మంచి అబ్బాయిలేరి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం టాలీవుడ్‌లో క్రేజీ అవకాశాలతో దూసుకుపోతున్న అందాల భామ రకుల్ అబ్బాయిలపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఆమె కామెంట్స్ ఎలా ఉన్నాయంటే అసలు మగజాతిలో మంచివాళ్లన్నదే ఉండరని స్టేట్‌మెంట్ ఇచ్చేసి షాకిచ్చింది. వివరాల్లోకి వెళితే లేటెస్టుగా ఓ ఇంటర్వ్యూలో నీకు కాబోయేవాడు ఎలా ఉండాలి? అన్న ప్రశ్నకు రకుల్ చిత్రమైన సమాధానం ఇచ్చింది. అసలు అబ్బాయిల్లో మంచివాళ్లు ఉంటారా? అంటూ రివర్స్ ప్రశ్న వేసింది. అసలు అబ్బాయిల్లో మంచివాళ్లు ఉండరు? ఇందులో సందేహం లేదు. ఒకవేళ మంచివారు ఉన్నారనుకుంటే, వాళ్లు నటిస్తున్నట్టే లెక్క. అమ్మాయిల ముందు అబ్బాయిలు మంచివాళ్లుగా నటిస్తారు అంతే. వాళ్లు ఎదురుగా లేనపుడు ఎలాంటి వేషాలు వేస్తారో ఎవరికీ తెలియదు? అందుకే అబ్బాయిల్లో మంచివాళ్లు ఉండరని నా నమ్మకం అని తెగేసి చెప్పేసింది. అంతేకాకుండా అబ్బాయిల్లో మంచివాళ్లు ఉండరు కాబట్టే నాకు మంచివాడు భర్తగా రావాలని అనుకోవడం లేదనీ కామెంట్ చేసిందట. తనకు కాబోయే భర్త మంచివాడు కాకున్నా ఫరవాలేదు కానీ, తనకన్నా పొడవుగా ఉండాలని చెప్తోంది గడుసుపిల్ల. మొత్తానికి రకుల్ కామెంట్లను ఆమె ఫ్యాన్స్ ఫన్నీగా తీసుకుంటారో, హార్ట్ చేసినట్టు తీసుకుంటారో చూడాలి.