ఫోకస్

ప్రభుత్వాలు విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వాతంత్య్రం లభించి 70 ఏళ్లు గడచినా నేటికి దళితులపై దాడులు ఆగడం లేదు. దేశంలో ప్రధానంగా బిహార్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో గుజరాత్‌లో కూడా దళితులపై దాడులు జరుగుతున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. సాధారణంగా దళితులను బహిరంగంగా అవమానపర్చడం, హత్యలు, బహిరంగ ప్రదేశాల్లో తిరగనివ్వక పోవడం. సాంఘిక బహిష్కరణ, అత్యాచారాలు, సాంప్రదాయ భూమి హక్కుల నుంచి వారిని నిరాకరించడం, మానభంగాలు, మానసికంగాను, శారీరకంగా వారిని గాయపరచడం వంటివి తరచూ జరుగుతున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో ప్రకారం ఈ తరహా నేరాలు అత్యధికంగా నమోదవుతున్నాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది. చుండూరు, కారంచేడు, వేంపేట నుంచి ప్రారంభమైన అత్యాచారాల పరంపర శ్రీకాకుళం జిల్లా లక్ష్మింపేట వరకు సాగింది. ఈ మధ్య కాలంలో ఐనపల్లి, గరుగుపర్రు, దేవరాపల్లి, ప్రకాశం, అమలాపురం ప్రాంతాల్లో దాడులు పెరిగాయి. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమైంది. ఫలితంగానే అట్రాసిటీ కేసులు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం ఏడు రకాల చర్యలు తీసుకోవాలి. ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం సక్రమంగా అమలుచేయడం, పర్యవేక్షణపై ఉన్నత స్థాయి కమిటీ సమీక్ష, విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ, జిల్లా విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ పనితీరును ఎప్పటికపుడు సమీక్షించాలి. ముందస్తు నివారణ చర్యలు తీసుకోవాలి. చట్టంపై నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకోవాలి. సెక్షన్ 21(4) ప్రకారం కేంద్రం పార్లమెంట్‌కు నివేదిక అందజేయాలి. ఇదే సెక్షన్‌పై బిఎస్పీ నేత మాయవతి పార్లమెంట్‌లో తీర్మానం చేయాలని పట్టుబట్టగా పార్లమెంట్‌లో అనుమతించలేదు. దీంతో ఆమె తన రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన విషయం విదితమే. రూల్ 18 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీకి నివేదిక ఇవ్వాలి. దానిపై చర్చ జరగాలి. హోం సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రతి మూడు నెలలకోమారు సమీక్ష జరిపి కేంద్ర ప్రభుత్వానికి నివేదికలను అందజేయాలి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం అమలుకు ప్రతి జిల్లాలో నోడల్ అధికారిని నియమించాలి. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఎక్కడా ఇలాంటివి అమలు చేయడం లేదు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పరిపూర్ణంగా అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ఆ ఆదేశాలు ఎక్కడా అమలు కావడం లేదు. వీటన్నింటిపై ఇటీవల ఢిల్లీలోని ‘నేషనల్ క్యాంపయిన్ ఆన్ దళిత్ హ్యూమన్ రైట్స్’ సమావేశంలో ప్రస్తావించడం జరిగింది.

-చిట్టిబాబు దళిత బహుజన శ్రామిక యూనియన్ ఏపి ప్రధాన కార్యదర్శి