కృష్ణ

అంగన్‌వాడీ భవనాలకు ఎన్‌ఆర్‌ఐల చేయూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్): జిల్లాలోని అంగన్‌వాడీ భవనాల నిర్మాణాలకు ఎన్‌ఆర్‌ఐ లు చేయూత నిస్తున్నారని, సామాజిక బాధ్యతగా వారిస్తున్న సహకారం అభినందనీయమని జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం అన్నారు. గురువారం నార్త్ అమెరికా ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరామ్ నేతృత్వంలో ఎన్‌ఆర్‌ఐల బృందం నగరంలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతంతో సమావేశమైన సందర్భంగా జిల్లాలో చేపట్టబోయే అంగన్‌వాడీ భవనాల నిర్మాణాలపై సమీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా వెయ్యి భవనాలను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తుండగా ఒకొక్క భవనానికి 7లక్షల రూపాయలు వ్యయం అవుతుందని అంచనా వేశామన్నారు. ఐదు లక్షలను ఉపాధి హామీ పథకం కింద మంజూరు చేస్తుండగా మిగిలిన రెండు లక్షల రూపాయలను దాతల సహకారం తీసుకుంటున్నట్టు తెలిపారు. ఎన్‌ఆర్‌ఐ లతోపాటు పారిశ్రామిక వర్గాలు, జిల్లా అధికారులు, గ్రామ సమైక్య సంఘాలు తమ వంతుగా ముందుకు రావడం సంతోషకరమన్నారు. ఎన్‌ఆర్‌ఐ లు కేవలం అంగన్‌వాడీ భవనాలే కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతుల ఏర్పాటుకు కూడా ముందుకు రావడం విద్యార్థులకు వరం లాంటిదన్నారు. అంతేకాకుండా జిల్లాలో ప్రభుత్వం పరంగా అభివృద్ధిపర్చనున్న స్మశాన వాటికల అభివృద్ధిలో కూడా ఎన్‌ఆర్‌ఐలు భాగస్వాములు కావాలంటూ ఎన్‌ఆర్‌ఐలను కలెక్టర్ లక్ష్మీకాంతం కోరిన మీదట వారు సానుకూలంగా స్పందించడం విశేషం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నార్త్ అమెరికా ప్రతినిధి కోమటి జయరామ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కోరిక మేరకు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతుల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని, అలాగే స్మశాన వాటికల అభివృద్ధిలో కూడా తగు సహకారం ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కవులూరు గ్రామానికి చెందిన చింతా భాస్కర్ అనే ఎన్‌ఆర్‌ఐ ఆయా అభివృద్ధి పనులకై తన వంతుగా 3లక్షల రూపాయల చెక్కును జయరామ్ నేతృత్వంలో కలెక్టర్ లక్ష్మీకాంతంకు అందజేశారు. ఈకార్యరక్రమంలో ఎన్‌ఆర్‌ఐలు గారపాటి ప్రసాద్, గొల్లనపల్లి ప్రసాద్, మురళీ, ప్రదీప్, డ్వామా, ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్లు బి రాజగోపాల్, కె కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.