తెలంగాణ

పాలమూరు ప్రాజెక్టులపై అనవసర రాద్ధాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పాలమూరు జిల్లా ప్రాజెక్టులపై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. టిఆర్‌ఎస్ శాసనసభా పక్షం కార్యాలయంలో బుధవారం ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, వెంకటేశ్వర్‌రెడ్డి, అంజయ్య యాదవ్‌తో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు. అవిభక్త పాలమూరు జిల్లా పచ్చబడుతుంటే విపక్షాలు ఓర్వలేకనే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ విషం కక్కుతుందన్నారు. పాలమూరు జిల్లా ప్రాజెక్టులపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నవారంతా తెలంగాణ వ్యతిరేకులని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రాంతానికి నయా పైసా ఇవ్వను ఏమి చేసుకుంటారో చేసుకోండన్న ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించిన చంద్రబాబు నాయుడికి కొమ్ముకాసిన ప్రబుద్ధులే రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారని మంత్రి గుర్తు చేశారు. 14 ఏళ్లపాటు సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన టిఆర్‌ఎస్ పార్టీ తప్ప తెలంగాణ వ్యతిరేక పార్టీలన్ని రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడంలో ఆంతర్యం ఏమిటని మంత్రి ప్రశ్నించారు. కృష్ణా జలాలలో అవిభక్త పాలమూరు జిల్లాకే 290 టిఎంసిల నీరు కేటాయింపు జరిగిందని మంత్రి గుర్తు చేశారు. కేటాయించిన దానికంటే ఎక్కువ నీరు అందించడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుంటే ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా విపక్షాలు ప్రచారం చేస్తున్నాయని మంత్రి విమర్శించారు. పాలమూరు ప్రాజెక్టులపై రౌండ్ టేబుల్ సమావేశాలు కాదు, దమ్ముంటే ప్రజల్లోకి వెళ్లి వాస్తవాలు చెబుదాం అందుకు సిద్ధమేనా అని ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సవాల్ చేశారు. కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటివరకు జిల్లాకో విధానాన్ని అవలంభిస్తూ నీచ రాజకీయాలకు పాల్పడుతుందని నిరంజన్‌రెడ్డి దుయ్యబట్టారు. కృష్ణా జలాలపై హక్కు లేకపోయినా వైఎస్‌ఆర్ హయాంలో పోతిరెడ్డిపాడు ద్వారా జలాలను తరలించుకు వెళ్తే నోరు మెదపని కాంగ్రెస్ నాయకులకు ప్రాజెక్టులపై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు అఖిల పక్షం పేరుతో జిల్లాల మధ్య చిచ్చు పెట్టడానికి కుట్రలు పన్నుతుందని ఆరోపించారు.