జాతీయ వార్తలు

రాష్ట్రాలకు స్పష్టమైన ఆదేశాలివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: జైళ్ల సంస్కరణలకు సంబంధించి కోర్టు ఆదేశాలను పాటించడానికి రాష్ట్రాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కేంద్రం బుధవారం సుప్రీంకోర్టును కోరింది. స్పష్టమైన ఆదేశాలను జారీ చేసినట్లయితే రాష్ట్రాలు వాటిని పాటిస్తాయని, లేనిపక్షంలో కోర్టు ఆదేశాలను పాటించనందుకు అవి తప్పు చేసినట్లవుతుందని కేంద్రం తరఫున హాజరయిన అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ న్యాయమూర్తులు మదన్ బి లోకుర్, దీపక్ గుప్తాలతో కూడిన బెంచ్‌కి చెప్పారు. ఒకే సమయంలో ఆరేడు రాష్ట్రాల్లో జైలు సంస్కరణలకు సంబంధించిన అంశాలన్నీ బెంచ్ చేపట్టి, విచారించిన తర్వాత స్పష్టమైన ఆదేశాలను జారీ చేయవచ్చని కూడా ఆయన అన్నారు. అంతేకాదు మూడు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలను ఒకేసారి చేపట్టవచ్చని, కేంద్రం కూడా ఆ సమయంలో ఉంటుందని అన్నారు. అయితే అలా చేసినట్లయితే సమస్య వస్తుందని, చాలా సమయం పడుతుందని బెంచ్ వ్యాఖ్యానించింది. ఈ దశలో వేణుగోపాల్ జోక్యం చేసుకొంటూ, ఒకేసారి ఆరేడు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలను చేపట్టవచ్చని సూచించారు. కాగా, సుప్రీంకోర్టు పార్లమెంటు ఆమోదించిన వివిధ చట్టాలను ప్రస్తావిస్తూ, వీటిని కూడా అమలు చేయాలని అభిప్రాయ పడింది. ‘పార్లమెంటు చర్చించి ఆమోదించిన చట్టాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా అమలు చేయాలి’ అని బెంచ్ వ్యాఖ్యానించింది. జైళ్ల సంస్కరణలకు సంబంధించి ప్రధానంగా నాలుగు అంశాలు- జైళ్లు క్రిక్కిరిసి ఉండడం, జైళ్లలో అసహజ మరణాలు, అక్కడ పని చేస్తున్న సిబ్బందికి శిక్షణ, ఖాళీల భర్తీ- అనే అంశాలను తాము విచారిస్తున్నామని బెంచ్ తెలిపింది. జైళ్లు క్రిక్కిరిసి ఉండడానికి సంబంధించి తాము ఇప్పటికే జనరల్ ఆదేశాలను జారీ చేశామని, మిగతా మూడు అంశాలపై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని బెంచ్ తెలిపింది. అనంతరం కోర్టు కేసు విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది.