Others

జ్ఞానమే సామాజిక సంపద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్న చిన్న దేశాలు 21వ శతాబ్దంలో ఏం సాధించాయని, అభివృద్ధిని కొన్ని దేశాలు ఎలా సాధించాయని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఇందుకు మానసిక శాస్త్రంలో వచ్చిన పరిశోధనలే కారణమంటారు. ఒక విద్యార్థికి ప్రాథమిక విద్యలో నేర్పినటువంటి నైపుణ్యాలు అలవడాలంటే, జ్ఞానం పరిపూర్ణంగా పొందాలంటే- తల్లిదండ్రుల నేపథ్యం, పరిసరాల నేపథ్యం పిల్లల మనసులపై చాలా ప్రభావితం చూపుతాయంటారు. దీనిని ప్రయోగాత్మకంగా లాటిన్ అమెరికన్ దేశాలలో నిరూపించారు. లాటిన్ అమెరిక్ దేశాలలో ప్రాథమిక విద్య కన్నా వయోజన విద్యపైన ప్రభుత్వాలు దృష్టి కేంద్రీకరిస్తే సామాజిక సంపత్తి ఉత్పత్తి అవుతుందని, దానివలన విద్యార్థి గ్రాహ్యశక్తి పెరుగుతుందనే విషయం లాటిన్ అమెరికన్ దేశాలలో వచ్చిన ఫలితాలు నిరూపిస్తున్నాయి.
కుటుంబంలో వచ్చిన సామాజిక పరివర్తన ఫైనాన్షియల్ క్యాపిటల్‌గా మారుతుంది. అనగా చదువుకునే వసతిని తల్లిదండ్రులు కలిగిస్తారు. ఇతర ఖర్చులు మానుకుని తమకున్న ఆదాయాన్ని చిన్నపిల్లల చదువుపై మరలిస్తారు. పిల్లలకు కథల పుస్తకాలు కొనటం, చారిత్రక స్థలాలకు తీసుకుపోవటం, పౌష్ఠికాహారం ఇవ్వటం ఇవన్నీ సామాజిక సంపదకు ప్రతీకలు. కుటుంబం చేసిన త్యాగమే చిన్న పిల్లల్లో ప్రాథమిక స్థాయిలోనే మంచి పునాది వేస్తుంది. ఈ పిల్లలు ప్రాథమిక స్థాయిలో దృష్టిని కేంద్రీకరించి చదువుకోవటం వలన జీవితంలో రాణించటానికి, ఉన్నత విద్యపై అభిలాష పెరుగుతుంది. విద్యార్థులలో శాస్ర్తియ పరిజ్ఞానం ఎక్కువగా ఉంటే అది మానవ సంపదగా మారింది. ఆ మానవ సంపదే సోషల్ క్యాపిటల్‌గా మారింది. వారిలో వచ్చిన సామాజిక స్పృహ వలన ప్రపంచంలో వున్న పేద ప్రజానీకం ఆరోగ్య పరిస్థితిని గమనించి ఎక్కడ డాక్టర్ల అవసరం వుందో అక్కడికి లాటిన్ అమెరికన్ డాక్టర్లు వెళ్లి రోగులకు సేవ చేశారు. చివరకు అమెరికాకు కూడా డాక్టర్లను సమకూర్చిన ఘనత లాటిన్ అమెరికన్ దేశాలకు దక్కుతుంది. అనధికారికంగా వలసలు పోయే జాతులు గౌరవంగా అమెరికా రోగులకు సహాయం చేసేందుకు వెళ్లారు. ఇది సోషల్ క్యాపిటల్‌గా మారింది. రోగం ఎక్కడున్నదో అక్కడ మందు వేస్తారు. వయోజన విద్య సమాజంలో చైతన్యం కలిగిస్తుంది. అదే ఈ దేశానికి రెక్కలు కట్టిస్తుంది. వయోజన విద్య లాటిన్ అమెరికన్ దేశాలకు ఒక వరంగా మారింది. అట్లాంటి అనుభవాలను గుణపాఠంగా తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ప్రాథమిక విద్యను సమర్థవంతం చేయాలంటే రాజ్యాంగం ఇచ్చిన ‘అందరికీ చదువు’ అనే హక్కుకు సామాజిక సంపదను ఇచ్చే వయోజన విద్యను బోధిస్తే మంచి ఫలితాలు వస్తాయి.

-చుక్కా రామయ్య