అదిలాబాద్

ఎంఆర్ వ్యాక్సిన్ వికటించి 5గురు విద్యార్థులకు ఆస్వస్థత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల: ఎంఆర్ వ్యాక్సిన్ వికటించి 5గురు విద్యార్థులు ఆస్వస్థతకు గురయ్యారు. వివరాల ప్రకారం మందమర్రి పట్టణంలోనిలిటిల్ ఫ్లవర్ పాఠశాలలో విద్యార్థులకు ఎం ఆర్ వ్యాక్సిన్ వేయడానికి గురువారం ఉదయం ఎ ఎన్ ఎం బృందం, పాఠశాలకు చేరుకోని విద్యార్థులకు వ్యాక్సిన్‌లు వేశారు. వ్యాక్సిన్ వేస్తున్న సందర్బంలో పాఠశాలకు చెందిన 5 గురు విద్యార్థులు ఆస్వస్థతకు గురి కావడంతో మెరుగైన చికిత్స కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఎలాంటి ప్రమాదం లేదని త్వరలోనే కోలుకుంటారని అని వైద్యులు తెలిపారు. పాఠశాలలో 8వ తరగతి చదువుతన్న సాత్విక్, అక్షయ 6వ తరగతి, పూజా, ఐశ్వర్య, కన్నయ్య ల తల్లిదండ్రులు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకోని మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను కోరారు.
భోజనం చేయకపోవడం వల్లనే ఆస్వస్థత.. సంధ్యారాణి ఎఎన్‌ఎం
భోజనం చేయకపోవడం వల్లనే పాఠశా లవిద్యార్థులు ఆస్వస్థతకు గురయ్యారని ఎం ఆర్ వ్యాక్సిన్‌లో ఎలాంటి లోపం లేదని ఎ ఎన్ ఎం సంధ్యారాణి మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో విలేకరుల సమావేశంలో పేర్కొంది.

కడుపు నొప్పి భరించ లేక సర్పంచ్ భర్త ఆత్మహత్య
కాగజ్‌నగర్: కడుపు నొప్పి భరించలేక మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈస్గాం పోలీసులు తెలిపిన ప్రకారం మండలంలోని ఈస్గాం సర్పంచ్ గడ్డి విమల భర్త నాగయ్య (45) బుధవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకోని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు గత కొంత కాలంగా కడుపు నొప్పితో బాధ పడుతున్నాడని భరించలేక మద్యానికి బానిసై మద్యంమత్తులో బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.

ఆలయ ఓడిబియ్యం హుండీల లెక్కింపు
బాసర: అమ్మవార్లకు భక్తులు సమర్పించిన ఓడిబియ్యం హుండీలను గురువారం ఆలయ అధికారులు విప్పారు. గురువారం ఆలయ ప్రత్యేకాధికారి ఎ.సుధాకర్‌రెడ్డి, ఛైర్మెన్ శరత్‌పాఠక్ ఆధ్వర్యంలో వెయ్యిరూపాయల అక్షరాభ్యాస మండపంలో ఏర్పాటుచేసిన ఓడిబియ్యం రెండు హుండీలను విప్పారు. ఇందులో నుండి భక్తులు సమర్పించిన ఓడిబియ్యంతో పాటు కనుమలు, కుడుకలను వేరుచేసి వేలంపాట నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో నిర్మల్ జిల్లా దేవాదాయశాఖ ఇన్స్‌పెక్టర్, ఆలయ సూపరిండెంట్‌లు సాయిలు, గిరిధర్, సిబ్బంది పాల్గొన్నారు.

మహిళ కార్మికులకు ఆరు నెలల ప్రసూతి సెలవులకు ఉత్తర్వులు
శ్రీరాంపూర్ రూరల్: సింగరేణి కాలరీస్‌లో పనిచేస్తున్న మహిళా కార్మికులకు ప్రసూతి సెలవులు 180 రోజులకు పెంచుతూ సింగరేణి యజమాన్యం అంగీకారం ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని టిబిజికెఎస్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు సురేందర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం శ్రీరాంపూర్ విలేఖరులతో మాట్లాడుతూ టిబిజికెఎస్ అధ్యక్షుడు వెంకట్రావు ఆధ్వర్యంలో యూనియన్ ప్రతినిధుల బృందం సిఎండిని కలిసి సమస్యలపై చర్చలు జరిపారని పేర్కొన్నారు. సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులకు జెబిసిసిఐ మార్గదర్శకాలు ప్రకారం కోలిండియా యజమాన్యం ఆదేశం మేరకు సింగరేణిలోని ప్రభుత్వజి ఓ ప్రకారం కనీస వేతనాలు, హైపవర్ కమిటి వేతనాలు అమలు చేయడానికి ఈ నెల 18 న ఉత్తర్వులు జారీ చేయడానికి యజమాన్యం అంగీకరించిందని ఎస్‌ఎల్‌పి ప్రమోషన్లు, ఎనిమిది నెలలు ఆలస్యం అయినందున కార్మికులకు రావాల్సిన బకాయిలను ఈనెల వేతనంతోపాటు కార్మికులకు అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు.

భూ సమస్యలకు ఎక్కడికక్కడే పరిష్కారం
* సంయుక్త కలెక్టర్ అశోక్‌కుమార్
వాంకిడి: కుంరంభీం ఆసిఫాభాద్ జిల్లాలో నెల కొన్న భూ సమస్యలను ఎక్కడికక్కడే పరిష్కరించే దిశగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యలో కార్యచరణ చేపట్టినట్లు జిల్లా సంయుక్త కలెక్టర్ అశోక్‌కుమార్ అన్నారు. గురువారం వాంకిడి మండల కేంద్రంలో ఆసిపాబాద్ ఆర్డీవో సురేష్ కదం, తహశీల్దార్ మల్లికార్జున్‌తో కలసి మండలంలో నెలకొన్న భూ సమస్యలపై ప్రత్యేక ప్రజా ఫిర్యాధులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మండలంలో జిల్లా ఉన్నత అధికారులమైన మేము తిరిగి ప్రజల భూ సమస్యలను తీర్చడానికి కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. గతంలో జరిగిన ఏ తప్పయినా పరిష్కరించడానికి సిద్దంగా ఉన్నామని ఆయన తెలిపారు. అయితే ఈ జిల్లాలో అధికంగా ఎస్సీ, ఎస్టీలకు సంబందించిన భూ సమస్యలే అధికంగా ఉన్నాయని, వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరించే దిశగా మేము,మా సిబ్బంది పనులు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల సందర్భంగా 14 వినతిపత్రాలు వచ్చాయని వాటిని పరిశీలించి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకొంటామని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా సెప్టెంబర్ 17న నిర్వహించే తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా చేపట్టాలని మండల బిజెపి నాయకులు జిల్లా సంయుక్త అధికారికి వినతిపత్రం అందచేశారు.
చెట్లతోనే మానవ మనుగడ
మన రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా అడవుల సంఖ్య తగ్గిందని, దీంతో ఈ సంఖ్యను పెంచడానికి మన రాష్ట్ర ప్రభుత్వం హరితహారం పథకాన్ని అమలు చేస్తుందని ఇందులో అందరు భాగస్వాములై చెట్లు నాటాలని కుంరంభీం ఆసిఫాబాద్ జిల్లా జెసి అశోక్ కుమార్ అన్నారు. గురువారం వాంకిడికి వచ్చిన సందర్భంగా ఆయన పలు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడవుల సంఖ్య చాలా తగ్గడంతో వర్షాలు తగ్గాయని ఈ పరిస్థితి నుండి మనం బయటపడాలంటే ప్రతి ఒక్కరు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగస్వాములై మొక్కలు నాటి, వాటిని రక్షించిన నాడే మానవ జాతికి మనుగడ ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా ఆయనతోపాటు ఆర్డీవో సురేష్ కదం, తహశీల్దార్ మల్లికార్జున్ ఉన్నారు.

పెర్కపల్లి, రేవోజిపేట్ గ్రామాల్లో అటవీశాఖ అధికారుల ఆకస్మిక దాడులు
* కలప దుంగలు, యంత్రాల పట్టివేత
కడెం: నిర్మల్ జిల్లాలోని దస్తురాబాద్ మండలం పెర్కపల్లి, రేవోజిపేట్ గ్రామాల్లో గల కార్పెంటర్ ఇళ్లల్లో ఖానాపూర్ ఎఫ్‌డివో రవీంధర్ రాథోడ్ ఆధ్వర్యంలో అటవీశాఖ అధికారులు, సిబ్బంది స్ట్రైకింగ్‌ఫోర్స్‌లు ఆకస్మిక దాడులు నిర్వహించి పలు కలపదుంగలు, వాటిని కోసే యంత్రాలను, కలప చెక్కలను అధికారులు పట్టుకున్నారు. పెర్కపల్లి గ్రామంలో గొల్లపల్లి సత్యనారాయణ, గంగారాం కార్పెంటర్ ఇళ్లల్లో అధికారులు దాడులు నిర్వహించగా యంత్రాలు, కలపదుంగలు లభ్యమయ్యాయి. అలాగే రేవోజిపేట్ గ్రామంలో గొల్లచారి, వి.శ్రీనివాస్ కార్పెంటర్ ఇళ్లలో దాడులు నిర్వహించగా కలపదుంగలు, యంత్రాలు లభ్యమయ్యాయి. ఈ ఆకస్మిక దాడుల్లో లభ్యమైన దాడుల్లో దాదాపు రూ.40 వేల విలువ ఉంటుందని, స్వాధీనం చేసుకున్న కలపదుంగలను ట్రాక్టర్‌లో ఖానాపూర్ డిపోకు తరలించామని ఆయన తెలిపారు. పెర్కపల్లి, రేవోజిపేట్ గ్రామాల్లో అక్రమ కలప, యంత్రాలను కార్పెంటర్ ఇళ్లలో దాడులు చేసి పట్టుకుని వారిపై కేసు నమోదుచేయడం జరిగిందన్నారు. ఈ దాడిలో కడెం ఎఫ్ ఆర్‌వో రాథోడ్ రమేష్, డిప్యూటి ఎఫ్ ఆర్‌వో సాంబయ్య, గంగాపూర్, దస్తురాబాద్ ఎఫ్ ఎస్‌వోలు ఎండి నజీర్‌ఖాన్, కింగ్‌ఫిషర్, ఎఫ్‌బివోలు కీర్తిరెడ్డి, కృష్ణచైతన్య, దుర్గం ప్రభాకర్, స్ట్రైకింగ్‌ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.

గణేష్ ఉత్సవాల్లో పోలీసు నిబంధనలు తప్పనిసరి పాటించాలి
* డిఎస్పీల సమక్షంలో ప్రత్యేక టాస్క్ఫోర్స్
* శాంతి కమిటీ సమావేశంలో జిల్లా ఎస్పీ ఎం.శ్రీనివాస్
ఆంధ్రభూమి బ్యూరో
ఆదిలాబాద్: గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భారీ పోలీసు బందోబస్తు నిర్వహించి, జిల్లాలో ప్రశాంత వాతావరణం కల్పిస్తామని, ఎవరైన పోలీసు నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ ఎం.శ్రీనివాస్ అన్నారు. గురువారం ఉత్సవ కమిటీ ప్రతినిధులు, శాంతికమిటీ నిర్వహకులు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులతో శాంతికమిటీ సమావేశం నిర్వహించారు. ఈమేరకు స్థానిక సమస్యలపై సంఘాల ప్రతినిధులతో ఎస్పీ సూచనలు తీసుకున్నారు. ఈ సంధర్భంగా ఎస్పీ ఎం.శ్రీనివాస్ మాట్లాడుతూ భారీ శబ్దంతో కాలుష్యం కల్గించే డిజెలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. మండపం ముందు వెనుక పేకాట ఆడటం, మద్యం సేవించడం పూర్తిగా నిషేదిస్తున్నామని అన్నారు. ప్రతి రోజు ఆకస్మిక తనిఖీలు ఉంటాయని, పట్టుబడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఉపన్యాసాలు, ప్రసంగాల ద్వారా ఇతర మతాల వారిని రెచ్చగొట్టే విధంగా మండపాల వద్ద ప్రసారం చేయకూడదన్నారు. మండపాల వద్ద ఆశ్లీల అసభ్యకరమైన నృత్యాలు చేయకూడదని, ప్రజలలో భక్త్భివం పెంచే విధంగా ఉన్నవి మాత్రమే ప్రసారం చేయాలన్నారు. రాత్రి సమయంలో తప్పనిసరిగా మండపాల నిర్వహకులు హాజరుగా ఉండాలని సూచించారు. భారీ గణేష్ మండపాల వద్ద సిసి కెమెరాలను అమర్చుకోవాలని సూచించారు. ప్రతి గణేష్ మండపాల వద్ద పోలీసు బందోబస్తు సున్నిత, సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసు పికెట్స్ నిర్వహించి, ప్రశాంత వాతావరణం కల్పిస్తామని తెలిపారు. ప్రజల వద్ద ఎటువంటి సమాచారం ఉన్నా పోలీసు వాట్సాప్ నెం.8333986898కు ఫోన్ చేయాలన్నారు. శాంతి భద్రతలను కాపాడే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామని, ప్రజల సహకారం పోలీసులకు ఉందని తెలిపారు. జిల్లా ప్రజలు ఇప్పటి వరకు పోలీసు వాట్సాప్ అందించిన సమాచారం మేరకు 98 సార్లు వివిధ ఆసాంఘీక కార్యకలాపాలపై దాడులు నిర్వహించి, కేసులు నమోదు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ ఏ.లక్ష్మీనారాయణ, మున్సిపల్ కమిషనర్ ఏ.మారుతి ప్రసాద్, ఆర్ అండ్‌బి ఇంజనీర్ ఆర్.సురేష్, ఎస్‌ఈ యుఎస్‌ఎన్ మూర్తి, డిఈ ఎలక్ట్రీకల్ డి.వెంకట రమణ, తహసీల్దార్లు ఎస్.శ్రీదేవి, పట్టణ సిఐలు వి.సురేష్, కె.పురుషోత్తం, ట్రాఫిక్ ఎస్సై బి.వెంకటేష్, టూటౌన్ ఎస్సై ఎన్.శ్రీనివాస్, మావల ఎస్సై రాజు, గ్రామీణ ఎస్సై తిరుపతి, స్పెషల్ బ్రాంచ్ ఎస్సై అన్వర్ ఉల్ హఖ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి
* సాంకేతిక పరిజ్ఞానంపై అధికారులకు శిక్షణ
* జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్
మంచిర్యాల: ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ లెర్నింగ్ శిక్షణ అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అన్నారు. గురువారం ముల్కల్ల గ్రామంలోని ఐ జా ఇంజనీరింగ్‌కళాశాలలో మూడు రోజుల పాటు ఈ శిక్షణను జిల్లా రెవెన్యూ అధికారులకు అందిస్తు ముఖ్యఅతిథిగా పాల్గొన్ని మాట్లాడారు. ప్రభుత్వ పాలన వ్యవహారాలపై అన్ని విభాగాల అధిపతులకు ద్వితీయ శ్రేణి అధికారులకు ఉద్యోగులకు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ ద్వారా మరింత మెరుగైన సేవలు అందిస్తారన్నారు. ఉద్యోగులు అనుసరించాల్సిన విధానాలతో పాటు సత్వరా సేవలు అందించేందుకు ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా నిర్ణీత లక్ష్యాలకు చేసుకునేందుకు ఏర్పడే సమస్యలను పరిష్కారం శాఖ అధిపతులకు అనుసరించాల్సిన పద్దతులు ఈ శిక్షణ కార్యక్రమంలో అందించడం జరుగుతుందన్నారు. ప్రతిశిక్షకుడుకి యూజర్ నేమ్, పాస్ వార్డు ఏర్పాటు చేయడంజరుగుతుందన్నారు. సుమారు 230మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని తెలిపారు. ప్రతిమనిషికి లక్ష్య నిర్ధేశం నిర్థిష్ట లక్ష్యంతో పని చేయాలనితెలిపారు. మంచి విషయాలను నేర్పించుకుంటామన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు సాంకేతిక విజ్ఞానం అవగాహన రాష్ట్రం అంతటా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. 15అంశాలపై శిక్షణ ఇస్తున్నట్లు గా తెలిపారు. కార్యక్రమంలో రెవెన్యూ అధికారి ప్రియాంక, ముఖ్య ప్రణాలిక అధికారి సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రీ సర్వే.. నాల్గో ‘సారీ’..
ఆంధ్రభూమి బ్యూరో
ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణ శివారులోని న్యూ హౌసింగ్ బోర్డు కాలనీకి ఆనుకొని ఉన్న 170 సర్వే నెంబర్‌లో అక్రమ పట్టాల వ్యవహారం అధికారుల మెడకు ఉచ్చుబిగిస్తోంది. 2012లో ప్రభుత్వం రైతుల నుండి 49 ఎకరాల భూమిని కొనుగోలు చేసి ఆ తర్వాత లేఅవుట్ చేసి 1279మంది పేద లబ్దిదారులకు ఇంటి స్థలాలను పంపిణీ చేశారు. లబ్దిదారులకు పట్టాలు కూడా అందించారు. ఇక్కడి మార్కెట్ విలువ ఎక్కువగా ఉండడంతో కబ్జాదారులు కనే్నసి అధికారులు, అధికార పార్టీ నేతల అండదండాలతో బోగస్ పట్టాలు సృష్టించుకొని పేద లబ్దిదారుల కడుపులు కొట్టి స్థలాలు కబ్జా చేశారు. స్థలాలు పొందిన లబ్దిదారులు కొందరు గుడిసెలు వేసుకోగా మరికొందరు హద్దులు వేసుకొని తమ ఆధీనంలో ఉంచుకున్నారు. విలువైన స్థలాలను గుర్తించిన కబ్జాదారులు రాత్రికి రాత్రే బోగస్ పత్రాలు సృష్టించుకొని బినామీ లబ్దిదారులకు లక్ష నుండి రూ.2లక్షల చొప్పున విక్రయించుకొని కోట్లల్లో డబ్బులు సంపాదించారు. అంతేగాక పేద లబ్దిదారులు కట్టుకున్న ఇంటికి నెంబర్ పేరిట పంచాయతీ అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి ఒక్కో ఇంటికి రూ.5వేల చొప్పున ముక్కుపిండి డబ్బులు వసూలు చేశారు. ఈ వ్యవహారంపై రాజకీయ విపక్షాలు, లబ్దిదారులు అందోళన వ్యక్తం చేయడమే గాక కలెక్టరేట్‌ల ముందు ధర్నాలు, నిరసనలు చేసి జిల్లా కలెక్టర్ గతంలో మూడుసార్లు సర్వే నిర్వహించి, బోగస్ పట్టాదారులను గుర్తించగా వారిపై ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు. మావల, ఆదిలాబాద్‌కు చెందిన కొందరు నేతలు, దళారులు పథకం ప్రకారం అర్హులైన లబ్దిదారులకు విషయం తెలియకుండానే వారి పేరిట బోగస్ పట్టాలు సృష్టించి సుమారు రెండు కోట్లకు పైగా దండుకున్నారన్న ఆరోపణలున్నాయ. తమకు జరుగుతున్న అన్యాయంపై బాధితులు నిలదీస్తే వారిని బెదిరించి, స్థలాలు కబ్జా చేసిన వ్యవహారం అధికారుల్లో అలజడి సృష్టించింది. ఎసిబి అధికారులు సైతం అక్రమాల బాగోతాలపై పూర్తి నివేధికను ప్రభుత్వానికి సమర్పించగా, ఇప్పటి వరకు మొక్కుబడి సర్వేలతోనే కాలం వెళ్లదీశారు. అయితే ఇటీవల జిల్లా కలెక్టర్ బుద్ద ప్రకాష్ జ్యోతికి 170 భూముల అక్రమ వ్యవహారంపై పెద్దఎత్తున ఫిర్యాదులు రాగా కిందిస్థాయి రెవెన్యూ అధికారుల నిర్వాకంపై మండిపడినట్లు తెలిసింది. అంతేగాక పూర్తిగా సర్వేచేసి బోగస్ పట్టాలను ఏరివేయడమేగాక వీరిలో ప్రమేయం ఉన్నవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. నాలుగు రోజుల క్రితమే జాయింట్ కలెక్టర్ కృష్ణారెడ్డి రెవెన్యూ బృందం కలిసి 170 సర్వే నెంబర్‌లో ప్రాథమిక సర్వే నిర్వహించి, అక్రమాలపై లోతైన విచారణకు ఆదేశాలు జారీ చేశారు. అయితే మొక్కుబడి సర్వేలతో రెవెన్యూ అధికారులు కాలం గడుపుతూ ఎలాంటి చర్యలకు సాహసం చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది.
నాలుగోసారి.. సర్వే సజావుగా సాగేనా..?
కబ్జాదారుల కబంద హస్తాల నుండి తమ ఇంటి స్థలాలకు విముక్తి కల్పించాలని బాధితులు అందోళన చేస్తూ రెవెన్యూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో నాల్గోసారిగా విచారణకు ఆర్డీవో సూర్యనారాయణ ఆదేశాలు జారీ చేశారు. గతంలో పనిచేసిన ఇద్దరు ఆర్డీవోలు ఇదే సర్వే నెంబర్‌లో 1279 ఇంటి స్థలాలపై సర్వే నిర్వహించి, నివేధికలు సమర్పించగా అవి బుట్టదాఖలయ్యాయి. తాజాగా గురువారం ఆర్డీవో సూర్యనారాయణ ఈ వ్యవహారంపై మూడు మండలాల అధికారులకు విచారణ బాధ్యతలు అప్పగించారు. ఇచ్చోడ ఆర్‌ఐ ఉల్లాస్, డిప్యూటీ తహశీల్దార్ రామారావు, గుడిహత్నూర్ ఆర్‌ఐ రాములు, డిటి నరేందర్, బజార్‌హత్నూర్ ఆర్‌ఐ, డిప్యూటీ తహశీల్దార్లు వారం రోజుల పాటు బోగస్ పట్టాల వ్యవహారంపై రీ సర్వే జరుపనున్నారు. గతంలో 1279మందికి మంజూరైన ఇళ్ల స్థల పట్టాల జాబితా ప్రకారం ఇంటింటికి వెళ్ళి అసలు, బోగస్ వ్యవహారాన్ని తేల్చనున్నారు. నాల్గోసారి రీ సర్వేకి ఆదేశాలు జారీకావడంతో అవినీతి అధికారుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.