ఆంధ్రప్రదేశ్‌

నేర రహిత రాష్ట్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం)/మంగళగిరి: నేర రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చి దిద్దడమే లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఉద్ఘాటించారు. సాంకేతిక పరిఙ్ఞనాన్ని అందిపుచ్చుకుంటూ వినూత్న తరహాగా ఆలోచిస్తే ఫలితాలు కూడా అదే స్థాయిలో ఉంటాయన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఎపిఎస్‌పి బెటాలియన్ ప్రాంగణంలో సుమారు 40కోట్ల రూపాయలు ఖర్చుతో లక్షా 10వేల చదరపు అడుగుల స్థలంలో నిర్మించిన ఐదంతస్తుల రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయాన్ని ముఖ్యమంత్రి బుధవారం ప్రారంభించారు. శంకుస్థాపన చేసిన కేవలం పదినెలల్లోనే నిర్మాణం పూర్తి చేసిన ఈ అత్యాధునిక భవనంలో డిజిపి కార్యాలయంతోపాటు సిఐడి ప్రధాన కార్యాలయం, ఇతర ముఖ్య విభాగాలు కొలువుదీరాయి. కార్యాలయాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి భవనంలోని ప్రతి అంతస్తులో ఉన్న విభాగాలను పరిశీలించారు. అనంతరం ఇక్కడ ఏర్పాటు చేసిన సభలో పోలీసుశాఖనుద్ధేశించి ప్రసంగించారు. రాష్ట్రంలో జీరో క్రైం రేటు సాధించేవరకూ పోలీసుశాఖ కృషి చేయాలన్నారు. కార్పొరేట్ ఆఫీసును తలదనె్నలా బ్రహ్మాండంగా పోలీసు ప్రధాన కార్యాలయం నిర్మించుకోవడం అభినందనీయమన్నారు. కార్యాలయం చూస్తేనే తనకు కబ్జా చేయాలనిపించిందంటూ చమత్కరించారు. భవిష్యత్తులో అమరావతి ఐదు ప్రధాన రాజధానుల్లో ఒకటి కావాలని, ఈ ఐదింటిలో కూడా ప్రథమస్ధానంలో ఉండాలన్నదే లక్ష్యమన్నారు. ఓవైపు కృష్ణానది, మరోవైపు కొండలు, అదేవిధంగా సారవంతమైన భూమి ఇలా అన్ని వనరులున్న ప్రదేశం అమరావతని, ఇలాంటి చోట డిజిపి కార్యాలయం ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు. ప్రతి పోలీసు వ్యాయామం ద్వారా శారీరక పటుత్వాన్ని పెంపొందించుకోవాలన్నారు. 20ఏళ్ల క్రితం గ్రేహౌండ్స్ విభాగం అవశ్యకతను తాను గుర్తించానని అన్నారు. హింస, అరాచకత్వం ఏ రూపంలో ఉన్నా అరికట్టాల్సిన బాధ్యత పోలీసులతోపాటు ప్రజలపై కూడా ఉందన్నారు. మన గ్రే హౌండ్స్, అక్టోపస్ దళాలు దేశంలోనే అగ్రగామిగా నిలుస్తున్నాయన్నారు. పోలీసులు శారీరక దారుఢ్యంతోపాటు సాంకేతిక పరిఙ్ఞనం కలిగి ఉండాలన్నారు. దీంతోపాటు పోలీసులు నిరంతరం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ పరీక్షలు నిర్వహించాలన్నారు. పోలీసులకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. తమ ప్రభుత్వానికి సంక్షేమం కూడా ముఖ్యమని, పోలీసు సంక్షేమంలో భాగంగా పోలీసుశాఖలోని ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు ఉండాలన్నదే తమ అభిమతమన్నారు. పోలీసు కనిపించకుండానే పోలీసింగ్ కనిపించాలని సూచించారు. కేంద్ర హోంశాఖ ప్రకటించిన అవార్డుల్లో అత్యధికంగా 52 పతకాలు రాష్ట్ర పోలీసుశాకకు వచ్చాయంటే మన శక్తి సామర్థ్యాలే ఇందుకు నిదర్శమన్నారు. ప్రపంచంలో ఎక్కడ అత్యత్తుమ టెక్నాలజీ ఉన్నా అది వెంటనే ఏపికి రావాలని, రాష్ట్ర ప్రజలకు భద్రత, భరోసాతో సంతోషంగా ఉండేలా పోలీసు వ్యవస్థ పని చేయాలని అన్నారు. బ్లూ బుక్ ప్రకారం పని చేస్తామంటే ఫలితాలు కూడా అలాగే ఉంటాయన్నారు. బోరుబావిలో పడిన చిన్నారి చందును రక్షించిన తీరుపై ముఖ్యమంత్రి స్పందిస్తూ పోలీసులను అభినందించారు. ఇతర ప్రాంతాల్లో ఆపరేషన్ విఫలమవుతున్నా, నిరుత్సాహానికి గురి కాకుండా విజయవంతంగా చిన్నారి ప్రాణాలు కాపాడగలగడం పట్ల ప్రభుత్వంపై, పోలీసులపై భరోసా ఏర్పడిందన్నారు. అంతకుముందుకు ఆక్టోపస్ దళాలు ప్రదర్శించిన విన్యాసాలు అబ్బురపరిచాయి. తిలకించిన ముఖ్యమంత్రి ఆక్టోపస్‌ను ప్రత్యేకంగా అభినందించారు. అదేవిధంగా ఇక్కడ ఏర్పాటు చేసిన వివిధ రకాల ఆయుధ సంపత్తి ప్రదర్శనను పరిశీలించారు. కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి చేతుల మీదుగా సర్ట్ఫికెట్ల ప్రదానం జరిగింది. డిజిపి నండూరి సాంబశివరావు మాట్లాడుతూ రాష్ట్ర పోలీసులు సమర్థవంతంగా పని చేస్తున్నారని, ప్రజల సమస్యల పరిష్కారానికి సాంకేతిక పరిఙ్ఞనంతో మెరుగైన సేవలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో శాసన సభ స్పీకర్ కోడెల శివప్రసాద్, డిప్యూటీ సీఎం, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్ర, పి నారాయణ, జవహర్, కామినేని శ్రీనివాస్, పితాని సత్యనారాయణ, నక్కా ఆనందబాబు, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి, ఏపి పోలీసు హౌసింగ్ బోర్డు చైర్మన్ కె నాగుల్‌మీరా, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏఆర్ అనూరాధ, ఇంటిలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు, గ్రే హౌండ్స్ అదనపు డిజి ఎన్‌వి సురేంద్రబాబు, పోలీసు హౌసింగ్ బోర్డు ఏండి రాజేంద్రనాథ్‌రెడ్డి, విజయవాడ పోలీసు కమిషనర్ దామోదర్ గౌతం సవాంగ్, పోలీసు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.