ఫోకస్

హక్కులను పరిరక్షించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దళితులపై దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి. స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు గడచిన తర్వాత కూడా దేశంలో పలు రాష్ట్రాల్లో దళితులపై దాడులు జరుగుతున్న వార్తలు చూసి మనసు బాధతో కుంగిపోతోంది. కాని దళితులపై దాడులు జరిగినా నిందితులను శిక్షించేందుకు ఇప్పుడున్న చట్టాలు సరిపోతాయా అనే అనుమానం వస్తుంది. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్, ఇంకా ఎంతో మంది మహనీయులు చేసిన కృషివల్ల దళితుల హక్కుల పరిరక్షణకు రాజ్యాంగంలో చట్టాలను చేర్చారు. ఈ చట్టాల అమలుకు ప్రత్యేక కమిషన్‌ను కూడా నియమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. పైగా జాతీయ స్థాయిలో ఎస్సీ, ఎస్టీ కమిషన్లు ఉన్నాయి. దళితుల అభివృద్ధికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. అలాగే ప్రత్యేక బడ్జెట్‌ను కూడా రూపొందించి అమలు చేస్తున్న రాష్ట్రాలున్నాయి. ఎన్నికల్లో దళితుల ఓట్లకోసం రాజకీయ పార్టీలు పోటీ పడుతుంటాయి. కాని దళితుల హక్కుల పరిరక్షణకు రాజకీయ పార్టీలు రాజకీయాలకు అతీతంగా ఒక వేదికపైకి రావాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో నేరెళ్ల, ఆంధ్రాలో గరగపర్రు ఉదంతాలు తాజాగా జరిగాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కారంచేడు, పదిరికుప్పం, చుండూరు ఘటనలు, తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు దళిత యువకులకు శిరోముండనం లాంటి ఘటనలు చరిత్రలో విషాధ ఘట్టాలు. ప్రతి పౌరుడు సిగ్గుతో తలవంచుకోవాలి. ఈ ఘటనల్లో దాడులకు పాల్పడిన వారికి శిక్షలు పడ్డాయా? ఈ ఘటనల విచారణ ఏళ్ల తరబడి జరిగింది. ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశారు. ఉన్నత న్యాయస్ధానాలకు కూడా వెళ్లారు. కాని బాధితులకు ఎంతవరకు న్యాయం జరిగింది? దళితుల పట్ల వివక్షత ఈ రోజు కొత్త కాదు. వేలాది సంవత్సరాలుగా భారతదేశంలో ఈ అనాచారం సాగుతోంది. అంటరానితనాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు గతంలో ఎంతోమంది సంఘ సంస్కర్తలు, కమ్యూనిస్టు పార్టీలు పోరాడాయి. కాని ఇంకా ఏదో ఒక రూపంలో ఈ అనాచారం దర్శనమిస్తూనే ఉంది. కొన్ని జిల్లాల్లో ఇంకా రెండు గ్లాసుల పద్ధతి అమలులో ఉంది. దళితుల హక్కుల పరిరక్షణకు చట్టాలు చేయడంతో మన పని ముగిసినట్లు రాజకీయ పార్టీలు భావించరాదు. వాటిని అమలు చేయడంపై శ్రద్ధపెట్టాలి. దాడులకు పాల్పడిన వారికి నిర్దేశించిన కాలపరిమితి లోపల విచారణ ముగించి శిక్షలు పడాలి. మరోవైపు సమాజంలో అన్ని వర్గాల్లో మనమంతా ఒక్కటే, ప్రజలు సంఘటితంగా ఉంటే, దేశం బలంగా ఉంటుందనే సందేశం పోవాలి.

విశే్వశ్వరరెడ్డి వైకాపా శాసనసభాపక్ష ఉపనేత, ఆంధ్రప్రదేశ్