కర్నూల్

పవన్ ప్రకటనపై ఉత్కంఠ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు : సినీనటుడు, జనసేనపార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ నంద్యాల ఉపఎన్నికలో తమ పార్టీ మద్దతు ఎవరికన్నది ఈ నెల 19,20 తేదీల్లో ప్రకటించనున్నట్లు సమాచారం. ఉత్తరాంధ్రలోని కిడ్నీ సమస్యాతమ్మక గ్రామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించిన అనంతరం నంద్యాల ఉపఎన్నికపై తన వైఖరిని రెండు రోజుల్లో ప్రకటిస్తానని పవన్ తెలిపారు. ఆయన ప్రకటన చేసి వారమైనా తన నిర్ణయం తెలపకపోవడంతో టిడిపి నేతలు ఎదురుచూస్తున్నారు. అయితే ఆయన వ్యక్తిగత, పార్టీ పనుల కారణంగా తీరికలేకుండా గడుపుతున్నారని దాంతో మరో రెండు, మూడు రోజుల తరువాత నంద్యాల ఉపఎన్నికపై స్పందిస్తారని జనసేనపార్టీ నాయకుల నుంచి టిడిపికి వర్తమానం అందింది. అయితే పవన్‌కళ్యాణ్ 19,20 తేదీల్లో ఒక్క రోజైనా సిఎం చంద్రబాబుతో కలిసి ప్రచారంలో పాల్గొనేలా ఆయనను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.
కాగా పవన్‌కళ్యాణ్ నంద్యాల ఎన్నికపై తటస్థ వైఖరి అవలంబించే అవకాశం ఉందని జనసేన పార్టీ అభిమానులు తెలిపారు. ఆ పార్టీ కోసం పని చేస్తున్న వారికి అందిన సమాచారం మేరకు నంద్యాల ఉపఎన్నికపై పవన్‌కళ్యాణ్ వౌనంగా ఉంటారని ప్రధాన కార్యాలయం నుంచి వర్తమానం అందినట్లు పేర్కొంటున్నారు.
ఓటింగ్‌పై అపోహలు వద్దు..
* కలెక్టర్ సత్యనారాయణ
నంద్యాల: ఓటరు వేసిన ఓటు వివి ప్యానల్‌లో ఓటరుకు మాత్రమే తెలుస్తుందని, ఇతరులకు తెలుస్తుందనే అపోహలు వద్దని కలెక్టర్ సత్యనారాయణ, ఎన్నికల అధికారి ప్రసన్న వెంకటేష్ అన్నారు. సోమవారం ఆర్డీఓ కార్యాలయంలో ఎన్నికల విధులు నిర్వహించే అధికారులతో సమీక్ష సమావేశంలో కలెక్టర్, రిటర్నింగ్ అధికారి మాట్లాడుతూ ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది బాధ్యతతో వ్యవహరించి అతి జాగ్రత్తతో విధులు నిర్వహించాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద బూత్‌స్థాయి అధికారి పేరు, వారి సెల్ నెంబరు కూడా రాయాలన్నారు. రహదారులు, భవనాల శాఖ వారు పోలింగ్ కేంద్రం వద్ద బారీకేడ్ నిర్మించాలని డిస్ట్రిబ్యూషన్ సెంటరువద్ద కూడా బారికేడ్లు ఏర్పాటు చేయాలని, సమస్యాత్మక ప్రాంతాలు ఉంటే అక్కడ కూడా పోలింగ్ బూత్ వద్ద బారికేడ్లను గట్టిగా ఏర్పాటు చేయాలన్నారు. సర్వశిక్ష అభియాన్ వారు వెబ్‌సైట్ కెమెరాలు, విద్యుత్ సరఫరా పాయింట్లను పరిశీలించి ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. పంచాయతీ రాజ్ శాఖ వారు ర్యాంపులు ఏర్పాటు చేయాలని, ఆర్‌డబ్ల్యుఎస్ వారు తాగునీటి సౌకర్యాలు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలన్నారు. పట్టణ ప్రాంతంలో మున్సిపల్ శాఖ వారు ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. డిఆర్‌డిఎ పిడి సిబ్బందికి భోజన వసతుల ఏర్పాట్లను పరిశీలించాలని, పోలింగ్ రోజు ఓటు వేయడానికి వచ్చే వృద్ధులకు, దివ్యాంగులకు ఎన్‌సిసి, ఎన్‌ఎస్‌ఎస్ వారిని అవసరాన్ని బట్టి వినియోగించుకోవాలన్నారు. మోడల్ కోడింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఓటరు ఓటు వేసిన అనంతరం వారి ఓటును ఏ పార్టీకి వేసింది వివి ప్యానల్ మిషన్ ద్వారా తెలుసుకుంటారని, అపోహలు ఉన్నాయని, అలా అపోహలు పడకుండ ఉండేలా ఓటర్లను చైతన్యపరచాలన్నారు. అభ్యర్థులు అనుమతి లేని వాహనాలు వాడితే వాటిపై దృష్టి సారించి సీజ్ చేయాలని ఆర్టీఓ అధికారులను ఆదేశించారు. ఎవరికి కేటాయించిన విధులు వారు తూచా తప్పకుండ బాధ్యతగా నిర్వహించి ఎన్నికలను విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు పాల్గొన్నారు.
న్యాయాన్ని గెలిపించండి
* ప్రజల గుండెల్లో వైఎస్ చెదరని ముద్ర..
* ప్రచారంలో వైకాపా అధినేత జగన్
నంద్యాలటౌన్:దివంగత వైయస్ రాజశేఖర్‌రెడ్డి పేదలకు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లోనే నిలిచివున్నాయని, పేదవాడి గుండెల్లో ఇప్పటికీ చెదరని ముద్రగా నిలిచిపోయి ఉన్నాయని వైఎస్‌ఆర్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహిస్తూ పద్మావతినగర్ గేట్ వద్ద నుంచి టెక్కె మీదుగా ఎస్‌బిఐ ఎటిఎం, గిరినాథ్ సెంటర్లలో ప్రజలను ఉద్దేశించి జగన్ ప్రసంగించారు. ఉప ఎన్నికలు వచ్చాయని చంద్రబాబు అభివృద్ధి అంటూ హడావుడిగా రోడ్లను విస్తరించారు. వ్యాపారులతో చర్చించకుండా వారికి నష్టపరిహారం అందించకుండా చంద్రబాబు మోసం చేశాడన్నారు. మూడున్నరేళ్ళల్లో ఏ ఒక్క వాగ్ధానం కూడా అమలు చేయలేదు. రాష్ట్ర కేబినెట్ అంతా నంద్యాల లాడ్జిలలో తిష్టవేసిందన్నారు. ఇప్పుడు వీరికి నంద్యాల గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. వైకాపా పోటీ పెట్టకపోయి ఉంటే బాబు నంద్యాలకు వచ్చేవారా అన్నారు. ప్రతి సామాజిక వర్గా న్ని బుజ్జగించే పనితో చంద్రబాబు ఉన్నారు. మాట వినకపోతే భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత రేషన్ దుకాణాల్లో ఎన్ని సరుకులు ఇస్తున్నారు.. కేవలం బియ్యం మాత్రమే అందిస్తున్నారు. వైఎస్సార్ హయాంలో 9 రకాల సరుకులు ఇచ్చేవారన్నారు. పేదలకు రేషన్ దుకాణాల్లో చక్కెర, కందిపప్పు , గోధుమ పిండి ఇచ్చేవారు. ఇప్పుడు పరిస్థితి ఏమిటని మీరే ఆలోచించుకోవాలన్నారు. ఏ ఒక్క పేదవాడికైనా ఇళ్లు కట్టించి ఇచ్చారా అన్నారు. తన అహంకారంతో ప్రజలను దారుణంగా ప్రలోభాలకు గురిచేస్తూ మోసాలు చేస్తున్నాడన్నారు. రైతులు, పేదల ముఖాల్లో చిరునవ్వు చూడడమే నిజమైన అభివృద్ధి అన్నారు. చంద్రబాబు మోసాలకు వ్యతిరేకంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఇవాల మనం వేసే ఓటు జరుగబోయే మార్పుకు నాంది కావాలన్నారు. నాయకుడు చెప్పింది చేయకపోతే కాలర్ పట్టుకుని అడిగే స్థాయికి రావాలన్నారు. మా నాన్న నాకు ఇచ్చిన ఆస్తి ఏంటో తెలుసా ఇంత పెద్ద కుటుంబం నా ఆస్తి అన్నారు. విలువలతో కూడిన రాజకీయాలే నా ఆస్తి...నంద్యాల ప్రజలకు అన్ని రకాలుగా అండగా ఉంటానన్నారు. జగన్ మోసం చేయడు...అబద్దాలు చెప్పడు. జగన్‌కు అవకాశం వస్తే గొప్ప పాలన చేస్తాడు.. అది మీరే అందించాలి. ఈరోజు న్యాయానికి, అన్యాయానికి జరిగే యుద్ధం అన్నారు.సి ఎంకు మంచిచేసే గుణంలే దు. తాను ఎంత ఆలస్యమైనా చక్కని చిరునవ్వుతో మీరు చూపిస్తున్న ఆదరణ మరువలేనిదన్నారు. అహంకారంతో చంద్రబాబు కళ్లు తలకెక్కాయి. మంచి నాయకుడిని ఎన్నుకోండి. వైకాపా గుర్తు ఫ్యాన్‌కు...అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని జగన్ పిలుపునిచ్చారు. రోడ్ షోలో భాగంగా స్టేట్‌బ్యాంకు కాలనీ, చంద్రశేఖర్ థియేటర్, పాలిటెక్నిక్ కళాశాలకు వెళ్లే దారి, సుద్దుల పేట తదితర ప్రాంతాల్లో రోడ్ షో నిర్వహిస్తూ ప్రజలకు అభివాదం చేస్తూ ప్రజలతో మమేకమై పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ త న రోడ్ షోను కొనసాగించారు.
రాజకీయ, కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు
* మంత్రి కొల్లు రవీంద్ర
నంద్యాల: రాజకీయాలకు, కులమతాలకు అతీతంగా బడుగు, బలహీన వర్గాలను బాగు చేసేందుకు తెలుగుదేశం పార్టీ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని, నంద్యాలను రూ. 1400 కోట్ల ఖర్చుతో చేస్తున్న అభివృద్ధి పనులను అర్థం చేసుకొని టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి కొల్లు రవీంద్ర కోరారు. సోమవారం నంద్యాల టిడిపి కార్యాలయంలో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ నంద్యాల ఉప ఎన్నిక దగ్గర పడుతోందని, నియోజకవర్గ ప్రజలు టిడిపిని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు ముఖ్యమంత్రి న్యాయం చేసేందుకు రూ. 10 వేల కోట్లు బడుగు, బలహీన వర్గాలకు కేటాయిం చారన్నారు. బలహీన వర్గాలకు సంబం ధించిన అనేక ఫెడరేషన్‌లు ఏర్పాటు చేసి, వాటిని నిధులు కేటాయించి ఆదుకుంటున్నారన్నారు. రైతులకు, ఆడపడచులకు ఇచ్చిన మాట ప్రకారంగా రుణాలు మాఫీ చేసిన ఘనత చంద్రబాబుదేనన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం దేశీయ, విదేశీయ కంపెనీలను రాష్ట్రానికి తీసుకువస్తూ యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందిస్తున్నారన్నారు. ప్రతిపక్ష నేత హుందాతనాన్ని కోల్పోయి ప్రాంతాలు, కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతూ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారన్నారు. సిఎం చేస్తున్న అభివృద్ధి కళ్లకు కనపడుతున్నా చూడలేక జగన్ స్వార్థ రాజకీయాలకు దిగుతున్నారని, ముఖ్యమంత్రిని అనరాని మాటలు అంటూ రాక్షసపాత్ర పోషిస్తున్నారని దుయ్యబట్టారు. నంద్యాలలో మంత్రులు, ఎమ్మెల్యేలు, సామాన్య కార్యకర్తలుగా పనిచేస్తున్నారని, అభివృద్ధి మంత్రాన్ని ప్రజల చెంతకు చేరవేస్తున్నారని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అందరికి వివరిస్తూ ఓట్లను అడుక్కుంటున్నామన్నారు. యువతకు నిరుద్యోగ బృతి ఇచ్చేందుకు బడ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయించారని, అవసరమైతే మరిన్ని నిధులు కేటాయించి త్వరలోనే నిరుద్యోగులకు బృతి ఇచ్చే కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం జరిగిందన్నారు.
కులాల మధ్య జగన్ చిచ్చు..
* పదవుల కోసమే శిల్పా పార్టీ మార్పు..
* టిడిపి జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి
కర్నూలుసిటీ:వైశ్య, రెడ్డి కులాల్లో ఎంతో మంది పేదలు ఉన్నారని వారి కోసం ప్రత్యేకంగా కార్పొరేష న్లు ఏర్పాటు చేస్తామని చెబుతూ వైకాపా అధినేత జగన్ కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని టిడిపి జిల్లా అధ్యక్షుడు, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు విమర్శించారు. నగరంలోని టిడిపి కార్యాలయంలో సోమవారం పార్టీ జిల్లా ప్రధా న కార్యదర్శి వై.నాగేశ్వరరావుయాదవ్ అధ్యక్షతన సోమిశెట్టి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. సిఎం చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యంతో కులాలా వారీగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, చైర్మన్లను నియమించి వాటికి నిధులు కేటాయించారని, ఇక జగన్ కొత్తగా చేసేదేమీ లేదన్నారు. సిఎం ఏనాడో వైశ్య ఫెడరేషన్ ఏర్పాటు చేశారని, అయితే ఈ విషయం జగన్‌కు తెలియకపోవడం విచారకమన్నారు. జగన్ నంద్యాల ఉపఎన్నికలో ప్రచారం చేయటానికి రాలేదని కేవలం ముఖ్యమంత్రిని తిట్టడానికి వచ్చినట్లు ఉందన్నారు. అందులో భాగంగానే సిఎంను ఉరి తీయాలని, నడి బజారులో కాల్చి చంపాలని ప్రజలకు సూచిస్తున్నారన్నారు. వైకాపా ఓడిపోతుందనే భయంతో మతిస్థిమితం కోల్పోయి జగన్ ఈ విధంగా పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తున్నాడని వెల్లడించారు. కేశవరెడ్డి చేసిన అప్పులను మంత్రి ఆదినారాయణరెడ్డి చెల్లించాలని చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు. నంద్యాల ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని, అడ్డుపడేవాళ్లకు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. శిల్పా సోదరులు పదవుల కోసం రోజుకు ఒక పార్టీని మార్చే వాళ్లని అటువంటి వారిని ప్రజ లు నమ్మే స్థితిలో లేరని స్పష్టం చేశా రు. శిల్పామోహన్‌రెడ్డి మంత్రిగా పని చేసినా నంద్యాలను అభివృద్ధి చేయలేదని, కేవలం స్వలాభం కోసం పార్టీలను మారుస్తూ అడ్డువచ్చిన వారిపై కేసులు పెట్టి, భయబ్రాంతులకు గురి చేయటం వారి నైజం అన్నారు. అలాగే శిల్పా చక్రపాణిరెడ్డికి నారా లోకేష్ రాజకీయ భవిష్యత్‌ను కల్పిస్తే ఆయన పైనే విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. నంద్యాల ప్రజలు అభివృద్ధికి సహకరిస్తున్నారని ఖచ్చితంగా టిడిపికి ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో కెఇ ప్రతాప్, కెడిసిసి బ్యాంక్ చైర్మన్ మల్లికార్జునరెడ్డి, పర్వేజ్, బాబురాజ్, హనుమంతరాయచౌదరి, రవికుమార్, పార్వతి పాల్గొన్నారు.
నంద్యాల నియోజకవర్గంలో 23న విద్యాసంస్థలకు సెలవు:కలెక్టర్
కర్నూలు:నంద్యాల ఉపఎన్నిక సందర్భంగా ఈ నెల 23వ తేదీ నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలోని విద్యాసంస్థలకు ఎన్నికల సంఘం సెలవు ప్రకటించిందని కలెక్టర్ సత్యనారాయణ సోమవారం ఒక ప్రకటలో తెలిపారు. పోలింగ్ రోజున ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా మేగోషియబుల్ చట్టం-1881 ప్రకారం ఈ నెల 23వ తేదీ సెలవు దినంగా ప్రకటిస్తున్నామని కలెక్టర్ తెలిపారు.
పంద్రాగస్టు వేడుకలకు సర్వం సిద్ధం
* విసృత్తంగా పోలీసుల తనిఖీలు
కర్నూలు:స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎస్పీ గోపీనాథ్‌జెట్టీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా సోమవారం జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, షాపింగ్‌మాల్, తదితర ప్రాంతాల్లో బిటిఎం, డాగ్ స్క్వాడ్ బృందాలతో విసృత తనిఖీలు చేపట్టారు. ఇక మంగళవారం జరిగే పంద్రాగస్టు వేడుకలకు జిల్లా పోలీసు మైదానంలో సర్వం సిద్ధం చేశారు. కర్నూలు డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో నగరంలో ప్రశాతం వాతావరణం నెలకొనేలా జిల్లా పోలీసు యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. రద్దీ ప్రదేశాల్లో పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏదైనా సంచారం తెలిస్తే డయల్ 100కు ఫోన్ ద్వారా సమాచారం అందించాలని ఎస్పీ ప్రజలను కోరారు. నగరంలో నిర్వహించిన తనిఖీల్లో ఆర్‌ఎస్‌ఐ రామాంజనేయులు, హెడ్‌కానిస్టేబుల్ నబిరసూల్, కానిస్టేబుళ్లు గౌడ్, డాగ్ గ్యాండ్లర్ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
బాల బాలికలు ధైర్య సాహసాలు కలిగి ఉండాలి
* విహెచ్‌పి జిల్లా అధ్యక్షుడు కిష్టన్న
కర్నూలు ఓల్డ్‌సిటీ:శ్రీకృష్ణుడు బాల్యం నుంచే ఎంతో ధైర్య సాహసాలతో తనను చంపటానికి వచ్చిన రాక్షసులను సైతం సంహరించాడని, అలాగే బాలబాలికలు కూడా ధైర్య సాహసాలు కలిగి ఉండాలని విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు కె.కిష్టన్న సూచించారు. స్థానిక శరీన్ నగర్‌లోని సద్గురు త్యాగరాజ రామాలయంలో సోమవారం విహెచ్‌పి విజ్ఞాన వికాస్ బాల సంస్కార కేంద్రం ఆధ్వర్యంలో విహెచ్‌పి ఆవిర్భావ వికాస్, శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కిష్ట న్న మాట్లాడుతూ సరైన మార్గదర్శకం లేక హిందూ సమాజం కులాల ప్రాతిపదికన విడిపోయి కలహించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరుణంలో హిందూ సమాజాన్ని సం ఘటితం చేయడం, హిందూ జాతి సం స్కృతీ, సంప్రదాయాల రక్షణ, అన్ని కులాలను కలిపి సమసమాజ నిర్మా ణం కోసం 1964లో ముంబయిలోని సాందీపని ఆశ్రమంలో శ్రీకృష్ణాష్టమి రోజున అప్పటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పెద్దలైన గురూజీ స్వామిచిన్మయానంద విహెచ్‌పిని ప్రారంభించారన్నారు. అప్పటి నుంచి విహెచ్‌పి అంతర్జాతీయ శాఖలుగా ఏర్పడిందని, సుమారు 137 దేశాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. శ్రీకృష్ణుడు ఎం తో ధైర్యంతో శకటాసుర, ధనుకాసుర, కంసుని వంటి లోక కంఠక రాక్షసుల ను సంహరించాడని తెలిపారు. అనంతరం చిన్నారులు గోపిక, శ్రీకృష్ణుడి వేషధారణ చేసిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. అలాగే చిన్నారుల ఉట్టి కొట్టే కార్యక్రమం అలరించింది. కార్యక్రమంలో విహెచ్‌పి రాష్ట్ర సహ కోశాధికారి సందడి మహేశ్వర్, నగర కార్యదర్శి భానుప్రకాశ్, నగర కోశాధికారి జంపాల రాజశేఖర్, నగర సత్సంగ్ ప్రముఖ్ తిరుపాలు, బజరంగ్‌దళ్ నగర ప్రముఖ్ రమేష్, సాయిరాం, ఆలయ కమిటీ సభ్యులు నాగరాజు, రంగనాథ్, చిన్నారులు పాల్గొన్నారు.
కదిలిన నకిలీ సర్ట్ఫికెట్ల డొంక..
* ఉద్యోగాలు పొందిన వారి గుండెల్లో గుబులు..
ఆదోని: నకిలీ సర్ట్ఫికెట్ల ముఠా ఆటను పోలీసులు కట్టించారు. నిందితులను అరెస్టు చేయడంతో నకిలీ సర్ట్ఫికెట్ల డొంక కదిలింది. ఇప్పటివరకు నకిలీ సర్ట్ఫికెట్లను తయారు చేసి అమ్ముకున్న వారిని, ఏజెంట్లును అరెస్టు చేశారు. నకిలీ సర్ట్ఫికెట్లతో ఉద్యోగం పొందిన వారిపై దర్యాప్తును పోలీసులు ప్రారంభించడంతో ఉద్యోగాలు పొందిన వారి గుండెల్లో గుబుల్ పుట్టుకుంది. ఆదోనిలో మూడు సంవత్సరాల క్రితం మహేష్ అనే వ్యక్తి ఎమ్మిగనూరు కేంద్రంగా చేసుకొని నకిలీ ఉద్యోగాల ఉత్తర్వులు ఇచ్చి నిరుద్యోగులను మోసం చేశాడు. ఈ గుట్టును పోలీసులు రట్టు చేసి మహేష్‌తో సహా చాలా మందిని అరెస్టు చేశారు. అయి తే ఆదోని సబ్‌జైల్ నుంచి నకిలీ బెయి ల్ పేపర్లు సృష్టించి నకిలీ పోలీసును సబ్‌జైల్‌కు పంపి నకిలీ బెయిల్‌తో సబ్‌జైల్ అధికారులకు బురిడి కొట్టించి మహేష్ సబ్‌జైల్ నుంచి పరారయ్యా డు. ఇంతవరకు పోలీసులు మహేష్‌ను పట్టుకోలేదు. మహేష్ ఘటన మరకవకముందే ఆదోనిలో ఎలాంటి డాక్టర్ పట్టా లేకుండా డాక్టర్ల పేరుతో ఏకంగా ఆసుపత్రిని తెరిచి వైద్యం అందిస్తూ ప్రజలను మోసం చేస్తున్న నకిలీ డాక్టర్‌ను విజిలెన్స్ అధికారులు పట్టుకొని ఆసుపత్రిని సీజ్ చేశారు. ఈ సంఘటన జరిగిన నెలలోపే ఆదోనిలో పర్వతాపురం మున్సిపల్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, అతని అనుచరుడు ఆంజనేయులు కలిసి కర్నూలులోని తేజడిలక్స్ లాడ్జిలో ఒక లాకర్ తీసుకొని అక్కడ మకాం వేసి జిల్లా అంతటా ఏజెంట్లును ఏర్పాటు చేసి ఆదోని, ఆత్మకూరు, కర్నూలు ప్రాంతాల్లో ఏజెంట్ల ద్వారా నకిలీ సర్ట్ఫికెట్లను అమ్మే ముఠా వ్యవహారాన్ని పోలీసులు ఛేదిరించారు. నకిలీ సర్ట్ఫికెట్లు వ్యవహారం పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ప్రధాన ముఠా నాయకులు ఉపాధ్యాయులు శ్రీనివాసులు, ముఖ్య అనుచరుడు ఆంజనేయులతోపాటు 28 మంది కటకటలా పాలయ్యారు. నిరుద్యోగులను వలవేసి పట్టుకొని నకిలీ సర్ట్ఫికెట్లను వారికి అమ్మినట్లు డిఎస్పీ శ్రీనివాసరావు వివరించారు. అలాగే ప్రమోషన్ల కోసం కూడా ఇంటర్, డిగ్రీ, 10వ తరగతి సర్ట్ఫికెట్లను కొనుగోలు చేసుకొని ఉద్యోగాలు ప్రమోషన్లు పొందినట్లు కూడా ఆయన స్పష్టం చేశారు. ఇలా నకిలీ సర్ట్ఫికెట్లతో ఉద్యోగం పొందిన వారి ప్రాథమిక సమాచారం ఉందని డిఎస్పీ చెప్పడంతో నకిలీ సర్ట్ఫికెట్లతో రెవె న్యూ, ఐసిడిఎస్, టీచర్, ఆర్టీసీ, తదితర సంస్థల్లో ఉద్యోగాలు పొందిన, ప్రమోషన్లు పొందిన వారి గుండెల్లో గుబుల్ పుట్టుకుంది. ఇప్పటికే పోలీసులు ప్రమోషన్, ఉద్యోగం పొందిన వారి వివరాలను సేకరించడానికి మూడు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. జిల్లా అంతటా నకిలీ సర్ట్ఫికెట్ల వ్యవహారం పెద్ద ఎత్తున సాగింది. అందువల్ల పోలీసులు ముందుగా సర్ట్ఫికెట్లను ఆయా బోర్డులకు, యూనివర్శిటీలకు పంపించి నకిలీవి అని తేలిన తరువాత ఉద్యోగం పొందిన వారిపై, ప్రమోషన్లు పొందిన వారిపై చర్యలు తీసుకోవడానికి పోలీసులు సన్నద్ధమవుతున్నారు. నకిలీ సర్ట్ఫికెట్ల వ్యవహారం ముఠా ఆగలేదు. దొంగ రైతు పాసుపుస్తకాలు తయారు చేసి వాటితో బ్యాంకుల్లో రుణాలను పొంది ప్రభు త్వం రుణాలను రద్దు చేస్తే ఆ లబ్ధిని కూడా పొందారు. అలాగే ఆదివారం పోలీసులు అరెస్టు చేసిన నకిలీ సర్ట్ఫికెట్లలో రెండవ ముద్దాయి ఆంజనేయు లు, తన తల్లి, తన భార్య, తన సోదరిడిపై నకిలీ ఇంటి పట్టాలను కూడా తయారు చేసుకున్నాడు. ఈ విధంగా నకిలీ పట్టాలను కూడా పెద్ద ఎత్తున ఈ ముఠా అమ్ముకుంది. అందువల్ల ఇప్పు డు పోలీసులు మొత్తం ముఠాను అరెస్టు చేయడంతో నకిలీ సర్ట్ఫికెట్లతో ఉద్యోగం పొందిన వారు, ప్రమోషన్లు పొందిన వారు, ఇతర లబ్ధిలు పొందిన వారు హడలిపోతున్నారు. పోలీసులు నకిలీ సర్ట్ఫికెట్లు వ్యవహారాన్ని చాలా లోతుగా దర్యాప్తు చేస్తున్నామని, సం బంధం ఉన్న ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తేలేదని డిఎస్పీ స్పష్టం చేశారు. ఇప్పటికే నకిలీ సర్ట్ఫికెట్లతో సంబంధం ఉన్న వారు రాష్ట్రాన్ని వదిలి పెట్టినట్లు సమాచారం. పోలీసులు అరెస్టు కటకటాలను లెక్కిస్తున్న నిందితుల్లో విఆర్‌ఎ లు, ప్రభత్వు ఉపాధ్యాయులు, ప్రభు త్వ కార్యాలయల్లో ఔట్‌సోర్సింగ్ కిందపని చేస్తున్న ఉద్యోగులు ఉన్నారు. డిఎస్‌పి నకిలీ సర్ట్ఫికెట్లు పొందిన ఉద్యోగాలు, ప్రమోషన్లు పొందిన వారి ప్రాథమిక సమాచారం తమ వద్ద ఉందన్నారు. అందువల్ల నకిలీ సర్ట్ఫికెట్లు వ్యవహారంలో మరెంత మంది కటకటలాపాలవుతారో వేచి చూడాలి.
పోరాటగడ్డ తెర్నేకల్..
ఆదోని: ఆదోని డివిజన్, దేవనకొండ మండలంలో ఉన్న తెర్నేకల్ గ్రామం ఎంతో చరిత్ర కల్గిన, పోరాటాలు చేసిన మహాయోధులు రక్తంతో తడిసిన నేల. తెర్నేకల్ గ్రామానికి ఎంతో చరిత్ర ఉంది. 1801 సంవత్సరంలో తెల్లదొరలకు పెంచిన భూమి శిస్తు చెల్లించమని చెప్పి తెల్లదొరల సైన్యంతో యుద్ధం చేసి ఎంతో మంది యోధులు నేలకొరిగిన చరిత్ర తెర్నేకల్ యుద్ధంలో చోటు చేసుకుంది. తెర్నేకల్ గ్రామంలో ఉన్న ప్రజలకు వీరులని పేరు కూడా సార్థకమైంది. మొట్టమొదట యాదవులు ఆదోని కోటను కేంద్రంగా చేసుకొని ఈప్రాంతాన్ని పాలించారు. వారు రాజల పేర్లమీదనే తెరిణికల్లు, వెంటాపురం, పుల్లాపురం, మురుసుపల్లె, దద్దనపాడు అనే గ్రామాలు కట్టించారు. విజయనగర రాజుల కాలంలో శ్రీరామలింగేశ్వరస్వామి దేవాలయం తెర్నేకల్‌లో పునఃనిర్మించారు. అయితే ఒక పొలంలో మాధవస్వామి విగ్రహం దొరకడంతో అక్కడ మాధవస్వామి దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. మాధవస్వామి అనుగ్రహంతో తెర్నేకల్ ప్రజలకు ఇంతటి దైర్యసాహసాలు వచ్చాయని ప్రతీతి. యాదవ రాజుల తరువాత శ్రీకృష్ణ దేవరాయుల కాలంలో కోటకొండపాలేగాడు గోపాలనాయుడుచే తెర్నేకల్ గ్రామం కూడా పరిపాలించబడింది. ఆ కాలంలోనే ఆదోని కోటలోని రాజాభీమ్‌సింగ్‌తో ఈప్రాంతం ప్రజలు నాలుగు మాసాలు పోరాటం చేశారు. చివరకు సంధి చేసుకున్నారు. ఆతరువాత ఆంగ్లేయుల పాలన వచ్చింది. ఈప్రాంతానికి మన్రోను గవర్నర్‌గా నియమించారు. ఆయన పాలనలోనే భూమి శిస్తు కట్టాలని తెర్నేకల్‌కు చెందిన రెడ్డి, కర్ణనలు జమాబందీకి ఆదోనికి రావాలని ఆంగ్లేయుల గుమస్తా శ్రీనివాసరావు తెర్నేకల్‌కు రావడం జరిగింది. గ్రామంలో ప్రవేశించగానే తెల్లదొరల పాలన ప్రారంభమైందని తెలుసుకున్న తెరిణికంటి ప్రజలకు ఆగ్రహం, ఆవేశం, పౌరుషం వచ్చేసింది. గ్రామ పెద్ద ముతుకూరిగౌడప్ప అనే అతను రెడ్డి, కర్ణాలతో కలిసి కంపెనీ గుమస్త శ్రీనివాసరావు వద్దకు వెళ్లాడు. తాము అధిక పన్ను చెల్లించలేమని శ్రీనివాసరావుతో చెప్పేశారు. అప్పటికే తెరిణికంటి ప్రజలకు శత్రువులైన గంజిహళ్ళి సుంకిరెడ్డి, పెసలదినె్న నారప్ప, బైలుప్పుల రామిరెడ్డిలు అక్కడ ఉన్నారు. వారు తెర్నేకల్ ప్రజలను అవహేళన చేస్తూ ఇది మొగలాయి సర్కార్‌కాదని, కంపెనీ సర్కార్ అని వారు అంటూ ప్రజలను హేళన చేసి మాట్లాడారు. అంతేకాకుండా నోటికి వచ్చినట్లు తిట్టారు. దీంతో ముత్తకూరు గౌడప్ప ఒక్కసారిగా కనుసైగ చేయడంతో తెర్నేకల్ ప్రజలు చేతికి అందిన కత్తులు, కఠారులు మొదలగు వాటితో సుంకిరెడ్డి, నారప్ప, రామిరెడ్డి మొదలగు వారిపై దాడి చేసి చంపివేశారు. అయితే ఈ దాడిలో కంపెనీ గుమస్తా శ్రీనివాసరావుకు కూడా స్వల్పగాయాలు అయ్యాయి. ఇంతటితో తృప్తి చెందని తెర్నేకల్ ప్రజలు సుంకిరెడ్డి, రామిరెడ్డి శవాలను దళితులతో పూడ్చివేయించారు. నారాప్ప బ్రాహ్మణుడు కావడంతో ఆయన మృతదేహాన్ని కాల్పించారు. ఆతరువాత కంపెనీ గుమస్తా శ్రీనివాసరావును తిరిగి పంపడానికి ప్రజలు అంగీకరించలేదు. శ్రీనివాసరావు వెళ్లి ఆదవేణిలో ఉన్న అమిలు రఘునాథ్‌రావుతో చెబుతాడని ప్రజలు పేర్కొన్నారు. అయితే శ్రీనివాసరావు ఇక్కడ జరిగిన ఘర్షణను ఎవరికి చెప్పనని మాట ఇచ్చిన తరువాత శ్రీనివాసరావును పంపగా శ్రీనివాసరావు ప్రజలకు ఇచ్చిన మాట తప్పి కంపెనీ సర్కార్‌కు తెర్నేకల్ ప్రజల తిరుగుబాటును, ముగ్గురిని చంపిన విషయాన్ని చెప్పడం జరిగింది. అయితే తెర్నేకల్ ప్రజలు ముందుగానే ఇది గ్రహించి ముందు జాగ్రతలు తీసుకున్నారు. గ్రామంలో ఉన్న ద్వారాలను మరమ్మతులు చేయించారు. పశువులను ఇతర గ్రామాలకు, ఆడ బిడ్డలను బంధువుల వద్దకు పంపి రాత్రి పగలు గ్రామంలో పహారా కాచారు. ఈవిషయం తెలుసుకున్న ఆ నాటి ఆదవేణి కోటలో ఉన్న కంపెనీ అధిపతి తాకరే సైనం అంతా తీసుకొని ఆవేశంతో తెర్నేకల్ గ్రామం మీదకు సైన్యంతో బయలుదేరాడు. చివరకు ఆయన కడివెళ్ళ గ్రామం వద్ద మకాం వేసి తాను ఒక్కడే గుర్రం మీద తెర్నేకల్ గ్రామానికి వెళ్ళి గ్రామ ద్వారం వద్ద నిలబడి గ్రామాధికారులను పిలిచి ఆదవాణికి వెళ్లి జమాబందీ చేయాలని, లేని పక్షంలో గ్రామాన్ని నాశనం చేస్తామని చెప్పాడు. గ్రామ అధికారులు గ్రామ సింహద్వారం వద్దకు వెళ్లి తలుపులు మూసి వేశారు. తాకరే మోసపోయానని తెలుసుకొని తీవ్ర ఆవేశంతో వెంటనే సైన్యంతో తెర్నేకల్ గ్రామంపై యుద్ధం ప్రారంభించారు. ఒకవైపు గ్రామం కోటవైపు నుంచి ప్రజలు వడిసేలతో రాళ్ళు రువ్వూతు తుపాకులు కల్గిన బ్రిటీష్ సైన్యంతో పోరాటం చేశారు. తూర్పు, పశ్చిమ ద్వారాల వద్ద పెద్ద ఎత్తున రెండు వర్గాలకు పోరు సాగింది. తుపాకులు ఉన్నా గ్రామ ద్వారాలను తెల్లదొరల సైన్యం బద్దలు కొట్టలేకపోయింది. చివరికి సంధి ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే తెర్నేకల్ గ్రామ ప్రజలకు శతృవులైన పెసలదినె్న గ్రామ ప్రజలు ఉత్తర ద్వారం బలహీనంగా ఉందని కంపెనీ సైన్యానికి సమాచారం ఇచ్చారు. దీంతో తాకరే వెంటనే ఉత్తర ద్వారాన్ని పెల్చివేసి గ్రామంలోకి వెళ్లి దొరికిన ప్రజలను దొరికినట్లు చంపేశారు. అలాగే తెర్నేకల్ కోట గోడలను బూడిద చేశారు. చివరకు తిరుగుబాటు నాయకత్వం వహించిన ముతుకూరుగౌడప్పను ఊరివాకిట ఉరి తీయించారు. స్ర్తిలను కూడా వదిలి పెట్టలేదు. గ్రామాన్ని తగలబెట్టాడు. శవాలను తీసుకెళ్లి కుక్కల బావిలో వేసి పూడ్చివేశారు. తెర్నేకల్ ప్రజలు కొలిచే మాధవస్వామి విగ్రహాన్ని కుక్కల బావిపై పెట్టారు. ఈవిధంగా తెర్నేకల్ ప్రజలు 1801 సంవత్సరంలోనే బ్రిటీష్ సైన్యంతో పోరాడి అమరవీరులుగా నిలిచారు. 1804లో భీమారావు ఈ గ్రామాన్ని పునః నిర్మించారు. కొంత కాలం గ్రామాన్ని భీమా పురం అని కూడా పిలిచారు. అయితే ఆతరువాత మళ్ళీ తెర్నేకల్‌గానే స్థిరపడిపోయింది. ఈవిధంగా భారతదేశంలో మొట్టమొదట ఆంగ్లేయులపై తిరుగుబాటు చేసిన తెర్నేకల్ వీరు చరిత్ర స్మరించుకోవాలి. ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం రోజున తేర్నేకల్ వీరులకు ఘణనివాళి అర్పించి స్మరించుకోవడం నేటి ప్రజల కర్తవ్యం. అలాగే బ్రిటీష్ సైన్యంతో పోరాడి ఊరి వాకిలికి ఊరి తీయబడ్డ ముతుకూరుగౌడప్ప విగ్రహాన్న తెర్నేకల్‌లో నిర్మించడానికి ఇటీవల గ్రామప్రజలు నిర్ణయించారు. ఈమేరకు ఎంపి బుట్టారేణుకకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది.