ఫోకస్

భరించలేకే దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనది కుల సమాజం. ఈ కుల సమాజంలో ప్రతి ఒక్కరినీ కులం కోణం నుంచి చూస్తారు. అసలు ఈ కుల వ్యవస్థలో అసమానతలు, ఆధిపత్యాలు, అవమానాలు భరించినంతకాలం బాధలేవీ కన్పించవు. వీటిపై ధిక్కారస్వరం వినిపించినపుడే అత్యాచారాలు, దాడులు, బహిష్కరణలు, ఏరివేతలు సంభవిస్తున్నాయి. అంటరాని కులాలుగా ఊరికి దూరంలో వెలివేయబడిన దళితులది నేడు ధిక్కార స్వరూపంగా మారింది కాబట్టే తట్టుకోలేని ఆధిపత్య కులాలు, పాలక కులాలు దళితులపై దాడులు, దమనకాండలకు దిగుతున్నాయి. మనిషిని మనిషిగా చూడాలన్న మన రాజ్యాంగ లక్ష్యం... ఆపై కులతత్వ స్థానంలో మానవత్వాన్ని నింపాలని పోరాడిన మహనీయుడు అంబేద్కర్ ఆశయాల వెలుగులో ఈ నవీన కాలంలో దళితులు ఆత్మగౌరవం కోసం దాడులు, అవమానాలకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నారు. డాక్టర్ అంబేద్కర్ ప్రారంభించిన ఆత్మగౌరవ పోరాటం ఈ తెలుగుగడ్డపై సైతం 1985 కారంచేడులోదాడి నుండి ఉవ్వెత్తున పుట్టుకొచ్చింది. ఆ తర్వాత చుండూరు మారణ కాండకు వ్యతిరేకంగా జాతీయ, అంతర్జాతీయ దళిత మానవహక్కుల పోరాటంగా రూపుదిద్దుకుంది. అనంతరం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో దళితులపై కొనసాగిన దాడులపై దళితుల నాయకత్వంలో అనేక పోరాటాలు విజృంభించాయి. ఈ నేపథ్యంలో దళితుల రక్షణ కొరకు అనేక ప్రత్యేక రక్షణ చట్టాలు, ప్రత్యేక పథకాలు పుట్టుకొచ్చాయి. అయినా ఎలాంటి ప్రయోజనం కన్పించడం లేదు. వివిధ కార్యక్రమాలకు కోట్లాది రూపాయల వ్యయంతో ప్రచారం చేసే ప్రభుత్వాలు అంటరానితనం, అత్యాచారాలకు వ్యతిరేకంగా చైతన్యం తెచ్చే ప్రయత్నాలు లేవు. ముఖ్యంగా ప్రత్యేక కాలనీలు, దళితవాడలను తొలగించి గ్రామాల్లో సహజీవనం కల్పించే వివిధ పథకాలు తీసుకొచ్చే విద్యా సంస్థల ఏర్పాటు ద్వారా కొంతమేర అయినా దళితులపై దాడులు తొలగుతాయని ఆశిద్దాం.

-మేళం భాగ్యారావు, జాతీయ ప్రధాన కార్యదర్శి దళిత బహుజన ఫ్రంట్, గుంటూరు.