సబ్ ఫీచర్

వ్యక్తిగత గోప్యత.. హక్కు కాదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన అంశాలున్నందున ‘ఆధార్ కార్డు’ను తప్పనిసరి చే యడం ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమే అవుతుందని కొందరు వ్యక్తులు సుప్రీం కోర్టులో పిటిషన్ వేయడం ఇపుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆ పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది. దా నిపై తుది తీర్పును ప్రకటించడానికి ముందు- అసలు ‘వ్యక్తిగత గోప్యత’ అనేది రాజ్యాంగం ప్ర కారం ప్రాథమిక హక్కు అవుతుందా? లేదా? అనేది తేల్చాలని సుప్రీం కోర్టు భావించింది. అందుకోసం ప్ర ధాన న్యాయమూర్తి నేతృత్వంలో 9మంది న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. ఆ ధర్మాసనం ముందు పిటిషనర్ల తరఫున, ప్రభుత్వం తరఫున న్యా యవాదులు తమ వాదనలు వినిపించారు. వ్యక్తిగత గోప్యత అనేది పౌరుని వ్యక్తిత్వం (పర్సనాలిటీ), హుందాతనం (డిగ్నిటీ)లో భాగమని, ఆ గోప్యతను ప్రకటించమనడం ప్రాథమిక హక్కుకు భంగకరమే అని పిటిషనర్ తరఫున్యాయవాదులు ధర్మాసనం ఎదుట తెలిపారు.
ప్రస్తుత ఎలక్ట్రానిక్ యుగంలో వాట్సాప్ మొదలైన మాధ్యమాలలో వ్యక్తులు తమ వ్యక్తిగత వివరాలు బహిరంగంగా పెడుతున్నారని, అవి అందరికీ తెలిసే అవకాశముందని న్యాయమూర్తులలో ఒకరు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. వ్యక్తిగత విషయాలను ఇలా సామాజిక మీడియాలో ఇతరులకు అందుబాటులో పెడుతుండగా, ప్రభుత్వం చేపట్టిన ఒక నియంత్రణా ప్రక్రియ కోసం వ్యక్తిగత విషయాలు ప్రకటించడానికి అభ్యంతరం ఎందుకని ఆ న్యాయమూర్తి ప్రశ్నించారు. ఇది నిజమే. ఒక పౌరుడు ప్రైవేటు వ్యక్తులకే తన వ్యక్తిగత వివరాలను ప్రకటిస్తున్నప్పుడు ప్రభుత్వానికి ఇవ్వడానికి అభ్యంతరం వుండనక్కరలేదు. అయితే ఇక్కడ ఒక కీలకమైన విషయముంది. ఆ పౌరుడు ఆ మీడియాలో తన వ్యక్తిగత వివరాలను ఐచ్ఛికంగా ప్రకటిస్తున్నాడు. ఇష్టం లేకపోతే ప్రకటించడు. కానీ, ప్ర భుత్వం విషయంలో ఇష్టమున్నా లేకపోయినా తప్పనిసరిగా ప్రకటించాల్సి వస్తుంది. అందువలన తన స్వేచ్ఛను కోల్పోతున్నాడు.
వ్యక్తిగత గోప్యత అనేది వివిధ అంశాలతో ఏర్పడినదని ప్రభుత్వ తరఫు న్యాయవాదులు అన్నారు. ఈ అంశాలలో కొన్ని ఎక్కువ గోప్యత కలిగినవి వుంటాయని, వాటిని ప్రాథమిక హక్కుగా భావించవచ్చుని, మిగిలిన అంశాలను సాధారణ హక్కుగానే చూడవలసి వుంటుందని ప్రభుత్వం తరఫు న్యాయవాది అన్నారు. అంటే వ్యక్తిగత గోప్యతతోనే కొన్ని అంశాలను ప్రాథమిక హక్కులుగా గుర్తించి మిగిలిన వాటిని సాధారణ హక్కుగానే గుర్తించాలే కానీ మొత్తం వ్యక్తిగత గోప్యతను ప్రాథమిక హక్కుగా గుర్తించడానికి వీలు కాదని ఆయన వాదన. ఇది కూడా న్యాయమైన ఆలోచనే! అయితే ఈ గోప్యతలో ఏయే అంశాలు ప్రాథమిక హక్కు అవుతాయో, ఏవి సాధారణ హక్కుగా వుంటాయో ఎవరు తేలుస్తారు? ఈ తేల్చడంలో స్పష్టమైన విభజన జరగాలి!
ఈ సందర్భంగా ఒక ఉదంతాన్ని ప్రస్తావించాలి. రైలు ప్రయాణంలో ఒక వ్యక్తి పక్కనున్న మరో ప్రయాణికుడి సూట్ కేసును దొంగలించి దిగిపోతాడు. దిగిపోయే ముందు తోటి ప్రయాణీకునికి ఒక ఉత్తరం ఇచ్చి వెళ్లిపోతాడు. దానిలో ఇలా రాశాడు.. ‘మాస్టారూ.. మీ సూట్‌కేసును నేనే దొంగిలించాను. దొంగతనం నా వృత్తి. ఒక్కోసారి మంచికీ, చెడుకీ మధ్య గుర్తించడానికి వీలుకానంత అస్పష్టమైన విభజన గీత వుంటుంది! ఆ గీతను గుర్తించి మంచినే ఎంచుకుని, చెడును చేయకుండా వుండడం నా లాంటి వాడికి సాధ్యమా? మీకు సాధ్యమా చెప్పండి? 64 కళల్లో చోరకళ ఒకటని మన పెద్దలు చెప్పారు కదా! అందువల్ల వృత్తిపరంగా నేను కళాకారుడినే, అయితే చాలా చిన్న కళాకారుడిని. నాకంటే చాలా పెద్ద కళాకారులున్నారీ దేశంలో! ఇప్పుడు ఈ దేశమే ఒక కళారంగమైపోయింది!’. ఇది చదివి సూట్‌కేసు పోగొట్టుకున్న వ్యక్తి తెల్లబోయాడు. ‘దొంగ’ చెప్పిన దాంట్లో నిజం లేదని కానీ, నిజం ఉందని కానీ అతను అనుకోలేకపోతున్నాడు. అందుకే మంచికీ చెడుకూ, న్యాయానికీ అన్యాయానికీ, హక్కుకు పర్యవేక్షణకూ మధ్య నిర్వచనం స్పష్టంగా వుండాలి. ఈ స్పష్టమైన విభజన, నిర్వచనాలను సుప్రీం కోర్టు చెప్పి స్థిరీకరిస్తే తర్వాత వివాదాలు తలెత్తవు. వ్యక్తిగత గోప్యతలో వివిధ అంశాలుంటాయని, వా టిని ప్రభుత్వమూ ప్రజలు చర్చల ద్వారా నిర్ణయించుకోవాలని చెబితే ఆ వివాదమెప్పటికీ కొనసాగుతునే ఉంటుంది.
ఏ చట్టంలోనైనా స్పష్టత, ఆచరణ యోగ్యత వున్నప్పుడు మాత్రమే ప్రయోజనం నెరవేరుతుంది. ఉదాహరణకు ప్రజాస్వామ్య పద్ధతిలో లక్షలాది మంది ఓటర్లు ఎమ్మెల్యేను లేదా ఎంపీని ఎన్నుకొంటున్నారు. ఎన్నికైన కొద్దికాలానికే కొందరు ప్రజాప్రతినిధులు తాము ఎన్నికైన పార్టీని వదిలి నచ్చిన పార్టీలో చేరిపోతున్నారు. ప్రజల ఓటు హక్కును వమ్ము చేస్తున్నారు. ఈ మార్పిడులను నిరోధించడానికి యాంటీ డిఫెక్షన్ చట్టముంది. ఆ చట్టం ప్రకారం పార్టీ మారిన ప్రజాప్రతినిధి ఎన్నిక రద్దు కావాల్సిందే. కానీ ఇక్కడే చట్టంలో ఒక చిన్న లోపముంది. అటువంటి వారిని అనర్హులుగా ప్రకటించే అధికారం స్పీకర్‌కే వుంది. కోర్టులకు కాదు. అధికార పార్టీ వ్యక్తులే స్పీకర్లుగా ఎన్నికవుతున్నారు. గనుక తమ పార్టీలో చేరిన ప్రతినిధిని అనర్హునిగా ప్రకటించకుండా అయిదేళ్లు సాగదీస్తున్నారు. దీంతో చట్టం ప్రయోజనం నెరవేరడం లేదు. పార్టీ మారిన ప్రజాప్రతినిధిని అనర్హునిగా ప్రకటించే అధికారం ఎలక్షన్ కమిషన్‌కు ఇస్తే ఫిరాయింపులకు అడ్డుకట్ట పడుతుంది. ఇందువల్ల ప్రజాస్వామ్యానికి మేలు కలుగుతుంది, ప్రజలకు న్యాయం జరుగుతుంది.

-మనె్న సత్యనారాయణ