అంతర్జాతీయం

మంచి పని చేశారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్: అమెరికా సైనిక కేంద్రంగా ఉన్న గువామ్ ప్రాంతంపై క్షిపణులతో దాడి చేయాలన్న నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నందుకు ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్‌ను డొనాల్డ్ ట్రంప్ అభినందించారు. జోంగ్ సహేతుకంగానే ఆలోచించారని పేర్కొన్న ట్రంప్ ఇందుకు భిన్నంగా ఆయన వ్యవహరించివుంటే దాని ఫలితాలు, పర్యవసానాలు చాలా తీవ్రంగానే ఉండేవని ట్వీట్ చేశారు. బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమంతో అమెరికాను గానీ, దాని మిత్ర దేశాలను గానీ బెదిరించే ప్రయత్నం చేస్తే చరిత్రలో ఎన్నడూ చూడని రీతిలో ఉత్తర కొరియాకు బుద్ధి చెబుతామని ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో ఇరు దేశాల ఉద్రిక్తతలపై సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. అయితే ఈ దాడి నిర్ణయాన్ని ఉత్తర కొరియా వాయిదా వేసుకోవడం ద్వారా ఓ ఉపద్రవాన్ని తప్పించినట్లయింది.