కృష్ణ

గుట్కా విక్రేత ‘గెల్లి కిషోర్’ జిల్లా బహిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: జిల్లా కేంద్రం మచిలీపట్నంకు చెందిన నిషేధిత గుట్కా విక్రేత గెల్లి కిషోర్ జిల్లా బహిష్కరణకు గురయ్యారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం గురువారం బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేశారు. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు నిర్వహించిన దాడుల్లో మూడు పర్యాయాలు నిషేధిత గుట్కాలతో పట్టుబడ్డ కిషోర్‌ను కలెక్టర్ తనకున్న అధికారాలను వినియోగించి ఆరు నెలల పాటు జిల్లా నుండి బహిష్కరించారు. గెల్లి కిషోర్ ఇప్పటి వరకు మూడు పర్యాయాలు విజిలెన్స్ అధికారులు నిర్వహించిన దాడుల్లో పెద్ద ఎత్తున గుట్కా నిల్వలతో పట్టుబడ్డాడు. 2016 జూన్ 6వతేదీన మచిలీపట్నం శివారు జగన్నాధపురంలో 25/252 డోర్ నెంబరు గల ఇంటిపై దాడి చేయగా రూ.8లక్షల 4వేల 380లు విలువ చేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని నిర్వాహకుడు గెల్లి కిషోర్‌పై తొలి కేసు నమోదైంది. ఈ కేసు నమోదైన మరో నాలుగు నెలలు అక్టోబర్ 1వతేదీన నిర్వహించిన ఎక్సైజ్ అధికారులు నిర్వహించిన దాడిలో పోతేపల్లి జ్యూయలరీ పార్కులోని ఫ్లాట్ నెం.266లో రూ.26లక్షల 25వేలు విలువ చేసే గుట్కా ప్యాకెట్లు నిల్వ చేసి మళ్లీ పట్టుబడ్డాడు. గత జూలై 17వతేదీన నిర్వహించిన దాడిలో మూడవ సారి పట్టుబడ్డాడు. సర్కిల్‌పేటలోని ముత్యాలమ్మ గుడి వద్ద ఒక ఇంటిని అద్దెకు తీసుకుని రూ.25లక్షల 46వేల 360లు విలువ చేసే గుట్కా ప్యాకెట్లను నిల్వ చేయగా విజిలెన్స్ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఒకటికి మూడుసార్లు పట్టుబడ్డ గెల్లి కిషోర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ జిల్లా నుండి బహిష్కరించిన సంచలన నిర్ణయం తీసుకున్నారు. కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి లక్ష్మీకాంతం కల్తీ ఆహారంపై ఉక్కుపాదం మోపారు. విజిలెన్స్ అధికారులతో విస్తృత దాడులు నిర్వహించి కల్తీ ఆహార పదార్థాలు, నిషేధిత గుట్కా విక్రేతలపై పెద్ద ఎత్తున కేసులు నమోదు చేసి జరిమానా విధించారు. గత జనవరి నెల నుండి ఇప్పటి వరకు 379 కేసులు నమోదు చేసి రూ.9కోట్ల మేర జరిమానా విధించారు.