జాతీయ వార్తలు

బ్లూవేల్‌ను తొలగించకపోతే చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశంలో పిల్లల ఆత్మహత్యలకు కారణమవుతున్న బ్లూవేల్ ఛాలెంజ్ గేమ్‌ను తొలగించని నెట్‌వర్క్ ఆధారిత సామాజిక మీడియా సంస్థలపై తగిన చర్యలు తీసుకుంటామని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ బుధవారం హెచ్చరించారు. బ్లూవేల్ గేమ్ కారణంగా అనేకమంది ఆత్మహత్య చేసుకుంటున్నారని, ఇప్పటికే తమకు ఇందుకు సంబంధించి అనేక ఫిర్యాదులు అందాయని తెలిపారు. తక్షణమే ఈ గేమ్‌ను డీలింక్ చేయాలని ఆదేశిస్తూ సంబంధిత టెక్నాలజీ సంస్థలకు ఉత్తర్వులు జారీచేయడం జరిగిందని, దేశంలో యువత ఆత్మహత్యలకు కారణమయ్యే దేన్నీ సహించేది లేదని ఆయన తెలిపారు. అత్యంత ప్రమాదకరంగా మారుతున్న బ్లూవేల్ ఛాలెంజ్ గేమ్‌ను తక్షణమే తొలగించాలంటూ గూగుల్, ఫేస్‌బుక్, వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్, మైక్రోసాఫ్ట్, యాహూ వంటి ప్రధాన సంస్థలకు ఈ నెల 11న ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఒక్క భారతదేశంలోనే కాకుండా ఈ ఆన్‌లైన్ గేమ్ కారణంగా అనేక దేశాల్లో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం జారీచేసిన ఆదేశాలకు ఈ సంస్థలన్నీ కట్టుబడి ఉండాలని, దాన్ని ఏమాత్రం ఉల్లంఘించినా తీవ్ర చర్యలు తీసుకుంటామని తెలిపారు. బ్లూవేల్ ఛాలెంజ్ అన్నది సోషల్ మీడియా ఆధారిత గేమ్. ఇందులో ఆడే ఆటగాళ్లకు 50రోజులు గడువిస్తారు. అంతిమ లక్ష్యం ఆత్మహత్యలకు దారితీస్తుంది. ప్రతి లక్ష్యాన్ని ఛేదించుకుంటూ వచ్చే ఆటగాళ్లు తమ ఫొటోలను పంపించాలని కూడా ఈ గేమ్ నిర్వాహకులు కోరుతున్నారు. ఈ రకమైన ప్రమాదకర ఆటద్వారా దాని నిర్వాహకులు పిల్లల్ని ఆహ్వానించి రెచ్చగొడుతున్నారని, దీనికి లోనైపోయిన పిల్లలు తమను తాము గాయపరుచుకోవడమో, ఆత్మహత్యలు చేసుకోవడమో జరుగుతోందంటూ కథనాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే ఈ గేమ్ కారణంగా ముంబయి, పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలో పలు మరణాలు సంభవించినట్లు వార్తలు వెలువడ్డాయి. కేరళలో కూడా ఈ గేమ్ ఆడుతూ ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లుగా కూడా కథనాలు వచ్చాయి. సోలాపూర్, ఇండోర్‌లలో ఆత్మహత్యలు చేసుకోకుండా సకాలంలో కొందరిని రక్షించినట్లుగా కూడా తెలుస్తోంది.