భక్తి కథలు

సాయ లీలామృతం- 1

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రశాంత వాతావరణం.. మామిడిచెట్లు, వేపచెట్టు, మఱ్ఱి చెట్లు, రాగిచెట్లు, మారేడు చెట్లు అన్నీ ఏపుగా పెరిగి ఉన్నాయి. తెల్లతెల్లని గులకరాళ్ళు.. సన్నని మట్టి.. మఱ్ఱిచెట్టు ఊడలు దిగి ఉంది. పెద్ద వేపచెట్టు దానికి చుట్టూరు కాంక్రీటుతో అరుగు వేసి ఉన్నారు.
ఆ ఊరికి అదే రచ్చబండ. ఆ ఊరికి అదే మొదలు.. ఆ ఊరికి ఎవరు వచ్చినా ఆ వేప చెట్టు కింద కాసేపైనా సేద తీరవలసిందే. అక్కడికి దగ్గరలోనే పెద్దగా ఊడలు దిగిన ఈ మఱ్ఱిమాను నీడలోనే ఆవులు నెమరువేసుకుంటూ పడుకుని ఉన్నాయి.
గేదెలూ వాటి ప్రక్కనే సేద తీరుతున్నాయి. ఓ ప్రక్కగా మేకలు.. మే.. మే... అంటూ ఏపుగా పెరిగి ఉన్న గడ్డిని తింటున్నాయి. వేప చెట్టు అరుగు దగ్గర తెల్లని కుక్క ఆ ఊరి గ్రామ సింహమేమో అనిపించేటట్టు ఊరి పొలిమేరల వైపు చూస్తూ వగురుస్తోంది. ఆత్మల గురించి పరమాత్మల గురించి కుక్కలకు తెలుస్తాయన్నట్టుగానే ఎవరో వస్తున్నట్లు.. వారికే స్వాగతం పలుకాలన్నట్టుగా ఆ కుక్క గబగబా ముందుకు పోతోంది మళ్లీ వెనుకు వస్తోంది.
అదే నేడు దేదీప్యమానంగా వెలుగులీనుతున్న శిరిడీ.
నాటి రూపురేఖలవి.
వేప చెట్టు అరుగుమీదకు చేరుకున్నాడు. అక్కడే ఆ ఊరి మునుసుబు, మరికొంతమంది పెద్దలు అప్పటికే ఆసీనులై ఊరి వార్తలు దేశంలోని వార్తలు బ్రిటీషు వారి వార్తలు చెప్పుకుంటూ ఉన్నారు. కొద్ది రోజుల్లో ఆ ఊరిలో జరుగబోయే పెళ్లి గురించి వారు మాట్లాడుకుంటున్నారు.
ఈరోజేనట పెళ్లివాళ్లు వచ్చేది. ఇందాకే ఆ కాశీనాథ్ వచ్చి మనకు చెప్పి వెళ్లాడు. వాళ్లు మన ఊరికి దగ్గరగా వచ్చి ఉండవచ్చు. ఈ కాశీనాథ్ ఇక మనం స్వాగతాలు పలుకడానికి తయారుగా ఉందాం అని చెప్పి మరీ ఎక్కడకు వెళ్లాడు ?అదిగో ఆ వచ్చేది పెళ్లి వాళ్లలాగా ఉన్నారు. అటు చూడు, దూరంగా గుఱ్ఱపు బగ్గీలు వస్తున్నట్లు ఉన్నాయి అన్నాడు మహిల్సాపతి.
అంతలో ఆ తెల్ల కుక్క పరుగెత్తి వెళ్లింది...
అంతలో చాంద్ పాటిల్ పెళ్లి బృందం విచ్చేశారు. పెద్ద పెద్దగా ఇదిగో ఇదే ఇదే అనే మాటలు గుఱ్ఱపు బండ్ల చప్పుడు.. ఆడవాళ్లు, మగవాళ్లు కలిసి మాట్లాడుతూ అంతా గందరగోళంగా అంతా హడావుడిగా అక్కడ కనిపిస్తోంది. ఆ గ్రామ సింహం ఎప్పుడు వెళ్లిందో కాని ఓ గుఱ్ఱపు బండి దగ్గర నాలుక చూపుతూ నిలబడి ఉంది.
మహిల్సాపతి.. ‘‘అదుగో పెళ్లివారు వచ్చేసినట్లు ఉన్నారు. వారిని స్వాగతిద్దాం రండి.. పదండి..’’ అంటూ ఊరి జనం అంతా ముందుకు కదిలారు.
అంతలో ఓ పొడవు చేతుల ఆకుపచ్చటి చొక్కా తలకు ఆకుపచ్చటి తలకట్టు , నడుముదాకా వ్యాపించి ఉన్న నల్లటి జుట్టు.. తెల్లని ప్రశాంతమైన మోము, చల్లని చూపులను ప్రసరించే కన్నులు, సన్నని పొడవైన ముక్కు, చిరునవ్వులు చిందించే మోము, చేతిలో సటకా, చిలిం గొట్టం, అగ్గిపెట్టె భుజాన ఒక జోలె.. ఇలా అతి నిరాడంబరంగా ఉన్న ఒక వ్యక్తి దిగాడు.
ఆయన్ను చూసీ చూడగానే మహిల్సాపతికి ఎక్కడలేని ఆనందం కలిగింది.
-ఇంకాఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743