అంతర్జాతీయం

హిజ్బుల్‌పై అమెరికా కొరడా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్: కాశ్మీర్ ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్‌ను అంతర్జాతీయ టెర్రరిస్ట్ సంస్థగా అమెరికా బుధవారం ప్రకటించింది. దీని కమాండర్ సయ్యద్ సలాహుద్దీన్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన రెండు నెలల వ్యవధిలోనే అమెరికా ఈ నిర్ణయం తీసుకొంది. దీని నేపథ్యంలో ఈ సంస్థపై అనేకరకాలుగా అమెరికా ఆంక్షలు అమలవుతాయి. ఇటీవలి కాలంలో కాశ్మీర్‌లో జరిగిన అల్లర్ల వెనుక హిజ్బుల్ ముజాహిదీన్ హస్తం ఉందన్న కథనాల నేపథ్యంలో అమెరికా ఈ నిర్ణయం తీసుకొంది. హిజ్బుల్‌కు సంబంధించిన అన్ని ఆస్తులు స్తంభించిపోతాయని అమెరికా పౌరులెవరూ ఈ సంస్థతో ప్రమేయం పెట్టుకోకుండా నిషేధిస్తున్నామని వైట్‌హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది.