ఉయ్యాలవాడ మొదలెట్టాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మొదలైంది. బుధవారం కొణిదెల ప్రొడక్షన్స్ కార్యాలయంలో పూజా కార్యక్రమంతో సినిమా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి, సురేఖ, రాంచరణ్, అల్లు అరవింద్ తదితరులు పాల్గొన్నారు. సురేందర్‌రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాంచరణ్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజుని పురస్కరించుకుని ఈ సినిమా టైటిల్‌తోపాటు ఫస్ట్ లుక్ విడుదల చేస్తారట.