూడా సినిమాలో అసలు విషయాన్ని సరిగ్గా చెప్పకపోవడం పెద్ద మైనస్. కథనం మధ్యలో అనవసరమైన సన్నివేశాలు వస్తుండటం సినిమా బాగుంది అనే మూడ్‌ను చెడగొట్టి నిరుత్సాహాన్ని కలిగించింది. మొత్తంమీద మంచి నిర్మాణ విలువలు కలిగి ఉండటం, నితిన్, అర్జున్‌ల పవర్‌ఫుల్ పెర్‌ఫార్మెన్స్ బాగున్నాయి.

-త్రివేది