జాతీయ వార్తలు

యూపీ మంత్రులపై కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోరఖ్‌పూర్: ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సొంత నియోజకవర్గంలోని బిఆర్‌డి మెడికల్ కాలేజీ, ఆసుపత్రిలో మెదడు వాపువ్యాధితో మృతిచెందిన చిన్నారి తండ్రి ఒకరు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, వైద్య విద్యాశాఖ మంత్రి, గోరఖ్‌పూర్ వైద్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీపై పోలీసు కేసు పెట్టారు.
బిహార్‌లోని గోపాల్‌గంజ్‌కు చెందిన రాజబహార్ తన చిన్నారి అస్వస్థతకు గురైతే ఈ నెల 8న గోరఖ్‌పూర్ ఆసుపత్రి లో చేర్చాడు. అయితే ఆసుపత్రిలో ఆక్సిజన్ అందకపోవడంతో చిన్నారి మృతి చెందింది. మంత్రి, ప్రిన్సిపల్ సెక్రెటరీ నిర్లక్ష్యం వల్లే అభం శుభం తెలియని చిన్నారులు చనిపోయారని రాజ్‌బహార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యశాఖ మంత్రి సిద్ధార్థనాథ్ సింగ్, వైద్య విద్యాశాఖ మంత్రి అశుతోష్ టాండన్, వైద్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రశాంత్ త్రివేదిలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ముగ్గురిపై రాజ్‌బహార్ ఈ నెల 14న పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకూ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదు. మరోపక్క బిఆర్‌డి మెడికల్ కాలేజీ ప్రినిపాల్ విధి నిర్వహణలో నిర్లక్ష్యంవల్లే ఈ దారుణం చోటుచేసుకుందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు. ప్రినిపాల్ రాజీవ్ మిశ్రా వైఫల్యం ఉందని ఆయన అన్నారు.