రాష్ట్రీయం

జూన్‌కల్లా ఎస్‌ఆర్‌ఎస్‌పి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: వచ్చే ఏడాది జూన్‌కల్లా శ్రీరామసాగర్ (ఎస్‌ఆర్‌ఎస్‌పి) రెండవ దశ పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి టి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. ఎస్‌ఆర్‌ఎస్‌పి రెండవ దశలో తుపాకులగూడెం అత్యంత కీలకమైందన్నారు. ఎస్‌ఆర్‌ఎస్‌పి రెండవ దశ, తుపాకులగూడెం ప్రాజెక్టులపై బుధవారం సంబంధిత ఉన్నతాధికారులతో మంత్రి హరీశ్‌రావు సమీక్షించారు. తుపాకులగూడెం ప్రాజెక్టు పూర్తి అయితే 10 నెలల పాటు దేవాదుల పంపులు నిరంతరాయంగా పని చేస్తాయన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల దేవాదుల ప్రాజెక్టు కింద 6 లక్షల ఎకరాలకు ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందన్నారు. ఎస్‌ఆర్‌ఎస్‌పి రెండవ దశ ద్వారా పూర్వ నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని కరువు పీడిత ప్రాంతాల్లో 4లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ఎస్‌ఆర్‌ఎస్‌పి రెండో దశ కింద మొత్తంగా రూ.1321 కోట్ల వ్యయం చేసే పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. టిఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎస్‌ఆర్‌ఎస్‌పి రెండవ దశ కింద 2 లక్షల 25 వేల ఎకరాలు స్థిరీకరించిందని, మరో లక్షా 75వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. వాస్తవానికి రెండవ దశ ఎస్‌ఆర్‌ఎస్‌పి ద్వారా 4లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉన్నప్పటికీ కాకతీయ ప్రధాన కాలువల్లో లైనింగ్ దెబ్బతినడం, పూడిక పేరుకుపోవడం వంటి కారణాల వల్ల ఆయకట్టుకు నీరు అందించలేక పోతున్నామన్నారు. వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లోని కాకతీయ కాలువలకు మరమ్మత్తులు చేసి ఫీల్డ్ చానల్స్ అన్నింటినీ వినియోగంలోకి తీసుకురావాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. రెండవ దశ పనులు పూర్తి అయితే పూర్వ నల్లగొండ జిల్లాలో తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ శాసనసభ నియోజకవర్గాల పరిధిలోని 2,13,175 ఎకరాలకు, ఖమ్మం జిల్లాలో పాలేరు, మధిర శాసనసభ నియోజకవర్గాల పరిధిలో 75,262 ఎకరాలకు, వరంగల్ జిల్లాలో వర్ధన్నపేట, పాలకుర్తి, డోర్నకల్ నియోజకవర్గాల పరిధిలో 1,09,512 ఎకరాలకు సాగునీరు అందుతుందని మంత్రి వివరించారు. శ్రీరామ్‌సాగర్ చివరి ఆయకట్టుకు కూడా సాగునీరు అందించాలని ముఖ్యమంత్రి పట్టుదలతో ఉన్నారన్నారు. వచ్చే ఏడాది కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎస్‌ఆర్‌ఎస్‌పి ప్రాజెక్టుకు అనుసంధానం చేయనుండటంతో ఆ లోగా రెండవ దశ పనులన్నీ పూర్తి చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి అన్నారు. ఎల్‌ఎండికి ఎగువ, దిగువ ప్రాంతాలలో కాలువల్లో నీటి ప్రవాహానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో నీటిపారుదలశాఖ ఇంజనీరింగ్-ఇన్-చీఫ్ మురళీధర్, ఇఎన్‌సి అడ్మిన్ నాగేందర్‌రావుతో పాటు కాంట్రాక్టు ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు.
చిత్రం.. అధికారులతో సమీక్షిస్తున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు