మహబూబ్‌నగర్

శ్రమదోపిడీని సహించేది లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల్వకుర్తి: రాష్ట్రంలో వివిధ పరిశ్రమలలో పని చేస్తున్న కార్మికులకు వేతన చెల్లింపులలో తేడా లేకుండా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, శ్రమ దోపిడి సహించేది లేదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మార్చల గ్రామ పరిధిలో గల సూర్యలత కాటన్ మిల్లు కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం గత కొన్ని రోజులుగా చేస్తున్న రిలే దీక్షలకు సోమవారం ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి కార్మికులకు మంత్రి సంఘీబావం తెలిపారు. అనంతరం దీక్ష శిబిరంలో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ కార్మికుల శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యమని న్యాయమైన సమస్యల సాధన కోసం ఎల్లప్పుడు అండగా ఉంటామని అన్నారు. ఆంధ్ర పాలనలో తెలంగాణ కార్మికులు శ్రమ దోపిడి జరిగిన ప్రశ్నించే వారు లేరని ప్రత్యేక రాష్ట్ర సాధనలో కార్మికుల పాత్ర మరువలేమని, ప్రత్యేక రాష్ట్ర సాధన అనంతరం ఒప్పంద, కాంట్రాక్టు ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం అందించడం జరుగుతుందని, న్యాయమైన డిమాండ్ల సాధనలో దేనికైన సిద్దమని మంత్రి పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో సూర్యలత కాటన్ మిల్లు అధ్యక్షులు సూర్యప్రకాష్‌రావు, జడ్పిటిసి అశోక్‌రెడ్డి, కల్వకుర్తి టిఆర్‌ఎస్ మాజీ ఇన్‌చార్జి బాలాజీసింగ్, ఆర్యవైశ్య మండల అధ్యక్షులు గోవర్థన్, కార్మికులు తదితరులు ఉన్నారు.

స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లు పూర్తి
* జెసి సురేందర్ కరణ్
నాగర్‌కర్నూల్: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించే వేడుకల ఏర్పాట్లను పూర్తి చేసినట్లు జిల్లా సంయుక్త కలెక్టర్ సురేందర్ కరణ్ తెలిపారు. సోమవారం తన క్యాంపు కార్యలయంలో సంబంధిత అధికారులతో ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్యక్రమాన్ని తిలకించడానికి వచ్చే ముఖ్యులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, ప్రజలకు ఇబ్బందులు ఏర్పడ కుండా చూడాలన్నారు. కనీస వసతులు, త్రాగు నీరు, వైద్య సదుపాయాలు కల్పించాలన్నారు. ఉదయం 9గంటలకు స్థానిక పోలీస్‌పరేడ్ గ్రౌం డ్‌లో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా పాల్గొని పతాకావిష్కరణ చేసి ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజలకు వివరిస్తారని, ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ప్రశంస పత్రాలు, ఆస్తుల పంపిణీ చేస్తారని తెలిపారు. డిపి ఆర్‌లో నీటిపారుదల, డిఎంహెచ్‌వో, ఆర్‌అండ్ బి, వ్యవసాయ, పశుసంవర్ధక శాఖల ఆధ్వర్యంలో శకటాల ప్రదర్శన ఉంటుందన్నారు. పాఠశాలల విద్యార్థులు, గిరిజనుల సంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. అనంతరం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించి పలుసూచనలు చేశారు. సమావేశంలో డిఆర్‌వో మధుసూదన్ నాయక్, జిల్లా అధికారులు సుధాకర్, అంజలప్పా, జోజి, తదితరులు పాల్గొన్నారు.
వరుణుడి కరుణ కోసం వరదపాశం
వెల్దండ : వరుణుడి కరుణ కోసం సోమవారం వెల్దండ మండల కేంద్రంలో శివుడికి వరదపాశం పోశారు. స్థానిక శివుని గుట్టపై ఉన్న శివాలయాన్ని ఎంతో శోభా యమానంగా అలంకరించి ఆది, సో మవారాలలో ప్రత్యేక పూజలు, భజనలు నిర్వహించారు. యాదవ కులస్థులు ఉపవాసం ఉండి శివలింగం మునిగే వరకు గంగాజలాన్ని పోసి అనంతరం ప్రత్యేకంగా తయారు చేసిన పానకాన్ని బండ నేలపై పో యగా ఉపవాస దీక్షాపరులు సేవించారు.శివుడుకి ప్రత్యేక పూజలు నిర్వహించి వర్షాలు సమృద్ధిగా కురిసే విధంగా చూడాలని వేడుకున్నారు. గ్రామస్థులకు అన్నదానం నిర్వహించారు. నిర్వాహకులు, నాయకులు వజ్రలింగం, కిషన్‌రావు, కుమారప్ప, శ్రీశైలం, రంగయ్య, చెన్నయ్య, పూరి రమేష్, జంగయ్య, వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.
అక్రమ అరెస్టులను ఆపాలి
* టిడిపి డిమాండ్
పెద్దకొత్తపల్లి: కొల్లాపూర్ నియోజక వర్గంలో టిడిపి నాయకులను అక్రమం గా అరెస్టు చేసి జైలుకు పంపుతున్నారని, వాటిని తక్షణమే ఆపాలని పెద్దకొత్తపల్లి టిడిపి నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం మండల కేం ద్రంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సత్యం, మండల అధ్యక్షుడు కురుమూర్తి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు వెంకటస్వామి మాట్లాడుతూ అధికార పార్టీలో మా నాయకులు చేరటం లేదని, మండల మాజీ ఎంపిపి, మాజీ జెడ్పీటిసి మురళీధర్ వెళ్లడంలేదని, అయనప్పటికీ ఆయనకు సంబంధం లేని కేసులో అరెస్టు చేసి మహబూబ్‌నగర్ జైలుకు పంపడం సరైన పద్ధతి కాదన్నారు. అక్రమ అరెస్టులు చేపడితే ప్రజలతో కలిసి పోరాడుతామని హెచ్చరించారు. సమావేశంలో టిడిపి నేతలు మాజీ ఎంపిపి శ్రీనివాసులు, నర్సింహా, నాగరాజు పాల్గొన్నారు.
ఎంబిబిఎస్ విద్యార్థినికి అభినందన
నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ పట్టణంలోని స్థానిక జాతీయోన్నత పాఠశాలలో 2017-18 సంవత్సరానికిగాను దేశంలో నిర్వహించిన నీట్‌లో ఎంబిబిఎస్ సీటు సాధించిన విద్యార్థిని సోని మాధురిని శ్రీ మహేంద్రనాథ్ యువజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం అభినందన సభను నిర్వహించారు. ఈ సమావేశంలో మహేంద్రనాథ్ యువజన సంఘం గౌరవ అధ్యక్షులు ఎంఇఎఫ్ రాష్ట్ర నాయకులు వంకేశ్వరం నిరంజన్ మాట్లాడుతూ పేద దళిత కుటుంబంలో పుట్టి ఎలాంటి కోచింగ్ లేకుండా దేశంలో నిర్వహించిన నీట్ పరీక్షలో ప్రతిభ కనబరిచి ఎంబిబిఎస్ సీటు సాధించడం అభినందించవల్సిన విషయమని, ఇలాంటి స్ఫూర్తిని ప్రతిఒక్కరు ఆదర్శంగా తీసుకోని విద్యలో రాణించి ఉన్నత శిఖరాలు అధిరోహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా వివిధ దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆమెను ఘనంగా సత్కరించారు. సభలో జాతీయోన్నత పాఠశాల ఉపాధ్యాయులు మురళి, సత్యం, శ్రీనివాసులు వివిధ సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
పెద్దకొత్తపల్లి: గ్రామాలాభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం మండల పరిధిలోని గంట్రావుపల్లి గ్రామంలో ఉపాధి హామి పథకం పనులలో భాగంగా రూ.10లక్షలతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని మంత్రి జూపల్లి సమక్షంలో సర్పంచ్ సులోచనమ్మ, ఎంపిటిసి దీపిక ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి జూపల్లి మాట్లాడుతూ గ్రామపంచాయతీల అభివృద్దితోపాటు గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా గుర్తించే ప్రక్రియను ఇప్పటికే ప్రభుత్వం చేపట్టిందన్నారు. ప్రతి గ్రామంలో గ్రామపంచాయతీ భవనం నిర్మాణంను ఇజిఎస్ నిధులతో నిర్మించేవిధంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. హరితహారంలో భాగంగా ప్రతి గ్రామంలో 40వేల మొక్కలు నాటాలని, ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండాలన్నారు. గ్రామ యాదవులంతా కమ్యూనిటీ హాల్ కావాలని కోరగా ఆయన అంగీకరించారు. ఎంపిపి వెంకటేశ్వరరావు, జడ్పీటిసి వెంకటయ్య, నాయకులు లక్ష్మణ్‌రావు, ప్రతాప్‌గౌడ్, బాబురావు, చిన్నయ్య, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.
విద్యతోనే బతుకుదెరువు
* పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి
కొత్తకోట: విద్య ఉంటేనే విద్యార్థులకు బతుకుదెరువు ఉంటుందని రాష్ట్ర పంచాయతిరాజ్ శాఖ జూ పల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం కొత్తకోట మండలంలోని విలీయంకొండ, మదనాపురం మండలంలోని తిర్మలాయపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్‌బివిఆర్ పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొత్వాల్ రాజరీకంలో 15 సంవత్సరాలు పని చేసి కళాశాలలు నెలకోల్పిన మహనీయుడు వెంకట్ రాంరెడ్డి అని, అబ్దుల్ కలామ్ కలలు కన్నా సమాజ స్థాపన కోసం విద్యార్థులు కృషిచేయాలన్నారు.
తెలంగాణ యోధులను మేము చూశాం : ఎంపి
క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న యోధులను మేము ఎప్పుడు చూడలేదని, ఇటీవల జరిగిన తెలంగాణ ఉద్యమంలో యోధులను చూశామని మహబూబ్‌నగర్ ఎంపి ఎపి జితేందర్‌రెడ్డి అన్నారు. పార్లమెంటులో ఇటీవలే క్విట్ ఇండియా ఉద్యమం గురించి ప్రస్తావించగా అందుకు తాను తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణ త్యాగా లు చేసిన శ్రీకాంతాచారి, ఇక్కడి ప్రాం తమైన కావలి సువర్ణ, దాసరి నరేష్‌లను తాము చూసిన యోధుల అని గుర్తు చేసుకున్నారు. సమావేశంలో ఎంపిపి గుంత వౌనిక, మార్కెట్ చై ర్మన్ రాజేశ్వరమ్మ, సిడిసి చైర్మన్ జగన్, సర్పంచులు చెన్నకేశవరెడ్డి, భాగ్యమ్మ, ఉమాదేవి, ఎంపిటిసి వెంకట్ నారాయణ, కృష్ణయ్య, తిరుపతయ్య, బాబురెడ్డి, నాగన్నసాగర్, సంజీవుడు, నాయకులు భీంరెడ్డి, కొండారెడ్డి, ప్రశాంత్, జగదీష్, కటికెశ్రీను తదితరులు పాల్గొన్నారు.
వెంకట్‌రాంరెడ్డి విగ్రహావిష్కరణ
మండల పరిధిలోని రాయిన్‌పేట స్టే జీ సమీపంలో సోమవారం రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి రాజా బహూదూర్ వెంకట్ రాంరెడ్డి విగ్రహావిష్కరణ చేశారు. సుమారుగా 150 సంవత్సరాల చరిత్ర గల వెంకట్ రాంరెడ్డి విగ్రహావిష్కరణ చేయడం హర్షించదగ్గ విషయమని, పేద విద్యార్థులకు విద్య కోసం కృషి చేసిన మహానీయుడని ఆయన కొనియాడారు. కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, మహబూబ్‌నగర్ ఎంపి జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చిన్నారెడ్డి, అల వెంకటేశ్వర్‌రెడ్డి, రెడ్డి హాస్టల్ చైర్మన్ రఘుపతిరెడ్డి, ప్రిన్సిపాల్ రాంరెడ్డి, పాపిరెడ్డి, ఎంపిపి గుంత వౌనిక, సిడిసి ఛైర్మన్ జగన్, మార్కెట్ చైర్మన్ రాజేశ్వరమ్మ, సర్పం చు చెన్నకేశవరెడ్డి, నాయకులున్నారు.
బాబూజగ్జీవన్‌రాం ఆశయాలను నెరవేరుద్దాం
* ఎమ్మెల్యే రాంమోహన్‌రెడ్డి * జగ్జీవన్‌రాం విగ్రహ ప్రతిష్టాపనకు భూమిపూజ
మక్తల్: బాబూజగ్జీవన్ రాం ఆశయాలను ప్రతి ఒక్కరం అమలుపర్చవలసిన బాధ్యత అందరిపై ఉందని ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం మక్తల్ పట్టణంలోని నారాయణపేట క్రాస్‌రోడ్డులో జగ్జీవన్‌రాం సంఘం అధ్యక్షులు గోలపల్లి నర్సిములు అధ్యక్షతన బాబు జగ్జీవన్‌రాం విగ్రహ ప్రతిష్టాపనకు ఎమ్మె ల్యే భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో వివక్షకు గురవుతూ సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలైన దళిత, గిరిజనులకు రాజ్యాంగంలో ప్రత్యేక హక్కులు, స్థానాన్ని కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపిన దళిత బాంధవుడు బాబు జగ్జీవన్‌రాం అని వారు కొనియాడారు. 1908 ఏప్రిల్ 5న బిహార్ రాష్ట్రంలో జన్మించిన ఆయన 82 సంవత్సరాలు సమసమాజ నిర్మాణానికి అంకితమై, దళితుల అభ్యున్నతికై ఎంతో కృషి చేసి 1986 జూలై 6వ తేదీన పరమపదించారని తెలిపారు. రాజ్యాంగంలో దళితులకు కల్పించిన హక్కులను పరిరక్షించేందుకై తన జీవితాంతం పోరాడిన దళిత జనోద్ధారకుడు బాబుజగ్జీవన్‌రాం అని అన్నారు. ఎంతోకాలంగా ఆయన కేంద్ర మంత్రిగా, దేశ ఉప ప్రధానిగా, సీనియర్ పా ర్లమెంటేరియన్‌గా పనిచేసిన ఆయన తన తుదిశ్వాస ఉన్నంత వరకు దళిత జాతికై పరితపించారని వారు కొనియాడారు. వ్యవసాయ మం త్రిగా ఉన్న కాలంలో హరిత విప్లవం సాధిచడంతో బాబు కీలకపాత్ర పో షించారన్నారు. వ్యవసాయ, ఆహార, కార్మిక, ఉపాధి, రవాణా, తంతితపాలా, రైల్వేశాఖ మంత్రిగా పనిచేసిన ఆయన సేవాభావమే గొప్పదిగా అన్నట్లు పనిచేశారని కొనియాడారు. ప్రతి దళితుడు ఐక్యతతో జీవించి రాజ్యాంగంలో కల్పించిన హక్కులను పొంది అభివృద్ధిలోకి రావాలన్నదే బాబు జగ్జీవన్‌రాం చివరి వరకు ఆశించారని అన్నారు. బాబు జగ్జీవన్‌రాం సంఘం నాయకులు గోలపల్లి నర్సిములు, కొలిమి రాములు, చిన్న హన్మంతులు మాట్లాడుతూ మక్తల్ పట్టణంలో జగ్జీవన్‌రాం విగ్రహావిష్కరణ చేయాలన్న విషయాన్ని గతంలో ఎమ్మెల్యే దృష్టికి, స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లిన వెంబడే స్పందించిన వారందరు నేడు వచ్చి ఈ భూమిపూజలో పాల్గొనడం వారికి బాబు జగ్జీవన్‌రాంపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారని తెలిపారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు వాకిటి శ్రీహరి, చిట్యాల నిజాంపాష, మార్కెట్ చైర్మన్ పి.నర్సింహగౌడ్, కొండయ్య, భాగ్య మ్మ, దళిత, ప్రజాసంఘాల నాయకులు చిన్న హన్మంతు, పోస్టు నారాయణ, సూర్యప్రకాష్, అమరచింత విజయ్, కర్రెం హన్మంతు, కురుమూర్తి, జుట్ల శంకర్, హాజమ్మ, వెంకటయ్య, నర్సిములు, ఈశ్వరయ్య, శాంతప్ప తదితరులు పాల్గొన్నారు.
స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముస్తాబు

మహబూబ్‌నగర్: భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు నాలుగు జిల్లాలో ముస్తాబు చేశారు. ఈ సందర్భంగా మంగళవారం జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని భారీ ఏర్పాట్లు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాట్లను ఎస్పీ రెమా రాజేశ్వరి స్వయంగా పరిశీలించారు. మహబూబ్‌నగర్ పోలీ సు పరేడ్‌గ్రౌండ్‌లో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు మంత్రి లక్ష్మారెడ్డి హాజరై జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. అదేవిధంగా జోగుళాంబ గద్వాల జిల్లాలో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు మంత్రి తలసాని శ్రీనివాస్‌రావు, నాగర్‌కర్నూల్ జిల్లాలో జరిగే వేడుకలకు మంత్రి జూపల్లి కృష్ణారావు, వనపర్తి జిల్లాలో రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ నిరంజన్‌రెడ్డిలు హజరై జాతీయ జెండాను ఎగురవేసి ఆయా జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
పోలీసు పరేడ్‌గ్రౌండ్లలో భారీ ఏర్పాట్లను చేశారు.
భక్తిశ్రద్ధలతో కృష్ణాష్టమి వేడుకలు
* శ్రీకృష్ణుడి వేషధారణలో అలరించిన చిన్నారులు
* భక్తులతో కిటకిటలాడిన కృష్ణమందిరాలు
ఆంధ్రభూమి బ్యూరో
మహబూబ్‌నగర్: భక్తిశ్రద్దలతో కృష్ణాష్టమి వేడుకలు జిల్లాలో వైభవంగా జరిగాయి. సోమవారం జిల్లాలో కృష్ణాష్టమినిపురస్కరించుకుని కృష్ణ మందిరాలకు భక్తులు పొటెత్తారు. భక్తుల రాకతో ఆయా ఆలయా లు సందడిగా మారాయి. ముఖ్యంగా కృష్ణాష్టమిని పురస్కరించుకుని తల్లిదండ్రులు తమ పిల్లలను చిన్ని కృష్ణుడు, గోపికల వేషాదారణలను వేసి మురిసిపోయారు. ఇళ్ల ముందు శ్రీకృష్ణుడి పాదాలను వేసి చిన్ని కృష్ణుడి వేషాదారణలో ఉన్న చిన్నారులను నడిపించారు. వారికి వెన్న, తదితర ప్రసాదాలను నైవేద్యంగా పెట్టి భక్తిశ్రద్దలతో తినిపించారు.
దీంతో కృష్ణమందిరాల్లో ఉట్లు కొట్టే కార్యక్రమం ఎంతో వైభవంగా కొనసాగింది. యువకులు పోటాపోటీగా ఉట్లు కొట్టి సంబరాలు జరుపుకున్నారు. ఆయా ఆలయాల్లో వేదపండితులు శ్రీకృష్ణుడి అవతార విశిష్టతలను భక్తులకు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రమైన మహబూబ్‌నగర్ పట్టణంలో వివిధ పాఠశాలల్లో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
విద్యార్థులు కృష్ణుడి వేషాదారణలు అందరికి అలరించాయి. దింతో పాటు పట్టణ కేంద్రంలోని పద్మావతీ కాలనీలో గల శ్రీకృష్ణుడి దేవాలయంలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయానికి భక్తులు పోటెత్తడంతో పద్మావతీ కాలనీ సందడిగా మారింది.
దేవాలయానికి భక్తులు తరలిరావడంతో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసి ఎలాంటి అవాంచనీయ సంఘటనలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
ఘనంగా శ్రావణవేద పూర్ణాహుతి
మక్తల్: మండల కేంద్రంలోని మక్తల్ పట్టణంలో గల స్థానిక దయానంద విద్యామందిర్ పాఠశాలలో మూడు రోజులు జరిగిన శ్రావణవేద ప్రచార పూర్ణాహుతి ముగింపు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా పాల్గొన్న సర్పంచ్ భాగ్యమ్మ, జెడ్పిటిసి వాకిటి శ్రీహరి, డిసిఎంఎస్ చైర్మన్ నిజాంపాష, బిజెపి నాయకులు కొండయ్య, అక్కల సత్యనారాయణలు పాల్గొని ఉపదేశించారు. విద్యార్థులకు సంస్కారవంతమైన విద్యను అందించుటలో దయానంద విద్యామందిరాలు ముందడుగు వేస్తున్నాయని అన్నారు. విద్యార్థులకు విద్యతోపాటు, మనుర్భవ స్లోకాలు, సంస్కృతి, సభ్యతతో కూడిన విద్యభ్యాసం చేయడం అభినందనీయమన్నారు. ప్రతి శ్రావణమాసంలో యజ్ఞయాగాలు చేస్తూ సమాజ బంధూవులందరికీ వేద సంస్కృతిని అందించాలనే లక్ష్యంగా వేద పఠనం చేస్తూ అగ్నిభగవానుని కొలువడం ఎంతో పుణ్యఫలమని అన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ కట్టసురేష్‌గుప్త, హన్మంతు, ప్రతాప్‌రెడ్డి, హెచ్‌ఎం కర్నిస్వామి, వేద పండితులు రాంచరణ్‌గురూజీ, భీంరెడ్డి, శేషగిరి, అంబ్రేష్, విజయలక్ష్మీ, నీలమ్మ, తిమ్మన్న, భాగ్యమ్మ, లక్ష్మీ, సంధ్య, లక్ష్మీకాంత్, తదితరులు పాల్గొన్నారు.