తెలంగాణ

తెలంగాణలో 19న భారీ వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 19న భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న ఐదురోజుల్లో సంభవించే వాతావరణ వివరాలను వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 16 నుంచి 18 వరకు మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. 19న మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. 20వ తేదీన మాత్రం వర్ష సూచన ఏదీ లేదని తెలిపింది. కాగా బుధవారం పలు చోట్ల కురిన వర్షపాత వివరాలను ప్రకటించింది. ములుగులో 4, సుల్తానాబాద్, జూలపల్లిలో 3, కరీంనగర్, ఉట్నూర్, గోవిందరావుపేటల్లో 2, నందిపేట, జగిత్యాల, ఆలంపూర్, నవీపేట, మక్తల్, మోర్తాడ్, తిమ్మాపూర్‌లో 1 సెం.మీ వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ పేర్కొంది.