హైదరాబాద్

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు గోల్కొండ ఖిల్లా సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని చారిత్రక కట్టడమైన గోల్కొండలో సర్వం సిద్ధమైంది. కొద్దిరోజులుగా ఉన్నతాధికారులు, పోలీసు అధికారుల పర్యటన, సమీక్షలతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో పంద్రాగస్టు వేడుకలు జరిగే గోల్కొండ ఖిల్లా పరిసర ప్రాంతాలు, నగరం నుంచి ఖిల్లా వైపు వెళ్లే అన్ని రహదార్లలో పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. సోమవారం సాయంత్రం నుంచే గోల్కొండ కోటలో పోలీసులు మోహరించారు. వేడకలు ముగిసే వరకు వేలాది మంది పోలీసులు విడతల వారీగా విధులు నిర్వర్తించేందుకు వీలుగా ప్రణాళికలు సిద్దం చేశారు. వేడుకలకు మూడు రోజుల ముందు నుంచే ఖిల్లా వైపు రాకపోకలు సాగించే వారి కదలికలను గమనించేందుకు పటిష్టమైన నిఘాను ఏర్పాటు చేశారు. సోమవారం ఖిల్లా వేదికగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గౌరవ వందన, ప్రసంగంతో పాటు పలు పురస్కారాల ప్రదానం, శకటాల ప్రదర్శన వంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు వీలుగా ఏర్పాట్లు చేపట్టారు. మంగళవారం ఉదయం రెండు గంటల పాటు ఈ కార్యక్రమాలు జరగనున్నందున, ఆ రెండు గంటల పాటు గోల్కొండ లోపల, బయట కూడా సాయుధ బలగాలతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సిఎం కెసిఆర్, ఇతర అమాత్యుల విఐపిల రాక సందర్భంగా ఎలాంటి బందోబస్తు చేపట్టాలన్న అంశంపై ఇప్పటికే నగర పోలీసులు బేగంపేటలోని క్యాంపు కార్యాలయం నుంచి గోల్కొండ కోట వరకు ప్రయోగాత్మక పరిశీలన జరిపి, ప్రత్యేక రూట్‌ను ఎంపిక చేయనున్నారు. ఇందుకు గాను మూడంచెల భద్రతను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి అంచెలోనూ సైనికులు, పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు తప్పకుండా ఉండేలా చర్యలు తీసుకున్నారు. వేడుకలు జరిగే రెండు గంటల పాటు విఐపిల రాకపోకలు, బందోబస్తు, సాధారణ ట్రాఫిక్ దారి మళ్లింపు వంటి అంశాలను పర్యవేక్షించేందుకు పలువురు ఉన్నతాధికారులను పర్యవేక్షకులుగా నియమించినట్లు తెలిసింది. ఖిల్లా ప్రధాన ముఖ ద్వారం వద్ధ సాయుధ బలగాలు, పురావస్తుశాఖ అధికారులకు బందోబస్తు బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది. గోల్కొండ కోటకు చేరుకునేందుకు గతంలో ఎనిమిది మార్గాలుండగా, ఇపుడు వీటి సంఖ్య పెరిగింది. చేరుకునే ప్రతి మార్గంలోనూ పోలీసుల బందోబస్తును ఏర్పాటు చేయటంతో పాటు ప్రజల రాకపోకలు, వ్యాపార సంస్థలపై ఆంక్షలను అమలు చేయనున్నారు. వీటిని అత్యవసరంగా, ఆసుపత్రులకు వెళ్లే వారికి మినహాయించనున్నారు.
కీసర: నేడు జరగనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడులకు సర్వం సిద్ధం చేసామని మేడ్చల్ కలెక్టర్ ఎంవి రెడ్డి పేర్కొన్నారు. ఉదయం పది గంటలకు రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ముఖ్య అతిధిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం పోలీసుల గౌరవ వందన స్వీకరణ ఉంటుందన్నారు. అనంతరం జిల్లాలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలనుద్ధేశించి ప్రసంగిస్తారన్నారు.
వివిధ పాఠశాలల విద్యార్ధులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి అవార్డులను హోం మంత్రి అందజేస్తారు. వివిధ శాఖలచే ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రి పరిశీంచిన అనంతరం అసెట్స్ పంపిణీ చేస్తారన్నారు. జిల్లాలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాగం అన్ని ఏర్పాట్లు చేసిందని కలెక్టర్ తెలిపారు. వర్షం పడినా తడవకుండా ఉండేందుకు వీలుగా వాటర్‌ఫ్రూఫ్ టెంట్ టెంట్‌లు ఏర్పాటు చేశామని అన్నారు. ఆహుతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, మొబైల్ మరుగుదొడ్లు ఏర్పాటు చేశామన్నారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో జరుగుతున్న ఏర్పాట్లను జెసి ధర్మారెడ్డి పరిశీలించారు. జెసి వెంట డిఆర్‌ఒ సురేందర్‌రావు, కీసర ఆర్డీఒ హన్మంత్‌రెడ్డి, సిఐ సురేందర్, బాంబ్‌స్వాడ్ బృందం ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
షాబాద్: 71వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సర్వం సిద్దమయ్యారు. మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో అన్ని ప్రభుత్వ ప్రవేటు కార్యాలయాలు, పాఠశాలలు అందంగా ఏర్పాటు చేశారు. పాఠశాలల్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని గత వారం రోజులుగా విద్యార్థులకు ఆటల పోటీలు, క్విజ్‌లను నిర్వహించారు. క్రీడల్లో మంచి ప్రతిభ కనబరిచిన వారికి స్వాతంత్య్ర దినోత్సవం రోజున వారికి బహుమతులను అందించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. జెండా కార్యక్రమం అనంతరం విద్యార్థులచే వివిధ సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు ఏర్పాట్లు చేస్తున్నారు.
దౌల్తాబాద్: స్వాతంత్య్ర దినోత్సవానికి మండలంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు పాఠశాలలను ఆయా శాఖల అధికారులు, విద్యార్థులు రంగు రంగుల కాగితాలతో విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు. దీంతో సోమవారం ప్రధాన దుకాణాలు జెండాల కొనుగొళ్లతో కిటకిటలాడాయి,
బొంరాస్‌పేట: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పాఠశాలలు విద్యుత్ దీపాలంకరణలతో ధగధగలాడుతున్నాయి. కార్యాలయాలు, పాఠశాలలను సోమవారం విద్యార్థులు, సిబ్బంది సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. బొట్లవానితండాలోని బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినులు తమ తరగతి గదులను అందంగా తీర్చిదిద్దారు.
వికారాబాద్: జిల్లా కేంద్రంలోని పోలీసు మైదానంలో మంగళవారం ఉదయం నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను కలెక్టర్ డి.దివ్య సోమవారం పరిశీలించారు. మైదానంలో అన్ని శాఖలు స్టాళ్ళను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పరేడ్ రిహార్సల్స్‌ను పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని పలు కూడళ్లలో ఇటీవలే బిగించబడి ప్రారంభం కాని సిగ్నల్స్‌ను పరిశీలించారు. జిల్లా పోలీసు శిక్షణ కేంద్రం సమీపంలో నిర్మాణం కానున్న జిల్లా కలెక్టరేట్, ఇతర కార్యాలయాల నిర్మాణ స్థలాన్ని కలెక్టర్ చూశారు. వికారాబాద్ జిల్లా ఎస్పీ టి.అన్నపూర్ణ, జెసి సురేష్ పొద్దార్, డిఆర్‌వో జి.సంధ్యారాణి, ఆర్డీవో విశ్వనాథం, వికారాబాద్ డిఎస్పీ టి.స్వామి, డిఆర్‌డివో జాన్సన్, డిఎంహెచ్‌వో దశరథ్, జిల్లా క్రీడల శాఖ అధికారి హన్మంత్‌రావు ఉన్నారు.
121 మందికి మెరిటోరియస్ సర్ట్ఫికెట్లు
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మంగళవారం వికారాబాద్ జిల్లాకు చెందిన 121 మందికి మెరిటోరియస్ సర్ట్ఫికెట్లను ముఖ్యఅతిథి అందజేయనున్నారు. వికారాబాద్ జిల్లా రెవెన్యూ అధికారి జి.సంధ్యారాణి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె.వరప్రసాద్, జిల్లా పశు సంవర్దక శాఖ అధికారి ఎంవి సుబ్బారావు, ఎడి సి.సత్యనారాయణతో పాటు నూరు శాతం మరుగుదొడ్ల నిర్మాణం, బహిరంగ మలమూత్ర విసర్జన రహిత గ్రామాలుగా సాధించిన ఏడు గ్రామాల సర్పంచ్‌లు ఉన్నారు.