వరంగల్

బాలల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయపర్తి: బాలబాలికల ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని వరంగల్ రూరల్ జిల్లా డిప్యూటీ డిఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ అనురాధ కోరారు. గురువారం మండల కేంద్రంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలోని విద్యార్ధులకు రుబేల్ల, తట్టు వ్యాధి నిరోదక టీకాలను వేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ డిఎంఅండ్‌హెచ్‌ఓ అనురాధ హాజరయి విద్యార్ధులకు టీకాలు వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం బాలబాలిక ఆరోగ్యన్ని దృష్టిలో పెట్టుకుని రూబేల్లా, తట్టు వ్యాక్సిన్‌లను అందిస్తోందని, ఈ వ్యాక్సిన్ ద్వారా ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్స్ ఉండవని చెప్పారు. తొమ్మిది నెలల శిశువు నుండి 15 సంవత్సరాల బాలబాలికలకు ఈ టీకాలను తప్పనిసరిగా వేయించాలని ఆమె అన్నారు. ఈ టీకాల పట్ల విద్యార్ధుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని అందుకు అధికారులు, ప్రజా ప్రతినిధులు చొరవ చూపాలని కోరారు. ఈ వ్యాక్సిన్ వేయించి బాల్యం దశ నుండే వ్యాధులను తరిమికొట్టాలని అన్నారు. సీజనల్ వ్యాధులపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏవైనా వ్యాధులు వస్తే వెంటనే ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఉచితంగా వైద్యం చేయించుకోవాలని చెప్పారు. ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్యంతోపాటు వౌళిక వసతులు కల్పిస్తున్నామని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి విజయ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారిణి విద్యారెడ్డి, పాఠశాల ప్రిన్సిపాల్ జ్యోతి, సిహెచ్‌ఓ డాక్టర్ నెహ్రూ చంద్, వైద్యబృందం, ఉపాద్యాయులు.
ఆరోగ్యవంతమైన సమాజం కోసం టీకాలు
వర్ధన్నపేట: బాలబాలికలు భవిష్యత్‌లో ఆరోగ్యంగా ఉండాలని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు రూబేల్లా, తట్టు టీకాలను ఉచితంగా అందిస్తోందని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని జెడ్పీటీసి పాలకుర్తి సారంగపాణి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని పుస్కోస్, ప్రభుత్వ పాఠశాలలో క్లష్టర్ ఆరోగ్యకేంద్రం ఆధ్వర్యంలో జరిగిన విద్యార్ధులకు రూబేల్లా, తట్టు టీకాల కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన జడ్పీటీసి పాలకుర్తి సారంగపాణి విద్యార్ధులకు టీకాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భాతరాలలో బాలబాలికలు ఆరోగ్యంగా ఉండాలని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు రూబెల్లా, తట్టు టీకాల కార్యక్రమాన్ని రూపొందించాయని అన్నారు. ఈ టీకాల పట్ల విద్యార్థులకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని అన్నారు. ఆగస్టు 17నుండి సెప్టెంబర్ 25వరకు ప్రభుత్వం ఉచితంగా టీకాలు అందిస్తుందని, దీనిని అందరూ వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి సిఎంఓ డాక్టర్ నెహ్రూచంద్ నాయక్, ఉపాధ్యాయ బృందం, టిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఎంఆర్ టీకాను తప్పనిసరిగా వేయించుకోవాలి
నర్సంపేట: చిన్నారుల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎంఆర్ టీకాను తప్పనిసరిగా వేయించాలని నర్సంపేట ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జాన్సన్ తల్లితండ్రులకు సూచించారు. నర్సంపేట ఏరియా ఆసుపత్రిలో చిన్నారులకు ఎంఆర్ టీకాలను డాక్టర్ జాన్సన్ వేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అన్ని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 9 నెలల నుండి 15 సంవత్సరాల చిన్నారులకు మీజిల్స్, రూబెల్లా వ్యాధులు సోకకుండా టీకాలు వేయనున్నట్టు చెప్పారు. మీజిల్స్, రూబెల్లా వ్యాధులు సోకితే చిన్నారుల ప్రాణానికే ప్రమాదమని ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిందని, ఈవిషయాన్ని తల్లితండ్రులు తెలుసుకుని ఎం ఆర్ టీకాను తప్పనిసరిగా వేయించాలన్నారు. రెండు వ్యాధుల నివారణకు ఒకే టీకాను వేస్తారని తెలిపారు. నాలుగు వారాల నుండి నిరంతరంగా ఎంఆర్ టీకా కార్యక్రమం కొనసాగుతుందని వివరించారు. ఈకార్యక్రమంలో వైద్య, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
గూడూరులో..
గూడూరు : గూడూరు మండల కేంద్రంలోని హైస్కూల్‌లో గురువారం విద్యార్థులకు ఎంఆర్ టీకాలు వేశారు. ఈకార్యక్రమంలో జడ్పీటిసి మహ్మద్ ఖాసీం, ఎంపిపి చెల్పూరి వెంకన్న, సర్పంచ్ వాంకుడోతు మోతిలాల్, డాక్టర్ విజయ్‌కుమార్, హెచ్ ఇవో దేవా, సూపర్‌వైజర్ మంఖ్త్యానాయక్, ప్రమీల, జానకి, హెచ్‌ఎం కాంతారావు తదితరులు పాల్గొన్నారు.
వ్యాధులను నివారించాలి
సంగెం: ప్రభుత్వం ఉచితంగా వేస్తున్న టీకాలను పిల్లలకు వేయించి తట్టు, రూబెల్లా వ్యాధుల నివారణకు కృషిచేయాలని ఎంపిపి కట్టయ్య అన్నారు. సంగెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన తట్టు, రూబెల్ల్లా టీకాల కార్యక్రమాన్ని సంగెం ప్రభుత్వ పాఠశాలలో ఎంపిపి కట్టయ్య గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలకు ఈ టీకాలు వేయించి వ్యాధులభారిన పడకుండా చూడాలని అన్నారు. డాక్టర్ హరిష్ మాట్లాడుతూ ఈ టీకాలతో పిల్లలకు ఎటువంటి హాని ఉండదని, టీకాలు వేయడం ద్వారా తట్టు, రూబెల్లా వ్యాధులను నివారించవచ్చని అన్నారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ఈ టీకాలు వేయించవద్దని కోరారు. చిన్నచిన్న జబ్బులు ఉన్న తొమ్మిది నెలల చిన్నారి నుండి 15 సంవత్సరాల పిల్లల వరకు టీకాలు వేయించవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మల్లికాంబ, ఎంపిటిసి కళావతి, ప్రధానోపాధ్యాయులు రవీందర్ వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
టీకాతో సంపూర్ణ ఆరోగ్యం
నెల్లికుదురు: మీజిల్స్ రుబెల్లా తదితర వ్యాధుల నివారణకు ఇచ్చే టీకా సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుందని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పిహెచ్‌సి డాక్టర్ జ్యోతితో కలసి టీకాలు ఇచ్చి మీజిల్స్, రుబెల్లా టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మోడల్ అంగన్‌వాడీ కేంద్రాన్ని స్థానిక సర్పంచ్ కస్తూరి శ్రీను, ఐసిడిస్ సిడిపివో లక్ష్మిప్రసన్న, ఎసిపివో శైలజలతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గొడలపై ఆకర్షనీయమైన బొమ్మలు, ఆట వస్తువులు, చిన్నారులను ఆసక్తిగొలిపే విధంగా ఉన్నాయని ఈ కేంద్రాలు పిల్లలకు ఉపయోగకరం అని అన్నారు. ఆయా కార్యక్రమాలలో ఎంపిపి ఎల్తూరి వెంకటమ్మ, తహశీల్దారు వేణుగోపాల్, ఎంఈవో రాము, హెచ్ యం ఖలీల్ అహ్మద్, హెచ్‌ఈవో వెంకటేశ్వర్లు, సూపర్‌వైజర్ శ్రీనివాస్, నాయకులు బిక్కునాయక్, యాదగిరిరెడ్డి, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
టీకాలతో వ్యాధులు దూరం
నెక్కొండ: చిన్నారులకు, 15ఏళ్లలోపు విద్యార్థులకు టీకాలు వేయించడంతో వ్యాధులు ప్రబలకుండా ఉంటాయని నెక్కొండ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి లక్ష్మణ్ అన్నారు. నెక్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం విద్యార్థులకు టీకాలు వేసారు. కార్యక్రమంలో సర్పంచ్ విక్టోరియా, వైద్య సిబ్బంది రాజేంద్రప్రసాద్, ప్రేమలత, సంజీవ, సుజాత తదితరులు పాల్గొన్నారు.

సమ్మె బాటలో
తపాల ఉద్యోగులు
మహాదేవపూర్, కాటారం: కేంద్ర ప్రభుత్వం గ్రామీణ తపాల ఉద్యోగుల పట్ల నిర్లక్ష్య ధోరిణిని నిరసిస్తూ వారి హక్కులను రాస్తున్నారని పెద్దపల్లి డివిజన్ తపాల ఉద్యోగుల సంఘ కార్యదర్శి కుడుదుల కిష్టయ్య ఆరోపించారు. గురువారం వారు తపాల కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. తపాల ఉద్యోగుల దేశ వ్యాప్త సమ్మెకు మద్దతు తెలపాలని కోరారు. మూడు గంటలకు ఏడు వేల రూ.లు చెల్లించి వెట్టి చాకిరి చేయిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వాలు పది ఏండ్లకు ఒకసారి కమిటీలు వేసి కాలయాపన చేస్తున్నారే తప్పా తపాల ఉద్యోగుల కోరికలు తీర్చడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కమలేష్ కమిటీ 2016 నుంచి అమలు చేయాల్సి ఉన్నా ఇదివరకు కమిషన్ వేయలేదని, తక్షణమే డిడి ఎస్ కమిషన్ అమలు చేయాలని కోరారు. ఎనిమిది గంటల పని కల్పించి, సివిల్ సర్వేంట్ హోదా కల్పించాలని, డిల్లీ క్యాపిటల్ బెంచ్ తీర్పు ప్రకారం పెన్షన్ మంజూరీ చేయాలని, టార్గెట్ పేరుతో డిడి ఎస్ ఉద్యోగులను బలవంతంగా వేదింపులు ఆపాలని వారు కోరారు. ఈ నిరవధిక సమ్మెలో మహాదేవపూర్, కాటారం ఉపతపాల ఉద్యోగులు గురుమల్ నాయక్, శివశంకర్, మాలతి, మదుసూదన్ రెడ్డి, రాజబాపు, రాజేష్, వజీర్, బ్రాహ్మణపల్లి శంకరయ్య, రవి , లింగయ్య, జహీర్, షబ్బీర్, సంపత్, విజయ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

చందులాల్ కృషితో ములుగు నియోజకవర్గ అభివృద్ధి
మంగపేట: రాష్ట్ర గిరిజన సంక్షేమ, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందులాల్ జన్మదిన వేడుకలను గురువారం మంగపేట మండలంలో ఘనంగా నిర్వహించారు. మంత్రి చందులాల్ జన్మదినంను పురస్కరించుకుని రెండవ యాదగిరి గుట్టగా ప్రసిద్ధి చెందిన శ్రీ హేమాచల లక్ష్మీనృసింహ స్వామి ఆలయంలో టిఆర్‌ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో మంత్రి చందులాల్ పేర ఆయుష్ హోమం, అభిషేకం,ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. మంత్రి చందులాల్ జన్మదినోత్సవం సందర్బంగా టిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఎన్.రాంచంద్రారెడ్డి ఇంటి వద్ద, మండలంలోని పలు గ్రామాలలో కేక్ కట్‌చేసి సంబురాలు చేసుకున్నారు. బిక్షంపేట గ్రామంలో టిఆర్‌ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పగిడిపెల్లి వెంకటేశ్వర్లు, పార్టీ గ్రామ ఇంచార్జి సిద్దంశెట్టి లక్ష్మణ్‌రావుల ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్ధులకు, అంగన్ వాడీ విద్యార్ధులకు స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతు మంత్రి చందులాల్ కృషితో ములుగు నియోజకవర్గం అభివృద్ధి చెందుతోందని అన్నారు. మంత్రి చందులాల్ నిత్యం ప్రజలతో మమేకమవుతూ, ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూస్తున్నారని, నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నారని చెప్పారు. మంత్రి చందులాల్, ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ అజ్మీరా ప్రహ్లాద్‌ల ఆధ్వర్యంలో ములుగు నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.

ఎంఆర్ వ్యాక్సిన్‌ను అందరూ వేయించుకోవాలి
కాటారం: మీజిల్స్ రూబెల్లా వాక్సిన్‌ను అందరూ వేయించుకోవాలని కాటారం మండల పరిషత్ అధ్యక్షురాలు కుమారి తైనేని స్వప్న పిలుపునిచ్చారు. గురువారం ఆమె కాటారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మీజిల్స్ రూబెల్లా వాక్సిన్‌ను లాంఛనంగా ప్రారంభించారు. 9 నెలల నుంచి 15 ఏండ్ల వయస్సులోపు ఉన్న పిల్లలందరికి ఈ వాక్సిన్‌ను వేయించాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ఉమాదేవి వివరించారు. ఐదు వారాల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని అన్నారు. బడి బయట ఉన్న పిల్లలకు ఈ టీకా వేయించడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని పేర్కొన్నారు.మండలంలోని అన్ని ఆరోగ్య ఉప కేంద్రాలలో, అన్ని అంగన్‌వాడీ కేంద్రాలలో ఈ టీకాలను పిల్లలకు వేయించడానికి కేంద్రాలను ఏర్పాటుచేసినట్లు ఉమాదేవి తెలిపారు.
మండల కేంద్రంలోని గిరిజన బాలుర గురుకులంలో, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, కేంబ్రిడ్జి పాఠశాలల్లో విద్యార్థినీ, విద్యార్థులకు ఎమ్మార్ వాక్సిన్‌ను వేశారు. ఈరోజు 2320 మందికి ఈ టీకా వేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఒక్క రోజులోనే 1875 మందికి వేసినట్లు డాక్టర్ ఉమాదేవి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి పంతకాని సమ్మయ్య, ఉపసర్పంచ్ కొట్టె శారదప్రభాకర్, నాయకులు తైనేని సతీష్, ఎస్టీ గురుకులం ప్రిన్సిపాల్ సంపత్‌కుమార్, ఏఎన్‌ఎంలు జె సునిత, కె శ్యామల, పి లక్ష్మి, ఆశ కార్యకర్తలు రాజేశ్వరీ, లత, సమ్మక్క, అంగన్‌వాడీ కార్యకర్తలు అమ్మక్క, అనసూర్య తదితరులు పాల్గొన్నారు.

మృతుల కుటుంబాలకు పరామర్శ

పరకాల: మృతుల కుటుంబాలను పరకాల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ ఇనగాల వెంకట్రాంరెడ్డి గురువారం పరామర్శించి ఆర్థిక సహాయం అందచేశారు. పరకాల మండలం రాజిపేట గ్రామానికి చెందిన వీర్ల మల్లయ్య ఇటీవల ఆనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఇనగాల వెంకట్రాంరెడ్డి వారికి అర్థిక సహాయం అందచేశారు. అదే గ్రామానికి చెందిన ముదురుకోళ్ళ బాబురావు అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందచేశారు. అదేవిధంగా పరకాల మండలం సీతారాంపురం గ్రామంలో ఇటీవల ఆనారోగ్యంతో మృతి చెందిన కొమురయ్య కుటుంబాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. అనంతరం వారికి ఆర్థిక సహాయం అందచేశారు. ఆయన వెంట పరకాల పట్టణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పసుల రమేష్, నలబాల క్రిష్ణయ్య, విజయ ఆగ్రో తిరుపతిరెడ్డి, యూత్ కాంగ్రెస్ పట్టణ, మండల అధ్యక్షులు శ్రీనివాస్‌గౌడ్, దామ అనిల్, రాంమూర్తి, నాగరాజు పాల్గొన్నారు.

ఘనంగా వెంకటేశ్వరస్వామి విగ్రహప్రతిష్ఠ ఉత్సవాలు

జనగామ టౌన్: జనగామ మండలం ఓబుల్‌కేశ్వాపురం గ్రామంలో ఇటీవల నిర్మించిన దేవాలయంలో వెంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. గురువారం ఈ ఉత్సవాలకు డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావ్, ప్రభుత్వ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎంపి బూరనర్సయ్య గౌడ్, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి, రాజయ్య, దయాకర్‌రావులతో పాటు వరంగల్ పోలీసు కమీషనర్ సుధీర్‌బాబులు హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం డిప్యూటి సిఎం కడియం శ్రీహరి, మండలి చైర్మన్ స్వామిగౌడ్‌లు కొద్దిసేపు విలేఖరులతో మాట్లాడారు. ప్రజల్లో భక్త్భివం పెంపొందడం వల్ల మానసిక బాదలు దూరమయ్యేందుకు అవకాశం ఉంటుందన్నారు. పర్యాటక శాఖ సెక్రటరీ బి. వెంకటేశం గ్రామస్థుల సహకారంతో చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. ప్రభుత్వ బంగారు తెలంగాణ కోసం అమలు చేస్తున్న ప్రతి కార్యక్రమం విజయవంతం కావాలని భగవంతున్ని వేడుకున్నట్లు వారు తెలిపారు. ఈ ఉత్సవాలకు ఓబుల్‌కేశ్వాపుర్ గ్రామస్థులే కాక చుట్టుప్రక్క గ్రామాలకు చెందని వందలాది మంది భక్తులు హాజరై మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి బైరగోని యాదగిరి, మున్సిపల్ చైర్‌పర్సన్ ప్రేమలతారెడ్డి, జడ్పీటీసి బాల్నె విజయసిద్దులు, వైస్ ఎంపీపీ బడికె ఇందిరాకృష్ణస్వామి, సర్పంచ్ ధర్మజయప్రకాష్‌రెడ్డిలు పాల్గొన్నారు.

సర్వాయి పాపన్న పాలన ప్రజారంజకం
నెల్లికుదురు: బహుజన బహుబలి సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ పాలన ప్రజానురంజకంగా సాగిందని ఆయన పాలనలో బహుజనులు తలెత్తుకు తిరిగారని గోపా జిల్లా అధ్యక్షుడు బిక్కి వెంకటేశ్వర్లుగౌడ్ అన్నారు. గురువారం స్థానిక విశ్రాంతి భవన్‌లో గోపా ఆధ్వర్యంలో పాపన్న 367వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దీనికి హాజరెనై ఆయన మాట్లాడుతూ... మొగలాయి చక్రవర్తులకు తొత్తులుగా వ్యవహరించిన అగ్రకులాల వారు బహుజనులను దౌర్జన్యంతో అణచివేసి చేసిన కష్టాన్నంతా పన్నుల రూపంలో తీసుకొని హింసించేవారని దీంతో పాపన్న బహుజన సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని మొగలాయి పాలనకు చరమగీతం పాడి గోల్కొండను పాలించారని అన్నారు. గీత కార్మికులు ప్రభుత్వానికి తాటి పన్ను చెల్లిస్తున్నారని నెలకు రూ.5వేల పెన్షన్, డబుల్‌బెడ్‌రూం ఇల్లు, గౌడ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.5వేల కోట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గోపా రాష్ట్ర నాయకులు నిమ్మల వెంకన్నగౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి కుర్ర శ్రీనివాస్‌గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి పెరుమాండ్ల యాదగిరిగౌడ్, రవికిరణ్, కుమారస్వామి, గండి వెంకన్న, అశోక్‌గౌడ్, వెంకన్న, యాకయ్య, వివిధ గ్రామాల గోపా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఒకే టీకాతో రెండు వ్యాధులకు చెక్
కురవి: మీజెల్స్(తట్టు), రుబెల్లా వ్యాధుల నివారణ టీకాల పంపిణీ కార్యక్రమాన్ని కురవి ఏకలవ్య గిరిజన బాలికల వసతిగృహంలో గురువారం కురవి ఎంపిపి బజ్జూరి ఉమాపిచ్చిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపిపి బజ్జూరి ఉమ మాట్లాడుతూ...ఈనెల 17వ తేదీనుండి 25వ తేదీ వరకు టీకాలను వేయాలన్నారు. రుబెల్లా వ్యాధి గర్భిణులకు సోకితే పుట్టబోయే బిడ్డకు వినికిడిలోపం, మానసిక వైకల్యంతో పాటు జీవితకాలం పీడించే వైకల్యాలతో జన్మిస్తారన్నారు. మీజిల్స్ వైరస్‌ద్వారా వ్యాపిస్తుందని చిన్నారుల అకాల మరణానికి కారణమవుతుందన్నారు. ఈ రెండు ప్రమాదకరమైన వ్యాధులను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎంపిపి కోరారు. 9నెలల వయస్సు నుండి 25 ఏళ్ల వయస్సు ఉన్నవారందరూ టీకాలను వేయించుకోవాలన్నారు. ప్రజా ఆరోగ్యం గురించి ప్రభుత్వం అనేక పథకాలను రూపొందించిందన్నారు. అధికారులు సహకరిస్తేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్నారు. ఆరోగ్య, ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు ఈ వ్యాక్సిన్ వేయడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మురళీకృష్ణ, సర్పంచ్ గుగులోత్ పూర్ణచంద్యానాయక్, వార్డెన్ నిర్మల జ్యోతి, హెల్త్ అసిస్టెంట్లు నిర్మలజ్యోతి, రమేష్, ఎఎన్‌ఎంలు కుమారి, నసీమా, ఆశాకార్యకర్తలు కాళీశ్వరీ, నిర్మల తదితరులు పాల్గొన్నారు.
మీజిల్స్ రుబెల్లా వ్యాది నివారణ టీకాలు
గంగారం: గంగారం మండలంలోని గంగారాం, కోమట్లగూడెం పాఠశాలల్లో 538మంది విద్యార్థులకు మీజిల్స్ రుబెల్లా వ్యాది నిరోధక టీకాలు వేసినట్టు డిప్యూటీ డియంహెచ్‌వో పి.వెంకటరమణ తెలిపారు. గంగారం మండల కేంద్రంలో గురువారం టీకాలు వేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. గంగారం పిహెచ్‌సి పరిధిలో 9నెలల నుండి 15సంవత్సరాలలోపు ఉన్న వారు 2470 ఉండగా అందులో తొలిరోజు 458మందికి టీకాలు వేశామన్నారు. ఆగస్టు 17నుండి నెల రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో మండలంలో ఉన్న పిల్లలకు వ్యాక్సిన్‌లు వేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మార్ వ్యాక్సిన్ వేయడం వల్ల భవిష్యత్‌లో వారికి పుట్టబోయే శిశువులకు అంగవైకల్యం లేకుండా ఆరోగ్యవంతమైన శిశువులు పుడతారన్నారు. మొత్తం నాలుగు సబ్‌సెంటర్‌లలో పిల్లలకు టీకాలు వేశాక ఇంకా మిగిలి ఉన్న పిల్లలకు స్వీటింగ్ సెషన్ రోజున వేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో వెంకట్‌రెడ్డి, ఎమ్మార్ ప్రొగ్రామర్ డాక్టర్ రాజేష్, గంగారం, కోమట్లగూడెం వైద్యాధికారులు శ్రీనివాస్, రాజ్‌కుమార్, స్థానిక సర్పంచ్ వసంత, ఎంపిటిసి సమ్మక్క, ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.