హైదరాబాద్

‘స్వచ్ఛ నమస్కార్’కు దేశవ్యాప్తంగా ఆదరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: స్థానిక సంస్థ బాధ్యతల నిర్వహణ, సరికొత్త సంస్కరణలు, మెరుగైన పారిశుద్ధ్యం కోసం అనుసరించాల్సిన కొత్తకొత్త విధానాల విషయంలో జిహెచ్‌ఎంసి దేశానికే రోల్ మాడల్ అయ్యే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే దేశంలో ఎక్కడా లేని విధంగా నగరంలోని 22 లక్షల కుటుంబాల నుంచి చెత్తను తడి,పొడిగా వేర్వేరుగా సేకరించేందుకు ఏకంగా 44లక్షల డస్ట్‌బిన్లను పంపిణీ చేసిన కార్యక్రమం దేశంలోని అన్ని స్థానిక సంస్థల దృష్టిని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే! జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్ రెడ్డి ప్రారంభించిన ‘స్వచ్ఛ నమస్కార్’ కూడా ఇపుడు అదే దిశలో దేశవ్యాప్తంగా ఆదరణ పొందుతోంది. దీని కన్నా ముందు ప్రతి ఇంటి నుంచి తడి,పొడి చెత్తను సేకరించేందుకు ఏర్పాటు చేసిన స్వచ్ఛ ఆటో టిప్పర్లు, చెత్తను తడి,పొడిగా వేరు చేస్తూ విడిపోయిన కుటుంబాలను కలపటం, బహిరంగ స్థలాల్లో చెత్త వేయటాన్ని నివారించి, అక్కడ అందమైన ముగ్గులు వేయటం, ఉత్తమ సేవలందించే ఉద్యోగులను సత్కరించటం, స్వచ్ఛ కార్యక్రమాలను ముమ్మరం నిర్వహించే కాలనీలు, వార్డులు, సర్కిళ్లను గుర్తించి పురస్కారాలను ఇవ్వటం వంటి బల్దియా కార్యక్రమాలు ఇప్పటికే దేశంలోని పలు స్థానిక సంస్థల్లో అమలవుతుండగా, ఇపుడు స్వచ్ఛ నమస్కార్ వాటి జాబితాలో చేరిందని చెప్పవచ్చు. ఈ స్వచ్ఛనమస్కార్ తెరపైకి రాకముందు గుడ్ మార్నింగ్, నమస్తే అన్ని సంభోదించుకునే అధికారులంతా తప్పకుండా స్వచ్ఛ నమస్కార్‌ను పాటించాలని కమిషనర్ ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేయటంతో ఇపుడు బల్దియాలో ఎక్కడ చూసినా, ఎటు విన్నా స్వచ్ఛనమస్కారే. కొద్ది రోజుల క్రితం నగరంలో ఘన వ్యర్థాల నియంత్రణపై జరిగిన సదస్సులో ప్రసంగం నిమిత్తం వెళ్లిన కమిషనర్ జనార్దన్ రెడ్డి ప్రసంగానికి ముందు సదస్సుకు హాజరైన అతిధులందరికీ స్వచ్ఛనమస్కారం అంటూ సంభోదించటంతో అందరూ ఆకర్షితులయ్యారు. అంతేగాక, భారతీయత ఉట్టిపడేలా ఈ సంభోధన ఉన్నట్లు వారు వ్యాఖ్యానించినట్లు అధికారులు తెలిపారు. ఇందుకు ఎంతో ఆకర్షితులైన రాజస్థాన్‌లోని బాన్స్‌వారా జిల్లా కలెక్టర్ భవగత్ ప్రసాద్ జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛ నమస్కార్‌ను అమలు చేయాలని ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. స్వచ్ఛ భారత్ మిషన్ ఆశయాలకు అనుగుణంగా ఈ స్వచ్ఛ నమస్కార్ కార్యక్రమాన్ని స్వాతంత్య్ర దినోత్సవం నుంచే అమల్లోకి రావాలంటూ ఆ రాష్ట్ర మంత్రి ధన్‌సింగ్ రావత్ అధికారికంగా ప్రారంభించి, స్వచ్ఛ నమస్కార్ పూర్తి స్థాయిలో అమలు కావాలని ఆదేశించినట్లు తెలిపారు.

జెన్‌ప్యాక్ రోడ్డులో ఆటో బోల్తా
ఉప్పల్: ఉప్పల్ ఐడిఎలో జెన్‌ప్యాక్ సమీపంలో ఆటో బోల్తా పడింది. ఇందులో ప్రయాణిస్తున్న ఏడుగురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. కేంద్రీయ విద్యాలయంలో చదువుతున్న విద్యార్థులతో సాయంత్రం ఇంటికి వెళ్తున్న ఆటో హబ్సిగూడ గ్రీన్‌హిల్స్ కాలనీ వైపు బయల్దేరింది. ఎత్తయిన ప్రదేశంలో ప్రమాదవశాత్తు అదుపుతప్పి కిందపడింది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే సంఘటన జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న 108 వాహనంలో వచ్చిన వైద్య సిబ్బంది ప్రాథమిక వైద్య చికిత్సలు అందించి ఇంటికి పంపించారు. ఈ విషయంలో ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

రెస్క్యూ హోమ్‌లో బాలిక ఆత్మహత్య

జీడిమెట్ల: రెస్క్యూ హోమ్‌లో ఓ బాలిక మృతి చెందిన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. బైంసా ప్రాంతానికి చెందిన ఓ బాలిక (15) ఈ నెల 1న కూకట్‌పల్లి, ఆల్విన్‌కాలనీలోని వసతి గృహంలో చేర్పించారు. బాలిక బుధవారం నాడు వసతి గృహంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇంకుడు గుంతలతో కలిగే లాభాలను వివరించాలి
హైదరాబాద్: భావితరాలకు తాగునీటిని అందించటంతో పాటు నీటి కొరతను ఎదుర్కొనేందుకు భూగర్భ నీటి మట్టాలను పెంచుకునేందుకు ఇంకుడు గుంతలెలా ఉపయోగపడుతాయో, వాటి వల్ల కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు వివరించి, వారిని చైతన్యవంతులను చేయాలని జలమండలి ఇంకుడు గుంతల ప్రత్యేకాధికారి జె. సత్యనారాయణ అన్నారు. బుధవారం జలమండలి, యువవారధి స్వచ్ఛంద సంస్థ సంయుక్త్ధ్వార్యంలో ఇంకుడు గుంతలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. టికెఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా ఔటర్ రింగురోడ్డు లోపలున్న గ్రామాలకు వెళ్లే సర్వే చేసిన పలువురు సివిల్ ఇంజనీర్లకు ఆయన సర్ట్ఫికెట్లను కూడా అందజేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ ఇంకుడు గుంతలపై సమాజంలో ప్రతి ఒక్కరిలో అవగాహన పెంచి, చైతన్యవంతులను చేయాలని అపుడే ఆశించిన ఫలితం దక్కుతుందన్నారు. ఇంకుడు గుంతల నిర్మాణం వల్ల భూగర్భ జలాల మట్టం పెరుగుతుందని వివరించారు. ఈ దిశగా ప్రతి ఒక్కర్ని ప్రోత్సహించేందుకు జలమండలి చేపడుతున్న చర్యలు, సహకరిస్తున్న తీరును ఆయన విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో టికెఆర్ ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ అమర్‌నాథ్‌రెడ్డి, యువవారధి అధ్యక్షుడు మయూర్ పాట్నాలతో పాటు సివిల్ ఇంజనీర్లు పాల్గొన్నారు.

సంతానం కలుగలేదని వేధింపులతో మహిళ ఆత్మహత్య
ఘట్‌కేసర్: సంతానం కలుగలేధని భర్త, అత్తల వేదింపులు తట్టుకోలేక హేయిర్ కలర్ తాగి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. అన్నోజిగూడ గ్రామంలో నివాసం ఉంటున్న బండ గణేష్ తో ఎనిమిది సంవత్సరాల క్రితం షామీర్‌పేట్ మండలం కేశవరం గ్రామానికి చెందిన రాధికతో వివాహం జరిగింది. రాధికకు సంతానం కలుగక పోవటంతో భర్త బండ గణేష్, అత్త శివమ్మ, మరిది ప్రకాష్, తోటి కోడలు జ్యోతిలు మరో వివాహం చేస్తామని, అధనపు కట్నం తీసుకురావాలని గత కొంత కాలంగా వేదింపులకు పాల్పడినట్లు చెప్పారు. సంతానం కలుగటం లేదని మరో వివాహం చేసుకుంటానని భర్త గణేష్ నిత్యం మద్యం సేవించి శారీరకంగా, మానసికంగా వేదింపులకు దిగుతు కొడుతుండటంతో పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించి సర్దిచెప్పి కాపురానికి పంపించినట్లు తెలిపారు. ఈ నెల 11న భర్త గణేష్ మద్యం తాగి వచ్చి కొట్టడంతో పాటు మరో వివాహం చేసుకుంటాని బెదిరించినట్లు, అతనికి అండగా అత్త, మరిది, తోటి కొడలు కలుగచేసుకుని వేదించినట్లు పేర్కొన్నారు. తీవ్ర మనస్థాపానికి గురైన రాధిక ఈ నెల 13న వెంట్రుకలకు వేసుకునే కలర్‌ను నీటిలో కలుపుకుని తాగినట్లు తెలిపారు. ఈ విషయాన్ని భర్త గణేష్‌కు మద్యాహ్నం ఒంటి గంటకు తెలుపగా సాయంత్రం ఆరు గంటలకు మేడిపల్లిలోని అఫెక్స్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అదే రోజు ఉప్పల్ ఆదిత్య ఆసుపత్రికి తరలించగా కామినేని ఆసుపత్రికి తీసుకువెళ్లాలని సూచించటంతో కామినేని ఆసుపత్రిలో చేర్పించినట్లు చెప్పారు. చికిత్స పొందుతూ బుధవారం రాధిక మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. శవాన్ని పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించి, మృతరాలి సోదరుడు గవ్వల మహేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్స్‌స్పెక్టర్ ప్రకాష్ తెలిపారు.

ఉత్సవ నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇవ్వాలి
*సైబరాబాద్ సిపి సందీప్ శాండిల్య
గచ్చిబౌలి: వినాయక మండపాలు ఏర్పాటు చేసి ఉత్సవ కమిటీ వారు స్థానిక పోలీసులకు తప్పక సమాచారం ఇవ్వాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సందీప్ శాండీల్య సూచించారు. ఉత్సవ కమిటీ నిర్వహకులు పోలీసుల నుంచి తప్పని సరిగా క్లియరెన్స్ సర్ట్ఫికెట్ తీసుకోవాలని చెప్పారు. సైబరాబాద్ పోలీస్ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తును చేసుకున్నా తరువాత ప్రింట్ తీసి స్థానికి పోలీస్ స్టేషన్‌లో ఇవ్వాలన్నారు. మండపం ఏర్పాటు చేసే విధి విధానాలు జాగ్రత్తలు సూచనలను వెబ్ సైట్‌లో వివరంగా పొందుపర్చామని తెలిపారు. నిబంధనల మేరకే మండపాలను ఏర్పాటు చేయాలని అదుకు భిన్నంగా ఉంటే అనుమతి ఇవ్వడం జరగదని సీపి స్పష్టం చేశారు.మండపాల వద్ద డీజేలకు అనుమతి లేదని, బాక్స్‌టైపులౌడ్ స్పీకర్‌లను మాత్రమే పెట్టాలని ఉదయం 6నుండి రాత్రి 10గంటల వరకే వాడలని తెలిపారు.నిర్వహకుల కోసం దరఖాస్తు ఫారాలు సైబరాబాద్‌లోని అన్ని పోలీసు స్టేషన్లలో అందుబాటులో ఉంటాయని ఆయన వివరించారు. సెప్టెంబర్ 25నుండి 5వరకు వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుగనున్న నేపధ్యంలో మండపాల నిర్వాహకులు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. పూర్తి వివరాలు సంబంధిత డాక్యుమెంట్లు నిమజ్జనోత్సవానికి సంబంధించిన రూట్ వివరాలు తెలుపుతూ సెప్టెంబర్ ఒకటో తేదీకి ముందు ఆయా పోలీస్ స్టేషన్లలో అందచేయాలని కోరారు. ఆలస్యంగా వచ్చిన దరఖాస్తులు తిరస్కరించ బడతాయని ఉత్సవాల సమయంలో కమిషనరేట్ పరిధిలో 144సెక్షన్ అమల్లో ఉంటుందని చెప్పారు. మండపం ఏర్పాటు చేస్తున్న స్థలం యజమాని నుండి ఎన్‌ఓసీ తీసుకోవాలని ట్రాఫిక్‌కు శాంతి భద్రతలకు ఆలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకొవాలన్నారు. మండపాలకు విద్యుత్‌కు సంబంధించిన సర్ట్ఫికేట్‌ను జతచేయాలని అనధికారికంగా కరెంటు తీసుకోవడానికి వీలులేదని వివరించారు. మండపాల నిర్వాహకులు సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు రాత్రి 10నుండి ఉదయం ఆరు వరకు లౌడ్ స్పీకర్లు, మైకులు పెట్టరాదని తెలిపారు. ప్రజలు ఉపయోగించే రహదారిని ఆటంకం కలిగించే విధంగా ఏర్పాటు చేయకుడదని, మండపంలో ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలపాలు నిర్వహించరాదని హెచ్చరించారు. మండపాల వద్ద నిత్యం ముగ్గురు వాలంటీర్లను నియమించు కొవాలని వారికి గుర్తింపుకార్డు ఇవ్వాలని చెప్పారు. రాత్రి 10గంటల తరువాత ఎలాంటి సాంస్కతిక కార్యక్రమాలు జరపడం, ఉపన్యాసాలు నినాదాలు ఇవ్వకూడదని తెలిపారు. నిమజ్జనం సమయంలో పోలీసు వారు ఇచ్చిన సీరియల్ నెంబర్ పొందాలని పోలీసుల నుండి పొందిన నెంబర్‌ని వాహనంకు అతికించాలని వివరించారు. మండపం సమీపంలో ఎదైనా సంఘటన జరిగిన అనుమానాస్పద వస్తువులు గాని వ్యక్తులు కనబడితే వెంటనే 949617444నెంబర్‌కు సమాచారం అదించాలని ఆయన కోరారు.

పురస్కారాలతో సమాజంలో గుర్తింపు
కాచిగూడ: పురస్కారాలను సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య అన్నారు. భారత 71వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉజ్వల సాంస్కృతిక సాహిత్య సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ‘స్వర్ణ్భారతి’ పురస్కారాలు ప్రదానోత్సవ కార్యక్రమం బుధవారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రోశయ్య వివిధ రంగల్లో విశిష్ట సేవలందించిన నృత్యరంగం డా.పి.రమాదేవి, సేవారంగం సంధ్యశకుంతల, సాహితీ రంగం వేలమూరి లక్ష్మి, వైద్య రంగం జి.నిర్మల, కళారంగం వేణుశ్రావణ్, వ్యవసాయ రంగం గజేంద్రారెడ్డి, రాజకీయ రంగం శాంతమ్మకు పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశం శాస్త్ర, సాంకేతిక రంగల్లో ఆగ్రదేశాలతో పోటీపడుతోందని, భారతదేశ పూరోభివృద్ధిలో అన్ని రంగాల పాత్ర అనిర్వచనీయమైందని అన్నారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులను ఉజ్వల సంస్థ స్వర్ణ్భారతి పురస్కారాలను ప్రదానం చేయడం ఎంతో అభినందనీయమని అన్నారు. ప్రముఖ కవి డా. ఎంకె.రాము సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో కాచం ఫౌండేషన్ అధ్యక్షురాలు కాచం సుష్మ, ఐఎఎస్ శిక్షణ నిపుణురాలు సర్వమంగళగౌరి, సంస్థ అధ్యక్షురాలు ఎం.లక్ష్మీ, గాయకుడు ప్రభాకరనాయుడు, నటుడు ఎంవి.సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. సభకు ముందు ప్రభాకరనాయుడు బృందం దేశభక్తి గీతాలతో పాటు సినీ గీతాలు అలపించగా మయూరి రాధా బృందం దత్తు, ప్రీతి పాశ్చాత్య నృత్యంశాలు ప్రదర్శించగా సాహితీ కూచిపూడి నృత్యం అందరినీ ఆకట్టుకున్నాయి.

నాణ్యతా ప్రమాణాలతో డబుల్ బెడ్‌రూం ఇళ్లు
* పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ ఆదేశం
జీడిమెట్ల: నాణ్యతా ప్రమాణాలతో అందమైన కాలనీలుగా డబుల్ బెడ్‌రూం ఇళ్లను నిర్మించి పేదలకు అందివ్వాలని రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆదేశించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దొమ్మరపోచంపల్లి గ్రామం, గండిమైసమ్మలోని సర్వేనంబరు 120లోని ఏడెకరాల ప్రభుత్వ స్థలంలో 1600 డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణపు పనులను మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే కెపి వివేక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ స్థానికుల కోరిక మేరకు నిర్మిస్తున్న 1600 డబుల్ బెడ్‌రూం ఇళ్లలో పది శాతం ఇళ్లను స్థానికులకు కేటాయిస్తామని, శివారులో ఎక్కడ నిర్మించినా ఈ సూత్రాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఆధునీకరణతో డబుల్ బెడ్‌రూం ఇళ్లను కట్టిస్తామని, ప్రైవేటు వ్యక్తులు డబుల్ బెడ్‌రూం ఇళ్లను కట్టి విక్రయిస్తే ఒక్కో ఇంటికి 30 లక్షలకు పైగా ఖర్చవుతుందని, ఒక్క రూపాయి కూడా ప్రజలపై భారం వేయకుండా ప్రభుత్వం డబుల్ బెడ్‌రూం ఇళ్లను నిర్మించి ఇస్తుందని చెప్పారు. రాష్ట్రంలో 18 వేల కోట్ల వ్యయంతో డబుల్ ఇళ్లను నిర్మిస్తున్నామని, ఈ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందని, ఒకరికి వచ్చి మరొకరికి రాదు అనేది ఉండదని స్పష్టం చేశారు. మోడల్ కాలనీగా డబుల్ ఇళ్లను నిర్మిస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ చేతుల మీదుగా గృహప్రవేశం చేయిస్తానని అన్నారు. పేద ప్రజలంటే గత ప్రభుత్వాలు చిన్నచూపు చేసేవని, ఆత్మగౌరవంతో కూడిన ఇళ్లుగా ఉండాలని, నాణ్యతలో ఎలాంటి రాజీ పడొద్దని చెప్పారు. నగరంలో లక్ష డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం కోసం ఈ నెలాఖరు కల్లా టెండర్‌లు పూర్తవుతాయని, రాబోవు సంవత్సర కాలంలోపు ఇళ్లను పూర్తిచేసుకుని ప్రారంభిస్తామని పేర్కొన్నారు. నాణ్యతపై అధికారులు, ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని సూచించారు. బౌరంపేట్ రైతుల సమస్యను పరిష్కరించేలా కలెక్టర్‌లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నగరంలోని స్లమ్‌లను తమకు ఇస్తే సుందరమైన కాలనీలుగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించి ఇస్తామని, స్లమ్ ఫ్రీ సిటీ నిర్మాణం కోసం విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. జీవో 58 కింద పట్టాలను పూర్తిగా ఇవ్వాలని, అసైన్డ్ భూముల పై దృష్టి పెట్టి రైతుల సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యులు సిహెచ్ మల్లారెడ్డి, ఎమ్మెల్సీ రాజు, జిల్లా కలెక్టర్ ఎంవి రెడ్డి, జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్థన్‌రెడ్డి, జెడ్‌పి వైస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, ఎంపిపి కవిత, పలు గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, వివిద శాఖల అధికారులు పాల్గొన్నారు.

అన్నమయ్య సంకీర్తనల స్వరార్చనలో నృత్యాభిషేకం
హైదరాబాద్: పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్య 609వ జయంతి సందర్భంగా బుధవారం రవీంద్రభారతిలో 12 గంటలపాటు నిర్విరామ సంకీర్తన గాన నృత్యార్చన జరిగింది. తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ఆవుల మంజులత జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమం అన్నమయ్య కీర్తనల ఆలాపనతో ప్రారంభమైంది. భావములోన... బ్రహ్మకడిగిన పాదము తదితర కీర్తనలను ఆలపించగా నృత్య కార్యక్రమంలో 460 మంది కళాకారులు పాల్గొన్నారు. వివిధ జిల్లాలనుంచి వచ్చిన కళాకారులు తమదైన శైలిలో వారి గురువుల సమక్షంలో నృత్యాన్ని ప్రదర్శించారు. ‘పొడగంటివయ్యా పురుషోత్తమా’ అనే కీర్తనను రమ్యంగా నృత్యం చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రెండు విభాగాలుగా జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 50 భాగాలుగా నృత్య ప్రదర్శనలు జరగగా ముగింపు కార్యక్రమంలో నృత్య గురువులు కూడా నృత్యాన్ని ప్రదర్శించడం విశేషం.

కష్టపడితేనే ఫలితం
* జాతీయ క్రీడాకారిణి పివి సింధు
జీడిమెట్ల: విద్యలో, క్రీడల్లో కష్టపడితే ఫలితం సాధిస్తామని ఒలంపిక్ అథ్లెటిక్ జాతీయ క్రీడాకారిణి పివి సింధు అన్నారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని సుచిత్ర అకాడమిలో హరితహారం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా క్రీడాకారిణి సింధు విచ్చేశారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా అకాడమిలో జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్ రెడ్డితో కలిసి మొక్కలను నాటారు. అనంతరం అకాడమీలో టెన్నిస్ కోర్టును ప్రారంభించారు. పివి సింధు మాట్లాడుతూ అకాడమిలోని క్రీడలకు ఇస్తున్న ప్రాధాన్యతను ఆమె అభినందించారు. విద్యకు ఎంత ప్రాధాన్యతను ఇస్తున్నారో అంతే స్థాయిలో క్రీడలకు ఇవ్వడం సంతోషకరమని చెప్పారు. అకాడమీలో ఇంటర్నేషనల్ కోచ్‌ల ద్వారా క్రీడాకారులకు శిక్షణ ఇవ్వడం, టాప్ క్రీడాకారులను తయారుచేయడం మంచి పరిణామమని అన్నారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల పట్ల శ్రద్ధ వహించాలని, కష్టపడితే దేనినైనా సాధించవచ్చని సూచించారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శంకరయ్య, సర్కిల్ ఉపకమిషనర్ సుధాంశ్, అకాడమీ నిర్వాహకులు పాల్గొన్నారు.

గాంధీలో అరుదైన శస్తచ్రికిత్స
* ఆరుగంటలపాటు ఏకధాటిగా నిర్వహించిన వైద్యులు
సికిందరాబాద్: గాంధీ ఆసుపత్రిలో వైద్యులు అరుదైన శస్తచ్రికిత్స చేసి రికార్డు సృష్టించారు. దాదాపు ఆరుగంటలు పాటు నిర్వహించి ఆపరేషన్‌ను విజయవంతం చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రవణ్‌కుమార్, సర్జన్ విభాగం హెచ్‌ఓడి డాక్టర్. రవీందర్‌లు వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లా జైనత్‌మండలం పార్థి (బి) గ్రామానికి చెందిన సంతోష్, రమల కుమారుడు శ్రీకాంత్ (16) ఇంటర్ చదువుతున్నాడు. కాగా, ఇతనికి చిన్ననాటి నుంచి దగ్గు, దమ్ము ఆయసం లాంటి సమస్యలతో బాధపడుతున్నాడు. దీంతో అతను తరుచూ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. గతనెలలో ఈ సమస్య మరింత తీవ్రమైంది. మహారాష్టక్రు దగ్గరగా ఉండడంతో అక్కడికి వెళ్లి పరీక్షలు చూపించుకోగా కంతి ఉన్నట్లు వైద్యులు పరీక్షలను నిర్వహించి వెల్లడించారు. శస్తచ్రికిత్సకు అయ్యే ఖర్చు ఎక్కువగా ఉంటుందని, ఆదే సమయంలో ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వలేమని చెప్పడంతో బాధితులు నేరుగా గాంధీ ఆసుపత్రికి చేరుకున్నారు. ఆగస్టు 1వతేదీన వచ్చి ఆసుపత్రిలో చేరగా అదేరోజు సాయంత్రం విధులు ముగించుకుని వెళ్లడానికి ఇంటికి సిద్ధంగా ఉన్న సిటీ సర్జన్ రవీందర్‌కు తమ పరిస్థితిని వివరించారు. దీనికి స్పందించిన ఆయన శ్రీకాంత్‌ను పరీక్షించి వెంటనే ఆపరేషన్ చేయాలని నిర్ణయించి, వెంటనే విధులు ముగించుకుని ఇంటికి వెళ్లిన వైద్య సిబ్బందికి తిరిగి ఆసుపత్రికి పిలిపించి సాయంత్రం ఆరుగంటలకు శస్తచ్రికిత్సను ప్రారంభించారు. అప్పటి నుంచి రాత్రి 1గంట వరకు నిర్వహించిన శస్తచ్రికిత్స చేసి విజయవంతం చేశారు. రోగి కోలుకోవడంతో బుధవారం విలేఖరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. వైద్యపరిభాషలో ఎక్సెషన్ ఆఫ్ ట్రైకిల్ ట్యూమర్ అని ఇది అరుదుగా ఉంటుందని, అటువంటిది విజయవంతంగా చికిత్సను అందించగలిగామని వారు సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు ఆరుణ్, సత్యజీ, సురేశ్, భానులక్ష్మి తదితర బృందం పాల్గొన్న వైద్యులు వెల్లడించారు.