కృష్ణ

స్వచ్ఛ రైల్వేగా తీర్చిదిద్దడమే ప్రధాన ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (రైల్వేస్టేషన్): స్వచ్ఛ్భారత్, స్వచ్ఛ రైల్వే పేరుతో 15 రోజులు పరిసరాల పరిశుభ్రత, ఆరో గ్య భద్రతపై ప్రత్యేక కార్యక్రమం చేపట్టడం జరిగిందని విజయవాడ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ ఆర్ ధనుంజయులు చెప్పారు. తూర్పు ప్రధాన ము ఖద్వారం నుంచి రైల్వేస్టేషన్‌లో విధు లు నిర్వహిస్తున్న సఫాయి సహాయ కర్మచారి సిబ్బంది ద్వారా ర్యాలీని బుధవారం నిర్వహించారు. అనంతరం చెత్త ఉన్న ప్రదేశాల్లో స్వీపర్లు పెట్టి క్లీన్ అం డ్ గ్రీన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ధనుంజయులు విలేఖర్ల తో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇ చ్చిన పిలుపు మేరకు పక్షం రోజులు అంటే బుధవారం 16నుంచి ఈ నెల 30వరకు 15 రోజులు స్వచ్ఛ రైల్వే కా ర్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ఈ 15 రోజులు రోజుకొకసారి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ఆ యన ఈ సందర్భంగా వివరించారు. ఇందులో ప్రధానంగా ప్రయాణికులకు స్వచ్ఛ రైల్వే కార్యక్రమంలో అవగాహ న కలిగే విధంగా తెలియచేయడం జరగుతుందన్నారు. ప్రస్తుతం రైల్వేస్టేషన్ పరిశుభ్రతగా ఉన్న ఇంకా మెరుగైన స్టేషన్‌గా తీర్చిదిద్దాలనేది తమ అందరి ధ్యేయమన్నారు. స్వచ్ఛ రైల్వే కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయస్థాయి కార్యక్రమంలో భారతీయ రైల్వేలో 4వ స్థానంలో నిలిచిందన్నారు. ఈ విషయంలో ప్రయాణికుల సహకారం ఎంతో అవసరమన్నారు. భవిష్యత్‌లో చేపట్టే కార్యక్రమాల్లో సైతం ప్రయాణికుల సహకారం ఎంతో తోడ్పాటు కావాలన్నారు. అనంతరం 1వ నెంబర్ ప్లాట్‌ఫారం ప్రధాన ద్వారా దగ్గరలోని జనరల్ బుకింగ్ కౌంటర్‌కి సమీపంలో రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ సిబ్బంది రూపొందించిన పరిసరాల పరిశుభ్రతపై ఒక డాక్యుమెంటరీని ప్రదర్శించారు. ఇందులో ప్రధానంగా ప్రయాణికులు తాము కూర్చున్న కుర్చీల వద్ద తిన్న శనక్కాయల తొక్కలు, బిస్కెట్ కవర్లు వంటివి తిని పారేయడానికి చూసిన ఆర్‌పిఎఫ్ కానిస్టేబుల్ అపరిశుభ్రత కారణంగా రూ.200ల జరిమానా కట్టాలని విధించడం వంటి ప్రదర్శన ప్రయాణికులను ఎంతగానో ఆకర్షించింది. అనంతరం 1వ నెంబర్ ప్లాట్‌ఫారంపై ఉన్న సాధారణ ప్రయాణికులు వేచి ఉండే ప్రాంతంలో రైల్వేస్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సఫాయి వాలాకి చెందిన సిబ్బంది, లైసెన్స్ పోర్టర్లు, వివిధ విభాగాల్లో పని చేస్తున్న సిబ్బంది, సూపర్‌వైజర్లు, సి అండ్ డబ్ల్యు (క్యారేజి అండ్ వ్యాగిన్) విభాగానికి చెందిన సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ధనుంజయులు మాట్లాడుతూ స్వచ్ఛ రైల్వే కార్యక్రమాన్ని చేపట్టడం, అలాగే ప్రయాణికులతో అవగాహన కల్పించే బాధ్యత అందరిపైన ఉందని వివరించారు. సమావేశంలో రైళ్లబోగీలు శుభ్రం చేసే సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషినల్ డివిజనల్ రైల్వే మేనేజర్ కె వేణుగోపాలరావు, కన్‌స్ట్రక్షన్ విభాగానికి చెందిన చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ విజయ్ అగర్వాల్, సీనియర్ డిఎంఇ సత్యనారాయణరెడ్డి, గెజిటెడ్ స్టేషన్ మేనేజర్ సిహెచ్ సురేష్, చీఫ్ హెల్త్ ఇన్‌స్పెక్టర్ వాసు తదితరులు పాల్గొన్నారు.

జిమ్నాస్టిక్స్‌లో జిల్లాకు పలు పతకాలు
విజయవాడ (స్పోర్ట్స్): కాకినాడలో ఈనెల 11నుండి 13వరకు జరిగిన రాష్టస్థ్రాయి జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్‌లో జిల్లా క్రీడాకారులు పలు పతకాలు కైవసం చేసుకున్నట్లు జిల్లా జిమ్నాస్టిక్స్ సంఘ కార్యదర్శి ఎస్‌కెఎల్ పి శాస్ర్తీ తెలిపారు. అండర్-10 బాలిక ల విభాగంలో ఎస్ ఐశ్వర్య, ఎస్ కీర్తన, కె సూర్యకళ, కె సరయు, సిహెచ్ అశ్రీతలతో కూడిన జిల్లా జట్టు చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది. అండర్- 10 వ్యక్తిగత బాలికల విభాగంలో ఎస్ ఐశ్వర్య ఫ్లోర్ ఎక్సర్‌సైజ్, బ్యాలన్సింగ్ బీమ్‌తో పాటు ఆల్‌రౌండ్ చాంపియన్‌షిప్‌ను దక్కించుకుంది. ఎస్ కీర్తన ఫో లర్ ఎక్సర్‌సైజ్‌లో ద్వితీయస్థానం, బ్యా లన్సింగ్ బీమ్‌తో పాటు ఆల్‌రౌండ్ చాంపియన్‌షిప్‌లో తృతీయస్థానం సా ధించగా బాలుర విభాగంలో డి ఆరవింద్ దత్త టేబుల్ వాల్ట్‌లో తృతీయస్థానం దక్కించుకున్నారు. సీనియర్ బాలికల వ్యక్తిగత విభాగంలో ఎస్‌కె యాసిన్ టేబుల్ వాల్ట్‌లో ప్రథమస్థా నం, ఫ్లోర్ ఎక్సర్‌సైజ్‌లో ద్వితీయసా థనం, బ్యాలన్సింగ్ బీమ్‌లో తృతీయస్థా నం, ఆల్‌రౌండ్ చాంపియన్‌షిప్‌లో ద్వి తీయస్థానం సాధించగా అన్‌ఇవేన్ బా ర్స్‌లో కె లతశర్వాణి ప్రథమస్థానం కైవ సం చేసుకుంది. వీరు విపి సిద్ధార్థలోని శాయ్‌లో శిక్షణ పొందుతున్నారు.

అనధికార చేపల సాగుదారులపై కఠిన చర్యలు
విజయవాడ: కొల్లేరు అభయారణ్యంలో అనధికార చేపలు సా గు, పర్యావరణానికి హాని వంటి చట్ట వ్యతిరేక చర్యలపై కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్ బి లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. కొల్లేరు అభయారణ్యంలో అనధికార చెరువుల నిర్మాణాలు నిర్వహిస్తున్నారని ఫిర్యాదులపై నగరంలోని కలెక్టర్ తన క్యాంపు కార్యాలయంలో బుధవారం అటవీశాఖ వైల్డ్‌లైఫ్, రెవెన్యూ, పోలీసు అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 5వ కాంటూర్ లోపల ఎ టువంటి అక్రమ చెరువుల నిర్మాణాలు, చేపలసాగు చేపట్టకుండా అటవీశాఖ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టాలన్నారు. అక్రమ చెరువుల నిర్మాణాలు, పక్షులు వేటపై అధికారులు దాడులు నిర్వహిం చి కేసులు నమోదు చేయాలన్నారు. కొ ల్లేరు సరస్సుకు సంబంధించిన విషయాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటుందని ఫిర్యాదులు వస్తే సమన్వయంతో పరిష్కరించాలన్నారు. అటవీశాఖ, రెవెన్యూ, జలవనరులు, మత్స్యశాఖ, పోలీసు అధికారులు సంయుక్తం గా క్షేత్రస్థాయిలో పరిశీలించి 2రోజుల్లో వాస్తవ నివేదికలను అందించాలని కలెక్టర్ ఆదేశించారు. కొల్లేరు అభయారణ్యంపై ఎటువంటి ఫిర్యాదులు వచ్చినా అధికారులు బాధ్యత వహించాల్సి ఉం టుందని కలెక్టర్ హెచ్చరించారు. పర్యావరణానికి, సరస్సుల్లో నిషేధిత చేపలసాగు వంటి కార్యకలాపాలు నిర్వహిం చే వారిపై కొల్లేరు అభయారణ్యం చట్ట ప్రకారం నేరంగా పరిగణించి కేసులు నమోదు చేయడం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు. సమావేశంలో జెసి చంద్రుడు, డిఆర్‌వో ఎం వేణుగోపాలరెడ్డి, మత్స్యశాఖ జెడి యాకూబ్ బాషా, అటవీశాఖ వైల్డ్‌లైఫ్, డిఎఫ్‌ఓ వి సాయిబాబ, పర్యావరణ కంట్రోల్ బోర్డు అధికారి టి ప్రసాదరా వు, ఇరిగేషన్ ఇఇ ఆర్ మోహన్‌రావు, పోలీసు శాఖ అధికారి బి విజయ్ పాల్గొన్నారు.

వాహనదారులకు ట్రాఫిక్ ‘గులాబీ’
* సీటుబెల్టు వాడకంపై అవగాహన
విజయవాడ (క్రైం): నగరంలో వాహనదారులకు సీటుబెల్టు వినియోగం పట్ల అవగాహన కలిగించేందుకు ట్రాఫిక్ పోలీసులు బుధవారం వినూత్న కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా ఫుడ్ జంక్షన్, మహానాడు, రామవరప్పాడు, సీతమ్మవారి పాదాలు, పిఎస్‌ఆర్ బొమ్మ, వారధి, ఆర్‌టిఏ జంక్షన్, రమేష్ ఆస్పత్రి, విఆర్ సిద్ధార్థ కాలేజ్, ఎనికేపాడు సెంటర్, సీతన్నపేట గేట్, చుట్టుగుంట సెంటర్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు వాహానదారులను ఆపి వారితో గౌరవ పూర్వకంగా వ్యవహరిస్తూ సీటు బెల్టు అవశ్యకతను తెలియచేశారు. దీనిలో భాగంగా గులాబీ పూలు ఇచ్చి సీటు బెల్టు ధరించాల్సిందిగా విఙ్ఞప్తి చేశారు. రోడ్డు ప్రమాదాల బారిన పడినప్పుడు సీటు బెల్టు ధరించడం వల్ల ప్రాణాలు రక్షించుకోవచ్చని, సురక్షితంగా గమ్యానికి చేరుకోవచ్చని సూచించారు. ఈకార్యక్రమంలో ట్రాఫిక్ ఏడిసిపి టి నాగరాజు, ట్రాఫిక్ ఏసిపి టి మురళీకృష్ణ, డి శ్రావణ్‌కుమార్, ఎం వెంకటేశ్వర్లు, ట్రాఫిక్ సిఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

సుబాబుల్ రైతులకు బకాయిలు చెల్లించినప్పుడే అసలైన పండుగ
* మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
నందిగామ: సుబాబుల్ రైతు బకాయిలు చెల్లింపునకు త్వరలో చర్యలు తీసుకుంటామని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. బుధవారం సాయంత్రం మార్కెట్ యార్డ్ చైర్మన్ చిరుమామిళ్ల శ్రీనివాసరావు, పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా హజరు కావాల్సి ఉన్న మంత్రి దేవినేని ఉమామాహేశ్వరరావు అనివార్య కారణాల వల్ల హజరు కాలేకపోతున్న నేపథ్యంలో మధ్యాహ్నం 2గంటల సమయంలో మండలంలోని చందాపురం గ్రామానికి చేరుకొని యార్డ్ చైర్మన్ చిరుమామిళ్ల శ్రీనివాసరావును అభినందించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఎన్‌టి రామారావు కాంస్య విగ్రహానికి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. తదుపరి నియోజకవర్గంలో ఎత్తిపోతల పథకాల నిర్వహణపై డిసి చైర్మన్‌లతో సమీక్ష జరిపారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి అక్కడి నుండే జెఎండికి ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. ఏ ఒక్క స్కీమ్ ఆగడానికి వీలులేదని, అన్ని స్కీమ్‌లు సక్రమంగా పనిచేసే విధంగా పర్యవేక్షణ చేయాలని డిసి, నీటి సంఘాల చైర్మన్‌లకు సూచిస్తూ స్కీమ్‌ల విషయంలో ఏ సమస్య ఎదురైనా తక్షణం తన దృష్టికి తీసుకురావాలన్నారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ సుబాబుల్ రైతు బకాయిల చెల్లింపుల విషయంలో మంత్రి నారా లోకేష్ కూడా సానుకూలంగా స్పందించారన్నారు. కంపెనీ యాజమాన్యం ద్వారాగానీ లేక ప్రభుత్వం ద్వారాగానీ త్వరలో బకాయిల చెల్లింపునకు చర్యలు తీసుకుంటామని, అప్పుడే తమకు అసలైన పండుగ అన్నారు. సుబాబుల్ రైతు బకాయిల చెల్లించే రోజు యార్డ్ చైర్మన్ బుజ్జితో కలిసి భారీ ర్యాలీలో పాల్గొంటానన్నారు. కంపెనీకి సంబంధించిన యాజమాన్యంను పిలిపించి మాట్లాడాలని డిఎస్‌పి ఉమామాహేశ్వరావును ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు కోట వీరబాబు, నగర పంచాయతీ చైర్‌పర్సన్ వై పద్మావతి, ఎన్‌ఎస్‌పి డిసి చైర్మన్ నెలకుదిటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

రాష్టస్థ్రాయి బేస్‌బాల్ పోటీలకు వేలేరు విద్యార్థులు
హనుమాన్ జంక్షన్: ఈ నెల 18వ తేది నుంచి కడపలో జరిగే రాష్టస్థ్రాయి బేస్‌బాల్ పోటీల్లో పాల్గొనే కృష్ణాజిల్లా జట్టుకు బాపులపాడు మండల విద్యార్థులు అర్హత సాధించారు. ఈ మేరకు వేలేరు జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు వరప్రసాద్ స్థానిక విలేఖర్లకు ఒకప్రకటన విడుదల చేశారు. 11న విజయవాడలో జరిగిన జిల్లా బేస్‌బాల్ జట్టు అర్హత ఎంపికపరిక్షలో వేలేరు జిల్లా పరిషత్ విద్యార్థులు సత్తాచాటారు. రాష్టస్థ్రాయి జట్టుకు అర్హత సాధించిన నక్కా శ్రీనివాసరావు, కృష్ణవరపు వెంకటేశ్వరమ్మ, వీరవల్లి శివ, జరపల శ్రీదేవిలను బుధవారం పాఠశాల సిబ్బంది, గ్రామ ప్రముఖులు వేములపల్లి శ్రీనివాసరావు, సర్పంచ్ బణావతుల కుమారి, ఉప సర్పంచ్ అవిర్నేని భవాని శంకర్, విద్యాకమిటి చైర్మన్ పోలగాని నాగరాజులు అభినందించారు.

కాలువ కట్టలపై గడ్డి వేలంపాటలను రద్దుచేయాలి
* తోట్లవల్లూరులో గొర్రెల కాపరుల ధర్నా
తోట్లవల్లూరు: ఇటీవల ఎవరికి తెలియకుండా నిర్వహించిన కాలువ కట్టలపై గడ్డి వేలం పాటలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తోట్లవల్లూరులో గొర్రెల కాపరులు బుధవారం ధర్నా చేశారు. వేలాది గొర్రెలను సెంటర్ నుంచి పంచాయతీ కార్యాలయం వరకు రోడ్డుపై నిలిపి ధర్నాకు దిగారు. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. గత పదేళ్లుగా గడ్డివేలం పాటలను నిలిపివేశారని, అందరూ గొర్రెలను కాలువ కట్టలపై మేపుకుని జీవిస్తున్నారని, ఇరిగేషన్‌శాఖలో ఒక ఉద్యోగి ఎవరికి తెలియకుండా గుట్టుగా గడ్డివేలం నిర్వహించి ఒకవ్యక్తికి కట్టపెట్టారని, ఇపుడు గ్రామంలో 20 మంది కాపరుల గొర్రెలను కూడా మేపుకునే అవకాశం లేకుండా పోయిందని కాపరులు వాపోయారు. కాలువ కట్టలను తాను పాడుకున్నానని, ఎవరి గొర్రెలు రావటానికి వీల్లేదని ఒకవ్యక్తి అడ్డుతగులుతున్నాడని చెప్పారు. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ ప్రసాద్ వచ్చి ధర్నాకు దిగిన గొర్రెల కాపరులతో మాట్లాడారు. సమస్యను వారు ఎస్‌ఐకి వివరించారు. అలాగే సాగునీటి వినియోగదారుల సంఘం డైరెక్టర్ మైనేని తారాచంద్ వచ్చి కాలువ కట్టల పాటలను నిర్వహించలేదని, అందరూ కాలువ కట్టలపైకి గొర్రెలను తోలుకెళ్లాలని సూచించారు. ఇరిగేషన్ అధికారులతో మాట్లాడతానని ఎస్‌ఐ ప్రసాద్ తెలపటంతో ధర్నా విరమించారు.

రోడ్ల మీద తిరిగే పశువులను గోసంరక్షణశాలలకు తరలిస్తాం
* సెట్ కాన్ఫరెన్స్‌లో ఎస్పీ త్రిపాఠి
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం: ప్రధాన రహదార్లపై విచ్చలవిడిగా తిరుగుతున్న పశువులను యజమానులు నియంత్రించకపోతే గో సంరక్షణశాలలకు తరలిస్తామని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి హెచ్చరించారు. జిల్లా కేంద్రం మచిలీపట్నం, గుడివాడ పట్టణాల్లో ఈ సమస్య అధికంగా ఉందని, దీన్ని నివారించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తున్నట్లు బుధవారం రాత్రి పోలీసు అధికారులతో నిర్వహించిన సెట్ కాన్ఫరెన్స్‌లో ఎస్పీ తెలిపారు. రోడ్ల మీద తిరుగుతున్న పశువుల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు, గతంలో జరిగిన ప్రమాదాలపై పశు యజమానులకు అవగాహన కల్పిస్తామన్నారు. రోజు రోజుకూ జటిలంగా మారుతున్న ఈ సమస్యలను ఎవరికి వారు తమకెందుకులే అని వ్యవహరిస్తున్నారన్నారు. అన్ని శాఖల సమన్వయంతోనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. ఆ దిశగా శాఖల మధ్య సమన్వయం కల్పించి రోడ్ల మీద పశువులు తిరగకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పోలీస్, మున్సిపల్, పశు సంవర్ధక శాఖల అధికారులు తరుచూ సమావేశాలు నిర్వహించుకుని పశువుల నియంత్రణకు చర్యలు తీసుకోవల్సి ఉంటుందన్నారు. ముందుగా పశు యజమానులకు అవగాహన కల్పిస్తామని, ఆ తర్వాత రోడ్ల మీదకు వచ్చే పశువులకు జరిమానా విధిస్తామని, అప్పటికీ సమస్య పరిష్కారం కాని పక్షంలో సంబంధిత పశువులను గోసంరక్షణశాలలకు తరలిస్తామన్నారు.

లాక్డ్‌హౌస్ మానిటరింగ్ సిస్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలి
మచిలీపట్నం (కోనేరుసెంటర్): చోరీల నియంత్రణకు పోలీసు శాఖ నూతనంగా ప్రవేశ పెట్టిన లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం (ఎల్‌హెచ్‌ఎంఎస్)ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పట్టణ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వాసవి కోరారు. సాంకేతికపరమైన ఈ సౌకర్యాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకునేలా విద్యార్థులు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. బుధవారం పట్టణంలోని పలు కళాశాలల విద్యార్థులకు ఎల్‌హెచ్‌ఎంఎస్ సిస్టంపై విద్యార్థులకు ఆమె అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ తమ తమ స్మార్ట్ ఫోన్‌లలో ఎల్‌హెచ్‌ఎంఎస్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. తమ తమ నివాసాలను వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లే సమయంలో సంబంధిత యాప్ ద్వారా పోలీసు వారికి సమాచారం అందిస్తే మీ గృహాలపై ప్రత్యేక నిఘా పెడతామన్నారు. దీని వల్ల చోరీలను పూర్తిగా నియంత్రించవచ్చన్నారు. ఈ సదస్సులో ఆర్‌పేట ఎస్‌ఐ హబీబ్ భాషా తదితరులు పాల్గొన్నారు.

బడుగుల ఆశాజ్యోతి ‘సర్దార్ గౌతు లచ్చన్న’
* మంత్రి కొల్లు రవీంద్ర
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం: బడుగు, బలహీన వర్గాల కోసం జీవితాంతం కృషిచేసిన త్యాగమూర్తి సర్దార్ గౌతు లచ్చన్న అని రాష్ట్ర న్యాయ, క్రీడా, యువజన సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. లచ్చన్న జయంతిని పురస్కరించుకుని బుధవారం స్థానిక బస్టాండ్ సెంటరులోని లచ్చన్న విగ్రహానికి పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ల నారాయణరావుతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ సిద్ధాంతాల కోసం పని చేసిన మహా నాయకుడని కొనియాడారు. ఎన్నో ఉద్యమాలకు ఊపిరి పోసి రాజకీయంగా బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారన్నారు. పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ అవిశ్రాంత పోరాటయోధుడు లచ్చన్న అన్నారు. ఆయన స్ఫూర్తితోనే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియాలో లచ్చన్న పాత్ర ఎనలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, టిడిపి రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల జగన్నాధరావు (బుల్లయ్య), మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, ఎంపిపి కాగిత వెంకటేశ్వరరావు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ బూరగడ్డ రమేష్ నాయుడు, కౌన్సిలర్లు నారగాని ఆంజనేయ ప్రసాద్, బత్తిన దాస్, టిడిపి మండల అధ్యక్షుడు కుంచే నాని, బిజెపి నాయకుడు పంతం వెంకట గజేంద్రరావు, వైసిపి నాయకుడు మాదివాడ రాము తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ ఆస్పత్రిలో బాలింత మృతిపై జెసి చంద్రుడు విచారణ
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం: ఇటీవల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా బాలింత మృతి చెందిందన్న ఫిర్యాదుపై బుధవారం జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు విచారణ నిర్వహించారు. కంకిపాడు మండలం కొణతనపాడు గ్రామానికి చెందిన కొడాలి సుధ (22) ప్రసవం నిమిత్తం ఈ నెల 3వ తేదీన జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. ఆస్పత్రి వైద్యులు ఆపరేషన్ చేయగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే అదే రోజు రాత్రి సుధ మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ మృతి చెందిందని సుధ కుటుంబ సభ్యులు ‘మీకోసం’లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పురస్కరించుకుని జెసి చంద్రుడు బుధవారం రాత్రి ఆస్పత్రికి వచ్చి విచారణ జరిపారు. మృతురాలి తల్లిదండ్రుల నుండి వాంగ్మూలం తీసుకున్నారు. ఆ రోజు విధుల్లో ఉన్న వైద్యులు, స్ట్ఫా, ఇతర సిబ్బందిని విచారించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. జయకుమార్, ఆర్‌ఎంఓ డా. అల్లాడ శ్రీనివాసరావు విచారణలో పాల్గొన్నారు. విచారణ అనంతరం జెసి చంద్రుడు ఆస్పత్రిలోని పలు విభాగాలను సందర్శించారు. ఓపి, గైనిక్, మాతా శిశు విభాగం, ఆపరేషన్ థియేటర్, ఐసియు తదితర విభాగాలను సందర్శించి చికిత్స పొందుతున్న రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు.