నల్గొండ

పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ: వినాయక చవితి, బక్రీద్ పండుగలను సామరస్యంతో ప్రజలంతా ప్రశాంతంగా జరుపుకోవాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, ఎస్పీ ఎన్.ప్రకాశ్‌రెడ్డిలు కోరారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన శాంతి సంఘం సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతు పండుగల నిర్వాహణ ప్రశాంతంగా సాగేలా శాంతి సంఘం సభ్యుల సూఛనలను అధికార యంత్రాంగం పరిగణలోకి తీసుకుని తగిన చర్యలు చేపడుతుందన్నారు. డివిజన్ స్థాయిలో ఆర్డీవోలు, డిఎస్పీలు శాంతి సంఘాల సభ్యులతో సమావేశాలు నిర్వహించి పండుగల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తల్తెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. గత అనుభవాల మేరకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టాలన్నారు. మండపాల ఏర్పాటు, పారిశుద్ధ్యం, విద్యుత్ వసతుల కల్పన, మైక్‌ల అనుమతి, నిమజ్జనోత్సవ ఏర్పాట్లను పక్కాగా ప్రణాళిక మేరకు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
ఎస్పీ ఎన్.ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతు వినాయక చవితి, బక్రీద్ పండుగల సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేపడుతామన్నారు. వినాయక విగ్రహాలు పెట్టిన ప్రాంతాల్లో విద్యుత్, అగ్నిమాపక శాఖ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, పోలీస్‌శాఖ సమన్వయంతో చర్యలు చేపట్టాలన్నారు. మున్సిపాల్టీల్లో పది రోజుల పాటు శానిటేషన్ డ్రైవ్ చేపట్టాలన్నారు. మండపాలు, విగ్రహాల ఏర్పాటుపై పోలీస్ సిబ్బందికి నిర్వాహకులు సమాచారం అందించడంతో పాటు మైక్‌లకు అనుమతులు పొంది నిబంధనలు పాటించాలన్నారు. గత ఏడాది మాదిరిగానే పండుగలు అన్ని వర్గాల ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని కోరారు. అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవన్నారు. శాంతి సంఘం సభ్యులు మాట్లాడుతు పట్టణంలో పండుగల సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై పలు సూఛనలందించారు. ఈ సందర్భంగా ఆరోగ్యలక్ష్మి ఎక్సలెన్స్ అవార్డుకు ఎంపికైన కలెక్టర్ గౌరవ్ ఉప్పల్‌ను శాంతి సంఘం సభ్యులు ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ సమావేశంలో డిఆర్‌వో ఖిమ్యానాయక్, ఎఎస్పీ శ్రీనివాస్, డిపివో గోపాల్, ఆర్డీవోలు వెంకటాచారి, లింగ్యానాయక్, బిజెపి జిల్లా అధ్యక్షుడు నూకల నరసింహారెడ్డి, నాయకులు వీరెల్లి చంద్రశేఖర్, పి.శ్యాంసుందర్, శాంతి సంఘం నాయకులు కొండకింది చిన వెంకట్‌రెడ్డి, హఫీజ్‌ఖాన్, కౌన్సిలర్ ఖయ్యుం, వినాయక ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బండారు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ఎంపి, ఎమ్మెల్యే మధ్య వైరం..అభివృద్ధి పనులు దూరం
వలిగొండ: భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో అధికార పార్టీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డికి, ఎంపి బూర నర్సయ్యగౌడ్‌ల మధ్య సాగుతున్న రాజకీయ వైరం గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఆటంకమవుతుండటం గులాబీ శ్రేణులను కలవర పరుస్తోంది. ఇరువురి మధ్య విబేధాలతో నియోజకవర్గంలో పార్టీ సైతం రెండు వర్గాలుగా కొనసాగుతోంది. గత ఏడాది కాలంగా వారి మధ్య సాగుతున్న రాజకీయ ఆధిపత్య పోరు రోజురోజుకు ముదిరిపోతు గురువారం వలిగొండ మండలంలో చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ పథకాల శంకుస్థాపన సందర్భంగా మరోసారి రచ్చకెక్కాయి. ఎంపి, ఎమ్మెల్యేలిద్దరు మత్స్యగిరిగుట్టపై నూతన శివాలయం నిర్మాణానికి భూమి పూజ, వేములకొండలో గౌడ సంఘం భవనం శంకుస్థాపన, వెలువర్తిలో డబుల్ బెడ్ రూమ్ పథకం శంకుస్థాపన, సబ్ స్టేషన్ శంకుస్థాపనల కార్యక్రమాలకు హాజరుకావాల్సివుంది. అయితే ముందుగా నిర్ణీత సమయం మేరకు వలిగొండ గెస్ట్‌హౌస్‌కు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డిలు చేరుకుని ఎంపి బూర నర్సయ్య గౌడ్ రాక కోసం ఎదురుచూశారు. ఎంపి బూర తనకు కొంత ఆలస్యమవుతుందని మరో అరగంట గంట సమయం పట్టవచ్చని సమాచారమిచ్చారు. దీంతో పదేపదే తాను ఎంపి రాక కోసం వేచి చూడాల్సి వస్తోందని తాను మత్స్యగిరి గుట్ట వద్దకు వెళ్లి అక్కడే ఎదురుచూస్తానని ఎమ్మెల్యే పైళ్ల వలిగొండ నుండి మత్స్యగిరి గుట్టకు ఎమ్మెల్సీ కృష్ణారెడ్డితో కలిసి వెళ్లిపోయారు. ఈ సమాచారం తెలుసుకున్న ఎంపి బూర తీవ్ర అసంతృప్తి చెంది తాను సదరు కార్యక్రమాలకు హాజరుకాకుండా భువనగిరిలోనే ఉండిపోయారు. ఎంపి బూర వైఖరి పట్ల అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యే పైళ్ల రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని కార్యక్రమాలకు సంబంధించిన శివాలయం భూమి పూజ, వెలువర్తిలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు శంకుస్థాపనలు చేసి వెళ్లిపోయారు. ఎంపి నిధులతో నిర్మించనున్న గౌడ సంఘం భవనానికి, అలాగే కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించే వెలువర్తి సబ్ స్టేషన్ నిర్మాణానికి మాత్రం శంకుస్థాపన చేయకుండా ఎమ్మెల్యే పైళ్ల వదిలేశారు. అధికారులు సైతం ఎంపి కార్యక్రమాలకు సంబంధించి శిలాఫలాకాలను తొలగించి తిరిగి తీసుకెళ్లారు. దీంతో ఎంపి బూర, ఎమ్మెల్యే పైళ్లల మధ్య నెలకొన్న విభేదాలతో గౌడ సంఘం భవనం, సబ్ స్టేషన్ల నిర్మాణ శంకుస్థాపనలు ఆగిపోవడం సదరు గ్రామాల వారిని నిరాశ పరిచింది.
గతంలో 2016లో వేసవిలో మూడున్నర కోట్లతో చేపట్టాల్సిన భీమలింగం మూసీ కాలువ మరమ్మతు పనుల శంకుస్థాపన సైతం ఎంపి, ఎమ్మెల్యే మధ్య పంచాయితీతో వాయిదా పడింది. ఏడాది ఆలస్యంగా 2017 వేసవిలో మొదలయ్యాయి. పనులు ఆలస్యంగా మొదలుపెట్టడంతో వర్షాలు రాగా భీమలింగం కాలువ పనులు అసంపూర్తిగా మిగిలిపోగా వెలువర్తి నుండి కూరెళ్ల వరకు మధ్యలో దాదాపు 8వేల ఎకరాల ఆయకట్టులో ఈ ఖరీఫ్ పంటలకు మూసీ నీరందకుండా రైతులు పంట నష్టపోతున్న దుస్థితి నెలకొంది.
పార్టీకి సమస్యగా మారిన ఎంపి, ఎమ్మెల్యేల విభేదాలు
ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో ఇతర నియోజకవర్గాల్లో లేని రీతిలో టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే పైళ్ల భువనగిరిలో బలమైన రాజకీయ ప్రత్యర్థులైన జిట్టా బాలకృష్ణారెడ్డి, కాంగ్రెస్‌కు చెందిన కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, బిజెపికి చెందిన పివి శ్యాంసుందర్‌రావు, టిడిపి నుండి ఎలిమినేటి ఉమామాధవరెడ్డిల నుండి గట్టి రాజకీయ సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఎంపి బూర, ఎమ్మెల్యే పైళ్ల వర్గాలుగా నియోజకవర్గంలో టిఆర్‌ఎస్ రెండు వర్గాలుగా సాగుతుండటం ప్రత్యర్థి పార్టీలకు అనుకూలంగా మారుతోంది. మరోవైపు గురువారం ఎమ్మెల్యే పైళ్ల ఏకపక్ష వైఖరితోనే గౌడ సంఘం నిర్మాణ పనుల శంకుస్థాపన ఆగిపోయిందని బిసి సంఘాల పేరుతో పత్రికా ప్రకటనలు విడుదల కావడం వర్గపోరుకు మరింత ఆజ్యం పోసినట్లయింది. బిసి ప్రజాప్రతినిధులను ఎమ్మెల్యే చిన్నచూపు చూస్తు అవమానపరుస్తున్నాడని ఆ ప్రకటనలో ఆరోపించారు. దీంతో పార్టీలో గ్రూపులుగానే కాకుండా కులాల వారిగా సైతం ఎంపి, ఎమ్మెల్యేల మధ్య ఇక్కడ వర్గపోరు సాగుతుండటం నియోజకవర్గంలో టిఆర్‌ఎస్‌ను దెబ్బతీసేవిగా ఉన్నాయని గులాబీ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

ఆటోలో రూ.8.5లక్షలు మాయం..
ముగ్గురు మహిళలపై బాధితుడి ఫిర్యాదు
మిర్యాలగూడ టౌన్: పట్టణంలో రాజీవ్ చౌక్ వద్ద ఆటోరిక్షా ఎక్కిన రైస్‌మిల్లర్ దేవిరెడ్డి వెంకట్‌రెడ్డి బ్యాగులో నుండి రూ.8.50లక్షలు మాయమైనట్టు వన్‌టౌన్ పోలీసులకు గురువారం ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి గ్రామంలో శ్రీదేవి ప్రసన్న రైస్‌మిల్లును నిర్వహిస్తున్న వెంకట్‌రెడ్డి హైద్రాబాద్‌లో కొంతమందికి అమ్మిన బియ్యం సంబంధించిన డబ్బులు సుమారు రూ.9.35 లక్షలు తీసుకున్న వెంకట్‌రెడ్డి గోనే సంచిలో పెట్టుకుని మిర్యాలగూడలోని రాజీవ్ చౌక్ వద్ద గురువారం ఉదయం 9.45 గంటలకు బస్సు దిగాడు. చౌక్ వద్ద నేరేడుచర్ల బస్సు కోసం ఎదురుచూడగా రాకపోవడంతో ఆటో ఎక్కాడు. అతనితో పాటు కొంతమంది మహిళలు ఆటో ఎక్కారు. వెనుకసీట్లు ఖాళీ లేకపోవడంతో వెంకట్‌రెడ్డి ఆటో డ్రైవర్ పక్కన కూర్చుని సంచి మహిళలు కూర్చున్న స్థలంలోనే పెట్టాడు. నేరేడుచర్ల వెళ్లాల్సిన మహిళలు వెంటనే ఈదులగూడ వద్దనే దిగిపోతామనడంతో డ్రైవర్ వారితో వాగ్వాదానికి దిగాడు. అయినా మహిళలు హడావుడిగా వెళ్లి పోయిన అనంతరం వెంకట్‌రెడ్డి సంచి చూసుకోగా అందులో కేవలం రూ.84 వేలు మాత్రమే ఉండటం గమనించి వెంటనే వన్‌టౌన్ సిఐ వెంకటేశ్వరరెడ్డి, ఎస్‌ఐ అహ్మద్‌లకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగి ఆటోను పట్టుకున్నారు. అతనితో కలిసి మహిళల కోసం గాలించారు. ఫలితం దక్కలేదు. మొత్తం అనుమానాస్పదంగా ఉన్న ఫిర్యాదును వన్‌టౌన్ పోలీసులు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

అవకాశాలను అందిపుచ్చుకోండి
యాదాద్రి జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ పిలుపు
సంస్థాన్‌నారాయణఫురం: మండల కేంద్రంలో నిర్వహించిన మెగా జాబ్‌మేళాకు నిరుద్యోగుల నుంచి అపూర్వ స్పందన లభించింది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, రాచకొండ పోలీస్ కమిషనర్‌ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ జాబ్‌మేళాకు సంస్థాన్‌నారాయణపురం, చౌటుప్పల్, వలిగొండ, రామన్నపేట, పోచంపల్లి మండలాలకు చెందిన సుమారు 4వేల మంది నిరుద్యోగులు పాల్గొన్నారు. ఉద్యోగాలు ఇవ్వడానికి 35కంపెనీలు, సంస్థలు ముందుకు వచ్చాయి. అందులో 20 మందికి అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం జరుగుతుండగానే నియామక పత్రాలు అందజేశాయి. ఈసందర్భంగా యాదాద్రి జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ మాట్లాడుతూ నిరుద్యోగ యువత వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఒక్కోమెట్టును ఎక్కుతూ ఎదగాలన్నారు. నిరుద్యోగులుగా ఇంట్లో ఉంటే తల్లిదండ్రులతో పాటు, మీకు ఇబ్బందిగా ఉంటుందన్నారు. ఈసమస్యను తానుకూడా అనుభవించినట్లు తెలిపారు. అందుకే కేవలం రూ.600 వేతనానికి కళాశాలలో ఉద్యోగం చేసినట్లు తెలిపారు. అనంతరం సివిల్స్‌కు ప్రిపేర్ అయినట్లు వివరించారు. అందివచ్చిన అవకాశాలను ముందుగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాచకొండ పోలీస్ జాయింట్ కమిషనర్ తరుణ్‌జోషి మాట్లాడుతూ వెనుకబడిన సంస్థాన్‌నారాయణపురం మండలంలో మెగా జాబ్‌మేళాను నిర్వహించడం నిరుద్యోగులకు లాభదాయకమన్నారు. 35 కంపెనీలు ఒకేచోటుకు తరలివచ్చి ఉద్యోగాలు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. త్వరలో పోలీస్‌శాఖలో 18వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. పోలీస్ శాఖలో ఉద్యోగం కావాలనుకునే వారు సంబంధిత పోలీస్ స్టేషన్‌లో ధరఖాస్తులు చేసుకోవాలని వారికి ఉచిత శిక్షణను ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిలు మాట్లాడుతూ మారుమూల మండలంలో జాబ్‌మేళాను చేపట్టినందుకు కంపెనీలను అభినందించారు. ఈకార్యక్రమంలో డిఆర్‌డిఎ పిడి వెంకట్‌రావు, డిసిపి యాదగిరి, ఎసిపి స్నేహిత, ఎంపిపి వాంకుడోతు బుజ్జీ, జడ్పీటిసి బొల్ల శివశంకర్, సర్పంచ్ అంజమ్మ, తహశీల్దార్ శ్రీనివాస్‌కుమార్, ఎంపిడివో సరస్వతి, ఎంపిటిసిలు, సర్పంచ్‌లు, నిరుద్యోగులు పాల్గొన్నారు.

త్వరలో పాస్‌పోర్టు కార్యాలయం ప్రారంభం
కలెక్టర్ గౌరవ్ ఉప్పల్
నల్లగొండ టౌన్: నల్లగొండ జిల్లాకు మంజూరైన పాస్‌పోర్టు కార్యాలయ ఏర్పాటుకు తాత్కాలికంగా మెప్మా భవన్‌ను ఎంపిక చేసినట్లు కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. కార్యాలయం ఏర్పాటుకు గాను పట్టణంలోని తపాలా కార్యాలయం, మెప్మా కార్యాలయాన్ని పరిశీలించి, వాటిలో మెప్మా కార్యాలయాన్ని ఎంపిక చేశారు. కార్యాలయ ఏర్పాటుకు త్వరలో చర్యలు తీసుకుంటానని కలెక్టర్ తెలిపారు. తపాలా కార్యాలయం సముదాయంలో అదనంగా నిర్మించతలపెట్టిన పాస్‌పోర్టు కార్యాలయ స్థలాన్ని పరిశీలించారు. ఆయన వెంట ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి, రీజనల్ పాస్‌పోర్టు ఆఫీసర్ విష్ణువర్ధన్‌రెడ్డి, హైద్రాబాద్ రీజియన్ పాస్‌పోర్టు మాస్టర్ జనరల్ ఏలేషా తదితరులున్నారు.

ఉద్యమంలా మిజెల్స్, రూబెల్లా వ్యాక్సిన్ పంపిణీ
ప్రారంభించిన కలెక్టర్ గౌరవ్ ఉప్పల్
సెయింట్ అల్ఫన్సస్‌లో ఒకే రోజు 3వేల మంది విద్యార్థులకు టీకాలు
నల్లగొండ: కేంద్ర ప్రభుత్వం నిర్ధేశించుకున్న లక్ష్యం మేరకు 2020నాటికి దేశంలో మిజెల్స్, రూబెల్లా వ్యాధి నివారణకు వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం ఉద్యమంలా సాగాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ కోరారు. గురువారం నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో మిజెల్స్, రూబెల్లా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం గ్రామాగ్రామాన ప్రారంభమైంది. నల్లగొండ జిల్లా కేంద్రంలోని సెయింట్ అల్ఫన్సస్ పాఠశాలలో కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ వ్యాక్సిన్ పంపి ప్రారంభించారు. ఈ పాఠశాలలో ఒకే రోజు ఏకంగా 3వేల మంది విద్యార్థులకు కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ పర్యవేక్షణలో వ్యాక్సిన్ టీకాలను వేయించడం విశేషం. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతు పిల్లలకు ప్రాణాంతకమైన తట్టు, పొంగుల నుండి శాశ్వత రక్షణకు ఈ వ్యాక్సిన్ తప్పక వేయించాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 23వరకు ఈ వ్యాక్సినేషన్ కొనసాగుతుందని 9నెలల నుండి 15 ఏళ్లలోపు పిల్లలు జిల్లాలో 3లక్షల 74,701మంది ఉన్నారని వారందరికి వ్యాక్సిన్ వేయించేందుకు 474టీమ్‌లు ఏర్పాటు చేశామన్నారు. మిజిల్స్, రూబెల్లా వ్యాధుల నివారణలో అంతా సహకరించాలని కోరారు. ఒకేసారి 3వేల మంది పిల్లలకు వ్యాక్సినేషన్ కార్యక్రమానికి సహకరించిన కళాశాల ప్రిన్సిపల్ ఎల్.అరుణ్ ప్రకాశ్‌కు, సహకరించిన తల్లిదండ్రులు, పిల్లందరికి కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్‌వో భానుప్రసాద్ నాయక్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి రామకృష్ణ, సందీప్‌పాండే, వైద్యాధికారి అనూష, పాఠశాల ఉపాధ్యాయులు ఎం.శ్రీనివాస్‌రావు, కుమార్, బాలశౌరిరెడ్డి, లూర్ధురెడ్డి, కాథరిన్, జిలాని, సుందరి, జయప్రకాశ్ పాల్గొన్నారు.
డైట్ కళాశాలలో ప్రారంభించిన ఎంపి గుత్తా
నల్లగొండ టౌన్: నల్లగొండ డైట్ కళాశాలలో గురువారం మిజెల్స్, రూబెల్లా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం తట్టు, పొంగు వ్యాధుల నివారణకు చేపట్టిన ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసి పిల్లలందరికి టీకాలు ఇప్పించాలన్నారు. కార్యక్రమంలో డిఎంహెచ్‌వో భానుప్రసాద్‌నాయక్, రెడ్‌క్రాస్, లయన్స్‌క్లబ్‌ల చైర్మన్ గోలి అమరేందర్‌రెడ్డి, రఘుపతిరెడ్డి, ఇమ్యూనైజేషన్ అధికారులు రామకృష్ణ, మోతిలాలా, డిఈవో చంద్రమోహన్, దేశ్‌పాండే, వైద్యులు వసంతకుమారి, అరుంధతి, హెచ్‌ఎం నిర్మల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

దేవాలయ భూముల్లో హరితహారంపై కలెక్టర్ పరిశీలన
నల్లగొండ టౌన్: నల్లగొండ అనే్నపర్తి సీతారామచంద్రస్వామి దేవాలయ భూముల్లో చేపట్టిన భారీ హరితహారం కార్యక్రమం పురోగతిని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ గురువారం పరిశీలించారు. భూముల్లో మొక్కలు నాటేందుకు తీస్తున్న గుంతలను పరిశీలించి ఎంపిక చేసిన ప్రాంతాల్లో గుంతలను త్వరిత గతిన సిద్ధం చేయాలన్నారు. ఈనెల 20న అటవీశాఖ మంత్రి జోగురామన్న, జిల్లా మంత్రి జి.జగదీష్‌రెడ్డిలు ఇక్కడ హరిత హారం కార్యక్రమానికి హాజరుకానున్నారన్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ సులోఛన, డిఎఫ్‌వో సుదర్శన్‌రెడ్డి, ఎంపిడివోలు కె.మణేమ్మ, సురేష్ పాల్గొన్నారు.
638 అడుగులకు చేరిన మూసీ నీటిమట్టం
కేతేపల్లి: జిల్లాలో రెండవ అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టు అయిన మూసీ ప్రాజెక్టు నీటిమట్టం గురువారం సాయంత్రం నాటికి 638 అడుగులకు చేరుకుంది. ఎగువ ప్రాంతాలైన భువనగిరి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతుండడంతో బుధవారం నాటికి 637 అడుగులుగా ఉన్న నీటిమట్టం 24గంటల్లో ఒక అడుగు మేర పెరిగి 638 అడుగులకు చేరింది. గత సంవత్సరం సెప్టెంబర్ 16నాటికి 645 అడుగుల పూర్తిస్థాయి సామర్థ్యానికి చేరుకోగా ఈ సంవత్సరం ప్రస్తుతం కురుస్తున్న తరహాలోనే ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురిస్తే మరో 10రోజుల్లో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంటుందని రైతులు, అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 455 క్యూసెక్కుల నీరు వచ్చిచేరుతుందని 45క్యూసెక్కుల నీరు ఎడమ కాల్వ ద్వారా బయటకు వెళ్తుందని ప్రాజెక్టు ఏఈ మమత తెలిపారు.
పవర్‌ప్లాంట్ నిర్మాణం నిలిపివేత
నేరేడుచర్ల: మండలంలోని చిల్లెపల్లి సమీపంలోని మూసీ నది ఒడ్డున నిర్మిస్తున్న పవర్‌ప్లాంట్ నిర్మాణాన్ని గురువారం రెవెన్యూ, ఇరిగేషన్ శాఖాధికారులు నిలిపివేశారు. ఐబి డిఇ స్వామి, తహశీల్దార్ కృష్ణానాయక్, జెఇ నాగరాజులు పవర్‌ప్లాంట్ నిర్మాణంపై పలువురు రైతులు ఆరోపణలు చేయగా పరిశీలించారు. ఈసందర్భంగా తహశీల్దార్ కృష్ణానాయక్ మాట్లాడుతూ పవర్‌ప్లాంట్ యాజమాన్యం ఒక చోట భూమి చూపించి మరొక చోట నిర్మిస్తున్నారని ఆరోపణలు వచ్చాయని, ఈభూమిపై సర్వే చేసి నిర్ణయించేంతవరకు పనులు నిలిపివేయాలని ఆదేశించినట్లు తెలిపారు. దళితులకు పట్టాలు ఇచ్చిన భూమిలో నిర్మాణం చేపడుతున్నారని రైతులు తహశీల్దార్‌కు విన్నవించారు.