బిజినెస్

కొనుగోళ్ల జోష్‌లో మదుపరులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాలను అందుకున్నాయి. అమెరికా-ఉత్తర కొరియా మధ్య నెలకొన్న యుద్ధ భయాలు నెమ్మదిగా తొలగిపోతుండటంతో మదుపరులు మళ్లీ పెట్టుబడులకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 321.86 పాయింట్లు ఎగిసి 31,770.89 వద్ద స్థిరపడింది. ఈ నెలలో కేవలం ఒక్కరోజులోనే సెనె్సక్స్ ఈ స్థాయిలో పెరగడం ఇదే ప్రథమం. ఇక నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 103.15 పాయింట్లు ఎగబాకి 9,897.30 వద్ద నిలిచింది. ఒకానొక దశలో సెనె్సక్స్ 31,805.99 పాయిం ట్లు, నిఫ్టీ 9,903.95 పాయింట్ల గరిష్ఠ స్థాయిలను తాకాయి.
ఐదు వారాల వరుస లాభాల అనంతరం గత వారం సూచీలు భారీగా నష్టపోయినది తెలిసిందే. సెనె్సక్స్ 1,111.82 పాయింట్లు, నిఫ్టీ 355.60 పాయింట్లు కోల్పోయాయి. అయితే సోమవారం లాభాల్లోకి రాగా, బుధవారం కూడా ఆ లాభాలు కొనసాగాయి. మంగళవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా స్టాక్ మార్కెట్లు మూతపడగా, భారత్‌సహా ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేస్తున్న అమెరికా-ఉత్తర కొరియా ఉద్రిక్తకర పరిస్థితులు శాంతిస్తుండటంతో మార్కెట్లూ కోలుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే సెనె్సక్స్ 235.44 పాయింట్లు, నిఫ్టీ 83.35 పాయింట్లు పెరిగాయి. బుధవారం సైతం అదే జోరు కనిపించగా, సూచీలు భారీ స్థాయిలో పుంజుకున్నాయి. ఎఫ్‌ఎమ్‌సిజి షేర్లు అత్యధికంగా 2.49 శాతం మేర బలపడగా, మెటల్, ఆటో, బ్యాంకింగ్, హెల్త్‌కేర్ రంగాల షేర్లకూ కొనుగోళ్ల మద్దతు లభించింది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, క్యాపిటల్ గూడ్స్ షేర్లు మాత్రం నష్టపోయాయి. కాగా, గత నెల జూలైకిగాను విడుదలైన రిటైల్, హోల్‌సేల్ ద్రవ్యోల్బణం గణాంకాలు పెరిగినప్పటికీ, మదుపరులు వాటిని పెద్దగా పట్టించుకోకపోవడం విశేషం.