అనంతపురం

ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు అందేనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం: వర్షాభావంతో ఖరీఫ్ వేరుశనగ పంట సాగు ఈ ఏడాది గణనీయంగా తగ్గిపోవడంతో రైతులు ప్రత్నామ్నాయ పంటలు వేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఆగస్టులో వేరుశనగ విత్తవద్దని ఇదివరకే వ్యవసాయాధికారులు సూచించారు. కానీ కొందరు రైతులు మాత్రం ఆశ చావక వేరుశనగ విత్తనున్నారు. పంట దిగుబడి సరిగా ఉండదని తెలిసినా సంప్రదాయంగా వేస్తున్న పంట కావడంతో ఎంతో కొంత పంట చేతికొచ్చినా చాలనే అభిప్రాయంలో ఉన్నారు. ఇది సరైంద కాదని, ప్రత్నామ్నాయ పంటలు వేసుకోవడం మంచిని జిల్లా వ్యవసాయాధికారులు సూచించారు. ఈ నేపథ్యంలో జొన్న, సజ్జ, పెసర, ఉలవలు, అలసంద తదితర విత్తనాలను సరఫరా చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. అయితే వీటిని ఉచితంగా పంపిణీ చేయాలా లేక 90 శాతం సబ్సిడీతో ఇవ్వాలా అన్న అంశం ఇంకా ఖరారు కాలేదు. ఉచితంగా అందిస్తే కొంత ఆర్థికంగా ఊరట కలుగుతుందని సన్న, చిన్నకారు రైతులు ఆశిస్తున్నారు. కాగా జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ వేరుశనగ సాగు 6 లక్షల హెక్టార్లలో సాగవుతుందని జిల్లా వ్యవసాయ శాఖ అంచనా వేసినా, వర్షాభావం గతంలో ఎన్నడూ లేని రీతిలో దెబ్బతీసింది. నైరుతి రుతుపవనాలు అనుకూలించక పోవడంతో వర్షాలు కురియలేదు. దీంతో గత నెలన్నర నుంచి ఇప్పటి వరకు కేవలం 2.50 లక్షల హెక్టార్ల మేరకు మాత్రమే వేరుశనగ పంట సాగైంది. ఇతర పంటలతో కలిపి 3.15 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో జిల్లాలో పంటలు సాగయ్యాయి. కాగా ఉరవకొండ, గుంతకల్లు, తాడిపత్రి తదితరాలతో పాటు నల్ల రేగడి నేలలున్న ప్రాంతాల్లో పప్పుశెనగ పంట వేసుకునేందుకు రైతులు విత్తనాలు సమకూర్చుకుంటున్నారు. అక్టోబర్‌లో ముందస్తుగా పప్పుశనగ వేసుకోవడం మంచిదని, దిగుబడి బాగా వస్తుందని వ్యవసాధికారులు రైతులకు సూచిస్తున్నారు. కాగా జిల్లా వ్యాప్తంగా సోమవారం 28 మండలాల్లో వర్షం ఊసేలేదు. మరో 27మండలాల్లో 2.5 మి.మీ., 5 మండలాల్లో 5.0 మి.మీ., రెండింటిలో 5.0 మి.మీ. నుంచి 10 మి.మీ., గార్లదినె్నలో మండలంలో మాత్రం 14 మి.మీ. మేర వర్షం కురిసింది. అయితే గత రెండు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా కురిసిన మోస్తరు, తుంపర్లతో 43.7 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఈ నెల 14 నాటికి సాధారణ వర్షపాతం 37.5 మి.మీ. నమోదు కావాల్సి ఉన్నా, 16.5 మి.మీ. అదనంగా కురిసినట్లు ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్, రెవెన్యూ రెయిన్‌గేజ్‌ల ద్వారా అధికారులు నిర్ధారించారు. ఇది గత నెలలో వేసిన వేరుశనగ పంటకు ఊరట కలిగిస్తోందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. అలాగే వేరుశనగ విత్తాలన్న ఆలోచన ఉన్న రైతులు ఈ నెలలో ఎట్టి పరిస్థితుల్లోనూ పంట సాగు చేయవద్దని స్పష్టం చేశారు. రెండు, మూడు రోజుల్లో ఖరారు
* శ్రీరామమూర్తి, జెడిఎ
వేరుశనగ పంట సాగు విస్తీర్ణం దారుణంగా పడిపోయిన నేపథ్యంలో, వర్షాభావాన్ని దృష్టిలో పెట్టుకుని రైతులకు పంపిణీ చేసేందుకు ప్రత్నామ్నాయ విత్తనాల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాము. రెండు, మూడు రోజుల్లో ధర ఖరారు కానుంది. ఆ వెంటనే పంపిణీ చేస్తాం.

ఇస్కాన్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
* హాజరైన మంత్రి పరిటాల సునీత
అనంతపురం కల్చరల్: ఇస్కాన్ మందిర్‌లో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు జరుగనున్న వేడుకలు సోమవారం ప్రారంభించారు. శ్రీ కృష్ణాష్టమిని పురస్కరించుకుని ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రంగురంగుల విద్యుద్దీపాలతో మిరుమిట్లు గొలుపుతూ భక్తులకు నేత్రానందాన్ని కలిగిస్తోంది. వేడుకల ప్రారంభానికి మంత్రి పరిటాల సునీత, మేయర్ స్వరూప హాజరై శ్రీకృష్ణుని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయంలో ఉదయం విశ్వశాంతి యజ్ఞం, విష్ణుసహస్రనామ పారాయణం, హరినామ సంకీర్తన, తులసి అర్చన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం చిన్నపిల్లల శ్రీకృష్ణ వేషధారణలు, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. బాలకృష్ణులు అలనాటి గోకులాన్ని తలపించారు. ఆలయ మేనేజర్ దామోదర గౌరంగదాస్ ప్రభు మంత్రికి శ్రీకృష్ణుని ఫొటో అందచేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఎస్కేయూలో : కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోపూజ, ఉట్టికొట్టే కార్యక్రమం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విసి.రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
అశోక్ నగర్‌లో
అనంతపురం సిటీ : నగరంలోని అశోక్ నగర్‌లోని మినర్వా పాఠశాలలో సోమవారం కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాలలోని విద్యార్థులు కృష్ణుడు, గోపికల వేషధారణలతో అలరించారు. అనంతరం ఉట్టిని కొట్టి విద్యార్థినీ, విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు.అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను అందరని అలరించాయి. ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ భాస్కర్‌రెడ్డి, స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థినీ, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

స్వాతంత్య్ర వేడుకలకు విస్తృత ఏర్పాట్లు
అనంతపురం కల్చరల్: నేడు స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనం గా నిర్వహించేందుకు జిల్లా యం త్రాగం అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఈమేరకు ఏర్పాట్లకు సంబంధించిన పనులను ఆర్డీఓ మ లోలా, తహశీల్దారు అన్వర్ హుస్సేన్ పరిశీలించారు. వివిధ ప్రభుత్వ శాఖలు తమ అభివృద్ధికి సంబంధించిన వివరాలను ప్రదర్శించేందుకు ఏర్పాటుచేసిన స్టాళ్లను, విఐపిలు, వివిఐపిలతోపాటు వేడుకలకు హాజరయ్యే వారి కోసం తగిన ఏర్పాట్లన్నింటినీ పరిశీలించారు. వేడుకల సందర్భంగా ఎటువంటి సమస్యలు రాకుండా అన్ని శాఖలకు సంబంధించిన వారు సమన్వయంతో తమతమ బాధ్యతలను నిర్వర్తించాలని ఆర్డీఓ తెలిపారు.
13 మందికి ఎపి పోలీస్ సేవా పతకాలు
* ముగ్గురికి ఉత్తమ సేవా పతకాలు
ఆంధ్రభూమిబ్యూరో
అనంతపురం: స్వాతం త్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా పోలీసు అధికారులు, సిబ్బందికి రాష్ట్ర స్థాయిలో 16 మందికి అరుదైన పురస్కారాలు దక్కాయి. జిల్లాకు చెందిన పోలీసు అధికారులు, సిబ్బంది 13 మందికి ఎపి రాష్ట్ర పోలీసు సేవా పతకాలు, మరో ముగ్గురు ఉత్తమ సేవా పతకాలకు ఎంపికయ్యారు. జిల్లా స్థాయిలో మొత్తం 30 మంది పోలీసు అధికారులు, సిబ్బందిని ఉత్తమ సేవకులుగా గుర్తింపు పొందారు. వీరందరూ 70వ పంద్రాగస్టు సందర్భంగా మంగళవారం స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించనున్న వేడుకల్లో రాష్ట్ర మంత్రి కాలవ శ్రీనివాసులు చేతుల మీదుగా అవార్డులు పొందనున్నారు. ఎపి పోలీసు సేవా పతకం పొందిన వారి వివరాలిలా.. బి.చిన్నకృష్ణ (డిఎస్పీ-డిఎఆర్),అనంతపురం, ఎం.కృష్ణమోహన్, సిఐ (త్రీటౌన్ పిఎస్, అనంతపురం), వి.నారాయణ, ఎఎస్‌ఐ (హిందూపురం రూరల్ పిఎస్), పి.రాజశేఖర్, ఎఎస్‌ఐ ( అనంతపురం వన్ టౌన్ పిఎస్), ఎస్.షఫీ ఉల్లా, హెచ్‌సి (జిల్లా స్పెషల్ బ్రాంచ్, అనంతపురం), సి.కొండరెడ్డి, ఎఆర్, హెచ్‌సి (అనంతపురం), ఎస్.జాన్సన్, పిసి (అనంతపురం టూ టౌన్ పిఎస్), ఎం.రమేష్, హెచ్‌సి (సిసిఎస్, అనంతపురం), బి. మహ్మద్‌దావూద్, హెచ్‌సి (డిసి ఆర్‌బి, అనంతపురం), ఎస్.త్రిలోక్‌నాథ్, హెచ్‌సి (అనంతపురం టౌన్ పిఎస్), కె.జయరాముడు, హెచ్‌సి (జిల్లా స్పెషల్ బ్రాంచి, అనంతపురం), జి.వెంకటేశులు, పిసి (జిల్లా స్పెషల్ బ్రాంచి,అనంతపురం), పి.రామయ్య, పిసి ( ఒడి చెరువు పిఎస్). ఉత్తమ సేవా పతకం పొందిన వారు: టి.వెంకటేశులు, సిఐ (అనంతపురం త్రీ టౌన్ పోలీసు స్టేషన్), వి.లక్ష్మినారాయణ, ఎఆర్ హెచ్‌సి(డిఎఆర్, అనంతపురం), పి.చిన్నమహబూబ్‌బాషా, ఎఆర్ పిసి( డిఎఆర్, అనంతపురం). కాగా ఎపి పోలీస్ సేవా పతకాలు పొందిన వారికి రూ.4000 నగదు, ప్రతి నెలా రూ.75 గ్రాంటును ప్రభుత్వం అందించనుంది. ఉత్తమ సేవా పురస్కార గ్రహీతలకు రూ.5000 నగదు, ప్రతి నెలా రూ.100 గ్రాంటు అందించనున్నారు. రివార్డులకు ఎంపికైన 30 మందిలో అనంతపురం సబ్‌డివిజన్ నుంచి జి.రాజేంద్రనాథ్ యాదవ్, (సిఐ), జి.్ఫయాజ్ సాహెబ్(పిసి), ధర్మవరం సబ్ డివిజన్ నుంచి వి.హరినాథ్( ఇన్‌స్పెక్టర్), ఎన్.రాజశేఖర్‌రెడ్డి (ఎస్‌ఐ), గుంతకల్లు నుంచి ఎ.షేక్షావలి, జి.వెంకటనారాయణ (హెడ్‌కానిస్టేబుళ్లు), కదిరి నుంచి ..హరినాథ్‌రెడ్డి (ఎస్‌ఐ), జి.హర్షవర్ధన్‌రాజు (పిసి), కళ్యాణదుర్గం నుంచి బి.శేఖర్ (ఎస్‌ఐ), ఈశ్వరయ్య (పిసి), పెనుకొండ సబ్‌డివిజన్ నుంచి జి. ఇదుర్‌బాషా (సిఐ), .రాము (పిసి), పుట్టపర్తి సబ్ డివిజన్ నుంచి టి.నరేంద్రకుమార్ (పిసి), తాడిపత్రి నుంచి పివై. ఆంజనేయులు (ఎస్‌ఐ), కె.నరసింహులు (పిసి), జిల్లా స్పెషల్ పార్టీ నుంచి ఆదినారాయణ, ఎ.ప్రభాకర్ (కానిస్టేబుళ్లు), అనంతపురం ట్రాఫిక్ పోలీసు స్టేషన్‌కు చెందిన అల్లూ లక్ష్మినారాయణ (ఎస్‌ఐ), క్రైమ్ కంట్రోల్ స్టేషన్, అనంతపురం నుంచి కె.రంజిత్‌కుమార్ (పిసి), కమ్యూనికేషన్స్ విభాగం నుంచి బి.శ్రీనివాసులు (హెచ్‌సి), వి.నారాయణస్వామి (పిసి), డిఎఆర్, అనంతపురం నుంచి బి.నిరంజన్‌రావ్ (ఆర్‌ఎస్‌ఐ), సి హెచ్.నాగేశ్వరరావు (ఎఆర్ ఎస్‌ఐ), బి.వెంకటేశ్‌నాయక్ (ఎఆర్ హెచ్‌సి), బి.బానుప్రకాష్‌రెడ్డి (ఎఆర్ పిసి), జిల్లా పోలీసు కార్యాలయం నుంచి జె.మాధవి ( ఆఫీస్ సూపరింటెండెంట్, పి-సెక్షన్), జి.మహబూబ్‌బాషా (జూనియర్ అసిస్టెంట్, ఎ-2), డిఐజి, అనంతపురం రేంజ్ నుంచి ఎస్.మహమ్మద్ రఫి (పిఎ టు డిఐజి, ఎఆర్, అనంతపురం), డి.దస్తగిరి (్ఫస్‌సూపరింటెండెంట్, ఐఎస్‌ఎస్). వీరితో పాటు జిల్లా పరిపాలనా విభాగానికి సంబంధించి వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బందిని రివార్డులకు ఎంపిక చేశారు.
శ్రీకృష్ణ నామ మాధుర్యం విశ్వవ్యాపితం
పుట్టపర్తి: శ్రీకృష్ణ నామ మాధుర్యం విశ్వ వ్యాపితం చేసిన మీరా, శ్రీకృష్ణుల ఇతివృత్తాంతంతో కూడిన నాటిక అద్భుతంగా అలరించింది. భగవాన్ సత్యసాయి బాబా సన్నిధిలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. విశాఖపట్నం జిల్లాకు చెందిన వేలాదిమంది సాయి భక్తులు పర్తియాత్రగా సాయి సన్నిధి చేరుకున్నారు. మీరా, శ్రీకృష్ణుల నిరుపమానమైన భక్తి భావాన్ని విశేషంగా ప్రదర్శించారు. చిత్తోడు యువరాజు భోజరాజును తమ తల్లిదండ్రుల ఒత్తిడి మేరకు వివాహమాడి భోజరాజు వంశ ప్రతిష్ట, తల్లిదండ్రుల ప్రాణాలను కాపాడుతూ శ్యామసుందరుడు గిరిధర నామస్మరణతో నల్లనయ్యే నా నాథుడు అనే కథాంశం నాటిక రూపం అశేష భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. హంతు తులసీదాస్ మీరా భక్తిని అవగతం చేసుకుని నిరుపమానమైన తన భక్తిని విశ్వ వ్యాప్తం చేయాలని ఆమెకు సూచిస్తాడు. ఆమె గిరిధర నామస్మరణను పఠిస్తూ శ్రీకృష్ణ నామ మాధుర్యాన్ని ప్రపంచ వ్యాప్తం చేసిన తీరు కళ్లకు కట్టినట్లు విశాఖపట్నం సాయి యువత నాటిక ప్రదర్శన భక్తులను మంత్రముగ్ధులను చేసింది.
పరస్పర సహకారంతో పండుగలు జరుపుకుందాం
కదిరి: హిందూ, ముస్లిం లు పరస్పరం అన్నదమ్ముల వలే ఒకరినొకరు సహకరించుకొని వినాయక చవితి, బక్రీద్ పండుగలను జరుపుకుందామని కదిరి ఇన్‌చార్జి డిఎస్పీ వెంకటరమణ పేర్కొన్నారు. సోమవారం రాత్రి పట్టణంలోని కాలే జి రోడ్డులో వున్న ఫుర్ఖానియా మదరసా మసీదులో ముతవల్లీలతో పోలీసులు ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. డిఎస్పీ, పట టణ సిఐ శ్రీనివాసులు మాట్లాడుతూ పండుగలకు ఏ చిన్న ఆటంకం కలగకుండా అన్నదమ్ముల వలే కలిసిమెలిసి వినాయక చవితి, బక్రీద్‌లను జరుపుకునేలా ముతవల్లీలు సహకరించాలన్నారు. ఎన్నో యేళ్ల క్రితం జరిగిన ఓ చిన్న సంఘటనల వల్ల ప్రతి యేడాది వినాయక చవితి పండుగ ముందు ఇలా సమావేశాన్ని ఏర్పాటుచేస్తున్నామని, అయితే ఒకరినొకరు సహకరించుకోవడం వల్ల గత కొనే్నళ్లుగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తలేదని, రెండేళ్ల క్రితం ఇరు వర్గాల పెద్ద మనుషుల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారమే నిమజ్జనం జరుగుతుందని తెలిపారు. ఇదే సందర్భంలో బక్రీద్ పండుగ సందర్భంగా ఇచ్చే ఖుర్బానిలో గోవులను ఖుర్బాని ఇవ్వకూడదని సూచించారు. గోవధ చట్టం గురించి వివరించారు. ముతవల్లీ వౌలానా సమీవుల్లా మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త పరమత సహనాన్ని పాటించాలని చెప్ప డం జరిగిందన్నారు. ఖు ర్బానిలో ఆ వును ఇవ్వకూడదని ఇప్పటికే మసీదుల్లో తెలపడం జరిగిందన్నారు. గోవు మాత్రమే ఖు ర్బానిగా ఇవ్వాలని ఎక్కడా ఖురాన్‌లో లేదని, ఇతర వాటిని కూడా ఖుర్బాని ఇచ్చే అవకాశం వుందన్నారు. పట్టణ ఎస్ ఐలు మధుసూదన్‌రెడ్డి, గోపాలుడు, ప్రభుత్వ ఖాజీ మన్నాన్, ముతవల్లీలు రహంతుల్లా, మండి నజీర్, సిఎండి ఫారుక్, అబ్దుల్ రబ్ పాల్గొన్నారు.
అయోధ్యలో రామాలయ నిర్మాణమే లక్ష్యం
తాడిపత్రి: అయోధ్యలోని రామజన్మభూమిలో రామమందిర నిర్మాణమే విశ్వహిందూ పరిషత్ లక్ష్యమని విహెచ్‌పి రాయలసీమ విభాగ్ అధ్యక్షులు నిచ్చెనమెట్ల రాధాకృష్ణ పేర్కొన్నారు. విహెచ్‌పి ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో విహెచ్‌పి, బిజెపి నాయకులు రోగులకు బ్రెడ్, పండ్లను పంపిణీ చేశారు. అనంతరం రాధాకృష్ణ విలేఖరులతో మాట్లాడుతూ 1964 ఆగస్టు 29న కృష్ణాష్టమినాడు మాధవరావు సదాశివరావు గోల్‌వల్కర్, స్వామి చిన్మయానందలు ముంబాయిలోని సాంధీపణీ ఆశ్రమమునందు సాధువులతో కలసి హిందూ సమాజంలోని లోపాలను, అంటరానితనం, అవిద్య, గిరిజన ప్రాంతాల్లోని ఆదివాసులకు వైద్య సేవాలు అందించడానికి విశ్వహిందూ పరిషత్ ఏర్పాటుచేశారని తెలిపారు. 53 సంవత్సరాలుగా అయోధ్యలో రామజన్మభూమి, రామసేతు పరిరక్షణ, దేశ వ్యాప్తంగా గోవధ నిర్మూలానికై విహెచ్‌పి అనేక ఉద్యమాలు చేపట్టిందన్నారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణం తొందరలో జరుగబోతుందని తెలిపారు. సుప్రీం కోర్టు 2017 డిసెంబర్ 5నుంచి వాయుదా లేని విచారణను చేపట్టడం శుభపరిమాణమన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని షియా వక్ఫ్‌బోర్డు వారు రాముడు పుట్టిన స్థలంలో రామమందిర నిర్మాణానికి సహకారం అందిస్తామని, సున్ని వక్ఫ్ బోర్డుతో మాట్లాడి సమస్యను సామరస్యంగా పరిష్కారం చూపుతామనడం రామజన్మభూమి ఉద్యమంలో కీలక విషయంగా అభివర్ణించారు. విహెచ్‌పి అంతర్జాతీయ అధ్యక్షులు ప్రవీణ్‌బాయ్ తొగాడియా క్యాన్సర్ నివారణ పరిశోధనాలయాన్ని స్థాపించారని, హిందూ హెల్ప్‌లైన్ ద్వారా క్యాన్సర్ నివారణకై ఉచితంగా వైద్యసేవలు, మందులను అందజేస్తున్నారని తెలిపారు. విహెచ్‌పి ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా 53,803 సేవా కేంద్రాలతో ప్రజలకు ఉచితంగా సేవలు అందిస్తున్నారని తెలిపారు. అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలోని 126 గ్రామాల్లో ఏకోపాధ్యాయ విధ్యాలయాలను విహెచ్‌పి నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి, విహెచ్‌పి నాయకులు శ్రీరంగయ్య, లక్ష్మినారాయణ, ఆంజనేయులు, రాంబాబు, నరసింహులు, గణేష్‌బాబు, రామాంజినేయులు, వీరభద్ర, నాగేశ్వరరావు, రాజారెడ్డి, సుబ్రమణ్యం, ప్రసాద్ పాల్గొన్నారు.
భారతీయ జనతా యువమోర్చా తిరంగ యాత్ర
* చైనా వస్తువులకు వ్యతిరేకంగా కాగడాల ప్రదర్శన
అనంతపురం కల్చరల్: క్విట్ ఇండియా ఉద్యమానికి 75 సం.లు పూర్తయిన సందర్భంగా భారతీయ జనతా యువమోర్చా తిరంగ యాత్ర నిర్వహించింది. ఈ సందర్భంగా సోమవారం రాత్రి టవర్‌క్లాక్ నుండి కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బిజెపి జిల్లా అధ్యక్షులు అంకాల్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో దేశ ప్రజలు నేడు క్విట్ చైనా గూడ్స్ ఉద్యమం నిర్వహించాలని పిలుపునిచ్చారు. క్విట్ ఇండియా ఉద్యమం ద్వారా బ్రిటీష్ వారిని దేశం నుండి పారదోలి స్వరాజ్యం సాధించుకున్నామన్నారు. ఇదే స్ఫూర్తితో ప్రధాని మోదీ రాబోయే ఐదేళ్లలో పేదరికం, కులతత్వం, మతతత్వం, తీవ్రవాదం, అపరిశుభ్రతవంటి వాటిని పారద్రోలి సరికొత్త భారత్‌ను నిర్మించుటకు కృషి చేస్తున్నారన్నారు. ఈ లక్ష్య సాధనకు బిజెపి కార్యకర్తలందరూ దీక్షబూనాలన్నారు. చైనా యుద్ధ కాంక్షతో దేశంపైకి చొచ్చుకు రావడానికి ప్రయత్నిస్తోందని, అయితే యుద్ధమే పరిష్కారం కాదని, చైనా వస్తువులను బహిష్కరించడం ద్వారా చైనా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలన్నారు. బిజెవైఎం నగర అధ్యక్షులు అశోక్‌రెడ్డి మాట్లాడుతూ 2020 నాటికి న్యూ ఇండియాను సాకారం చేయడానికి ప్రతి కార్యకర్త ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి దుద్దేకుంట వెంకటేశ్వరరెడ్డి, నగర అధ్యక్షులు శ్రీనివాసులు, నాయకులు ఆనంద నరసింహయ్య, సయ్యద్‌బాబా, గోవర్ధన్, వంశీ, పవన్‌కుమార్, విజయ్, చంద్రశేఖర్, నిఖిల్, జాకబ్, శ్రీకాంత్, శీను పాల్గొన్నారు.
జిల్లా పోలీసు వాట్సప్‌కు సమాచారం వెల్లువ
* ఎస్పీ జివిజి. అశోక్‌కుమార్
అనంతపురం అర్బన్: జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలు అడ్డుకట్ట వేసేందుకు పోలీసు శాఖ అందుబాటులో ఉంచిన వాట్సప్‌కు సమాచారం వెల్లువలా వచ్చి పడుతోందని ఎస్పీ జివిజి. అశోక్‌కుమార్ తెలిపారు. సోమవారం ఆయన తన క్యాంప్ కార్యాలయంలో పోలీసు కంట్రోల్‌రూం (పిసిఆర్) విభాగం సిబ్బందితో గత పది రోజులుగా సాధించిన ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఉరవకొండ, కుందుర్పి, ధర్మవరం, చిలమత్తూరు, ముదిగుబ్బ, రొళ్ల మండలాల నుంచి ఆయా గ్రామాలకు సంబంధించి పేకాట జరుగుతున్నట్లు వాట్సప్‌కు సమాచారం ప్రజలు ఇవ్వటం జరిగిందన్నారు. ఈ ఫోన్‌కాల్స్‌కు పోలీసులు తక్షణమే స్పందించి ఆయా ప్రాంతాల్లో దాడులు చేయటం జరిగిందన్నారు. 31 మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేయటంతోపాటు రూ.28,100 స్వాధీనం చేసుకోవటం జరిగిందన్నారు. బెల్ట్‌షాపులకు సంబంధించి వాట్సప్‌కు వచ్చిన సమాచారం మేరకు అక్కడి పోలీసులు నలుగురిని అరెస్టు చేసి 62 బాటిళ్లను స్వాధీనం చేసుకోవటం జరిగిందన్నారు. ఇవేకాకుండా క్రికెట్ బెట్టింగ్, మట్కా, రోడ్డు ప్రమాదాలపై డయల్ 100తోపాటు వాట్సప్‌ను విరివిగా ప్రజలు ఉపయోగించుకోవాలని ఎస్.పి పిలుపునిచ్చారు.
భక్తిశ్రద్ధలతో లక్ష్మినరసింహస్వామి విగ్రహ ప్రతిష్ఠ
రామగిరి: మండలంలోని పాపిరెడ్డిపల్లి సమీపంలో వెలసిన నంది ఓబుళేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో లక్ష్మినరసింహ స్వామి విగ్రహ ప్రతిష్ఠ సోమవారం తెల్లవారుజామున అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్ర్తి, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విశ్వబ్రాహ్మణులచే స్వామి విగ్రహ ప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్ఠ కావించారు. అంతకుమునుపే వినాయక విగ్రహ ప్రతిష్ఠ, కలశ స్థాపన చేశారు. హోమాలు నిర్వహించారు. దాతల సహకారంతో దేవాలయాన్ని నూతనంగా నిర్మించారు. మంత్రి పరిటాల సునీత చొరవతో కమ్యూనిటీ భవనం కూడా అక్కడ ఏర్పాటుచేయించారు. అన్నదానం నిర్వహించారు.
హెచ్‌ఎల్‌సికి నీరు అందించలేం
బొమ్మనహాల్:తుంగభద్ర జలాశయం నుండి హెచ్‌ఎల్‌సి ఆయకట్టుకు నీరు అందించలేమని జలాశయం చీఫ్ ఇంజనీర్ శేషగిరిరావు పేర్గొన్నారు. సోమవారం విలేఖరులతో మాట్లాడుతూ జలాశయంలో నీటి మట్టం 49 టిఎంసీలు ఉన్నట్లు, ఇన్‌ఫ్లో 6540 క్యూసెక్కులు వచ్చి చేరుతుందని, ఈ ప్రకారం హెచ్‌ఎల్‌సికి ఆరు టిఎంసీల కంటే ఎక్కువ నీటి శాతం రాదని ఈ సందర్భంగా ఆయకట్టుకు నీళ్లు ఇవ్వడం సాధ్యం కాదన్నారు. దేవుడి కరుణించి వర్షాలు భారీగా వస్తే సెప్టెంబర్ మొదటివారంలో హెచ్‌ఎల్‌సికి నీరు విడుదల చేయాలని జలాశయం సెంట్రల్ ట్రిబ్యునల్ కమిటీ తీర్మాణం చేయవచ్చునన్నారు. కర్నాటక రాష్ట్రం నుండి 20 టిఎంసీలు తాగునీరు కావాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసినట్లు వారు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుండి ఎలాంటి ప్రతిపాదన రాలేదని వారు తెలిపారు. తాగునీటికి వదులుతారా, సాగునీరు వినియోగించుకుంటారా అనేది ఆ ప్రభుత్వంపై ఆధారపడి ఉంటుందన్నారు. ప్రస్తుతం బొమ్మనహాల్ మండలంలో వేలాది మంది రైతులు వరినారు, మిరపనారు, మొక్క జొన్నపంటలకు బ్యాంక్‌రుణాలు చేసి సంసిద్దమయ్యామని రైతు సంఘం ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాగునీటి కోసం కృష్ణజలాలు వినియోగించుకుని ఆయకట్టుకు నీరు అందించాలని పలువురు రైతులు జిల్లాకలెక్టర్‌కు కోరుతామని వారు పేర్కొన్నారు.