బిజినెస్

నేడు షెల్ కంపెనీల పిటిషన్లపై శాట్ విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశీయ స్టాక్ మార్కెట్లలోని డొల్ల సంస్థల (షెల్ కంపెనీలు)పై మార్కెట్ రెగ్యులేటర్ సెబీ నిషేధం వ్యవహారంలో సెక్యూరిటీస్ అప్పీలెట్ ట్రిబ్యునల్ (శాట్).. గురువారం మరో రెండు సంస్థల పిటిషన్లపై విచారణ జరపనుంది. హిట్ కిట్ గ్లోబల్ సొల్యూషన్స్, శాన్కో ఇండస్ట్రీస్ సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లను శాట్ పరిశీలించనుంది. కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అందించిన వివరాలతో గత వారం 331 సంస్థలపై సెబీ నిషేధం విధించినది తెలిసిందే. దీంతో ఈ సంస్థల షేర్ల ట్రేడింగ్‌ను స్టాక్ మార్కెట్లు నిలిపివేశాయి. ఈ క్రమంలో జెకుమార్ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్, పార్శ్వనాథ్ డెవలపర్స్ తదితర ఎనిమిది సంస్థలు సెబీ నిర్ణయానికి వ్యతిరేకంగా శాట్‌ను ఆశ్రయించాయి. దీంతో సెబీ ఆదేశాలపై స్టే విధించిన శాట్.. ఆయా సంస్థల షేర్ల ట్రేడింగ్‌కు అనుమతినిచ్చింది. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లు ఈ సోమవారం నుంచే మళ్లీ సదరు సంస్థల షేర్ల ట్రేడింగ్‌ను పునరుద్ధరించాయి. ఈ నేపథ్యంలోనే మరో రెండు సంస్థలు శాట్ వద్దకు వెళ్లాయి.