అదిలాబాద్

సర్వమత శాంతితోనే సమగ్ర అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్: అన్ని మతాలు శాంతిని ప్రబోదిస్తాయని, జాతి సమగ్రత, అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు మతసామరస్యాన్ని పాటిస్తూ పండగలను ప్రశాంతంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ ఎం.శ్రీనివాస్ కోరారు. సోమవారం స్థానిక పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లోని పోలీసు సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జిల్లా శాంతి కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించి, పలు సూచనలు, సలహాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లా అన్నిరంగాల్లో అభివృద్ధి బాటలో పయనిస్తుందని, ఈ అభివృద్దిని మరింత మెరుపర్చుకోవాలంటే అన్ని మతాల పండగలను శాంతియుతంగా నిర్వహించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఉందని, పండుగలకు ఆటంకపర్చేవారిపై నిఘా ఉంటుందన్నారు. ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడినా కేసులు నమోదు చేస్తామని తెలిపారు. చట్టాలను అతిక్రమించవద్దని, ఏ చిన్న సంఘటన జరిగిన పోలీసులను ఆశ్రయించాలని, ఇరు వర్గాల ప్రజలు మద్యలో రావద్దని సూచించారు. పశువుల అక్రమ రవాణాను అడ్డుకుంటామని, ఆవులను వధించడం తీవ్రమైన నేరమని తెలిపారు. పశువుల రవాణాలో నిబంధనలు పాటించాలని సూచించారు. ప్రతి గణేష్ మండలి వద్ద భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసి, పకడ్బందీగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసు పికెట్స్ నిర్వహించి, రాత్రి పగలు పెట్రోలింగ్ నిర్వహిస్తామన్నారు. పట్టణ ప్రజలు పోలీసు వ్యవస్థకు సహకరించాలని, పోలీసు సూచనలు ప్రతి ఒక్కరు పాటించాలన్నారు. కార్యక్రమంలో డిఎస్పీలు ఏ.లక్ష్మీనారాయణ, వి.చంద్రప్రభు, కె.నర్సింహారెడ్డి, కె.సీతారాములు, పట్టణ సిఐలు వి.సురేష్, కె.పురుషోత్తం, వివిధ మత పెద్దలు, ప్రతినిధులు జగదీష్ అగర్వాల్, జంగిలి ఆశన్న, యూనుస్ అక్బాని, ఫారుఖ్ ఆహ్మద్, శ్రీరాం, శర్మ, దత్తు, నగేష్ తదితరులు పాల్గొన్నారు.

స్వాతంత్య్ర వేడుకులకు పూరె్తైన ఏర్పాట్లు
* వర్ష సూచనతో మార్కెట్ యార్డుకు వేదిక మార్పు
ఆసిఫాబాద్: కుమరంభీం జిల్లాకేంద్రంలో 70 స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లా ఆవిర్భావం తరువాత తొలిసారిగా నిర్వహిస్తున్న స్వాతంత్య్ర ఉత్సవాలను కనీవినీ రీతిలో జరుపుకునేందుకు కలెక్టర్, ఎస్పీ పర్యవేక్షణలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే వర్షసూచన కారణంగా పరేడ్ మైదానంలో నిర్వహించాల్సిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణ వేదికను మార్కెట్ యార్డుకు మార్చారు. జిల్లాలో నిర్వహించే ఉత్సవాల్లో శాసన మండి చైర్మన్ స్వామిగౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ఉదయం 9గంటలకు పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అలాగే పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం, ఉత్తమ సేవలందించిన అధికారులకు సేవాపురస్కారాలను ఆయన అందచేయనున్నారు. మరోవైపుప్రధాన శాఖల అధ్వర్యంలోచేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన శకటాలను ఈవేడుకల్లో ప్రదర్శిస్తారు. దీంతోపాటు జిల్లా కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల్లో కలెక్టర్ చంపాలాల్, ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ జాతీయ పతాకాలను ఆవిష్కరిస్తారు. వీరితోపాటు అన్ని జిల్లా, డివిజన్, మండల కార్యాలయాల్లో పంద్రాగస్టు వేడుకల కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. పలు కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలను చక్కగా ముస్తాబు చేశారు. మరోవైపు కలెక్టర్ చంపాలాల్, ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ మార్కెట్ యార్డులో సాగుతున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సంభందించిన ఏర్పాట్లను పరిశీలించారు. కింది స్థాయి అధికారులకు తగు సూచనలు, సలహాలు అందించారు.
తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్‌యే
* మరిచిపోతున్న తెరాస నేతలు
లక్సెట్టిపేట: రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని తెరాస నాయకులు మరిచి పోతున్నారని మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్ రావు అన్నారు. సోమవారం ఇటిక్యాల గ్రామంలో గడపగడపకు కాంగ్రెస్‌కార్యక్రమంలో పాల్గొన్ని ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చెపుతున్న మాటలకు ప్రజలు విసుగు చెంది కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. గత మూడు సంవత్సరాల కాలంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం వారికి ఏమి చేసిందే చూపించాలని ప్రశ్నించారు. రైతులు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన అనంతరం పడే కష్టాలను గుర్తు చేశారు. రైతులు రుణమాఫీ ఎంతచేశారో తెలుసుకోవాలన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల విషయం పక్కకు పెట్టారన్నారు. మాటలుచెప్పడం కాదు, చేతలలో పని చూపించినప్పుడు పార్టీకి ప్రజాదరణ పెరుగుతుందన్నారు. కాంగ్రెస్ హాయంలో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు దాదాపుగా ఇచ్చామన్నారు. అనంతరం పార్టీలో చేరుతున్న 50మందికి పార్టీ ఖండువాకప్పి ఆహ్వానించారు. అనంతరం గ్రామంలో వర్షంలో సైతం కాలినడకన ప్రచారంతో తిరిగారు. ఇటీవల మరణించిన శంకరయ్య కుటుంబ సభ్యులనుపరామర్శించి కుటుంబీకులకు 5వేల ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు వెంకటేశ్వర్లు, వెంకటస్వామి గౌడ్, శ్రీనివాస్, పెండం రాజు, శ్రీనివాస్, మండే రవి, తిరుపతి, మెట్‌పల్లివెంకటేష్, నిమ్మ రవి, రంజీత్, రమేష్, లక్ష్మణ్‌లు పాల్గొన్నారు.

దళితులను ఉచకోత కోస్తున్న మోదీ ప్రభుత్వం
* మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్
బెల్లంపల్లి: 70ఏళ్ల స్వాతంత్య్ర ఉద్యమంలో కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం దళితులను ఉచ కోత కోస్తుందని మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ తెలిపారు. సోమవారం పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మూడు సంవత్సరాలుగా దేశాన్ని పరిపాలిస్తున్న ప్రధాని మోదీ మత రాజకీయాలను పెంచిపోషిస్తున్నారని విమర్శించారు. దళితులపై దాడులు జరుగుతున్న పట్టించుకోవడం లేదని ఆరోపించారు. హిందూ రాజ్యం ఏర్పడి రాజ్య పరిపాలన కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. యూనివర్సిటిలు మతోన్మాద కేంద్రాలుగా నెలకొల్పే కుట్రలు జరుగుతున్నాయని తెలిపారు. విద్యాబోధనలో కాశాయి కరణ ప్రవేశింప బడుతుందని పేర్కొన్నారు. ఎన్నికల సందర్బంగాకేంద్రంలోని ప్రధాని మోదీ, రాష్ట్రంలోనిముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాలను నేటికి నేరవేర్చలేదన్నారు. స్విస్ బ్యాంకులోని నల్లధనాన్ని బయటకు తీసుకొస్తానని చెప్పిన మోదీ ఏ ఒక్క రూపాయిని కూడా బయటకు తీసుకురాలేకపోయ్యారని తెలిపారు. అంతేకాకుండా కార్మికుల హక్కులను కాలరాస్తు కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకొస్తు ప్రతి ఒక్కరిని మోసం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలత్యాగాలతో ఏర్పడిన తెలంగాణ మన వనరులు, నిధులు, నియమకాలు మనకే అన్న ముఖ్య మంత్రి కెసిఆర్ నేడు ఏ ఒక్కరికి న్యాయం చేయలేదని తెలిపారు. రాష్ట్రంలోని టిఆర్‌ఎస్ ప్రభుత్వం అభివృద్దికి ఆమాడదూరంలో ఉందన్నారు. మూసివేసిన పరిశ్రమలు తెరిపించిన పాపానపోలేదన్నారు. ప్రజలను దగాచేసేందుకే కెసిఆర్ ప్రభుత్వం కుట్రపన్నుతుందన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్ట్‌లపేరుతో కోట్లాదిరూపాయాలను దుర్వినియోగం చేస్తున్నారని ఎన్నికలలో ఓట్ల కోసమే రాజకీయ నాటకం ఆడుతున్నారని దుయ్య బట్టారు. ప్రజా స్వామ్యం మీద నమ్మకంలేని పరిపాలన కొనసాగుతుందన్నారు. హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు ధర్నా చౌక్‌ను ఎత్తివేసి ఒంటెద్దుపోకడలను, తన పరిపాలనను కొనసాగిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమానికి అండగా ఉన్న సిపిఐ పార్టీని తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరాం స్ఫూర్తి యాత్ర నిర్వహిస్తే కామారెడ్డి దగ్గర అరెస్టు చేసి విద్యార్థుల మీద పోలీసులతో లాఠీచార్జీలు చేయించి పాశవీక చర్యలు చేపట్టారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు మార్చుకోకుంటే సిపిఐ పెద్దఎత్తున్న ఉద్యమం చేపడుతుందని తెలిపారు. 21వ తేదీన ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద వామ పక్ష పార్టీల ఆధ్వర్యంలో జరిగే సామూహిక ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలోపట్టణ కార్యదర్శి మంతెన మల్లేష్, సహాయ కార్యదర్శి తాళ్లపల్లి మల్లయ్య, నాయకులు కత్తెరశాల పోశం, తోకల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సూపర్ మార్కెట్‌ను ప్రారంభించిన మంత్రి అల్లోల
నిర్మల్: రాష్ట్ర గృహనిర్మాణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సోమవారం పట్టణంలోని బస్టాండ్ సమీపంలో నూతనంగా ఏర్పాటుచేసిన మారుతి సూపర్ మార్కెట్‌ను రిబ్బన్‌కట్‌చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సూపర్‌మార్కెట్‌లో కలియతిరిగిన మంత్రి బిస్కెట్లు, ఇతర తినుబండరాలను కొనుగోలుచేశారు. అనంతరం నిర్వాహకులు ఆమెడ దేవేందర్, కిరణ్‌రావులు మంత్రి దంపతులను సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిర్మల్ పట్టణం రోజురోజుకు విస్తరిస్తోందన్నారు. జిల్లాకేంద్రంగా మారిన తర్వాత పట్టణ రూపురేఖలే మారిపోయాయన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఇలాంటి దుకాణాలు అందుబాటులోకి రావడం హర్షనీయమన్నారు. మంత్రి వెంట మున్సిపల్ ఛైర్మెన్ అప్పాల గణేష్ చక్రవర్తి, నాయకులు రాంకిషన్‌రెడ్డి, భాస్కర్‌రావు, పాకాల రాంచందర్, దేవరకోట ఆలయ కమిటి ఛైర్మెన్ ఆమెడ కిషన్, బాసర ఆలయ కమిటి డైరెక్టర్ లింగంపల్లి లక్ష్మినారాయణ, వ్యాపారులు ఆమెడ మారుతి, వడూరి విశ్వనాథం, ఆమెడ శ్రీనివాస్, శ్రీ్ధర్, రేణుకాదాస్, నాగనాథ్, గందె సుధీర్, నాగరాజు, భిక్షపతి, కొమ్మ గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత
ఆదిలాబాద్ టౌన్: ఆదిలాబాద్ పట్టణంలోని 23వ వార్డులో నివాసం ఉంటున్న టీఆర్‌ఎస్ కార్యకర్త గైక్వాడ్ నందు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా ఆయన కుటుంబ సభ్యులకు సోమవారం టీఆర్‌ఎస్ పార్టీ తరుపున మంజూరైన రూ.2లక్షల చెక్కును మంత్రి జోగురామన్న అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి జోగురామన్న మాట్లాడుతూ గైక్వాడ్ నందు టీఆర్‌ఎస్ పార్టీలో చురుకుగా పాల్గొనేవాడని, ఆయన మృతి పార్టీకి తీరని లోటని అన్నారు. ఆపద సమయంలో కార్యకర్తలకు తెరాస పార్టీ ఎళ్ళప్పుడు అండగా ఉంటుందన్నారు. మృతుని కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి రామన్న వారికి భరోసా కల్పించారు. పార్టీ తరుపున అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మంత్రి వెంట మున్సిపల్ చైర్‌పర్సన్ రంగినేని మనీషా, మార్కెట్ కమిటీ చైర్మెన్ ఆరె రాజన్న, డెయిరీ కార్పోరేషన్ చైర్మెన్ లోక భూమారెడ్డి, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు సాజిదొద్దిన్, కౌన్సిలర్లు బండారి సతీష్ తదితరులు పాల్గొన్నారు.

బోథ్‌లో భారీ వర్షం.. ఆనందంలో రైతన్న
బోథ్: మండలంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత పక్షం రోజులుగా మండలంలో వర్షాలు కురియకపోవడంతో ఎండ తీవ్రతకు చేతికి వచ్చిన పంట దిగుబడి తగ్గుతుందని రైతులు అందోళన వ్యక్తం చేశారు. రైతులు సాగు చేస్తున్న పత్తి, సోయాపంటలు మంచి కాత దశలో ఉన్నాయి. ఈ దశలో వర్షాలు ముఖం చాటేయడంతో రైతులు అందోళనకు గురయ్యారు. వరుణుడు కరుణించి ఆది, సోమవారాల్లో భారీ వర్షాలు కురియడంతో రైతుల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మండల వ్యాప్తంగా 4,500 ఎకరాల్లో వేసిన సోయాబిన్, పత్తి పంటలు ఏపుగా పెరిగే అవకాశాలు ఏర్పడ్డాయి.
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుందాం
ఆసిఫాబాద్: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ చంపాలాల్ పిలుపునిచ్చారు. సోమవారం సమావేశ మందిరంలో ఆయా శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లా ఆవిర్భావం తరువాత తొలిసారిగా నిర్వహిస్తున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందన్నారు. ఆయా శాఖల అధికారులు తమకు కేటాయించిన శకటాలను ప్రదర్శించాలని కలెక్టర్ ఆదేశించారు. ఉదయం 8.15 గంటలకు జిల్లాకలెక్టర్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తామని, ఆ తరువాత వ్యవసాయ మార్కెట్‌లో 9 గంటలకు శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ జెండా ఆవిష్కరిస్తారని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమ అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ ఉంటుందని, సాయంత్రం 5 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎట్ హోం ఉంటుందన్నారు. దీనికి జిల్లాలోని ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది తప్పని సరిగా హాజరు కావాలని కలెక్టర్ కోరారు. ఈసమావేశంలో జెసి అశోక్ కుమార్, డిఆర్‌ఓ సురేష్, డిఆర్‌డివో శంకర్ పాల్గొన్నారు.

అభివృద్ధిని చూసే టిఆర్‌ఎస్ పార్టీలో చేరిక
* మంత్రి జోగు రామన్న
ఆదిలాబాద్ టౌన్: ముఖ్యమంత్రి కెసిఆర్ చేపడుతున్న అభివృద్ది పనులకు ఆకర్షితులై ఇతర పార్టీల నుండి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్దఎత్తున టిఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారని మంత్రి జోగు రామన్న అన్నారు. సోమవారం ఆదిలాబాద్ పట్టణంలోని తిర్పెల్లి కాలనీకి చెందిన బిజెపి నాయకులు చిల్క రామకృష్ణ, ప్రదీప్‌కుమార్‌లతో పాటు మరో 50 మంది యువకులు, మహిళలు మంత్రి రామన్న సమక్షంలో టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ అన్ని వర్గాల అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి కెసిఆర్ సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రవేశపెడుతున్నారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. ఆదిలాబాద్ పట్టణాన్ని అన్నిరంగాల్లో అభివృద్దిపర్చేందుకు కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ రంగినేని మనీషా, డెయిరీ కార్పోరేషన్ చైర్మన్ లోక భూమారెడ్డి, ఐసిడిఎస్ ఆర్గనైజర్ కస్తాల ప్రేమల, టీఆర్‌ఎస్ నాయకులు ప్రేమేందర్, యూనిస్ అక్బాని, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

అవినీతి ఉచ్చులో బెల్లంపల్లి ఎసిపి
* డిజిపి కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఉత్తర్వులు
బెల్లంపల్లి: బెల్లంపల్లి ఎసిపి శోధగిరి సతీష్‌పై పోలీస్ శాఖలో తీవ్రమైన ఆరోపణలు వ్యక్తం అవుతున్న క్రమంలో ఉన్నతాధికారులు ఎట్టకేలకు ఆయనపై వేటు వేస్తూ ఆదేశాలు జారీ చేయడం పోలీస్ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. బెల్లంపల్లి ఎసిపిగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి వివాదస్పద అధికారిగా పలువురి నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఎన్నడూలేని విధంగా బెల్లంపల్లి పోలీస్ డివిజన్ పరిధిలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసులను నమోదు చేసిన పోలీస్ అధికారిగా పేరు తెచ్చుకోవడం పోలీస్ ఉన్నతాధికారులను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఎస్సీ, ఎస్టీ కేసుల నమోదు వ్యవహారంలో పలువురిని తన అధికారబలంతో ఎదురించి తప్పుడు కేసులు బనాయించడం పట్ల అనేక ఆరోపణలు వెలువెత్తాయి, కిందిస్థాయి సిబ్బందిని తన ఆదీనంలో తీసుకోని సబ్ డివిజన్‌లో పలు అవినీతి కార్యకలాపాలు కొనసాగించారనే ఆరోపణలు ఆయన మీద బలంగా విన్పించాయ. డివిజన్ పరిధిలోతాజాగా పెద్దమొత్తంలో పత్తి విత్తనాలు పట్టుకోని సదరు వ్యాపారి నుంచి లక్షలాది రూపాయలు లంచంగా వసూళ్లు చేశాడన్న ఆరోపణలూ ఉన్నాయి. ఆరోపణలు వాస్తవం అని తేలడంతో ఈ అంశం పోలీసు శాఖలో చర్చనీయాంశం అయింది. దీనిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. గతంలో ఒక జర్నలిస్టు పై కూడా దురుసుగా ప్రవర్తించి వివాదాస్పద పోలీస్ అధికారిగా ముద్రవేసుకున్నారు. మందమర్రి ప్రాంతానికి చెందిన ఓ వివాహిత మహిళ తనకు ఇష్టంలేని పెళ్లి చేశారంటూ న్యాయం కోసం ఎసిపిని ఆశ్రయించగా నిందితులకు మద్దతుగా నిలిచి బాధితురాలికి తీవ్ర అన్యాయం చేశాడని ఈ వ్యవహారం సైతం డబ్బులు దండుకున్నట్లు ఇతని మీద ఆరోపణలున్నాయి. దీనిపై బాధితురాలు ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. తన వాగ్ములాన్ని ఎసిపి అన్యాయం చేశాడని, తన ఆత్మహత్యయత్నానికి ఎసిపి కారణం అని పేర్కొంది. ఈ ఆరోపణలపై ఉన్నతాధికారులు వేగవంతం మైన విచారణ చేపట్టారు. ఆరోపణలు వాస్తవం అని తేలడంతో డిజిపి అనురాగ్ శర్మ డిజిపి కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర పోలీస్ బాస్ నుంచి ఉత్తర్వులు జారీకావడంతో పోలీస్ వర్గాలలో కలకలం రేపింది.

పంద్రాగస్టు వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు
* పరేడ్ మైదానాన్ని సందర్శించిన కలెక్టర్, ఎస్పీ
ఆంధ్రభూమి బ్యూరో
ఆదిలాబాద్: 71వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా నిర్వహించేందుకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాకేంద్రంలోని పోలీసు పరేడ్ మైదానంలో కన్నుల పండవగా నిర్వహించే పంద్రాగస్టు వేడుకల ఏర్పాట్లను సోమవారం జిల్లా కలెక్టర్ బుద్ద ప్రకాష్ జ్యోతి, ఎస్పీ ఎం.శ్రీనివాస్ పరిశీలించారు. వర్షాకాలం నేపథ్యంలో సందర్శకులకు ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. కాగా పంద్రాగస్టు వేడుకలను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ బుద్ద ప్రకాష్‌కు రెండు ఉత్తమ అవార్డులను ప్రకటించడం ద్వారా అధికార యంత్రాంగం ఈసారి ఘనంగా వేడుకలను నిర్వహించేలా సమాయత్తమైంది. ఇదిలా ఉంటే స్థానిక పోలీసు పరేడ్ మైదానంలో ఏర్పాట్లను ఎస్పీ ఎం.శ్రీనివాస్ స్వయంగా పరిశీలించారు. సిసిఎస్ డిఎస్పీ కె.నర్సింహారెడ్డి అధ్వర్యంలో పోలీసు కవాతు నిర్వహించగా ఎస్పీ పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని హంగులతో సర్వాంగసుందరంగా మైదానాన్ని అలంకరించాలని సూచించారు. వేడుకల ఏర్పాట్లను వైభవంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆర్‌ఐ బి.జెమ్స్‌కు బాధ్యతలు అప్పగించారు. స్వాతంత్య్ర వేడుకలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు నిర్వహించాలని అన్నారు. రాష్ట్ర అటవీ,పర్యావరణ, బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారని అన్నారు. అనంతరం పోలీసు కవాతు, గౌరవ వందనం స్వీకరణ, మంత్రి జోగురామన్న సందేశంతో పాటు శకటాల ప్రదర్శన ఉంటుందని ఎస్పీ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖల్లో ప్రతిభకనబర్చిన అధికారులకు మంత్రి రామన్న ప్రశంసా పత్రాలను అందిస్తారని, అనంతరం చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధులకు సన్మానం, రాష్ట్ర ప్రభుత్వం తరుపున అర్హులైన లబ్దిదారులకు ఆస్తుల పంపిణీ కార్యక్రమం ఉంటుందన్నారు. వివిధ శాఖల స్టాళ్ళు ఏర్పాటు చేసి సందర్శకులకు కనువిందు చేయాలని సిబ్బందికి సూచించారు. వేడుకలను చూసేందుకు వచ్చే జిల్లా ప్రజలకు అన్ని రకాల సదుపాయాలు కల్పించడం జరిగిందని, ట్రాఫిక్ క్రమబద్దీకరణకు పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. ఎటువంటి ఆటంకాలు తలెత్తకుండా పోలీసు బందోబస్తు ఉంటుందని, జిల్లా ప్రజలు, విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, యువకులు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలని ఎస్పీ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిసిఎస్ డిఎస్పీ కె.నర్సింహారెడ్డి, ఆర్‌ఐ బి.జెమ్స్, ఆర్‌ఎస్సైలు బి.పెద్దయ్య, టి.కిష్టన్న, రాజేష్, నారాయణ, తలమడుగు ఎస్సై సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.