తెలంగాణ

డ్రగ్ డిటెక్షన్ కిట్ల పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాలను కనుగొనేందుకు వీలుగా త్వరలో డ్రగ్ డిటెక్షన్ కిట్ల పంపిణీ చేయనున్నారు. ఇప్పటి వరకు ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్‌లో బ్రీతింగ్ ఎనాలసిస్ పరికరాలను వాడుతూ, మందుబాబులపై పాయింట్ సిస్టంను ప్రయోగిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఎక్సైజ్ శాఖ మాదకద్రవ్యాల వినియోగం, సరఫరావంటి వాటిని గుర్తించేందుకు కొత్తగా డ్రగ్ టిటెక్షన్ కిట్లు ప్రవేశపెట్టింది. అయితే త్వరలో ఈ కిట్లను రాష్టవ్య్రాప్తంగా ఆబ్కారీ శాఖ సిబ్బందికి అందజేయనున్నట్టు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ కమిషనర్ సి వివేకానందరెడ్డి తెలిపారు. ఇటీవల హైదరాబాద్‌లో స్టేట్ టాస్క్ఫోర్స్ (ఎస్‌టిఎఫ్) యాంటీ నార్కొటిక్ సెల్ (ఏఎన్‌సి) అధికారులు డ్రగ్ డిటెక్షన్ కిట్‌ల ద్వారా 20 మందిని అదుపులోకి తీసుకుని వారి రక్తనమూనాలు, గోళ్లు, వెంట్రుకలు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. కాగా ఐదుగురు సభ్యులతో కూడిన బృందం ఒకటి గత నెలలో బెంగుళూరులో జరిగిన యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైం (యుఎన్‌ఓడిసి) నిర్వహించిన సదస్సుకు హాజరైంది. వారం రోజుల పాటు డ్రగ్స్ డిటెక్షన్‌పై శిక్షణ పొందినట్టు డిసిపి వివేకానందరెడ్డి తెలిపారు. త్వరలో డ్రగ్స్ డిటెక్షన్ కోసం ఎక్సైజ్‌శాఖకు కిట్లు అందనున్నట్టు ఆయన తెలిపారు. ఇదిలావుండగా 2014లో ఎన్‌సిబి హిందుస్తాన్ యాంటిబయోటిక్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) పుణెలో 869 కిట్లను సరఫరా చేయగా, వీటిని జోన్, సబ్‌జోన్లలో వినియోగించారు. అదేతరహలో తెలంగాణ రాష్ట్రంలో కూడా డ్రగ్ డిటెక్షన్ కిట్ల పంపిణీ జరుగబోతోందని సమాచారం.