బిజినెస్

మహిళా టెకీలకు షీ షటిల్ భద్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో ప్రవేశపెట్టిన ‘షీ షటిల్’ సర్వీసులకు మంచి స్పందన లభిస్తోంది. మహిళా టెకీల భద్రతకు ఏర్పాటుచేసిన ఈ ప్రత్యేక సదుపాయాన్ని మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని దాదాపు 32 వేల మంది మహిళా ఉద్యోగులు సద్వినియోగం చేసుకుంటున్నారు. అయితే ఈ సర్వీసులు వ్యాపార దృక్పథంతో నడవడం లేదని ఎస్సీఎస్సీ సెక్రటరీ భరణి కుమార్ తెలిపారు. ఎస్సీఎస్సీ నాన్ ప్రాఫిటబుల్ సంస్థని, స్పాన్సర్షిప్‌లపై ఆధారపడి ఉందని, కాబట్టి తెలంగాణ ప్రభుత్వం రాబోయే రోజుల్లో షీ షటిల్ సర్వీసులను ఐటీ క్యాడర్ మొత్తంగా విస్తరించేందుకు కృషి చేయాలని సూచించారు. కాగా, మహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, సైబరాబాద్, రాచకొండ పరిధిలోని మహిళా టెకీలు ఉదయం వేకువజాము, రాత్రి వేళల్లో అభద్రతా భావానికి గురవుతుండటంతో ఎస్సీఎస్సీ సంస్థ షీ షటిల్స్‌ను ప్రవేశపెట్టి మహిళల సురక్షిత ప్రయాణానికి నడుం బిగించిందని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య ప్రశంసించారు. దేశంలోనే మొదటిసారిగా ప్రవేశపెట్టిన షటిల్ సర్వీసులకు జిపిఎస్ అనుసంధానంతో స్మార్ట్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ మంచి ఫలితాలు సాధిస్తుందన్నారు. ఐటీ కారిడార్ ఉద్యోగులు తాము షటిల్ సర్వీసు ఎక్కే సమయం నుంచి గమ్యస్థానానికి చేరుకునే వరకు ప్రయాణం సురక్షితంగా జరుగుతుందని, సర్వీసుల్లో ఏర్పాటు చేసిన యాప్ సిస్టం ప్రయాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తుందని తెలిపారు. ఇక లాభాపేక్షతో కాకుండా స్వచ్ఛందంగా సామాజిక సేవా దృక్పథంతో షీ షటిల్స్ పనిచేస్తున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ ఎం భగవత్ కొనియాడారు. ఐటీ కారిడార్‌లో మహిళల భద్రతకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను హైదరాబాద్ నగర కమిషనర్ ఎం మహేందర్‌రెడ్డి సైతం అభినందించారు. భవిష్యత్తులో మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని ఐటీ కారిడార్‌లో షీ షటిల్ సర్వీసులను విస్తరింపజేయాలని కమిషనర్ కోరారు.